Jeremiah - యిర్మియా 20 | View All
Study Bible (Beta)

1. యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని

యిర్మీయా శత్రువులలో ఒకడి పేరు ఇక్కడ మొదటి సారిగా కనిపిస్తున్నది. అతడు కపట ప్రవక్త (వ 6). అధికారంలో ఇతడు ప్రముఖయాజి తరువాతివాడు. ఆలయంలో అంతా సక్రమంగా జరిగేలా చూడడం, అల్లరి చేసేవాళ్ళను శిక్షించడం లేదా వెళ్ళగొట్టడం ఇతని విధులు. యిర్మీయా ఇలా అల్లరి రేపేవాడని ఇతడు అభిప్రాయపడ్డాడు యిర్మియా 38:4; 1 రాజులు 18:16-17 చూడండి). సత్యం అంటే ఇష్టం లేని వారికది ఓ సమస్యలాగా అనిపిస్తుంది. సత్యాన్ని ప్రకటించేవారు తరచుగా అలాంటివారి దృష్టిలో అల్లరి రేపేవారు (లూకా 23:4-5; అపో. కార్యములు 16:19-24; అపో. కార్యములు 17:5-7; అపో. కార్యములు 21:28; అపో. కార్యములు 24:5).

2. ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.
హెబ్రీయులకు 11:36

3. మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్‌ అని నీకు పేరు పెట్టును.

అన్యాయంగా పడిన శిక్ష దేవుని ప్రవక్తల నోళ్ళు మూయించలేదు (వ 9; అపో. కార్యములు 4:3, అపో. కార్యములు 4:18-20; అపో. కార్యములు 7:52; హెబ్రీయులకు 11:32-38). “మాగోర్ మిస్సాబీబ్” అంటే అన్ని వైపులనుండి భయం.

4. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియయూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసి కొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.

5. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.

6. పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవుదురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు.

7. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.

యిర్మీయా ప్రార్థన, ఫిర్యాదు. దేవుని తరఫున మాట్లాడేవారు ప్రజల ఎదుట నిలిచి మాట్లాడేటప్పుడు సింహాలవలె ధైర్యవంతులైతే కావచ్చు గాని దేవునితో ఏకాంతంగా ఉండే సమయంలో మాత్రం తమ భయాలు, బలహీనత, నిరుత్సాహం వారికి తెలుసు. యిర్మీయా తన అంతరంగాన్ని దేవుని ఎదుట పరుస్తున్నాడు. ఏదీ దాచుకోవడం లేదు. యోబు 10:1-2; కీర్తనల గ్రంథము 62:8 పోల్చి చూడండి. అతడు ప్రవక్తగా ఉండేందుకు ఇష్టపడలేదు (యిర్మియా 1:6). దేవుడతణ్ణి బలవంతం చేశాడు. ఫలితంగా సంభవించినది యిర్మీయాకు నచ్చలేదు.

8. ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను.

యిర్మియా 6:10; యిర్మియా 15:10, యిర్మియా 15:15; 2 పేతురు 3:3-4.

9. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు.
1 కోరింథీయులకు 9:16

దేవుని తరఫున మాట్లాడడం ఒక్కోసారి భరించరాని బాధగా అతనికి అనిపించేది. ఆ పని మానుకోవాలని కూడా కొన్నిసార్లు అనుకున్నాడు. అది అతనికి విచారం తప్ప మరేది తేలేదు. దేవుడతని హృదయంలో మంటలు ఉంచాడు. మాట్లాడకుండా తప్పించుకోనియ్యని ఒక ఒత్తిడిని అతనిలో పెట్టాడు. అపో. కార్యములు 4:20; 1 కోరింథీయులకు 9:16; 2 కోరింథీయులకు 5:14; 2 పేతురు 1:21 పోల్చి చూడండి. దేవుని బలవంతం, వారి హృదయంలో దేవుని మాటలు ఆయన తరఫున మాట్లాడేవారిని అవమాన్నైనా, ఏ హింసనైనా ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సన్నిద్ధులను చేస్తాయి. వారి అంతరంగంలో నుంచి పెల్లుబుకుతున్న దేవుని వాక్కును చెప్పకపోతే వారికి ఉపశమనం ఉండదు.

10. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారుదుర్మార్గుడని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టు కొనియున్నారు.

పషూర్‌కు యిర్మీయా పెట్టిన పేరును బట్టి అతని శత్రువులు అతణ్ణి ఎగతాళి చేస్తున్నారు (వ 3). అతని స్నేహితులు పేరుకు మాత్రమే స్నేహితులు. ఎందుకంటే దేవుని తీర్పును గురించిన సందేశం ద్వారా అతడు వారిని నొప్పించాడు. గలతియులకు 4:16 పోల్చి చూడండి. శత్రువుల పీడ కంటే మిత్రుల ద్రోహమే ఎక్కువ బాధిస్తుంది.

11. అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.

“యెహోవా...నా ప్రక్కనే”– ఇదే అతని ధైర్యం. ఎవరికీ రుచించని తన పరిచర్యలో అతడు ముందుకు సాగేందుకు అతనికి తోడు ఇదే.

12. సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక

యిర్మియా 11:20. “సేనల ప్రభువు యెహోవా”– 1 సమూయేలు 1:3 నోట్.

13. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.

తన హృదయంలో ఈ విలాపం ప్రవక్తకు పెద్దగా ఆనందం లేదు గాని దేవుడు అనుగ్రహించే విడుదల అతనికి తెలుసు. అందుకు ఆయన్ను స్తుతించాలని కూడా తెలుసు.

14. నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;

ఒకప్పుడు యోబుకు జరిగినట్టు యిర్మీయా కూడా ఇక్కడ బాధ, విచారం, నిరాశకు లొంగిపోతున్నాడు (యోబు 3వ అధ్యాయం; ప్రసంగి 4:1-3). అయితే దేవునిలో తన నమ్మకాన్ని గాని, ప్రవక్తగా తన బాధ్యతను గాని అతడు విడిచిపెట్టలేదు. తమ ఆలోచనలే తమనిలా హింసిస్తూ ఉన్నప్పటికీ దేవునిపై నమ్మకం చెక్కుచెదరకుండా ఆయన సేవలో కొనసాగడం గొప్ప విషయం.

15. నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;

16. నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక

17. యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్త ధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక

18. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రవక్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాషూరు యొక్క వినాశనం. (1-6) 
పాషూరు యిర్మీయాను కొట్టి, అతనిని స్టాక్‌లో ఉంచాడు. దేవుడు అతనికి సందేశంతో ప్రేరేపించే వరకు యిర్మీయా మౌనంగా ఉన్నాడు. దీనిని నొక్కిచెప్పడానికి, పాషూరుకు "ప్రతి వైపు భయం" అనే పేరు వచ్చింది, ఇది ఒక వ్యక్తి బాధను అనుభవించడమే కాకుండా నిరాశలో మునిగిపోవడాన్ని వివరించింది. ఇది ఎవరైనా ప్రమాదాన్ని ఎదుర్కోవడమే కాకుండా, అన్ని వైపుల నుండి భయంతో శోషించబడటం కూడా చిత్రీకరించబడింది. స్పష్టమైన కారణం లేనప్పుడు కూడా దుర్మార్గులు తరచుగా చాలా భయంతో జీవిస్తారు, ఎందుకంటే దేవుడు ధైర్యమైన పాపిని తమ కోసం భయాందోళనకు గురిచేస్తాడు.
దేవుని ప్రవక్తల హెచ్చరికలను లక్ష్యపెట్టనివారు చివరికి తమ స్వంత మనస్సాక్షిని ఎదుర్కొంటారు, అది వారి తప్పుల గురించి వారిని నిందిస్తుంది. వారి స్నేహితులు మరియు మిత్రులు వారిని విడిచిపెట్టినప్పుడు అలాంటి వ్యక్తి దయనీయంగా ఉంటాడు, తనకు తానుగా భయభ్రాంతులకు గురవుతాడు. దేవుడు తన దైవిక న్యాయానికి సజీవ సాక్ష్యంగా పనిచేయడానికి కష్టాల్లో జీవించడానికి వారిని అనుమతిస్తాడు.

జెర్మియా కఠినమైన వినియోగం గురించి ఫిర్యాదు చేశాడు. (7-13) 
ప్రవక్త తనకు జరిగిన అవమానాలు మరియు గాయాల గురించి విలపిస్తాడు. అయితే, 7వ వచనాన్ని కూడా ఈ క్రింది విధంగా అన్వయించవచ్చు: "మీరు నన్ను ఒప్పించారు మరియు నేను మీ ఒప్పందానికి లొంగిపోయాను. మీరు నా కంటే బలంగా ఉన్నారు, మీ ఆత్మ ప్రభావంతో నన్ను అధిగమించారు." మనల్ని మనం దేవుని మార్గంలో మరియు కర్తవ్యమార్గంలో నడుస్తున్నట్లు భావించినంత కాలం, కష్టాలు మరియు నిరుత్సాహాలను ఎదుర్కొన్నప్పుడు మనం ఎన్నడూ చేయని కోరిక బలహీనత మరియు అవివేకానికి సంకేతం.
ప్రవక్త తనలో దేవుని దయ శక్తివంతంగా ఉందని కనుగొన్నాడు, దానిని వదులుకోవాలనే ప్రలోభాలు ఉన్నప్పటికీ తన మిషన్‌కు కట్టుబడి ఉండగలిగాడు. మనకు ఎలాంటి అపకారం జరిగినా, "నేను తిరిగి చెల్లిస్తాను" అని ప్రకటించినట్లుగా, సరైన ప్రతీకారం తీర్చుకునే దేవునికి మనం దానిని అప్పగించాలి. దేవుని సన్నిధి యొక్క సౌలభ్యం, అతను అనుభవించిన దైవిక రక్షణ మరియు అతను ఆధారపడిన వాగ్దానాలతో అతని హృదయం పొంగిపోయింది. ఇది దేవుణ్ణి మహిమపరచడానికి తనను మరియు ఇతరులను కూడగట్టుకునేలా ప్రేరేపించింది.
దేవుని ప్రజలు వారి మనోవేదనలను ఆయన ఎదుట సమర్పించనివ్వండి మరియు విమోచనకు సాక్ష్యమిచ్చేలా ఆయన వారికి శక్తిని ఇస్తాడు.

అతను ఎప్పుడూ జన్మించినందుకు చింతిస్తున్నాడు. (14-18)
కృప విజయం సాధించినప్పుడు, మన మూర్ఖత్వానికి అవమానకరమైన అనుభూతిని పొందడం, దేవుని మంచితనాన్ని చూసి ఆశ్చర్యపడడం మరియు భవిష్యత్తులో మన ఆత్మలను కాపాడుకోవడానికి అనుభవాన్ని హెచ్చరికగా ఉపయోగించి జాగ్రత్త తీసుకోవడం ప్రయోజనకరం. ప్రవక్త ఎదుర్కొన్న టెంప్టేషన్ యొక్క బలీయమైన బలాన్ని గమనించండి, చివరికి అతను దైవిక సహాయంతో దానిని జయించాడు. దాని ప్రభావంలో ఉన్నప్పుడు తన చివరి శ్వాసను కోరుకోలేదని అతను నిరాశను వ్యక్తం చేశాడు.
ఈ కోరికలు మనకు అనుకరించడానికి ఉదాహరణలుగా అందించబడలేదని మేము గుర్తించినప్పటికీ, వాటి నుండి విలువైన పాఠాలను సంగ్రహించవచ్చు. తాము దృఢంగా ఉన్నామని విశ్వసించే వారు పొరపాట్లు పడకుండా ఉండేందుకు ఎలా అప్రమత్తంగా ఉండాలి మరియు "మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయకు" అని ప్రతిరోజూ ప్రార్థించాలని ఇది హైలైట్ చేస్తుంది. ఇది మానవత్వం యొక్క దుర్బలత్వం, చంచలత్వం మరియు పాపభరితమైనతనాన్ని నొక్కి చెబుతుంది. మనం అసంతృప్తికి లొంగిపోయినప్పుడు మన ఆలోచనలు మరియు కోరికలు మూర్ఖంగా మరియు అసహజంగా మారతాయి.
మన చిన్న పరీక్షల సమయంలో మన మనస్సులో అలసిపోకుండా లేదా నిరుత్సాహపడకుండా ఉండటానికి, తనకు వ్యతిరేకంగా పాపుల వ్యతిరేకతను సహించిన క్రీస్తు ఉదాహరణను మనం ధ్యానిద్దాం.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |