1. mariyu yehovaa moshe aharonulaku eelaagu selavicchenu.
2. ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మ మందు కుష్ఠుపొడవంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను.
2. okani dhehacharmamandu vaapugaani pakku gaani niganigalaadu macchagaani yundi vaani dhehacharma mandu kushthupodavantidi kanabadina yedala yaajakudaina aharonu noddhakainanu yaaja kulaina athani kumaarulalo okaniyoddhakainanu vaani theesikoni raavalenu.
3. ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.
3. aa yaajakudu vaani dhehacharmamandunna aa podanu choodagaa aa poda yandali vendrukalu tellabaarinayedalanu, aa poda athani dhehacharmamu kante pallamugaa kanabadinayedalanu adhi kushthu poda. Yaajakudu vaani chuchi apavitrudani nirnayimpavalenu.
4. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.
4. niganigalaadu maccha charmamula kante pallamukaaka vaani dhehacharmamandu tellagaa kanabadinayedalanu, daani vendrukalu tellabaarakunna yedalanu aa yaajakudu edu dinamulu aa podagalavaanini kadagaa unchavalenu.
5. ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.
5. edava naadu yaajakudu vaanini choodavalenu. aa poda charmamandu vyaapimpaka atle undinayedala, yaajakudu mari yedu dinamulu vaani kadagaa unchavalenu.
6. ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
6. edavanaadu yaajakudu rendavasaari vaani choodavalenu. Appudu aa poda charmamandu vyaapimpaka adhe theeruna undinayedala yaajakudu vaanini pavitrudani nirnayimpavalenu; adhi pakke, vaadu thana battalu udukukoni pavitrudagunu.
7. అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.
7. ayithe vaadu thana shuddhivishayamu yaajakuniki kanabadina tharuvaatha aa pakku charmamandu visthaaramugaa vyaapinchina yedala vaadu rendavasaari yaajakuniki kanabadavalenu.
8. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.
8. appudu aa pakku charmamandu vyaapinchinayedala yaaja kudu vaadu apavitrudani nirnayimpavalenu.
9. కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.
9. kushthupoda yokaniki kaliginayedala yaajakuni yoddhaku vaanini theesikoniraavalenu.
10. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబారినయెడలను, వాపులో పచ్చి మాంసము కన బడినయెడలను,
10. yaajakudu vaani choodagaa tellani vaapu charmamandu kanabadinayedalanu, adhi vendruka lanu tellabaarinayedalanu, vaapulo pachi maansamu kana badinayedalanu,
11. అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అపవిత్రుడు.
11. adhi vaani dhehacharmamandu paathadaina kushthamu ganuka yaajakudu vaadu apavitrudani nirna yimpavalenu, vaanini kadagaa unchakoodadu; vaadu apa vitrudu.
12. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలు కొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల
12. kushthamu charmamandu visthaaramugaa puttinappudu yaajakudu chuchinanthavaraku aa podagalavaani thalamodalu koni paadamulavaraku kushthamu vaani charmamanthayu vyaapinchi yundinayedala
13. యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు.
13. yaajakudu vaanini choodavalenu; aa kushthamu vaani dhehamanthata vyaapinchinayedala aa podagala vaadu pavitrudani nirnayimpavalenu. Vaani ollanthayu tellabaarenu; vaadu pavitrudu.
14. అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు.
14. ayithe vaani yonta pachimaansamu kanabadu dinamuna vaadu apavitrudu.
15. యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.
15. yaajakudu aa pachimaansamunu chuchi vaadu apavitru dani nirnayimpavalenu. aa pachimaansamu apavitrame; adhi kushthamu.
16. అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకునియొద్దకు రావలెను;
16. ayithe aa pachimaansamu aari tellabaarina yedala vaadu yaajakuniyoddhaku raavalenu;
17. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు.
17. yaajakudu vaani choodagaa aa poda tellabaarinayedala yaajakudu aa poda pavitramani nirnayimpavalenu; vaadu pavitrudu.
18. ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత
18. okani dhehacharmamandu pundu putti maanina tharuvaatha
19. ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను.
19. aa pundundinachootanu tellani vaapainanu teluputhoo koodina yerupurangugala podagaani niganigalaadu tellani podagaani puttinayedala, yaajakuniki daanikanuparachavalenu.
20. యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.
20. yaajakudu daani chuchinappudu athani choopunaku adhi charmamukante pallamugaa kanabadinayedalanu, daani vendru kalu tellabaari yundinayedalanu, yaajakudu vaadu apavitrudani nirnayimpavalenu; adhi aa puntivalana puttina kushthupoda.
21. యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.
21. yaajakudu daani chuchinappudu daanilo tellani vendrukalu lekapoyinayedalanu, adhi charmamu kante pallamukaaka konchemu nayamugaa kana badinayeda lanu, yaajakudu edu dinamulu vaanini pratyekamugaa unchavalenu.
22. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.
22. adhi charmamandu visthaaramugaa vyaapinchina yedala yaajakudu vaadu apavitrudani nirnayimpavalenu; adhi kushthupoda.
23. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
23. niganigalaadu poda vyaapimpaka atle undinayedala adhi dadduru; yaajakudu vaadu pavitru dani nirnayimpavalenu.
24. దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానే గాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.
24. dadduru kaligina dhehacharmamandu aa vaatha yerragaane gaani tellagaanegaani niganigalaadu tellani macchagaanegaani yundinayedala yaajakudu daani choodavalenu.
25. నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.
25. niga nigalaadu aa macchaloni vendrukalu tellabaarinayedalanu, adhi charmamukante pallamugaa kanabadinayedalanu, adhi aa vaathavalana puttina kushthupoda; yaajakudu vaadu apavitrudani nirnayimpavalenu; adhi kushthamu.
26. యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రుకలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.
26. yaajakudu daani choochunappudu adhi niganigalaadu macchalo tellani vendru kalu lekayegaani charmamukante pallamugaa nundakaye gaani kontha nayamugaa kanabadinayedala, yaajakudu edu dinamulu vaanini kadagaa unchavalenu.
27. ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.
27. edavanaadu yaaja kudu vaani chuchinappudu adhi charmamandu visthaaramugaa vyaapinchinayedala vaadu apavitrudani nirnayimpavalenu; adhi kushthame.
28. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.
28. ayithe niganigalaadu maccha charmamandu vyaapimpaka aa chootaneyundi konchemu nayamugaa kanabadinayedala adhi vaathapu vaape; vaadu pavitrudani yaajakudu nirnayimpavalenu; adhi vaathapu mantaye.
29. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా
29. purushunikainanu streekainanu thalayandhemi gaddamandhemi poda puttinayedala, yaajakudu aa podanu choodagaa
30. అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన యెడల, వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము.
30. adhi charmamukante pallamugaanu sannamaina pasupu paccha vendrukalu kaladhigaanu kanabadina yedala, vaadu apavitru dani yaajakudu nirnayimpavalenu; adhi bobba, thalameeda nemi gaddamumeeda nemi puttina kushthamu.
31. యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచి నప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేని యెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
31. yaajakudu aa bobbayina podanu chuchi nappudu adhi charmamukante pallamu kaaniyedalanu, daanilo nallavendrukalu leni yedalanu, yaajakudu aa bobbayina podagalavaanini edu dinamulu pratyekamugaa unchavalenu.
32. ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రుకలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,
32. edavanaadu yaajakudu aa podanu choodavalenu. aa bobba vyaapiṁ paka yundinayedalanu, daanilo pasupu pacchavendru kalu leniyedalanu, charmamukante pallamukaani yedalanu,
33. వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
33. vaadu kshauramu chesikonavalenu gaani aa bobba kshauramu cheyakoodadu. Yaajakudu bobbagala vaanini mari yedu dinamulu pratyekamugaa unchavalenu.
34. ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.
34. edavanaadu yaajakudu aa bobbanu choodagaa adhi charmamandu bobba vyaapimpaka charmamukante pallamu kaaka yundinayedala, yaajakudu vaadu pavitrudani nirnayimpavalenu. Vaadu thana battalu udukukoni pavitrudagunu.
35. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను,
35. vaadu pavitru dani nirnayinchina tharuvaatha bobba visthaaramugaa vyaapinchina yedala yaajakudu vaani choodavalenu,
36. అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.
36. appudu aa maada vyaapinchiyundinayedala yaajakudu pasupu paccha vendrukalanu vedakanakkaraledu; vaadu apavitrudu.
37. అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.
37. ayithe nilichina aa maadalo nallavendrukalu puttina yedala aa maada baagupadenu; vaadu pavitrudu; yaaja kudu vaadu pavitrudani nirnayimpavalenu.
38. మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల
38. mariyu purushuni dhehapucharmamandhemi stree dhehapu charmamandhemi niganigalaadu macchalu, anagaa niganigalaadu tellanimacchalu puttinayedala
39. యాజకుడు వానిని చూడవలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.
39. yaajakudu vaanini chooda valenu; vaari dhehacharmamandu niganigalaadu macchalu vaadi yundinayedala adhi charmamandu puttina yoka pokku; vaadu pavitrudu.
40. తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయినను వాడు పవిత్రుడు.
40. thalavendrukalu raalinavaadu batta thalavaadu; ayi nanu vaadu pavitrudu.
41. ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు.
41. mukhamuvaipuna thala vendrukalu raalinavaadu batta nosativaadu; vaadu pavitrudu.
42. అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి యందైనను పుట్టిన కుష్ఠము.
42. ayinanu batta thalayandhegaani batta nosatiyandhegaani yerragaanundu tellani poda puttina yedala, adhi vaani batta thalayandainanu batta nosati yandainanu puttina kushthamu.
43. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల
43. yaajakudu vaanini choodavalenu. Kushthamu dhehacharma mandu kanabadunatlu aa poda vaapu choopunaku vaani batta thalayandainanu vaani batta nosatiyandainanu erragaa nundu tellani podayainayedala
44. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.
44. vaadu kushtharogi, vaadu apavitrudu; yaajakudu vaadu botthigaa apavitrudani nirnayimpavalenu; vaani kushthamu vaani thalalonunnadhi.
45. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.
45. aa podagala kushtharogi vastramulanu chimpiveyavalenu; vaadu thala viriyabosikonavalenu; vaadu thana paipedavini kappukoni apavitrudanu apavitrudanu ani biggaragaa palukavalenu.
46. ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.
లూకా 17:12
46. aa poda vaaniki kaligina dinamulanniyu vaadu apavitrudai yundunu; vaadu apavitrudu ganuka pratyekamugaane nivasimpavalenu; vaani nivaasamu paalemunaku velupala undavalenu.
47. మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి
47. mariyu kushthupoda vastramandu kanabadunappudu adhi gorravendrukala battayandhemi naarabattayandhemi
48. నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి
48. naarathoonegaani vendrukalathoonegaani nesina padugunaṁ dhemi pekayandhemi thoolunandhemi thooluthoo cheyabadu eyoka vasthuvunandhemi putti
49. ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.
మత్తయి 8:4, మార్కు 1:44, లూకా 5:14, లూకా 17:14
49. aa poda aa battayandhemi aa thoolunandhemi aa pekayandhemi thooluthoo cheyabadina vasthuvunandhemi pacchadaalu gaanegaani yerradaalugaanegaani kanabadinayedala, adhi kushthupoda; yaajakuniki daani kanu parachavalenu.
50. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.
50. yaajakudu aa podanu chuchi podagala vaatini edu dinamulu pratyekamugaa unchavalenu.
51. ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అప విత్రము.
51. edavanaadu athadu aa podanu choodavalenu. Appudu aa vastramandu, anagaa padugunandhegaani pekayandhegaani thoolunandhegaani thooluthoo chesina vasthuvunandhegaani aa poda vyaapinchinayedala adhi korukudu kushthamu; adhi apa vitramu.
52. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.
52. kaavuna athadu aa poda dhenilo unnado aa vastramunu naarathoonemi vendrukalathoonemi chesina padu gunu pekanu thooluthoo chesina prathi vasthuvunu agnithoo kaalchiveyavalenu; adhi korukudu kushthamu; agnithoo daani kaalchiveyavalenu.
53. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల
53. ayithe yaajakudu chuchi nappudu aa poda aa vastramandu, anagaa padugunandhemi pekayandhemi thooluthoo chesina mari dheniyandhemi vyaapiṁ paka poyinayedala
54. యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను.
54. yaajakudu aa podagaladaanini uduka naagnaapinchi mari edu dinamulu daanini vidigaa uncha valenu.
55. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.
55. aa podagala daanini udikina tharuvaatha yaajakudu daanini choodavalenu. aa poda maarakapoyinanu vyaapiṁ paka poyinanu adhi apavitramu. Agnithoo daanini kaalchi veyavalenu. adhi lovaipunagaani paivaipunagaani puttinanu korukudu kushthamugaa undunu.
56. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.
56. yaajakudu daanini chuchinappudu vastramu udikina tharuvaatha aa poda vaadi yundinayedala, adhi aa vastramulo undinanu thoolulo undinanu padugulo undinanu pekalo undinanu yaajakudu vaatini chimpiveyavalenu.
57. అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.
57. atutharuvaatha adhi aa vastramandhegaani padugunandhegaani pekayandhegaani thooluthoo chesina dheniyandhegaani kanabadinayedala adhi koru kudu kushthamu. aa poda dhenilo nunnado daanini agnithoo kaalchiveyavalenu.
58. ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికినతరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;
58. e vastramunegaani padu gunegaani pekanegaani thooluthoo chesina dheninegaani udi kinatharuvaatha aa poda vadhilina yedala, rendavamaaru daanini udukavalenu;
59. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేక యందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.
59. appudu adhi pavitramagunu. Bochu batta yandhegaani naarabattayandhegaani padugunandhegaani peka yandhegaani thoolu vasthuvulayandhegaani yundu kushthupodanu goorchi adhi pavitramani apavitramani neevu nirnayimpavalasina vidhi yidhe.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
కుష్టు వ్యాధికి సంబంధించి తీర్పు చెప్పడానికి పూజారికి ఆదేశాలు. (1-17)
కుష్టు వ్యాధి కేవలం అనారోగ్యంగా కాకుండా ఒక రకమైన మురికిగా పరిగణించబడింది. యేసు కుష్టురోగులను స్వస్థపరచడమే కాకుండా వారిని శుభ్రపరచగలిగాడు. హీబ్రూ ప్రజలకు ముఖ్యంగా ఈజిప్టులో ఉన్న సమయంలో కుష్టు వ్యాధి ఒక సాధారణ సమస్య. ఇది వారి పేద జీవన పరిస్థితులు మరియు కష్టపడి పనిచేయడం వల్ల కావచ్చు. అయితే, కొన్నిసార్లు దేవుడు కుష్టువ్యాధి ఉన్న వ్యక్తులను వారు చేసిన నిర్దిష్ట పాపాలకు శిక్షిస్తాడు. కుష్టు వ్యాధి సాధారణ వ్యాధి మాత్రమే కాదు, దానికి భిన్నంగా చికిత్స చేయడం చాలా ముఖ్యం. చాలా కాలం క్రితం, ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు మరియు చర్మంపై మచ్చలు ఏర్పడినప్పుడు, వారు కుష్టువ్యాధి అని పిలువబడే ఒక నిర్దిష్ట రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదో నిర్ణయించడానికి పూజారులు అని పిలువబడే ప్రత్యేక నాయకుల వద్దకు వెళ్ళేవారు. ఈ అనారోగ్యం ప్రజల హృదయాలను మురికిగా మరియు విచారంగా మార్చే ఒక చెడ్డ విషయంలా ఉంది. యేసు మాత్రమే మన హృదయాలను మరల శుద్ధి చేయగలడు. మన హృదయాలను తనిఖీ చేయడం మరియు అవి శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం, కానీ అది చేయడం కష్టం. మనందరికీ మన హృదయాలను మురికిగా చేసే విషయాలు ఉన్నాయి, కానీ మనం నిజంగా శుభ్రంగా ఉన్నారా లేదా అని మనం గుర్తించాలి. ఎవరికైనా కుష్టు వ్యాధి ఉంటే చూపించే ప్రత్యేక సంకేతాలు ఉన్నట్లుగా, ఎవరికైనా మురికి హృదయం ఉంటే చూపించే సంకేతాలు ఉన్నాయి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా అని నిర్ణయించుకోవడానికి పూజారులు తమ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది, మన హృదయాలను పరీక్షించుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. నాయకులు మరియు సాధారణ వ్యక్తులతో సహా ప్రతి ఒక్కరికీ ఇది ఒక పాఠం, ఇతరులను త్వరగా తీర్పు చెప్పడం లేదా విమర్శించకూడదు. కొన్నిసార్లు వ్యక్తుల చెడు చర్యలు ముందుగా నిర్ణయించబడతాయి, కానీ చివరికి మంచి చర్యలు కూడా పరిగణించబడతాయి. తప్పు చేశాడని ఆరోపించబడిన ఎవరైనా నిర్దోషులుగా తేలినా, వారు తప్పు చేశారని ప్రజలు భావించినందున వారు తమను తాము శుభ్రం చేసుకోవాలి. వ్యాధి ఉన్నంత గంభీరమైన పనిని మనం చేయనప్పటికీ, యేసు ద్వారా మనల్ని ఎలా క్షమించాలి అంటే ఇదే. మనమందరం తప్పు చేశామని అంగీకరించాలి మరియు క్షమించమని అడగాలి.
తదుపరి దిశలు. (18-44)
పురోహితుడు ఎవరికైనా కుష్టు వ్యాధి అనే జబ్బు ఉందో లేదో వారి పాత పుండ్లు కనిపించే తీరును బట్టి నిర్ణయించుకోవాలి. మంచిగా ఉండి మళ్లీ చెడు పనులు చేయడం ప్రారంభించిన వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు. కొన్నిసార్లు ప్రజలు పోరాడినప్పుడు, అది వారిని చెడుగా ప్రవర్తించేలా చేస్తుంది మరియు వారు అనారోగ్యానికి గురవుతారు. జీవితం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. పాపం వల్ల మనం అనేక రకాల వ్యాధులకు గురవుతాము. కానీ మనం మన శరీరాలను జాగ్రత్తగా చూసుకుని, వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే, మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపించగలము. కుష్టువ్యాధి నిజంగా చెడ్డ అనారోగ్యం, ప్రత్యేకించి అది తలపై ప్రభావం చూపితే. మనకు చెడు ఆలోచనలు మరియు చెడు పనులు చేస్తే, అది మన తలలో కుష్టు వ్యాధి ఉన్నట్లే - వదిలించుకోవటం నిజంగా కష్టం. కానీ మనం దేవుణ్ణి నమ్మి, ఆయన బోధలను అనుసరిస్తే, మనం అలాంటి అనారోగ్యాన్ని నివారించవచ్చు.
కుష్ఠురోగిని ఎలా తొలగించాలి. (45,46)
ఆ వ్యక్తికి లెప్రసీ అనే జబ్బు ఉందని పూజారి చెప్పినప్పుడు, సాధారణ జీవితం గడపడం వారికి చాలా కష్టమైంది. వారు తమ స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను చూడలేకపోయారు మరియు అది వారిని చాలా బాధపెట్టింది. పురోహితుని మాట విని బాగుపడినంత వరకు ఓపిక పట్టవలసి వచ్చింది. మనమందరం మనలో చెడుతనంతో పుట్టాము మరియు కొన్నిసార్లు చెడు పనులు కూడా చేస్తాము. ఇది మనం దేవునికి సన్నిహితంగా ఉండటానికి మరియు ఆయనతో సంతోషంగా ఉండటానికి అనర్హులుగా చేస్తుంది. మనల్ని ఇతరుల నుండి వేరు చేసే జబ్బు ఉన్నట్లే మరియు మనం వాటికి దూరంగా ఉండాలి. చర్చిలో మంచిగా మరియు స్వచ్ఛంగా ఉండటం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది.
వస్త్రాలలో కుష్టు వ్యాధి. (47-59)
లెప్రసీ అనే వ్యాధి ఉందని ప్రజలు భావించే దుస్తులు ఏదైనా ఉంటే, వారు వెంటనే దానిని కాల్చలేరు. వారు మొదట దాన్ని తనిఖీ చేయాలి మరియు దానికి వ్యాధి ఉంటే, వారు దుస్తులలోని ఆ భాగాన్ని కాల్చాలి. కానీ దానికి రోగం లేకుంటే కడిగేసి మళ్లీ వాడుకునేవారు. ఇది పాపం ఎంత చెడ్డదో మరియు పాపం చేసే ప్రతి పనిని మురికిగా మారుస్తుంది. వారు ఎలా కనిపిస్తారనే దాని గురించి చాలా శ్రద్ధ వహించే వ్యక్తులు వారి చెడు ప్రవర్తన కారణంగా మురికి బట్టలు కూడా కలిగి ఉండవచ్చు. కానీ మనం మంచిగా ఉండి, సరైన పనులు చేస్తే, మన మంచి ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉంటుంది మరియు పాడైపోదు.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |