Jeremiah - యిర్మియా 31 | View All

1. యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు.

“గోత్రాలన్నిటికీ”– ఉత్తర రాజ్యానికి చెందిన పది గోత్రాలు ఇస్రాయేల్, దక్షిణ రాజ్యానికి చెందిన రెండు గోత్రాలు యూదా. ఈ అధ్యాయంలో రెండు సామ్రాజ్యాల గురించీ ఉంది. 4-22 వచనాల్లో ఉత్తర రాజ్యం గురించి, 23-26లో దక్షిణ రాజ్యం గురించి, 27-40 వచనాల్లో రెండు రాజ్యాల గురించి ఉమ్మడిగా రాసి ఉంది.

2. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.

ఇది గడిచిపోయినకాలం గురించిన విషయమై ఉండవచ్చు – అంటే దేవుని ప్రజలు ఈజిప్ట్‌నుండి బయటకు వచ్చేసిన విషయం, లేదా రాబోయే కాలం గురించిన భవిష్యద్వాక్కును భూతకాల క్రియా రూపంలో (అంటే నెరవేరిపోయినట్టు) రాసినదైనా అయి ఉండవచ్చు.

3. చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

ద్వితీయోపదేశకాండము 4:37; ద్వితీయోపదేశకాండము 7:7-8; ద్వితీయోపదేశకాండము 10:15; హోషేయ 11:4 లోని సారాంశాన్ని ఈ వచనం తెలియజేస్తుంది. ఈ కాలంలో విశ్వాసులకు ఎఫెసీయులకు 1:4-6; 1 థెస్సలొనీకయులకు 1:4; 2 థెస్సలొనీకయులకు 2:13 మొదలైన వచనాలు ఉన్నాయి. పాపవిముక్తి ఎవరెవరైతే పొందారో, పొందుతారో వారందరి విమోచనకూ మూలాధారం దేవుని శాశ్వతమైన ప్రేమ.

4. ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.

సమరయ (వ 5), ఎఫ్రాయిం (వ 6,9,18,20), అనే పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఉత్తర దిశన ఉన్న పది గోత్రాల సంగతి అని స్పష్టం అవుతున్నది. ఉత్తర రాజ్యం ముఖ్య పట్టణం సమరయ క్రీ.పూ. 721లో శత్రువుల హస్తగతమైంది. అప్పటినుండి ఇప్పటిదాకా ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తిరిగి ఆశ్రయించి సమరయను వశపరచుకోలేదు. ప్రస్తుతం ఇస్రాయేల్ సమరయ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది గాని ఒక జాతిగా అదింకా అపనమ్మకంలోనే ఉంటూ తమ అభిషిక్తుడూ ప్రభువూ అయిన యేసుక్రీస్తును నిరాకరిస్తూ ఉంది. ఈ భవిష్యద్వాక్కులు గతంలో సంపూర్ణంగా నెరవేరలేదు కాబట్టి రాబోయే కాలంలో ఈ నెరవేర్పు కలుగుతుందని మనం ఎదురు చూడవచ్చు.

5. నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు.

6. ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.

ఉత్తర రాజ్యప్రజలు యూదానుండి విడిపోయిన తరువాత నుంచి సాధారణంగా జెరుసలంకు ఆరాధన నిమిత్తమై రావడం మానుకొన్నారు (1 రాజులు 12:25-33). అయితే భవిష్యత్తులో ఈ పరిస్థితి మారుతుంది (వ 12).

7. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.

ఇస్రాయేల్‌ను దేవుడు జనాలన్నిటిలో ప్రముఖ జనంగా పరిగణించాడు. దాని అధిక జనాభా, బలపరాక్రమాలు, మొదలైన కారణాలవల్ల కాదు. తన వాక్కు భూజనాలకు అందేందుకు, క్రీస్తు ఈ లోకంలోకి వచ్చేందుకు అది సాధనం అయింది కాబట్టి.

8. ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణుల నేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు

“భూమి కొనలు”– దీని అర్థం బబులోను మాత్రమే కాక అనేక దేశాలు, ప్రాంతాలు అని గదా? “మహా గొప్ప సమూహం”– బబులోనునుండి 42,360 మంది తిరిగి వచ్చారు (ఎజ్రా 2:64). వీరిలో ఎక్కువమంది దక్షిణ రాజ్యానికి చెందినవారు. ఉత్తర రాజ్యానికి చెందినవారు చాలా తక్కువ. మరి మహా గొప్ప గుంపు అంటే ఈ కొద్దిమంది అని ఎలా అనుకొంటాం? ఈ వచనం ఇంకా నెరవేరలేదన్నమాట.

9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
1 కోరింథీయులకు 6:18

“ఏడుస్తూ”– ఏడ్వడం, ప్రార్థన చేయడం పశ్చాత్తాపానికీ, దేవునివైపు తిరగడానికీ గుర్తు. తరువాతి వచనం విమోచన పొంది తమ తమ స్వస్థలాలకు చేరినవారి సంతోషాన్ని తెలియజేస్తూ ఉంది (వ 10-14). “ఎఫ్రాయిం”– అంటే ఉత్తర రాజ్యం మొత్తాన్ని సూచిస్తూ చెప్పిన మాట.

10. జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.

11. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

12. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.

“నీరసించిపోరు”– వారు పూర్వస్థితికి చేరుకోవడం ఇక ఎన్నటికీ శాశ్వతం అని సూచించే పదం.

13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును ¸యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.

14. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.

15. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.
మత్తయి 2:18

జెరుసలంకు 8 కి.మీ. ఉత్తరంగా బెన్యామీను ప్రాంతంలో రమా ఉంది. బెన్యామీను తల్లి రాహేలు, ఎఫ్రాయింకు నాన్నమ్మ. దీని సందర్భాన్ని బట్టీ, దీని తరువాత వస్తున్న వచనాలను బట్టీ చూస్తే ఈ వచనాలు ముఖ్యంగా ఇస్రాయేల్‌వారికి దాపురించిన చెర, వినాశనాల మూలంగా కలిగిన దుఃఖం గురించి అని అర్థమౌతున్నది. అయితే మత్తయి 2:18 లో ఈ వచనాన్ని ఎత్తి రాయబడింది. అక్కడ యేసుప్రభువు జననం తరువాత బేత్లెహేం దాని పరిసరాల్లో చిన్నపిల్లలను వధించిన విషయాన్ని ఇది సూచిస్తున్నదని రాసి ఉంది. పాత ఒడంబడికలోని భవిష్యద్వాక్కులలో కొన్నింటికి ఒకటికంటే ఎక్కువ నెరవేర్పులు, లేక అన్వయింపులు ఉన్నట్టు అనిపిస్తున్నది. యెషయా 60:1-22 నోట్.

16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియసఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.
ప్రకటన గ్రంథం 21:4

ఇస్రాయేల్‌ప్రజలకు ఆఖరు సారిగా మంచి కలిగేంతవరకే కంటతడి ఉంటుంది.

17. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

ఇస్రాయేల్ వారు ఎట్టకేలకు దేవుని క్రమశిక్షణకు లోబడి పూర్తిగా ఆయన వైపు తిరుగుతారు. ఇస్రాయేల్‌వారి లాగానే మనందరమూ ఆయన మనలను తిప్పినప్పుడే ఆయనవైపు తిరుగుతాం (యోహాను 6:44).

19. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడచరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.

సంపూర్ణ పశ్చాత్తాపం కళ్ళకు కట్టినట్టున్న దృశ్యం.

20. ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.

ఎఫ్రాయిం అంటే ఇస్రాయేల్‌ప్రజ. మరికొన్ని చోట్ల ఇస్రాయేల్‌ను యెహోవా వధువుగా, భార్యగా చిత్రీకరించడం జరిగింది (యిర్మియా 2:2; యిర్మియా 4:14; మొ।।). ఇక్కడ ప్రజలను గాఢమైన ప్రేమను చూరగొన్న కుమారునితో పోల్చడం కనిపిస్తున్నది. దేవునికి ఆయన ప్రజలపట్ల ఉన్న మక్కువ ఎలాంటిదో చెప్పేందుకు ఏ ఒక్క మానవ సంబంధమూ చాలదు. యిర్మీయా ఈ మాటలు రాసిన సమయానికి ఎఫ్రాయిం అప్పటికే 130 సంవత్సరాలనుండి దేశాంతరంలో ప్రవాసంలో ఉన్నారు. ఈ అధ్యాయంలోని భవిష్యద్వాక్కుల సంపూర్ణ సిద్ధికి మరికొన్ని శతాబ్దాలు గడిచిపోవలసి ఉంది. అయితే ఇస్రాయేల్ అంటే మాత్రం దేవుని హృదయంలో ఇంకా తావు ఉంది, ప్రేమ ఉంది.

21. ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము.

ఇస్రాయేల్ కేవలం తిరగబడిన కుమారుడే కాదు, దారి తప్పిన కుమార్తెవంటి జనం కూడా. అయితే ఆమె తన ప్రదేశానికి తిరిగి వస్తుంది. దేవుడామెను ఒక సరిక్రొత్త విధానంలో వాడుకుంటాడు. అదేమిటో ఆయన స్పష్టంగా వివరించలేదు.

22. నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.

23. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.

దేవుడు యూదాను కూడా యథాస్థితికి తెస్తాడు. ఇంతకు ముందు వచనాల్లో ఇస్రాయేల్ గురించి చెప్పినదంతా దక్షిణ రాజ్య ప్రజల విషయంలో కూడా చక్కగా సరిపోతుంది. “న్యాయానికి...పవిత్ర పర్వతమా”– కీర్తనల గ్రంథము 48:1-2; యెషయా 1:21, యెషయా 1:26.

24. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును.

25. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.
మత్తయి 11:28, లూకా 6:21

యెషయా 40:29-31.

26. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను.

దీనిబట్టి చూస్తే యిర్మియా 30:1 నుండి ఉన్న యిర్మీయా దర్శనం అతనికి కలరూపంలో వచ్చినట్టుంది. ఆదికాండము 15:12-21; దానియేలు 10:9; జెకర్యా 4:1 కూడా చూడండి.

27. యెహోవా వాక్కు ఇదే ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.

ఇక్కడినుండి ఈ అధ్యాయం చివరివరకు ఇస్రాయేల్, యూదా, రెండింటి గురించీ రాసి ఉంది. దేవుడు ఈ రెంటినీ వారి దేశంలోనుంచి పెళ్ళగించి చెరలోకి పంపాడు. అయితే వాటిని తమ స్వదేశంలో తిరిగి నాటి అభివృద్ధి పొందేలా చేస్తాడు.

28. వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.

29. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.

యెహెఙ్కేలు 18:2. ఇది దేవుని మార్గాలనూ, దేవుని వాక్కునూ అపార్థం చేసుకోవడమే.

30. ప్రతివాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.

ద్వితీయోపదేశకాండము 24:16; యెహెఙ్కేలు 18:3, యెహెఙ్కేలు 18:20; యెహెఙ్కేలు 33:7-18.

31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
మత్తయి 26:28, లూకా 22:20, 1 కోరింథీయులకు 11:25, 2 కోరింథీయులకు 3:6, హెబ్రీయులకు 8:8-13

ఇది క్రొత్త ఒడంబడికను గురించిన భవిష్యద్వాక్కు. బైబిలు రెండో భాగానికి దీన్నిబట్టే క్రొత్త ఒడంబడిక అనే పేరు కలిగింది. దీని గురించిన ఇతర రిఫరెన్సులకోసం యెషయా 61:8; యిర్మియా 32:40; యిర్మియా 50:5; మత్తయి 26:28; మార్కు 14:24; లూకా 22:20; 1 కోరింథీయులకు 11:25; 2 కోరింథీయులకు 3:6; హెబ్రీయులకు 8:8; హెబ్రీయులకు 9:15; హెబ్రీయులకు 12:24; హెబ్రీయులకు 13:20 చూడండి. దేవుడు సీనాయి పర్వతం దగ్గర మోషేద్వారా ఇస్రాయేల్ ప్రజలతో చేసిన ఒడంబడికనుంచి ప్రత్యేకించేందుకు దీన్ని “క్రొత్తది” అన్నాడు (నిర్గమకాండము 19:5-6 నోట్స్ చూడండి). ఆ పాత ఒడంబడిక దేవుని ధర్మశాస్త్రం పట్ల మానవుల విధేయతపై ఆధారపడి ఉంది. మనిషి స్వతహాగా పాపాత్ముడు, అవిధేయుడు కాబట్టి, దేవుని ధర్మశాస్త్రం అతణ్ణి పవిత్రునిగా, విధేయునిగా చేయడం అసాధ్యం కాబట్టి ఈ పాత ఒడంబడిక తప్పక విఫలం కావలసి వచ్చింది (రోమీయులకు 7:5-25; రోమీయులకు 8:3). ఇది విఫలమైందనడానికి ఇస్రాయేల్ చరిత్రే రుజువు (యిర్మియా 11:6-8; యిర్మియా 7:25-26; యిర్మియా 16:11; యిర్మియా 22:9). పాత ఒడంబడికలోని షరతుల మూలంగా ఎవరికైనా పాపవిముక్తి కలగడం అసాధ్యం. నిజానికి అది శాపాన్నే తెచ్చిపెట్టింది (గలతియులకు 3:10-12). కాబట్టి సరిక్రొత్త ఒడంబడికను చేస్తానని దేవుడిక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రానికి మానవుడు చూపే విధేయతతో నిమిత్తం లేనిది. ఇది దేవుడు స్వయంగా చేసే పనిమీద ఆధారపడి ఉంది. 33,34 వచనాల్లో నేను అనే పదం నాలుగుసార్లు కనిపిస్తుంది. ఇది కృపతో కూడిన ఒడంబడిక. దీని పునాది మానవుని బలహీన స్వభావంలో లేదు. దేవునిలోనే ఉంది. “ఇస్రాయేల్‌వారితోను, యూదావారితోను”– ఈ ఒడంబడిక నేరుగా క్రొత్త ఒడంబడిక గ్రంథంలో కనబడే క్రీస్తు సంఘంతోను, యూదులు కాని క్రైస్తవులతోను చెయ్యబడిందని ఎక్కడా చెప్పలేదు. క్రైస్తవులకు కూడా దీన్లో భాగం ఉంది, ఎలానంటే అబ్రాహాము అనే వేరునుండి మొలిచి ఇస్రాయేల్ అనే కొమ్మలు గల ఆలీవ్ చెట్టుకు వీరు అంటుకట్టబడ్డారు గనుక. రోమీయులకు 11:17-18 చూడండి.

32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

నిర్గమకాండము 19:5; నిర్గమకాండము 24:8.

33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
2 కోరింథీయులకు 3:3, రోమీయులకు 11:26-27, 1 థెస్సలొనీకయులకు 4:9, హెబ్రీయులకు 8:8-13

“మనసులలో...హృదయాలపై”– పాత ఒడంబడిక ప్రకారం దేవుని శాసనాలు రాతి పలకల పై రాసి ఉన్నాయి (నిర్గమకాండము 31:8; నిర్గమకాండము 34:1; 2 కోరింథీయులకు 3:7). అయితే క్రొత్త ఒడంబడిక కాలంలో దేవుడు అవి మనుషుల హృదయాలపై, మనస్సులపై రాస్తాడు (2 కొరింతు 3:3). ఇది దేవునికి లోబడాలన్న ఒక క్రొత్త స్వభావం, క్రొత్త జన్మ, క్రొత్త సృష్టిని సూచిస్తున్నది (2 కోరింథీయులకు 5:17; ఎఫెసీయులకు 2:4-5 మొ।।). దేవుని శాసనాలను వినాలని లోలోపల అభిలాషను సూచిస్తున్నది. ఇదంతా లేకుండా ఒక వ్యక్తి క్రొత్త ఒడంబడికలో భాగస్వామి అనుకొనేందుకు వీలులేదు. “నేను...ఉంటాను”– లేవీయకాండము 26:12; యెహెఙ్కేలు 37:27; 2 కోరింథీయులకు 6:16; ప్రకటన గ్రంథం 21:3.

34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
అపో. కార్యములు 10:43, హెబ్రీయులకు 10:17, 1 Joh 2:27, రోమీయులకు 11:26-27, 1 థెస్సలొనీకయులకు 4:9

క్రొత్త ఒడంబడికలోని రెండు పరమ శ్రేష్ఠమైన దీవెనలు – పాపాలకు శాశ్వత క్షమాపణ, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోగలగడం. వీటిని అనుగ్రహించగలవాడు దేవుడు ఒక్కడే. ఇవి కేవలం ఆయన కృపచొప్పున ఉచితంగా ఇస్తాడు. “వారంతా”– రాబోయే కాలంలో జాతి అంతటికీ విముక్తి కలుగుతుందని తెలిపే మాట (రోమీయులకు 11:26 పోల్చి చూడండి). “తెలుసుకొంటారు”– యిర్మియా 9:23-24; 1 సమూయేలు 3:7; హోషేయ 2:20; యోహాను 17:3; ఎఫెసీయులకు 4:13; ఫిలిప్పీయులకు 1:3. “క్షమించి”– లేవీయకాండము 4:20; కీర్తనల గ్రంథము 32:1; కీర్తనల గ్రంథము 85:2; కీర్తనల గ్రంథము 86:5; కీర్తనల గ్రంథము 130:4; లూకా 24:45-47; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9.

35. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

ఇస్రాయేల్‌కు తాను చేసిన వాగ్దానాల విషయంలో తిరుగులేని తన విశ్వసనీయత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్థాపించిన ప్రకృతి ధర్మాలు ఏవిధంగా గతులు తప్పవో ఇస్రాయేల్‌వారి ఉనికికీ అఖండత చెక్కు చెదరదన్న సంగతి కూడా అంతే నిశ్చయం. నక్షత్రాలున్న విశ్వం సరిహద్దుల్ని కొలవడం, భూమి కేంద్ర బిందువుకు చొచ్చుకుపోవడం ఎంత అసాధ్యమో ఆ ప్రజలపట్ల ఆయన ఉద్దేశాలు నెరవేరకపోవడం కూడా అంతే అసాధ్యం.

36. ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.

37. యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే.

38. యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.

తాను మాట్లాడుతున్నది అక్షరాలా ఇస్రాయేల్ దేశం గురించే అని స్పష్టం చేసేందుకు దేవుడు వారి నగరమైన జెరుసలంను ప్రస్తావిస్తున్నాడు. ఆ నగరంలో కొన్ని భాగాలను తిరిగి కట్టించడం జరుగుతుంది. అతి హీనంగా కలుషితమైపోయిన ప్రాంతం పవిత్రమౌతుంది. ఆ పైన నగరం శాశ్వతంగా ఉండిపోతుంది. జెకర్యా 14:9-11, జెకర్యా 14:20-21 పోల్చి చూడండి. క్రీ.శ. 70లో రోమ్‌వాళ్ళు జెరుసలంను పూర్తిగా ధ్వంసం చేశారు కాబట్టి ఈ వాక్కు నెరవేర్పు ఇంకా ముందు ఉంది. జెరుసలం ఇంకా అపనమ్మకంలోనే ఉంటూ ప్రభువైన యేసుక్రీస్తు అనే తన అభిషిక్తుణ్ణి నిరాకరిస్తూ ఉంది గనుక ఆ నగరం ఇంకా యిర్మీయా, జెకర్యా గ్రంథాల్లో చెప్పినట్టు దేవునికి పవిత్రం కాలేదు. మత్తయి 23:37-39 పోల్చి చూడండి. కాబట్టి ఈ భవిష్యద్వాక్కు ఇంకా నెరవేరలేదు అనుకోవచ్చు.

39. కొలనూలు దాని కెదురుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.

40. శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 31 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇజ్రాయెల్ పునరుద్ధరణ. (1-9) 
దేవుడు తన ప్రజలతో మరోసారి ఒడంబడిక సంబంధాన్ని ఏర్పరచుకుంటానని వారికి హామీనిచ్చాడు. వారు తమను తాము చాలా ప్రతికూల స్థితిలో కనుగొన్నప్పుడు మరియు నిరుత్సాహకరమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, చర్చి గతంలో ఇటువంటి కష్టాలను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. అయితే, గత ఆశీర్వాదాలను గుర్తుచేసుకున్నప్పుడు ప్రస్తుత కష్టాల మధ్య సుఖం పొందడం కష్టం. ఏది ఏమైనప్పటికీ, దేవుని దయతో ఆశీర్వదించబడినవారు మరియు అతని ప్రేమను పొందినవారు అతని ప్రేమ శాశ్వతమైనదని, అతని దైవిక ప్రణాళికలలో మొదటి నుండి ఉనికిలో ఉన్నందున మరియు శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సాంత్వన పొందవచ్చు.
దేవుడు, తన ప్రేమలో, వారి ఆత్మలపై తన ఆత్మ యొక్క పరివర్తన ప్రభావం ద్వారా తాను ప్రేమించే వారిని ఆకర్షిస్తాడు. ఆయన గత కార్యాల కోసం మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆయన చర్చికి అవసరమైన మరియు ఎదురుచూసే ఆశీర్వాదాల కోసం ఆయనను వేడుకోవడం కూడా చాలా అవసరం. ప్రభువు తన పిలుపును పొడిగించినప్పుడు, మనం అసమర్థతకు సాకులు చెప్పకూడదు, ఎందుకంటే మనల్ని పిలిచేవాడు అవసరమైన బలాన్ని మరియు సహాయాన్ని అందిస్తాడు. దేవుని దయ వ్యక్తులను పశ్చాత్తాపానికి దారి తీస్తుంది మరియు వారు తమ చెర నుండి విడిపించబడినప్పుడు, పాపం పట్ల వారి దుఃఖం వారు భరించినప్పటి కంటే చాలా లోతైనది మరియు హృదయపూర్వకంగా ఉంటుంది.
మనం దేవుణ్ణి మన తండ్రిగా అంగీకరించి, మొదటి సంతానం యొక్క సమావేశంలో భాగమైతే, మనకు ప్రయోజనకరమైనది ఏమీ ఉండదు. ఈ ప్రవచనాలు నిస్సందేహంగా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఇశ్రాయేలీయుల భవిష్యత్ సమావేశాన్ని కూడా సూచిస్తాయి. వారు పాపులను క్రీస్తుగా మార్చడాన్ని మరియు వారు మార్గనిర్దేశం చేసే స్పష్టమైన మరియు సురక్షితమైన మార్గాన్ని ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు.

మార్గదర్శకత్వం మరియు సంతోషం యొక్క వాగ్దానాలు; రాచెల్ విలపిస్తోంది. (10-17) 
ఇశ్రాయేలును చెదరగొట్టిన వ్యక్తికి వారిని ఎక్కడ గుర్తించాలో ఖచ్చితంగా తెలుసు. భవిష్యవాణి నిబంధనలలో దేవుని దయాదాక్షిణ్యాలను గుర్తించడం భరోసానిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, మన ఆత్మలు దేవుని ఆత్మ మరియు దయ యొక్క మంచుతో పోషించబడినప్పుడు మాత్రమే నిజమైన విలువైన తోటలను పోలి ఉంటాయి. అమూల్యమైన వాగ్దానం వస్తుంది, అది పరలోక సీయోనులో మాత్రమే దాని సంపూర్ణ నెరవేర్పును పొందుతుంది. వ్యక్తులు దేవుని ప్రేమపూర్వక దయ గురించి తెలుసుకున్నప్పుడు, వారు తమ సంతోషం కోసం ఇంకేమీ కోరుకోకుండా దానితో పూర్తిగా సంతృప్తి చెందుతారు.
ఈ ప్రవచనంలో, రాచెల్ తన సమాధి నుండి బయటపడినట్లుగా చిత్రీకరించబడింది మరియు ఆమె సంతానం నిర్మూలించబడిందని నమ్ముతూ ఓదార్పుని పొందేందుకు నిరాకరించింది. మాథ్యూ 2:16-18లో నమోదు చేయబడినట్లుగా, బేత్లెహెమ్‌లో హేరోదు పిల్లలను ఊచకోత కోసిన విషాద సంఘటన ఈ అంచనాను పాక్షికంగా నెరవేర్చింది కానీ దాని మొత్తం ప్రాముఖ్యతను కలిగి ఉండదు. మనకు మరియు మన ప్రియమైనవారికి శాశ్వతమైన వారసత్వం గురించి మనం చివరికి నిరీక్షణను కలిగి ఉంటే, అన్ని తాత్కాలిక కష్టాలను భరించవచ్చు మరియు చివరికి మన ప్రయోజనం కోసం పని చేస్తుంది.

ఎఫ్రాయిమ్ తన తప్పులపై విలపిస్తాడు. (18-20) 
పది గోత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఫ్రాయిమ్ తన పాపాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అతను తన అతిక్రమణలు, మూర్ఖత్వం మరియు దారితప్పిన కారణంగా తనను తాను తీవ్రంగా విసుగు చెందుతాడు. అతను దేవునితో సన్నిహితంగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి లేడని అతను గ్రహించాడు మరియు అంతకన్నా ఎక్కువగా, అతను దారితప్పినప్పుడు తనను తాను తిరిగి తీసుకురాలేడు. అందుచేత, "నన్ను తిప్పుము, నేను తిరగబడతాను" అని ప్రార్థిస్తాడు. అతని స్వంత సంకల్పం దేవుని దివ్య చిత్తానికి లొంగిపోయింది. దేవుని ఆత్మ యొక్క మార్గదర్శకత్వం అతని ప్రొవిడెన్స్ యొక్క దిద్దుబాట్లతో పాటుగా ఉన్నప్పుడు, పరివర్తన సాధించబడుతుంది.
కష్ట సమయాల్లో, దేవుడు మనల్ని తలుచుకుంటాడనే జ్ఞానంలో మన ఓదార్పు ఉంటుంది. దేవుడు దయ యొక్క నిధిని కలిగి ఉన్నాడు, సమృద్ధిగా మరియు అచంచలంగా ఉన్నాడు, ఆయనను హృదయపూర్వకంగా కోరుకునే వారందరికీ ఖచ్చితంగా సరిపోతుంది.

వాగ్దానం చేయబడిన రక్షకుడు. (21-26) 
పాపం యొక్క బానిసత్వం నుండి దేవుని పిల్లల స్వేచ్ఛకు దారితీసే మార్గం బాగా గుర్తించబడిన రహదారి. ఇది సూటిగా మరియు సురక్షితమైనది, కానీ హృదయపూర్వకంగా దానిపై దృష్టి పెట్టేవారు మాత్రమే దానిపై అడుగు పెట్టే అవకాశం ఉంది. వారు కొత్త మరియు అసాధారణమైన వాటి వాగ్దానం ద్వారా ప్రేరేపించబడ్డారు, విననిది: సృష్టి, సర్వశక్తిమంతమైన శక్తి యొక్క దైవిక పని-క్రీస్తు యొక్క మానవ స్వభావం, పరిశుద్ధాత్మ ప్రభావంతో రూపొందించబడింది మరియు సిద్ధం చేయబడింది. యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి ఇది ఇక్కడ ప్రస్తావించబడింది, సంపన్నమైన భవిష్యత్తు పరిష్కారం గురించి వారికి ఓదార్పుకరమైన దర్శనాన్ని అందిస్తుంది.
దేవుడు దైవభక్తి మరియు నిజాయితీని ఏకం చేసాడు మరియు ఎవరూ వాటిని వేరు చేయడానికి ప్రయత్నించకూడదు లేదా మరొకరు లేకపోవడాన్ని భర్తీ చేయగలరని విశ్వసించకూడదు. దేవుని ప్రేమ మరియు అనుగ్రహంలో, అలసిపోయిన ఆత్మలు విశ్రాంతిని కనుగొంటాయి మరియు దుఃఖంలో ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు. మరియు జెరూసలేం యొక్క శ్రేయస్సు మరియు ఇజ్రాయెల్ అంతటా శాంతి కంటే మనకు గొప్ప సంతృప్తిని ఏది తీసుకురాగలదు?

చర్చిపై దేవుని శ్రద్ధ. (27-34) 
దేవుని ప్రజలు అభివృద్ధి మరియు శ్రేయస్సును అనుభవిస్తారు. హెబ్రీయులకు 8:8-9లో, ఈ ప్రకరణము యేసుక్రీస్తులో విశ్వాసులతో స్థాపించబడిన కృప యొక్క ఒడంబడిక యొక్క సారాంశంగా పేర్కొనబడింది. ఇది కొత్త చట్టాలను స్వీకరించడం గురించి కాదు, ఎందుకంటే క్రీస్తు చట్టాన్ని రద్దు చేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి వచ్చాడు. బదులుగా, ధర్మశాస్త్రం ఒకప్పుడు రాతి పలకలపై చెక్కబడినట్లుగా, ఆత్మ యొక్క దైవిక స్పర్శ ద్వారా వారి హృదయాలలో లిఖించబడుతుంది.
తన కృపచేత, ప్రభువు తన శక్తి దినాన తన ప్రజలను ఇష్టపూర్వకంగా అనుచరులుగా మారుస్తాడు. ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకుంటారు మరియు అందరికీ అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేవుని గురించిన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. సువార్త వ్యాప్తికి అనుగుణంగా పరిశుద్ధాత్మ ప్రవాహం ఉంటుంది. అంతిమంగా, వారి స్వంత పాపాల వల్ల తప్ప ఎవరూ నశించరు, ఎందుకంటే క్రీస్తు ద్వారా మోక్షం దానిని అంగీకరించడానికి ఇష్టపడే వారందరికీ తెరవబడుతుంది.

సువార్త సమయంలో శాంతి మరియు శ్రేయస్సు. (35-40)
సృష్టికర్త యొక్క సంకల్పం ప్రకారం ఖగోళ వస్తువులు తమ నిర్దేశించిన మార్గాలను అంతిమకాలం వరకు విశ్వసనీయంగా అనుసరిస్తున్నట్లుగా మరియు అల్లకల్లోలమైన సముద్రం అతని ఆజ్ఞను పాటించినట్లుగా, యూదు ప్రజలు నిస్సందేహంగా ఒక ప్రత్యేక జాతిగా మిగిలిపోతారు. ఈ పదాలు ఇజ్రాయెల్ పునరుద్ధరణ వాగ్దానాన్ని మరింత గట్టిగా వ్యక్తపరచలేవు. జెరూసలేం పునర్నిర్మాణం, విస్తరణ మరియు స్థాపన అనేది సువార్త చర్చి కోసం దేవుడు చేయాలనుకున్న విశేషమైన పనులకు ప్రతిజ్ఞగా ఉపయోగపడుతుంది.
ప్రతి నిజమైన విశ్వాసి యొక్క వ్యక్తిగత ఆనందం, అలాగే ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్తు పునరుద్ధరణ, వాగ్దానాలు, ఒడంబడికలు మరియు ప్రమాణాల ద్వారా దృఢంగా హామీ ఇవ్వబడుతుంది. ఈ దైవిక ప్రేమ మానవ అవగాహనను అధిగమిస్తుంది మరియు దానిని స్వీకరించే వారికి, ప్రతి ప్రస్తుత ఆశీర్వాదం మోక్షానికి ముందస్తు రుచిగా ఉపయోగపడుతుంది.




Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |