Daniel - దానియేలు 11 | View All
Study Bible (Beta)

1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతనియొద్ద నిలువబడితిని.

“దర్యావేషు”– దానియేలు 5:31.

2. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.

ఇక్కడి నుంచి దానియేలు 12:4 వరకు ఉన్న కథనం దానియేలు కాలం నుంచి ఈ యుగాంతం వరకు సంభవించేవి కొన్ని వెల్లడి అయ్యాయి. దానియేలు వింతైన రీతిగా భవిష్యత్తులోకి తొంగిచూశాడు. వ 2-36 వరకు ఉన్న భవిష్యద్వాక్కులు 362 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తయ్యాయి. “ముగ్గురు రాజులు” - కాంబిసెస్, సూడో స్మెర్దిస్, డారియస్ హిస్టాపిస్. నాలుగోవాడు అహష్‌వేరోషు (ఎస్తేరు 1:1 లోని అహష్‌వేరోషు ఇతనే). క్రీ.పూ. 480లో ఇతడు గ్రీసు పై దండెత్తాడు. ఇది విఫలమైంది.

3. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును.

మహా అలెగ్జాండరు (క్రీ.పూ. 336–323).

4. అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు, అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును, అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.

“నాలుగు”– దానియేలు 7:4-7; దానియేలు 8:8. అలెగ్జాండరు సామ్రాజ్యం నాలుగు ముక్కలైంది.

5. అయితే దక్షిణదేశపు రాజును, అతని అధిపతులలో ఒకడును బలముపొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును.

ఇందులో అలెగ్జాండరు సామ్రాజ్యంలోని రెండు భాగాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం కనిపిస్తుంది. దక్షిణ ప్రాంతం రాజు అంటే ఈజిప్ట్ రాజు. ఉత్తర ప్రాంతం రాజంటే సిరియా, దాని మిత్ర పక్షాల రాజులు. బహు కొద్దిమంది వ్యాఖ్యాతలు ఈ వచనాలన్నీ ఈ యుగాంతానికి సంబంధించినవని అభిప్రాయ పడ్డారు. అయితే ఎక్కువ మంది మాత్రం క్రీ.పూ. 323తో మొదలై దాదాపు 160 సంవత్సరాల వరకు పై రెండు రాజ్యాల పాలకుల క్రమాన్ని ఈ వచనాలు వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నోట్స్‌లో ఉన్న వివరణ కూడా ఇదే. దక్షిణ ప్రాంతానికి మొదటి రాజు టాలెమీ సోటెర్. ఇతడు మాసిదోనియావాడు. ఉత్తర ప్రాంతం మొదటి రాజు సెలూకస్. ఈ రెండు రాజ్యాలకు సరిగ్గా మధ్యలో ఇస్రాయేల్ దేశం ఉంది.

6. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు.

“కూతురు”– బెర్నీకే. “ఉత్తర ప్రాంతం రాజు – అంతియొకస్ 2

7. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తర దేశపురాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును

“ఆమె వంశంలో ఒకడు”– టాలెమీ 3 “ఉత్తర ప్రాంతం రాజు” – సెలూకస్ 3

8. మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.

9. అతడు దక్షిణ దేశపురాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును.

10. అతని కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.

“అతడి కొడుకులు”– సెలూకస్ 3, అంతియొకస్ 3.

11. అంతలో దక్షిణదేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపురాజుతో యుద్ధము జరిగించును; ఉత్తరదేశపురాజు గొప్పసైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును.

“దక్షిణ రాజు”– టాలెమీ 4 అతియొకస్ 3 ను రఫియా దగ్గర యుద్ధంలో ఓడించాడు.

12. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణదేశపు రాజు మనస్సున అతిశయపడును; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు.

13. ఏలయనగా ఉత్తర దేశపురాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును.

14. ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు.

“దక్షిణం”– టాలెమీ 5. “నీ ప్రజలో”– ఉత్తర రాజుతో చేయి కలిపిన యూదులు.

15. అంతలో ఉత్తరదేశపురాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. దక్షిణ దేశపు రాజుయొక్క బలము నిలువలేకపోయినందునను, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.

“పట్టణానికి”– మధ్యధరా తీరాన ఉన్న సీదోను.

16. వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువలేక పోయినందున తనకిష్టమువచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును.

“వచ్చినవాడు”– అంతియొకస్ 3.

17. అతడు తన రాజ్యముయొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధిచేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.

“కూతురు”– క్లియోపాత్రా 1.

18. అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణచేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాకతప్పదు.

“సేనాధిపతి”– స్కిపియా ఆసియాటికస్ అనే రోమ్ నాయకుడు.

19. అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.

క్రీ.పూ. 187లో ఎలిమయిస్‌లో అంతియొకస్ 3 మరణించాడు.

20. అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినము లైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.

“అతనికి మారుగా...వచ్చినవాడు” సెలూకస్ 5.

21. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరుగాని నెమ్మది కాలమందు అతడువచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.

అంతియొకస్ 4. అతడికి అంతియొకస్ ఎపిఫానీస్ అని పేరు. దానియేలు 8:9-13, దానియేలు 8:23-25 చూడండి. న్యాయమైన వారసుడు ఇంకా పసివాడుగా ఉండగానే ఇతడు అన్యాయంగా అధికారం చేజిక్కించుకున్నాడు.

22. ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.

మొదట్లో అంతియొకస్ యుద్ధ రంగంలో విజయాలు సాధించాడు. అయితే తనతో ఒప్పందం చేసుకొన్న వారి పట్ల నమ్మక ద్రోహం జరిగించాడు.

23. అతడు సంధిచేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనముగలవాడైనను ఎదురాడి బలము పొందును.

24. అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులు గాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును

25. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చు కొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును.

“దక్షిణ రాజు”– టాలెమీ 6.

26. ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.

“సైన్యం”– టాలెమీ సైన్యం.

27. కీడుచేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు.

“ఇద్దరు రాజులు”– నాలుగవ అంతియొకస్, ఆరవ టాలెమీ.

28. అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.

“పవిత్రమైన ఒడంబడిక”– ఈ అంతియొకస్‌కు ఇస్రాయేల్ అంటే ద్వేషం. క్రీ.పూ. 169లో అతడు జెరుసలంకు వచ్చి అనేకమంది యూదులను వధించి దేవాలయాన్ని కొల్లగొట్టాడు.

29. నిర్ణయకాలమందు మరలి దక్షిణదిక్కునకు వచ్చునుగాని మొదట నున్నట్టుగా కడపటనుండదు.

“నిర్ణీత కాలం”– అంతియొకస్ ద్వారా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకొనేందుకు నిర్ణయించిన కాలం.

30. అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును.

“ఓడలు”– పాపిలియస్ లాయినాస్ నాయకత్వంలోని రోమ్ నౌకాబలం. “పవిత్రమైన ఒడంబడిక”– వ 28. “విడిచిపెట్టిన”– అంతియొకస్ పక్షం చేరిన భ్రష్టులైన యూదులు (వ 32).

31. అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు.
మత్తయి 24:15, మార్కు 13:14

క్రీ.పూ. 168లో అంతియొకస్ జెరుసలంను ఆక్రమించుకునేందుకు సైన్యాన్ని పంపాడు. విశ్రాంతి దినాన ఆ సైన్యం ప్రజల పైబడి చాలామంది స్త్రీలను, పిల్లలను చెరపట్టుకుంది. దేవాలయం సైన్యం హస్తగతమయింది. బలులన్నీ ఆగిపోవాలని అంతియొకస్ యూదులను ఆజ్ఞాపించాడు. ఆలయ ఆవరణంలో హోమ బలిపీఠం పై గ్రీకు దేవుడైన జూస్‌కు బలిపీఠాన్ని కట్టించాడు. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఇదే పరిస్థితి కొనసాగింది. మత్తయి 24:15 లో యేసుప్రభువు చెప్పిన “అసహ్యకరమైన వినాశకారి” ఇది కాదు గాని దానికి ఒక సూచన. దానియేలు 9:27; దానియేలు 12:11 చూడండి.

32. అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు.

యూదుల్లో రెండు వర్గాలు అయ్యాయి. కొందరు దురాశపరులైన దుర్మార్గులు అంతియొకస్‌కు లొంగిపొయ్యారు. ఇతరులు అతణ్ణి గట్టిగా ఎదిరించారు. వారు ప్రజలకు సత్యాన్ని బోధించారు. అంతియొకస్ మూలంగా చాలా హింసను భరించారు. వీరు దేవుణ్ణెరిగిన యూదులు, ఆయనకోసం బాధలను అనుభవించడానికి సిద్ధపడినవారు. హెబ్రీయులకు 11:36-38 చూడండి.

33. జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.

34. వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని

“కపటంగా”– అన్ని కాలాల్లోనూ ఒకటి చెప్పి మరొకటి చేసే వంచకులు ఉంటారు.

35. నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.

“దీనావస్థలో దిగి”– తెలివితేటలున్నవారు ఇలా దిగిపోవడం ద్వారా దేవుడు వారిని మరింత శుద్ధులుగా మరింత పదునుగా చేస్తాడు. ఇక్కడ “దీనావస్థలో దిగిపోతారు” అని అర్థం ఇచ్చే హీబ్రూ పదం “శక్తి లేక దిగిపోవడం” అన్న అర్థాన్ని ఇస్తుంది. నిజమైన వివేకవంతులు తమ బలహీనతలో తొట్రుపడుతున్నప్పుడు దేవునిలో బలాన్ని వెదికి కనుక్కొంటారు. అప్పుడిక తూలిపడడం ఉండదు (యెషయా 40:31). శుద్ధి చేయడం గురించి కీర్తనల గ్రంథము 66:10-12 చూడండి. “చివరి కాలం”– బహుశా ఆ హింస కాలం పూర్తయ్యే కాలం. లేక ఈ యుగాంత సమయం అనుకొనేందుకు కూడా అవకాశం ఉంది. నిజానికి తరువాత వచ్చే వచనాలు (వ 40-45) అక్షరాలా ఈ యుగాంతాన్నే చూపుతున్నాయి. 2,7,9 అధ్యాయాల్లో లాగానే మధ్యలో ఉన్న అనేక శతాబ్దాలను మౌనంగా దాటించి అంతిమ కాలంలోని విషయాలను మన కళ్ళెదుటికి తెస్తున్నది ఈ భాగం.

36. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవునిమీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.
2 థెస్సలొనీకయులకు 2:4, ప్రకటన గ్రంథం 13:5

అంతియొకస్ ఎపిఫానీస్ చేసిన పనులు వ 21-32 లో వర్ణించబడ్డాయి. ఇక్కడి రాజు అంతియొకస్ కాదు. 36,37 వచనాల్లో ఉన్నట్టు అంతియొకస్ అన్ని దేవతల కంటే పైగా తనను హెచ్చించుకొని పూర్వీకుల దేవుణ్ణి లెక్కచెయ్యలేదు అనడానికి రుజువులేమీ లేవు. అంతే కాక 44,45 వచనాల్లో వర్ణించిన మరణం వంటిది కాదు అంతియొకస్ మరణం. “అంతిమ కాలంలో” (వ 40) వచ్చేవాడికి ఈ అంతియొకస్ కేవలం ఒక సాదృశ్యం, ఒక సూచన. హీబ్రూలో 40వ వచనం అంత స్పష్టంగా లేదు కాబట్టి వ 36 లోని రాజుపై దక్షిణ రాజు, ఉత్తర రాజు ఇద్దరూ దాడి చేస్తారో లేక ఇతడే ఉత్తర రాజు అయి ఉండి, దక్షిణ రాజు పై దాడి చేస్తాడో చెప్పడం కష్టం. ఇతడు గనుక ఉత్తర రాజు అయితే 41-45 వచనాలు ఇతనికి వర్తిస్తాయి. అలా కాని పక్షంలో వర్తించవు. 40వ వచనం అస్పష్టంగా ఉంది కాబట్టి దాని గురించి బల్లగుద్ది చెప్పకూడదు. రుజువు లేని వివరణలు చెప్పకూడదు. భవిష్యద్వాక్కు నెరవేరినప్పుడే దీని వివరణ తేటతెల్లమౌతుంది. దానియేలు 7:8; 2 థెస్సలొనీకయులకు 2:3-4; ప్రకటన గ్రంథం 13:5-6. పాపం సారాంశం ఇక్కడ కనిపిస్తున్నది – ఇష్టం వచ్చినట్టు జరిగించడం, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం. ఏదెను వనంలో ఆదాము చేసిన ఒక్క స్వేచ్ఛ క్రియతో అది ఆరంభమైంది. ఈ యుగాంతంలో తన ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ప్రవర్తించే ఒక మనిషి లోకమంతటినీ పాలించడంతోను, అతణ్ణి లోక ప్రజలలో అధిక సంఖ్యాకులు వంగి పూజించడంతోను ఇది అంతమౌతుంది. “కోప కాలం” – యెషయా 26:20-21; యెషయా 30:27-28; యెషయా 34:2; యిర్మియా 30:4-8; దానియేలు 8:19; దానియేలు 12:1; యోవేలు 3:12-16; మత్తయి 24:21-22.

37. అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.
2 థెస్సలొనీకయులకు 2:4, ప్రకటన గ్రంథం 13:5

ఈ రాజు భ్రష్టుడైన క్రైస్తవుడో, భ్రష్టుడైన యూదుడో అయి ఉంటాడేమో.

38. అతడు తన పితరులెరుగని దేవతను, అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును; బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి, ఆ దేవతను ఘనపరచును.

“కోటలమీద దేవుడు”– యుద్ధంలో తనకు జయం ప్రసాదించే వ్యక్తిని అతడు గౌరవిస్తాడు. ఇతడు గౌరవించేది ఈ ఒక్క “దేవత”నే. వ 36,37 లను బట్టి చూస్తే ఈ రాజు 2 థెస్సలొనీకయులకు 2:3-4 లోని న్యాయ విరోధి, ప్రకటన 13 వ అధ్యాయంలోని మొదటి మృగం అనిపిస్తున్నా బహుశా అతడు ప్రకటన 13 అధ్యాయంలోని రెండో మృగమై ఉంటాడేమో. దీని గురించి బల్లగుద్ది చెప్పలేము.

39. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని, కోటలకు ప్రాకారములు కట్టించి, నూతన విధముగా తనవారికి మహా ఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వమిచ్చును.

“దేశం”– ఇస్రాయేల్. కేవలం “దేశం” అని ఊరుకుంటే అది మరే దేశమూ కావడానికి వీలు లేదు.

40. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

ఇక్కడ ఉత్తర రాజును గురించి రాసి ఉంది. వ 36లోని రాజూ ఇతడూ ఒకరే అయి ఉండవచ్చు, కాకపోవచ్చు. అతడెన్నో విజయాలు సాధిస్తాడు (వ 41-43). ప్రకటన గ్రంథం 6:2; ప్రకటన గ్రంథం 13:4, ప్రకటన గ్రంథం 13:7 పోల్చి చూడండి.

41. అతడు ఆనందదేశమున ప్రవేశించుటవలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులలో ముఖ్యులును అతని చేతిలోనుండి తప్పించుకొనెదరు.
మత్తయి 24:10

“అందమైన దేశం”– ఇస్రాయేల్ (వ 16; దానియేలు 8:9; యెహెఙ్కేలు 20:6). “ఎదోం”, “మోయాబు”, “అమ్మోను”– ఇవన్నీ ఇస్రాయేల్‌కు తూర్పుగా ఆగ్నేయంగా ఉన్నాయి.

42. అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.

43. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తుయొక్క విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును.

44. అంతట తూర్పునుండియు ఉత్తరమునుండియు వర్తమానములు వచ్చియతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును.

“తూర్పు... ఉత్తరదిక్కు”– యెహెఙ్కేలు 38:1-9. ప్రకటన గ్రంథం 16:12-16 పోల్చి చూడండి. ఈ యుగాంతంలో భూమి పై ఉన్న అన్ని గొప్ప దేశాల సైన్యాలూ ఇస్రాయేల్ వైపుకు నడుస్తాయి (యోవేలు 3:9-16; జెకర్యా 12:2-3; జెకర్యా 14:2-4).

45. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య వేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయముచేయు వాడెవడును లేకపోవును.

“సముద్రాల మధ్య”– మధ్యధరా సముద్రం, మృత సముద్రం. “పవిత్ర పర్వతం”– కీర్తనల గ్రంథము 48:1-2. “అంతరిస్తాడు”– 2 థెస్సలొనీకయులకు 2:8; ప్రకటన గ్రంథం 19:19-20.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సత్య గ్రంథాల దర్శనం.

1-30
ఈజిప్ట్ మరియు సిరియా రాజుల ప్రమేయాన్ని ఎత్తిచూపుతూ, పర్షియన్ మరియు గ్రీషియన్ సామ్రాజ్యాల వారసత్వాన్ని దేవదూత డేనియల్‌కు వెల్లడించాడు. ఈ ఆధిపత్యాల మధ్య ఉన్న యూదయా, వారి సంఘర్షణలచే తీవ్రంగా ప్రభావితమైంది. 21వ వచనంలో, యూదులను క్రూరమైన వేధించే ఆంటియోకస్ ఎపిఫానెస్‌పై దృష్టి సారిస్తుంది. ఇది ప్రాపంచిక శక్తి మరియు ఆస్తుల యొక్క నశ్వరమైన మరియు పాడైపోయే స్వభావాన్ని మరియు తరచుగా వాటిని సంపాదించిన క్రూరమైన మార్గాలను వివరిస్తుంది. దేవుడు, తన ప్రావిడెన్స్‌లో, తన ఇష్టానుసారం నాయకులను ఉన్నతపరుస్తాడు మరియు తొలగించాడు. ప్రపంచం మానవ కోరికలచే నడిచే యుద్ధాలు మరియు సంఘర్షణలతో నిండి ఉంది.
రాష్ట్రాలు మరియు రాజ్యాలలో అన్ని మార్పులు మరియు తిరుగుబాట్లు, అలాగే ప్రతి సంఘటన, దేవుడు సంపూర్ణ స్పష్టతతో ముందే ఊహించారు. అతని మాట ఎప్పుడూ నెరవేరదు; అతని ఉద్దేశాలు మరియు ప్రకటనలు నిస్సందేహంగా ఫలిస్తాయి. ప్రజలు పెళుసుగా ఉండే మట్టి కుండల వలె పోరాడే ప్రపంచంలో, వారు విజయం సాధించవచ్చు లేదా ఓడిపోవచ్చు, మోసపోవచ్చు లేదా మోసపోవచ్చు. అయితే, దేవునిపై విశ్వాసం ఉన్నవారు ఆయనపై నమ్మకం ఉంచుతారు. స్థిరంగా నిలబడేందుకు, వారి భారాలను మోయడానికి మరియు వారి పోరాటాలను భరించడానికి ఆయన వారికి శక్తిని ఇస్తాడు.

31-45
ఈ జోస్యం యొక్క మిగిలిన భాగం గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది, వ్యాఖ్యాతల మధ్య విభిన్న వివరణలకు దారి తీస్తుంది. ఇది ఆంటియోకస్ నుండి క్రీస్తు విరోధికి సంబంధించిన సూచనలకు మారినట్లు కనిపిస్తుంది. ఇంకా, రోమన్ సామ్రాజ్యం, నాల్గవ గొప్ప రాజ్యం, దాని అన్యమత, ప్రారంభ క్రిస్టియన్ మరియు పాపల్ దశలలో సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
తన ప్రజలపై ప్రభువు ఉగ్రత యొక్క ముగింపు సమీపిస్తోంది, అలాగే తన విరోధులతో అతని సహనానికి ముగింపు. అవిశ్వాసులు, విగ్రహారాధకులు, మూఢనమ్మకాలు మరియు క్రూరమైన వేధించేవారి కోసం ఎదురుచూసే వినాశనాన్ని నివారించడానికి, అలాగే గౌరవం లేని వారి కోసం, మనం సత్యం మరియు ధర్మానికి మార్గదర్శకంగా దేవుని వాక్య బోధనలను స్వీకరించాలి. ఇది మన ఆశకు పునాదిగా ఉపయోగపడాలి మరియు ఈ చీకటి ప్రపంచంలో మన మార్గాన్ని ప్రకాశవంతం చేయాలి, పైన మనకు ఎదురుచూస్తున్న అద్భుతమైన వారసత్వం వైపు మనల్ని నడిపిస్తుంది.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |