Jeremiah - యిర్మియా 37 | View All

1. బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.

1. King Nebuchadnezzar of Babylonia had removed Jehoiachin son of Jehoiakim from being the king of Judah and had made Josiah's son Zedekiah king instead.

2. అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.

2. But Zedekiah, his officials, and everyone else in Judah ignored everything the LORD had told me.

3. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహుకలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు పంపిదయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.

3. Later, the Babylonian army attacked Jerusalem, but they left after learning that the Egyptian army was headed in this direction. One day, Zedekiah sent Jehucal and the priest Zephaniah to talk with me. At that time, I was free to go wherever I wanted, because I had not yet been put in prison. Jehucal and Zephaniah said, 'Jeremiah, please pray to the LORD our God for us.'

4. అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండ లేదు; అతడు ప్రజలమధ్య సంచరించుచుండెను.

4. (SEE 37:3)

5. ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.

5. (SEE 37:3)

6. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

6. Then the LORD told me to send them back to Zedekiah with this message: Zedekiah, you wanted Jeremiah to ask me, the L(ORD )God of Israel, what is going to happen. So I will tell you. The king of Egypt and his army came to your rescue, but soon they will go back to Egypt.

7. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెనుమీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.

7. (SEE 37:6)

8. కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు.

8. Then the Babylonians will return and attack Jerusalem, and this time they will capture the city and set it on fire.

9. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.

9. Don't fool yourselves into thinking that the Babylonians will leave as they did before.

10. మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.

10. Even if you could defeat their entire army, their wounded survivors would still be able to leave their tents and set Jerusalem on fire.

11. ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటనుండి వెళ్లిపోగా

11. The Babylonian army had left because the Egyptian army was on its way to help us.

12. యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా

12. So I decided to leave Jerusalem and go to the territory of the Benjamin tribe to claim my share of my family's land.

13. ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనినీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా

13. I was leaving Jerusalem through Benjamin Gate, when I was stopped by Irijah, the officer in charge of the soldiers at the gate. He said, 'Jeremiah, you're under arrest for trying to join the Babylonians.'

14. యిర్మీయా అది అబద్దము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను.

14. I'm not trying to join them!' I answered. But Irijah wouldn't listen, and he took me to the king's officials.

15. అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహ ముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.
హెబ్రీయులకు 11:36

15. They were angry and ordered the soldiers to beat me. Then I was taken to the house that belonged to Jonathan, one of the king's officials. It had been turned into a prison, and I was kept in a basement room. After I had spent a long time there,

16. యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి,

16. (SEE 37:15)

17. అతని తన యింటికి పిలిపించి యెహోవాయొద్ద నుండి ఏ మాటైనను వచ్చెనా అని యడుగగా యిర్మీయా - నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను.

17. King Zedekiah secretly had me brought to his palace, where he asked, 'Is there any message for us from the LORD?' 'Yes, there is, Your Majesty,' I replied. 'The LORD is going to let the king of Babylonia capture you.'

18. మరియయిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెనునేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి?

18. Then I continued, 'Your Majesty, why have you put me in prison? Have I committed a crime against you or your officials or the nation?

19. బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?

19. Have you locked up the prophets who lied to you and said that the king of Babylonia would never attack Jerusalem?

20. రాజా, నా యేలిన వాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము, నేను అక్కడ చని పోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.

20. Please, don't send me back to that prison at Jonathan's house. If you do, I will die.'

21. కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

21. King Zedekiah had me taken to the prison cells in the courtyard of the palace guards. He told the soldiers to give me a loaf of bread from one of the bakeries every day until the city ran out of grain.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 37 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

కల్దీయుల సైన్యం తిరిగి వస్తుంది. (1-10) 
ఇతరుల తప్పుల యొక్క భయంకరమైన పరిణామాలకు సంఖ్యలు సాక్ష్యమిస్తాయి, అయినప్పటికీ వారు నిర్లక్ష్యంగా తమ బూట్లు వేసుకుని అదే వినాశకరమైన మార్గంలో నడుస్తారు. కష్ట సమయాల్లో, సేవకులు మరియు క్రైస్తవ సహచరుల మధ్యవర్తిత్వం కోరడం చాలా అవసరం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రార్థనల కోసం తహతహలాడే చాలామంది తరచుగా సలహాలను తిరస్కరిస్తారు, అయితే దైవిక తీర్పులలో ఆలస్యం కొన్నిసార్లు పాపులను కఠినతరం చేస్తుంది. అయినప్పటికీ, దేవుని సహాయం లేకుండా, ఏ భూసంబంధమైన సంస్థ సహాయం అందించదు. అవి ఎంత అసంభవంగా కనిపించినా, దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఎంచుకున్న సాధనాలు వాటి పాత్రను నెరవేరుస్తాయి.

యిర్మీయా ఖైదు చేయబడ్డాడు. (11-21)
యెషయా 26:20లో సలహా ఇచ్చినట్లుగా సద్గురువులు ఉపసంహరించుకోవడం, వారి గదులకు వెనుదిరగడం మరియు తలుపులు మూసుకోవడం వివేకవంతమైన సందర్భాలు ఉన్నాయి. యిర్మీయా పారిపోయిన వ్యక్తిగా పట్టుబడి జైలు పాలయ్యాడు. చర్చి యొక్క బలమైన మద్దతుదారులు తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవడం అసాధారణం కాదు, తరచుగా దాని అత్యంత దుర్మార్గపు విరోధుల ప్రయోజనాల కోసం. తప్పుడు అభియోగాలు మోపబడినప్పుడు, మనం ఆరోపణలను తిరస్కరించవచ్చు మరియు నీతితో తీర్పు చెప్పే వ్యక్తికి మన కారణాన్ని అప్పగించవచ్చు. యిర్మీయా విశ్వాసపాత్రంగా ఉండటానికి దేవుని దయను పొందాడు మరియు మానవ దయకు బదులుగా దేవునికి లేదా అతని పాలకుడికి తన విధేయతను రాజీ చేసుకోవడానికి నిరాకరించాడు. దేవుని సందేశాన్ని అందించేటప్పుడు అతను నిజాయితీగా రాజుకు పూర్తి సత్యాన్ని తెలియజేసాడు. యిర్మీయా దేవుని వాక్యాన్ని బట్వాడా చేస్తున్నప్పుడు ధైర్యంగా మాట్లాడాడు, తన వ్యక్తిగత అభ్యర్థనను చేసేటప్పుడు అతను విధేయతతో మాట్లాడాడు. దేవుని సేవలో, సింహంలా ఉగ్రంగా, వ్యక్తిగత విషయాల్లో గొర్రెపిల్లలా మృదువుగా ఉండాలి. తత్ఫలితంగా, దేవుడు రాజు దృష్టిలో యిర్మీయాకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ప్రభువైన దేవుడు తన ప్రజల కోసం జైలు గదులను కూడా పచ్చికభూములుగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాడు మరియు కరువు కాలంలో కూడా వారు సంతృప్తి చెందేలా చూసేందుకు స్నేహితులను పెంచుకుంటాడు.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |