Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను
1. And the LORD spoke unto Moses after the death of the two sons of Aaron, when they came near before the LORD and died;
2. నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.హెబ్రీయులకు 6:19, హెబ్రీయులకు 9:7
2. and the LORD said unto Moses, Speak unto Aaron, thy brother, that he not enter at all times into the sanctuary inside the veil before the seat of reconciliation, which [is] upon the ark, that he not die; for I will appear in the cloud above the seat of reconciliation.
3. అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.హెబ్రీయులకు 9:13
3. Thus shall Aaron come into the holy [place]: with a young bullock as sin and a ram as a burnt offering.
4. అతడు ప్రతిష్ఠిత మైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననారపాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.
4. He shall put on the holy linen coat, and he shall have the linen underwear upon his flesh and shall be girded with a linen girdle, and with the linen mitre shall he cover himself. These [are] holy garments; and he shall wash his flesh with water and put them on.
5. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను.
5. And he shall take of the congregation of the sons of Israel two he goats as the sin and one ram as a burnt offering.
6. అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసిహెబ్రీయులకు 5:3, హెబ్రీయులకు 7:27
6. And Aaron shall cause the bullock of his sin to be brought, and make reconciliation for himself and for his house.
7. ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.
7. After that, he shall take the two goats and present them before the LORD [at] the door of the tabernacle of the testimony.
8. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
8. And Aaron shall cast lots upon the two he goats, one lot for the LORD and the other lot for Azazel.
9. ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.
9. And Aaron shall cause the he goat upon which the LORD'S lot fell to be brought and offer him for the sin.
10. ఏ మేకమీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.
10. But the he goat on which the lot fell for Azazel shall be presented alive before the LORD, to make the reconciliation upon him [and] to send him to Azazel into the wilderness.
11. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి
11. And Aaron shall cause the bullock of his own sin to be brought and shall make the reconciliation for himself and for his house and shall kill the bullock of his own sin.
12. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరిమళ ధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లుహెబ్రీయులకు 6:19, ప్రకటన గ్రంథం 8:5
12. After that he shall take the censer full of burning coals of fire from off the altar before the LORD and his hands full of aromatic incense beaten small and bring [it] inside the veil.
13. ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను.
13. And he shall put the incense upon the fire before the LORD, and the cloud of the incense shall cover the seat of reconciliation that [is] upon the testimony, and he shall not die.
14. అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.హెబ్రీయులకు 9:7-13
14. Then he shall take of the blood of the bullock and sprinkle [it] with his finger towards the seat of reconciliation eastward; towards the seat of reconciliation he shall sprinkle of the blood with his finger seven times.
15. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్ధబలియగు మేకను వధించి అడ్డ తెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.హెబ్రీయులకు 6:19, హెబ్రీయులకు 7:27, హెబ్రీయులకు 9:7-13, హెబ్రీయులకు 10:4
15. After that, he shall kill the goat of the sin of the people and bring its blood inside the veil and do with that blood as he did with the blood of the bullock and sprinkle it upon the seat of reconciliation and before the seat of reconciliation;
16. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టియు, అనగా వారి అపవిత్రతను బట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.
16. and he shall cleanse the sanctuary of the uncleanness of the sons of Israel and of their rebellions and of all their sins; in the same manner so shall he do for the tabernacle of the testimony, which dwells among them in the midst of their uncleanness.
17. పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.
17. And no man shall be in the tabernacle of the testimony when he enters in to make reconciliation in the sanctuary until he comes out and has made reconciliation for himself and for his household and for all the congregation of Israel.
18. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి
18. And he shall go out unto the altar that [is] before the LORD and reconcile it and shall take of the blood of the bullock and of the blood of the he goat and put [it] upon the horns of the altar round about.
19. యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.
19. And he shall sprinkle of the blood upon it with his finger seven times and cleanse it and sanctify it from the uncleanness of the sons of Israel.
20. అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను.
20. And when he has made an end of reconciling the sanctuary and the tabernacle of the testimony and the altar, he shall cause the live he goat to be brought;
21. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.హెబ్రీయులకు 10:4
21. and Aaron shall lay both his hands upon the head of the live he goat and confess over it all the iniquities of the sons of Israel and all their rebellions and all their sins, putting them thus upon the head of the he goat and shall send [him] away into the wilderness by the hand of [a] man prepared [for this];
22. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.
22. and that he goat shall bear upon itself all their iniquities unto an uninhabitable land; and he shall send the he goat into the wilderness.
23. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము లోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి
23. After that, Aaron shall come into the tabernacle of the testimony and shall put off the linen garments, which he put on to enter into the sanctuary, and shall put them there.
24. పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహన బలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను
24. [Then] he shall wash his flesh with water in the holy place and put on his garments and come forth after that and make his burnt offering and the burnt offering of the people and make reconciliation for himself and for the people.
25. పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను.
25. And the fat of the sin he shall incense upon the altar.
26. విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.
26. And he that took the he goat to Azazel shall wash his clothes and bathe his flesh with water and afterward come into the camp.
27. పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొనిపోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయ వలెను.హెబ్రీయులకు 13:11-13
27. And he shall take outside the camp the bullock of the sin and the goat of the sin, whose blood was brought in to make the reconciliation in the sanctuary; and they shall burn in the fire their skins and their flesh and their dung.
28. వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెము లోనికి రావలెను.
28. And he that burns them shall wash his clothes and bathe his flesh in water, and afterward he shall come into the camp.
29. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.అపో. కార్యములు 27:9
29. And you shall hold this as a perpetual statute: In the seventh month, on the tenth [day] of the month, ye shall afflict your souls and do no work at all, whether it is a natural [of your own country] or a stranger that sojourns among you;
30. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.హెబ్రీయులకు 9:7-12-28
30. for on that day he shall reconcile you to cleanse you [that] ye may be clean from all your sins before the LORD.
31. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.
31. It [shall be] a sabbath of rest unto you, and ye shall afflict your souls, by a perpetual statute.
32. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభి షేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.
32. And the reconciliation shall be made by the priest who is anointed and whose hand has been filled to be priest in the place of his father; and he shall put on the linen clothes, the holy garments;
33. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.
33. and he shall reconcile the holy sanctuary and reconcile the tabernacle of the testimony; he shall also reconcile the altar and the priests and all the people of the congregation.
34. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.హెబ్రీయులకు 9:7-12-28
34. And you shall hold this as a perpetual statute to reconcile the sons of Israel of all their sins once a year. And Moses did as the LORD commanded him.: