Jeremiah - యిర్మియా 46 | View All
Study Bible (Beta)

1. అన్యజనులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

యిర్మియా 1:10; యిర్మియా 25:17; యిర్మియా 27:3. 46నుండి 51వ అధ్యాయం దాకా యిర్మీయా ఇతర జాతులకు ప్రవక్తగా తన పరిచర్య చేస్తున్నాడు. పది దేశాల, లేక ప్రాంతాల గురించి దేవుడు వెల్లడించిన దానిని ఈ భాగంలో యిర్మీయా రాసి పెట్టాడు. ఈ ప్రదేశాలన్నీ ఇస్రాయేల్‌కు నైరుతి దిక్కున ఈజిప్ట్‌నుండి ఇస్రాయేల్ తూర్పు దిక్కున యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల అవతల ఉన్న ఏలాం వరకు వ్యాపించిన భూభాగంలో ఉన్నాయి. ఈ అధ్యాయాల్లో దేవుడు మరో సారి తాను దేశాలన్నిటిపైనా సర్వాధికారిననీ, విశ్వానికి చక్రవర్తిననీ తెలియజేస్తున్నాడు. మానవ చరిత్ర అంతటిలోనూ ఒక రాజ్యాన్ని ఉన్నత స్థితిలోకి తెచ్చేందుకూ, ఒక రాజ్యాన్ని పతనమొందించేందుకూ ఆయన పూనుకుని తన పనులు జరిగిస్తూనే ఉన్నాడు. ఈనాటికీ అలా చేస్తూనే ఉన్నాడు.

2. ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసునదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట.

“ఈజిప్ట్”– ఆఖరు రెండు వచనాలు తప్ప ఈ అధ్యాయమంతా ఈజిప్ట్‌ను గురించి రాసినదే. “కర్కెమీషు”– క్రీ.పూ. 605లో ఈ ప్రదేశంలో బబులోను సైన్యాలు ఈజిప్ట్ సైన్యాలను ఓడించాయి. ఇది పురాతన ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన యుద్ధాల్లో ఒకటి. పశ్చిమాసియాలో ఈజిప్ట్ అధికారం ఈ యుద్ధంవల్ల భగ్నమైంది. బబులోను సామ్రాజ్యం అంత ఉన్నత స్థాయికి రావడానికి కారణమైంది.

3. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి యుద్ధమునకు రండి

హీబ్రూలో ఇదంతా పద్యరూపంలో ఉంది. కళ్ళకు కట్టినట్టుగా సంకేత భాషలో ఈజిప్ట్ ఓటమిని ఇది వర్ణిస్తున్నది.

4. గుఱ్ఱములను కట్టుడి, రౌతులారా, కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకొనుడి ఈటెలకు పదును పెట్టుడి కవచములు వేసికొనుడి.

5. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.

6. త్వరగ పరుగెత్తువారు పారిపోజాలకున్నారు బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు ఉత్తరదిక్కున యూఫ్రటీసు నదీతీరమందు వారు తొట్రిల్లిపడుచున్నారు.

7. నైలునదీ ప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి

8. ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదనుపట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.

9. గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.

ఈ ప్రాంతాలవారు ఈజిప్ట్ సైన్యంలో ఉన్నారు.

10. ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండనచేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసునదియొద్ద ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా బలి జరిగింప బోవుచున్నాడు.
లూకా 21:22

కర్కెమీషు యుద్ధం కేవలం ఈజిప్ట్, బబులోను రాజ్యాలకు సంబంధించినదేనా? కాదు. సేనల ప్రభువు యెహోవా అక్కడ ఉండి తన ఉద్దేశాలను నెరవేర్చుకొంటున్నాడు. ఈజిప్ట్‌ను దాని పాపాల కారణంగా శిక్షిస్తున్నాడు. యిర్మియా 25:30-38 నోట్ కూడా చదవండి.

11. ఐగుప్తుకుమారీ, కన్యకా, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలుగదు

12. నీకు సిగ్గుకలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదనధ్వని దేశమందంతట వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకనిమీద ఒకడు పడి అందరు కూలుదురు.

13. బబులోనురాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతముచేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

ఇది క్రీ.పూ. 568–567లో జరిగింది. అంటే కర్కెమీషు యుద్ధం జరిగిన చాలా ఏళ్ళకన్నమాట.

14. ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నొపులోను తహపనేసులోను ప్రకటనచేయుడి ఏమనగాఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మింగివేయుచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి.

15. నీలో బలవంతులైన వారేల తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు.

16. ఆయన అనేకులను తొట్రిల్ల జేయుచున్నాడు వారొకనిమీద ఒకడు కూలుచు లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి మన స్వజనులయొద్దకు మన జన్మభూమికి వెళ్లుదము రండి అని వారు చెప్పుకొందురు.

“సొంత ప్రజ”– ఇతర ప్రాంతాలనుంచి కూలికి వచ్చిన సైనికులు (వ 9,20).

17. ఐగుప్తురాజగు ఫరో యుక్తసమయము పోగొట్టుకొను వాడనియు వట్టిధ్వని మాత్రమేయని వారచ్చట చాటించిరి.

18. పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే.

దేవుడు తనను తాను ఏమని పిలుచుకొంటున్నాడో చూడండి. ఆయన విశ్వానికంతటికీ మహారాజు. అన్ని దేశాలమీదా నిజమైన పరిపాలకుడు. తాబోరు, కర్మెలు ఇస్రాయేల్ లోని రెండు కొండలు.

19. ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.

20. ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తరదిక్కుననుండి జోరీగ వచ్చుచున్నది వచ్చేయున్నది.

21. పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడలవలె ఉన్నారు వారేగదా వెనుకతట్టు తిరిగిరి యొకడును నిలువకుండ పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయెను.

22. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు మ్రానులు నరుకువారివలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది యెహోవా వాక్కు ఇదే

“పాము”– నిర్గమకాండము 4:3 చూడండి.

23. లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయుదురు.

24. ఐగుప్తు కూమారి అవమానపరచబడును ఉత్తరదేశస్థులకు ఆమె అప్పగింపబడును

25. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.

ఆమోను కేవలం నో నగరానికే గాక ఈజిప్ట్ చరిత్రలో కొంత కాలం ఆ దేశమంతటికీ ముఖ్య దేవుడుగా ఎంచబడ్డాడు. దేవుడు ఆమోనునూ ఈజిప్ట్‌లోని ఇతర దేవతలనూ శిక్షించబోతున్నాడు. అంటే వారి శక్తిహీనతను, శూన్యతను బట్టబయలు చేసి అవమానం పాలు చేయబోతున్నాడు. నిర్గమకాండము 12:12 పోల్చి చూడండి.

26. వారి ప్రాణము తీయజూచు బబులోనురాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.

దేవుడు ఈజిప్ట్‌ను సంపూర్తిగా నాశనం చేయదలుచు కోలేదు.

27. నా సేవకుడవైన యాకోబూ, భయపడకుము ఇశ్రాయేలూ, జడియకుము దూరములోనుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలోనుండి నీ సంతతివారిని రక్షించుచున్నాను ఎవరి భయమును లేకుండ యాకోబు తిరిగివచ్చును అతడు నిమ్మళించి నెమ్మదినొందును.

యిర్మియా 30:10-11.

28. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైయున్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశప్రజలను సమూల నాశనము చేసెదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమునుబట్టి నిన్ను శిక్షించెదను ఇదే యెహోవా వాక్కు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 46 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈజిప్షియన్ల ఓటమి. (1-12) 
దేవుని సందేశం మొత్తం క్రీస్తు సువార్త బోధలను అనుసరించని వారిని వ్యతిరేకిస్తుంది, అయితే అది ఆయనను ఆలింగనం చేసుకోవడానికి ఎంచుకున్న అన్యులతో సహా వారికి మద్దతునిస్తుంది. ఈ ప్రవచనం ఈజిప్ట్ గురించిన సూచనతో ప్రారంభమవుతుంది. వారి అన్ని నైపుణ్యాలు మరియు ప్రభావంతో తమను తాము బలపరచుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలతో సంబంధం లేకుండా, వారి ప్రయత్నాలు చివరికి వ్యర్థమని రుజువు చేస్తాయి. దేవుడు తన విరోధులకు కలిగించిన గాయాలను వైద్య చికిత్సల ద్వారా సరిచేయలేము. నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో, అధికారం మరియు శ్రేయస్సు త్వరగా ఒక సంస్థ నుండి మరొకదానికి మారతాయి.

టైర్ ముట్టడి తర్వాత వారి పతనం. (13-26) 
గతంలో ఇతరులను ఆక్రమించిన వారు ఇప్పుడు ఆక్రమణలను ఎదుర్కొంటున్నారు. ఈజిప్టు, ఒకప్పుడు అందమైన మరియు అలవాటు లేని కోడలు వలె, ఇకపై అణచివేత భారం నుండి విముక్తి పొందదు; ఎందుకంటే కల్దీయులు తమ దారిలో వెళ్తున్నప్పుడు ఉత్తరం నుండి నాశనము సమీపిస్తోంది. దేవుని తీర్పులు దేశాలను ప్రభావితం చేస్తున్న సమయాల్లో వారిని ఉద్ధరించడానికి ఉద్దేశించిన ఇజ్రాయెల్ ప్రజలకు ఓదార్పు మరియు శాంతి విస్తరించబడ్డాయి. అతను వారి ప్రక్కనే ఉంటాడు, వారిని మితంగా మాత్రమే సరిదిద్దాడు మరియు శిక్ష ద్వారా వారిని తన ఉనికి నుండి శాశ్వతంగా వేరు చేయడు.

యూదులకు ఓదార్పునిచ్చే వాగ్దానం. (27,28)



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |