Joel - యోవేలు 2 | View All
Study Bible (Beta)

1. సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక.

“బూర”– లేవీయకాండము 23:24; లేవీయకాండము 25:9; సంఖ్యాకాండము 10:5; హోషేయ 5:8; హోషేయ 8:1. “నా పవిత్ర పర్వతం”– కీర్తన 2:6. ఈ మాటకు, సీయోను అనే పేరుకు అర్థం “జెరుసలం” అని. దేవుడు ఇక్కడ యోవేలు ద్వారా మాట్లాడుతున్నాడు. “ఆసన్నమైంది”– యోవేలు 1:15 నోట్ చూడండి. దేవుడిక్కడ యుగాంతంలో యెహోవా దినం అతి త్వరలో ఇక రాబోతున్న కాలం గురించి మాట్లాడుతున్నాడు.

2. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
మత్తయి 24:21

“చీకటి”– యోవేలు 2:10, యోవేలు 2:31; యెషయా 13:10; ఆమోసు 5:18, ఆమోసు 5:20; జెఫన్యా 1:15. “సమూహాలు”– మొదటి అధ్యాయంలో యోవేలు చెప్పిన మిడతల సమూహం దండెత్తి వస్తున్న సైన్యంలాగా ఉంది (యోవేలు 1:6). ఇక్కడ దేవుడు అక్షరాలా సైన్యం గురించే మాట్లాడుతున్నాడా? కావచ్చు. యెహోవా దినం పూర్తిగా రాకముందు మహా సైన్యాలు ఈ భూమి పై బారులు తీర్చి సాగిపోతాయని మనకు తెలుసు. ప్రకటన 9వ అధ్యాయం చూడండి. ఈ యుగాంతంలో ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా మిడతల తెగులు ఉంటుందని బైబిల్లో మరెక్కడా చెప్పలేదు. “యుగయుగాలకూ ఉండవు”– దేవుడిక్కడ చెప్తున్న సేన ఎంత బ్రహ్మాండమైనదంటే అప్పటివరకు అలాంటిది లేదు, దానితరువాత అలాంటిది ఉండబోదు. అలా అయితే ఇకముందు జరగబోయే సంభవం గురించే ఆయన మాట్లాడుతున్నాడు. యోవేలు 3:9-11; జెఫన్యా 12:3, జెఫన్యా 12:9; ప్రకటన గ్రంథం 16:14 పోల్చి చూడండి.

3. వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను.

మానవ సైన్యాలు మిడతల దండులంతగా దేశాన్ని పాడు చేయగలవు. అంతేగాక ప్రజల ప్రాణాలకు మరింకెంతో నాశనం కలిగించగలవు.

4. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.
ప్రకటన గ్రంథం 9:7

ప్రకటన గ్రంథం 9:7, ప్రకటన గ్రంథం 9:9.

5. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వనిచేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.
ప్రకటన గ్రంథం 9:9

6. వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖములు తెల్లబారును.

“ప్రజలు”– దేవుని ఈ బీకరమైన తీర్పులో కేవలం ఇస్రాయేల్ దేశం మాత్రమే గాక ఇతర జనాలు కూడా ఉంటారు. యెషయా 24:1-3 పోల్చి చూడండి.

7. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి

8. ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.

9. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.

క్షేమం ఉండదు. ఆ విపత్తు నుంచి ఎవరూ తప్పించుకోలేరు.

10. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.
మత్తయి 24:29, మార్కు 13:24-25, ప్రకటన గ్రంథం 6:12-13, ప్రకటన గ్రంథం 8:12, ప్రకటన గ్రంథం 9:2

యెషయా 13:13; యెషయా 24:17-21; యిర్మియా 4:23-26; నహూము 1:5-6; హగ్గయి 2:21; హెబ్రీయులకు 12:26-28. “కాంతి”– వ 2,31; యెషయా 13:10; ప్రకటన గ్రంథం 6:12-14.

11. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు?
ప్రకటన గ్రంథం 6:17

“ఉరుముతూ”– తీర్పుకు సంబంధించిన ఉరుములు. ఇస్రాయేల్‌ను నాశనం చేసేందుకు బయలుదేరిన అదే సైన్యాలకు వ్యతిరేకంగా ఉరుముతానని దేవుడు చెప్పిన సంగతితో (యోవేలు 3:16) దీన్ని పోల్చిచూడండి. “ఆయన దండు”– తీర్పులో తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు అది తన చేతిలో సాధనం గనుక దాన్ని దేవుడు తన సైన్యం అంటున్నాడు. యెషయా 10:5-7; యెషయా 13:4; యిర్మియా 25:9; యిర్మియా 43:10-13; హబక్కూకు 1:5-6 పోల్చి చూడండి. “మహా గొప్పది”– అన్ని దిశలనుంచీ సైన్యాలు కదులుతూ ఉండగా ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది. “యెహోవా దినం”– యోవేలు 1:15. “తట్టుకోగల వారెవరు?”– నహూము 1:6; ప్రకటన గ్రంథం 6:17.

12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు

యోవేలు 1:13-14.

13. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

“వాత్సల్యం”– నిర్గమకాండము 34:6-7; మీకా 7:18-19; 1 యోహాను 4:8. “జాలి...సంసిద్ధుడు”– యిర్మియా 18:8; యోనా 3:10; యోనా 4:2. “బట్టలను”– ఆ కాలంలో బట్టలు చింపుకోవడం దుఃఖాన్నీ కంగారునూ ప్రదర్శించే గుర్తు (ఆదికాండము 37:29, ఆదికాండము 37:34; ఆదికాండము 44:13; యెహెఙ్కేలు 7:6; యోబు 1:20; యోబు 2:12). పశ్చాత్తాపం అంటే ఇంత మాత్రమే కాదు. కఠినమైన హృదయాలను చింపుకోవాలి, బట్టలను కాదు – కీర్తనల గ్రంథము 51:17; యెషయా 57:15. “తిరగండి”– యిర్మియా 3:12, యిర్మియా 3:14, యిర్మియా 3:22; విలాపవాక్యములు 3:40; విలాపవాక్యములు 5:21; హోషేయ 14:1-2.

14. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

వ 18. యిర్మియా 26:3; ఆమోసు 5:15. ప్రవక్త మనసులో ఉన్న ఆశీస్సు ఏమిటంటే దేవునికి మళ్ళీ అర్పణలు ఇవ్వడం ద్వారా ఆరాధించగలిగే పరిస్థితి.

15. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

ప్రజలంతా కలసి మనసారా దేవుణ్ణి వెదకండని పిలుపు. ఏ కారణం వల్లనైనా ఎవరూ దూరాన ఉండిపోకూడదు. ఇంతకు ముందు వచనంలోని ఆశీస్సు కలగడానికి మార్గం ఇదే.

16. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

17. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపము నకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులువారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.

పశ్చాత్తాపపడి దేవుణ్ణి వెదకడంలో మత నాయకులే ప్రజలకు మార్గం చూపాలి. “సొత్తుగా ఉన్న”– ద్వితీయోపదేశకాండము 4:20; కీర్తనల గ్రంథము 28:9; కీర్తనల గ్రంథము 33:12; ఎఫెసీయులకు 1:18. “తిరస్కారానికి”– ద్వితీయోపదేశకాండము 9:26-29; 1 రాజులు 9:7; కీర్తనల గ్రంథము 44:13-14. “దేవుడు ఏమయ్యాడు”– కీర్తనల గ్రంథము 42:3, కీర్తనల గ్రంథము 42:10; కీర్తనల గ్రంథము 79:10; కీర్తనల గ్రంథము 115:2.

18. అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషముపూని తన జనులయెడల జాలిచేసికొనెను.

ప్రజలు తమ వంతు పని తాము చేస్తే దేవుడు తప్పకుండా తాను చేయవలసినది చేస్తాడు. యాకోబు 4:8-10 పోల్చి చూడండి. “అత్యాసక్తిపరుడై”– యెషయా 26:11; జెకర్యా 1:14; జెకర్యా 8:2.

19. మరియయెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను

2 దినవృత్తాంతములు 7:14; యెహెఙ్కేలు 34:29.

20. మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పారదోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్పకార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.

మొదటి అధ్యాయంలో ఉన్న మిడతల దండు గురించి ఈ మాటలు రాసి ఉన్నాయని కొందరు పండితులు భావించారు. వ 25 పోల్చి చూడండి. మరి కొందరైతే యుగాంతంలో ఇస్రాయేల్ పై దండెత్తే శత్రు సైన్యాల గురించి అని భావించారు (యెహె 38,39 వ అధ్యాయాలు పోల్చిచూడండి). బహుశా ఈ మాటలు అప్పటి కాలానికీ, రాబోయే కాలానికీ కూడా వర్తిస్తాయేమో. యెషయా 60:1-22 గురించిన నోట్ చూడండి. “తూర్పు సముద్రం”– మృత సముద్రం. “పడమటి సముద్రం”– మధ్యధరా. “కంపు”– యెషయా 34:3; యెహెఙ్కేలు 39:11-12 పోల్చిచూడండి.

21. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.

యోవేలు గ్రంథం ఆరంభ భాగాల్లో ఇస్రాయేల్ ప్రజలకు ఏడవాలనీ శోకించాలనీ అంగలార్చాలనీ చెప్పడం చూశాం – యోవేలు 1:5, యోవేలు 1:8, యోవేలు 1:11, యోవేలు 1:13; యోవేలు 2:17. ఇప్పుడు సంతోషించాలనీ ఆనందించాలనీ చెప్పడం కనిపిస్తున్నది. ఈ తేడా ఎందువల్ల వచ్చింది? వారి విషయంలో చూస్తే పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగడంవల్ల. దేవుని విషయంలో చూస్తే ఆ ప్రజలనూ దేశాన్నీ దీవించి మునుపున్న క్షేమాన్ని తిరిగి చేకూర్చడం వల్ల. “యెహోవా గొప్ప క్రియలు చేశాడు” గాని వారు కాదు (కీర్తనల గ్రంథము 126:3; యెషయా 25:1). వారు ఆయన్ను బట్టి ఆనందించాలి (వ 23) గాని తమను బట్టి కాదు.

22. పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,

23. సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును
యాకోబు 5:7

“తొలకరి...కడవరి వర్షం”– అక్షరాలా వర్షాలు అనే అర్థం. దేశంలో వర్షంలేమి ఉంది, “మునుపటిలాగే” దేవుడు వర్షాలనిస్తాడు.

24. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లిపారును.

25. మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును.

యోవేలు 1:4. “నా మహా సైన్యం”– వ 11 పోల్చి చూడండి. మిడతల దండు కావచ్చు లేక శత్రు సైన్యం కావచ్చు. దేవుడు వాటిని తన ప్రయోజన సిద్ధికి వాడుకోగలడు. అందువల్ల అవి ఆయన సైన్యాలు అనిపించుకున్నాయి. “నష్టపరిహారం”– దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొన్నిసార్లు తన ప్రజలను శిక్షించి దిద్దుబాటు చేయవలసి వస్తుంది. అయితే వారు తప్పు దిద్దుకున్న తరువాత వారి పై తన ఆశీస్సులు కురిపిస్తాడు. వారు అనుభవించిన బాధలు, కష్టాల వల్ల కలిగిన నష్టాన్ని రూపుమాపేవిగా అవి ఉంటాయి.

26. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.

“కీర్తిస్తారు”– యెషయా 12:1-3; యెషయా 25:1 పోల్చిచూడండి. స్తుతి గురించి కీర్తనల గ్రంథము 33:1 నోట్.

27. అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందకయుందురు.

యిర్మియా 31:34 చూడండి. “ఎవడూ లేడు”– యెషయా 44:8; యెషయా 45:18, యెషయా 45:21-22. “సిగ్గుపడనవసరం ఉండదు”– ఈ సమయం ఇక ముందు రావలసి ఉంది. యోవేలు కాలం నుంచి ఇప్పటివరకు ఇస్రాయేల్ తరచుగా సిగ్గుపాలైంది. అయితే ఇలాంటిది ఇక జరగకుండా ఉండే కాలం ఒకటి రాబోతూ ఉంది – యెషయా 29:22; యెషయా 45:17; యెషయా 54:4.

28. తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ ¸యౌవనులు దర్శనములు చూతురు.
అపో. కార్యములు 21:9, తీతుకు 3:6, అపో. కార్యములు 2:17-21

అపో. కార్యములు 2:16-21. ఈ వచనాల నెరవేర్పుకు ఆరంభం పెంతెకొస్తు దినం. “తరువాత”– అంటే చివరి రోజుల్లో (అపో. కార్యములు 2:16). “చివరి రోజుల” గురించి యోహాను 6:39; యోహాను 11:24; 2 తిమోతికి 3:1; హెబ్రీయులకు 1:8; యాకోబు 5:3; 1 పేతురు 1:20; 2 పేతురు 3:3; 1 యోహాను 2:18; యూదా 1:18 చూడండి. చివరి రోజులు యేసు ప్రభువు మొదటి రాకతో ఆరంభమై కనీసం ఆయన రెండో రాక వరకు కొనసాగుతాయి. “మీ కొడుకులు, కూతుళ్ళు”– అంటే ఇస్రాయేల్ ప్రజలు. ఇస్రాయేల్‌కు దేవుడు తన ఆత్మను ప్రసాదించడానికి సంబంధించిన వాగ్దానాలు మరి కొన్ని ఉన్నాయి. యెహెఙ్కేలు 36:27-28; యెహెఙ్కేలు 37:14; యెహెఙ్కేలు 39:29 చూడండి. ఈ వాగ్దానాల సందర్భాలను బట్టి చూస్తే వీటిని దేవుడు నెరవేర్చేకాలం భవిష్యత్తులోనే ఉంది. పెంతెకొస్తు దినాన ఆరంభం జరిగిందంటే భవిష్యత్తులో ఒక సారి చివరిగా ఇస్రాయేల్ పై ఆత్మను కుమ్మరించడం ఉండదని అర్థం కాదు.

29. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.

30. మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను
లూకా 21:25, ప్రకటన గ్రంథం 8:7

మత్తయి 24:29; ప్రకటన గ్రంథం 6:12-14. ఈ సంభవాలు యెహోవా దినానికి కొంచెం ముందుగా జరుగుతాయి (యోవేలు 1:15; యోవేలు 2:1, యోవేలు 2:11; యోవేలు 3:14). దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి వీటిని ముడిపెట్టి మాట్లాడుతున్నాడంటే ఈ యుగాంతానికి కొంచెం ముందు ఈ కుమ్మరింపు ఉంటుందని భావించవచ్చు.

31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.
మత్తయి 24:29, మార్కు 13:24-25, లూకా 21:25, ప్రకటన గ్రంథం 6:12

32. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.
అపో. కార్యములు 2:39, అపో. కార్యములు 22:16, రోమీయులకు 10:13

“విముక్తి”– రోమీయులకు 10:13. “తప్పించుకొన్నవారి మధ్య”– యెషయా 10:20; యెషయా 11:10-11; జెకర్యా 13:8-9. “రక్షణ”– యెషయా 46:13; యెషయా 59:20-21; రోమీయులకు 11:26. “పిలుస్తాడు”– అపో. కార్యములు 2:39.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joel - యోవేలు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దేవుని తీర్పులు. (1-14) 
పూజారులు ప్రజలలో అలారం మోగించడం, రాబోయే దైవిక తీర్పుల గురించి వారిని హెచ్చరించడం అనే గంభీరమైన విధిని కలిగి ఉన్నారు. పాపం యొక్క భయంకరమైన పర్యవసానాలకు వ్యతిరేకంగా హెచ్చరించడం మరియు భక్తిహీనులు మరియు అన్యాయస్థులకు సంభవించే పరలోక కోపాన్ని ప్రకటించడం మంత్రులపై పడుతుంది. క్రింది స్పష్టమైన వర్ణన మిడతల వల్ల కలిగే వినాశనాన్ని వర్ణించడమే కాకుండా, భూమిపై కల్దీయులు చేసిన వినాశనాన్ని చిత్రీకరించినట్లు కూడా చూడవచ్చు. తాత్కాలిక తీర్పులను ఎదుర్కొంటున్న దేశాలకు హెచ్చరిక ఇవ్వబడితే, రాబోయే దైవిక ఉగ్రత నుండి మోక్షాన్ని పొందమని పాపులను ఎంత ఎక్కువగా ప్రోత్సహించాలి!
కాబట్టి, ఈ భూమిపై మన ప్రాథమిక శ్రద్ధ మన ప్రభువైన యేసుక్రీస్తుతో సంబంధాన్ని పొందడం. ప్రాపంచిక ఆస్తుల నుండి మనల్ని మనం వేరుచేయడానికి ప్రయత్నించాలి, అది చివరికి వాటిని విగ్రహాలుగా ప్రాధాన్యతనిచ్చే వారి నుండి తీసివేయబడుతుంది. ఈ ప్రక్రియ ఉపవాసం, ఏడుపు మరియు సంతాపంతో సహా పశ్చాత్తాపం మరియు అవమానం యొక్క బాహ్య వ్యక్తీకరణలు అవసరం. కష్టాల కోసం కారుతున్న కన్నీళ్లు ఆ కష్టాలకు దారితీసిన పాపాలకు పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లుగా మారాలి. నమ్రత మరియు స్వీయ-విరక్తితో హృదయాలు నలిగిపోతే తప్ప, పాపాల పట్ల ప్రగాఢమైన దుఃఖం మరియు వాటి నుండి తనను తాను దూరం చేసుకోవాలనే సంకల్పం ఉంటే తప్ప బట్టలు విడదీయడం అర్థరహితం.
మనం మన పాపాల పట్ల యథార్థంగా పశ్చాత్తాపపడితే, దేవుడు క్షమాపణ ప్రసాదిస్తాడనడంలో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ, అతను బాధను తొలగిస్తాడని ఎటువంటి హామీ లేదు, అయినప్పటికీ దాని సంభావ్యత పశ్చాత్తాపపడేలా మనల్ని ప్రేరేపిస్తుంది.

ఉపవాసం మరియు ప్రార్థనలకు ఉపదేశాలు; వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు. (15-27) 
పురోహితులు మరియు నాయకులు గంభీరమైన ఉపవాసాలను స్థాపించే బాధ్యతను కలిగి ఉన్నారు. పాపాత్ముని మనవి, "ఓ ప్రభూ, మమ్మల్ని కరుణించు." దేవుడు తన ప్రజల సహాయానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు మరియు దయ చూపించడానికి అతని సుముఖత ఎప్పుడూ ఉంటుంది. వారు అతని దయ కోసం దేవుణ్ణి వేడుకున్నారు మరియు అతను వారి విన్నపానికి ప్రతిస్పందించాడు. అతని వాగ్దానాలు విశ్వాసం ఉన్నవారి ప్రార్థనలకు స్పష్టమైన ప్రతిస్పందనలుగా పనిచేస్తాయి; అతనిలో, మాట్లాడటం మరియు నటన విడదీయరానివి. కొందరు ఈ వాగ్దానాలను రూపకంగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే అవి సువార్త యొక్క కృపను సూచిస్తాయి, కృప యొక్క ఒడంబడికలో విశ్వాసులకు కేటాయించబడిన సమృద్ధిగా ఉన్న సౌకర్యాలలో వ్యక్తమవుతుంది.

పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం, మరియు భవిష్యత్ దయ. (28-32)
వాగ్దానం పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో దాని సాక్షాత్కారాన్ని చూడటం ప్రారంభించింది. ఈ వాగ్దానం యూదులు మరియు అన్యులకు అందించబడిన పరివర్తనాత్మక దయ మరియు అసాధారణ బహుమతుల ద్వారా విప్పబడుతూనే ఉంది. పాపభరిత ప్రపంచంపై దేవుని తీర్పులు చివరి రోజున జరిగే అంతిమ తీర్పుకు పూర్వగామిగా పనిచేస్తాయి. మనం దేవుణ్ణి పిలిచినప్పుడు, అది ఆయన గురించి మనకున్న జ్ఞానాన్ని, ఆయనపై మనకున్న విశ్వాసాన్ని, ఆయన పట్ల మన వాంఛను, ఆయనపై మన ఆధారపడడాన్ని మరియు ఈ లక్షణాల యొక్క నిజాయితీకి నిదర్శనంగా, ఆయనకు మనం అంకితమైన విధేయతను సూచిస్తుంది. పాపం నుండి వైదొలగడానికి మరియు దేవుణ్ణి ఆలింగనం చేసుకోవడానికి, స్వయం నుండి క్రీస్తు వైపుకు మారడానికి మరియు భూసంబంధమైన వాటి కంటే పరలోక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సమర్థవంతంగా పిలువబడిన వారు మాత్రమే ఆ ముఖ్యమైన రోజున పంపిణీ చేయబడతారు.



Shortcut Links
యోవేలు - Joel : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |