Daniel - దానియేలు 3 | View All

1. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను.

1. నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరాయను మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు.

2. రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా

2. ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధి కారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు వారందరిని పిలించాడు.

3. ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధిపతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారందరును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి.

3. రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు.

4. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాటలాడు వారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.
ప్రకటన గ్రంథం 10:11

4. రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాడలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ.

5. ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనీయ వీణ విపంచిక సకలవిధములగు వాద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి.
మత్తయి 4:9, ప్రకటన గ్రంథం 13:15

5. కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల, ధ్వసులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగ పడి పూజించాలి.

6. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును.
మత్తయి 13:42-50, ప్రకటన గ్రంథం 13:15

6. ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.

7. సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణ వీణ సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆ యా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.

7. అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్టించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.

8. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములుచెప్పి

8. తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి యూదులకు విరుద్ధంగా మాటలాడసాగిరి.

9. రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి రాజు చిరకాలము జీవించును గాక.

9. వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు, ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక!

10. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను వినుప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను.
మత్తయి 4:9

10. రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫొనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీక వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు.

11. సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును.

11. ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు.

12. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.

12. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిషించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”

13. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి.

13. నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు.

14. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?

14. అందువల్ల వారిని అతని సమక్షమునకు తీసుకు వచ్చారు. నెబుకద్నెగో మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా?

15. బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు వినుసమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?
మత్తయి 4:9

15. కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించ కపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”

16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకులేదు.

16. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు.

17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

17. మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకి ఇష్టం కలిగితే మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు.

18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.

18. దేవుడు కూడా మమ్ములను రక్షించని పక్షంలో, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”

19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞఇచ్చెను.

19. అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కొపంగా చూశాడు. మామూలుకంటె ఏడు రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు.

20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞఇయ్యగా

20. తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నె గోలనిబంధించి. వేడి కొలిమిలోకి తోసి వేయుమని ఆజ్ఞా పించాడు.

21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి.

21. అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి త్రోసివేశారు. వాళ్లను మంటలో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు.

22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

22. రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్లవారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహా బలవంతులయిన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలిచచ్చారు.

23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా
హెబ్రీయులకు 11:34

23. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటల్లోకి త్రోసేశారు.

24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రులనడిగెను. వారు రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.

24. తర్వాత నెబుకద్నెజరు జరిగింది చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాము గదా!” అని అడిగాడు. “చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.

25. అందుకు రాజునేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

25. “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగా గాని కాలి పోయినట్టుగా గాని లేదు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.

26. అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చిషద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

26. తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా బయటికి రండి” అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు.

27. అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒక టైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

27. వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు ఉన్నతాధికారులు, రాజుగారి సలహా దారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనై నా లేదని వారు తెలుసుకొన్నారు.

28. నెబుకద్నెజరుషద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి.

28. తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించినాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికి గాని, పూజించుటకు గాని ఇష్టపడలేదు.

29. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను.

29. అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారు గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బగా నాశానం చేయబడుతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు గాని తన మనుష్యులను రక్షించలేడు.”

30. అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను.

30. ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Daniel - దానియేలు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నెబుచాడ్నెజార్ యొక్క బంగారు చిత్రం. (1-7) 
దాదాపు ముప్పై గజాల ఎత్తులో, చిత్రంలో ఒక పీఠం చేర్చబడి ఉండవచ్చు. ఈ పీఠం పూర్తిగా ఘనమైన బంగారంతో కాకుండా బంగారు పలకలతో అలంకరించబడి ఉండవచ్చు. అహంకారం మరియు మూర్ఖత్వం యొక్క ప్రేరణలు తరచుగా వ్యక్తులు తమ మతం యొక్క ఖచ్చితత్వంతో సంబంధం లేకుండా తమ మతానికి కట్టుబడి ఉండేలా వారిని బలవంతం చేస్తాయి. ప్రాపంచిక లాభం లేదా శిక్ష యొక్క ముప్పు పొంచి ఉన్నప్పుడు, కొంతమంది వ్యక్తులు ప్రతిఘటించడానికి మొగ్గు చూపుతారు. ఉదాసీనత, హేడోనిస్టిక్ లేదా సందేహాస్పదంగా ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది, ఎందుకంటే వారు మెజారిటీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తులు కనీసం ప్రతిఘటన మార్గాన్ని అనుసరిస్తారు. ప్రపంచంలోని ఉదాసీనతకు హద్దులు లేవు, ఎందుకంటే చాలా అవాంఛనీయమైన అభ్యాసాలు కూడా అజాగ్రత్తగా ఉన్నవారిని సంగీతం యొక్క సెడక్టివ్ నోట్స్‌తో ఆకర్షించగలవు లేదా వాటిని కొలిమి యొక్క వేడి నుండి నడిపించగలవు. అలాంటి మార్గాల ద్వారా, అబద్ధ ఆరాధన స్థాపించబడింది మరియు శాశ్వతం చేయబడింది.

షడ్రక్ మరియు అతని సహచరులు దానిని ఆరాధించడానికి నిరాకరించారు. (8-18) 
నిజమైన భక్తి ఆత్మకు ప్రశాంతతను తెస్తుంది, దానిని ఓదార్పునిస్తుంది మరియు శాంతపరుస్తుంది, అయితే మూఢనమ్మకాలు మరియు తప్పుడు దేవతలపై భక్తి మానవ కోరికల మంటలను రేకెత్తిస్తాయి. పరిస్థితిని ఎంపికగా క్లుప్తంగా వ్యక్తీకరించవచ్చు: "తిరగండి లేదా కాల్చండి." పురాతన కాలం నాటి నెబుచాడ్నెజార్ వంటి గర్విష్ఠులు, "ప్రభువు ఎవరు, ఆయన శక్తికి నేను భయపడటానికి ఎవరు?" అని అహంకారంతో ప్రశ్నించవచ్చు. అయినప్పటికీ, షడ్రక్, మేషాక్ మరియు అబేద్నెగో వంటి వ్యక్తులు తమ నిర్ణయాన్ని వదలలేదు. టెంప్టేషన్‌ను ఎదుర్కొన్నప్పుడు వారు జీవితం లేదా మరణం యొక్క ప్రాముఖ్యతను తూకం వేయలేదు. పాపం నుండి తప్పించుకోవాలని కోరుకునే వారు దాని చెడు స్వభావం స్పష్టంగా కనిపించినప్పుడు టెంప్టేషన్‌తో చర్చలలో పాల్గొనకూడదు. సంకోచం కోసం సమయం లేదు; బదులుగా, క్రీస్తు చేసినట్లుగా, "సాతానా, నా వెనుకకు రా" అని గట్టిగా ప్రకటించాలి.
సూటిగా సమాధానం ఊహించబడినప్పుడు వారు మోసపూరిత ప్రతిస్పందనను రూపొందించలేదు. తమ కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారు ఫలితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మకమైన సేవకులు తమకు వ్యతిరేకంగా అమర్చబడిన అన్ని శక్తులను నియంత్రించే మరియు భర్తీ చేయగల అతని సామర్థ్యాన్ని కనుగొంటారు. "ప్రభూ, నీవు కోరుకుంటే, నీవు చేయగలవు" అని వారు ధృవీకరిస్తున్నారు. దేవుడు మన పక్షాన ఉంటే, మనిషి మనల్ని ఏమి చేస్తాడో భయపడాల్సిన అవసరం లేదు. మరణం నుండి లేదా మరణం నుండి దేవుడు మనలను విడిపించును. వారు మనిషి కంటే దేవునికి విధేయత చూపాలి, పాపం కంటే బాధలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి మరియు మంచి ఫలితాన్ని సాధించాలనే ఆశతో తప్పు చేయకుండా ఉండాలి. అందువల్ల, ఈ ట్రయల్స్ ఏవీ వారిని కదిలించలేదు.
పాపానికి లొంగిపోకుండా వారి విముక్తి ప్రకృతి రాజ్యంలో ఉన్నట్లే దయ యొక్క రాజ్యంలో అద్భుతంగా ఉంది. మనిషి పట్ల భయం, లోకం పట్ల ప్రేమ, మరియు ముఖ్యంగా విశ్వాసం లేకపోవడం వల్ల ప్రజలు ప్రలోభాలకు లోనవుతారు. దీనికి విరుద్ధంగా, సత్యంపై దృఢమైన విశ్వాసం వారిని క్రీస్తును తిరస్కరించకుండా లేదా ఆయన గురించి సిగ్గుపడకుండా చేస్తుంది. మన ప్రతిస్పందనలలో, మనం మృదువుగా ఉండాలి, అయితే మనిషి కంటే దేవునికి కట్టుబడి ఉండాలనే మన నిబద్ధతలో మనం దృఢంగా ఉండాలి.

వారు కొలిమిలో వేయబడ్డారు, కానీ అద్భుతంగా భద్రపరచబడ్డారు. (19-27) 
నెబుచాడ్నెజార్ తన కొలిమిని దాని అత్యంత తీవ్రతతో కాల్చినప్పటికీ, దానిలోకి విసిరిన వారి బాధలను కొన్ని క్షణాలు ముగించాయి. అయినప్పటికీ, నరకాగ్ని అంతం లేకుండా హింసను కలిగిస్తుంది. హెబ్రీయులకు 12:29లో పేర్కొన్నట్లుగా మృగాన్ని మరియు దాని ప్రతిమను ఆరాధించే వారికి ఎలాంటి ఉపశమనాన్ని, ఉపశమనాన్ని మరియు వారి వేదన నుండి ఉపశమనం లభించదు. మనం శాశ్వతమైన రాజ్యాన్ని చూడగలిగితే, హింసించబడిన విశ్వాసి వారి విరోధుల ద్వేషం నుండి ఆశ్రయం పొందడాన్ని మనం చూస్తాము, అయితే ఆ విరోధులు దేవుని ఉగ్రతకు గురవుతారు మరియు ఆరిపోని జ్వాలలలో అంతులేని హింసను భరిస్తారు.

నెబుకద్నెజరు యెహోవాను మహిమపరుస్తాడు. (28-30)
ఈ నమ్మకమైన దేవుని సేవకుల తరపున దైవిక జోక్యం ద్వంద్వ ఉద్దేశ్యాన్ని అందించింది. మొదటిగా, యూదు ప్రజలు తమ బందిఖానాలో ఉన్న సమయంలో వారి మత విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మరియు వారి హృదయాల నుండి విగ్రహారాధనను నిర్మూలించడానికి వారు ఒక సాధనంగా పనిచేశారు. రెండవది, అద్భుత సంఘటనలు నెబుచాడ్నెజార్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి, అతనిలో లోతైన నమ్మకాలను రేకెత్తించాయి. అయినప్పటికీ, ఇది అతని ప్రవర్తనలో శాశ్వత పరివర్తనకు దారితీయలేదని గమనించడం చాలా అవసరం. ఈ భక్తుడైన యూదులను మండుతున్న కొలిమిలో కాపాడిన అదే దేవుడు ప్రలోభాల సమయంలో మనలను ఆదుకునే మరియు పాపానికి లొంగిపోకుండా నిరోధించే శక్తి కలిగి ఉన్నాడు.



Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |