Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్దమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.
ఇస్రాయేల్వారు విదేశీయులతో సైనిక ఒప్పందం కుదుర్చుకోవాలని చేసే వ్యర్థ ప్రయత్నాల గురించి ఇది చెప్తున్నది – హోషేయ 5:13; హోషేయ 7:11; హోషేయ 8:9.
2. యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయును.
“యూదా”– హోషేయ 5:5, హోషేయ 5:12-14; హోషేయ 6:4, హోషేయ 6:11; హోషేయ 10:11; హోషేయ 11:12. “యాకోబు”– ఇస్రాయేల్ప్రజ.
3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను.
ఆదికాండము 25:26; ఆదికాండము 27:36.
4. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;
“దేవదూత”– ఆదికాండము 32:22-28. “బేతేల్”– ఆదికాండము 28:12-19; ఆదికాండము 35:1-15.
5. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.
“యెహోవా”– నిర్గమకాండము 3:14 నోట్.
6. కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక నుంచుము.
మునుపు యాకోబు మోసగాడుగా ఉండేవాడు. అయితే హృదయ పూర్వకంగా దేవునివైపుకు తిరిగాడు. అతని సంతతివారు ఇప్పుడు చేయవలసినది ఇదే. “న్యాయంగా”– యెషయా 1:16-17; ఆమోసు 5:15, ఆమోసు 5:24; మీకా 6:8. “ఎదురు చూస్తూ”– కీర్తనల గ్రంథము 5:3; కీర్తనల గ్రంథము 27:14; కీర్తనల గ్రంథము 33:20; కీర్తనల గ్రంథము 37:7, కీర్తనల గ్రంథము 37:34; కీర్తనల గ్రంథము 123:2. వారు (దేవుని ప్రజలు) దేవుని సహాయం కోసం, అనుగ్రహం కోసం ఆయనవైపే చూడాలి గాని మనుషుల నుండి సహాయం పొందే ప్రయత్నాలు చేయకూడదు.
7. ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధపెట్టవలె నన్న కోరిక వారికి కలదు.
ఇస్రాయేల్ప్రజలు వారి కపటాన్ని బయట పెట్టుకున్న పద్ధతులు. వారు ఇతరులనే గాక తమను తామే మోసపుచ్చుకొన్నారు. వారి మోసం ఎప్పుడూ బయటపడదు అనుకున్నారు.
8. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.ప్రకటన గ్రంథం 3:17
“ఆస్తిపాస్తులు”– ప్రకటన గ్రంథం 3:17 పోల్చి చూడండి. “అపరాధం”– కొన్ని సార్లు ఎక్కువ దుర్మార్గత చేసేవాళ్ళ లోను తమ దుర్మార్గత గురించి తక్కువ ఎరుక ఉంటుంది. అప్పుడప్పుడు తాము మంచివాళ్ళమని కూడా గొప్పలు చెప్పు కొంటారు అలాంటివాళ్ళు.
9. అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును.
“ఈజిప్ట్”– హోషేయ 11:1. “మళ్ళీ డేరాలలో”– హోషేయ 2:14-15. ఈజిప్ట్నుంచి బయటికి వచ్చిన తరువాత ఇస్రాయేల్ప్రజలు ఎడారి ప్రయాణాల్లో గుడారాల్లో నివసించారు – నిర్గమకాండము 33:8; సంఖ్యాకాండము 1:52-53.
10. ప్రవక్తలతో నేను మాటలాడియున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవక్తలద్వారా మాటలాడియున్నాను.
“మాట్లాడాను”– హోషేయ 1:1. ప్రవక్తల గురించి నోట్ ఆదికాండము 20:7. “దర్శనాలు”– ఆదికాండము 15:1 నోట్. “వారిద్వారా”– హెబ్రీయులకు 1:1; 2 పేతురు 1:21. “ఉదాహరణలు”– 2 సమూయేలు 12:1-4; కీర్తనల గ్రంథము 78:2; యెషయా 5:1-7; యెహెఙ్కేలు 17:2; యెహెఙ్కేలు 24:3.
11. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి
“గిలాదు”– హోషేయ 6:8-9. “గిల్గాల్”– హోషేయ 4:15; హోషేయ 9:15.
12. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱెలు కాచెను.
ఆదికాండము 28:2, ఆదికాండము 28:5; ఆదికాండము 29:20-28; ఆదికాండము 30:31; ఆదికాండము 31:14. యాకోబు సిరియా ప్రదేశానికి పారిపోయాడు. శత్రువులు అతని సంతానాన్ని అక్కడికి బందీలుగా తీసుకుపోతారు (సిరియా అష్షూరు రాజ్యంలో ఒక భాగం అయింది).
13. ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.
“ప్రవక్త”– మోషే (సంఖ్యాకాండము 12:6-8; ద్వితీయోపదేశకాండము 18:15; ద్వితీయోపదేశకాండము 34:10). ఇస్రాయేల్వారిని గురించి శ్రద్ధ వహించేందుకు దేవుడు మోషేను వాడుకున్నాడు.
14. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును.
ఎఫ్రాయిం అంటే ఇస్రాయేల్జనాన్ని సూచించేందుకు వాడిన పదం. వారి దోషం ఎంత మితిమీరి పోయిందంటే ఇక దాన్ని దేవుడు చూచీ చూడనట్టు ఊరుకోలేడు – హోషేయ 1:6. “రక్తపాతం”– హోషేయ 1:4; హోషేయ 4:2; హోషేయ 5:2; హోషేయ 6:8.