Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
2. నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.
3. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలనుబట్టి నడవకూడదు.
“ఈజిప్ట్”– యెహెఙ్కేలు 20:7-8. “కానాను”– లేవీయకాండము 18:24-30 లేవీయకాండము 20:23.
4. మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.
5. మీరు నాకట్టడలను నా విధు లను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.మత్తయి 19:17, లూకా 10:28, రోమీయులకు 7:10, రోమీయులకు 10:5, గలతియులకు 3:12
నెహెమ్యా 9:29 యెహెఙ్కేలు 18:9 యెహెఙ్కేలు 20:11 లూకా 10:28 రోమీయులకు 10:5 గలతియులకు 3:12. ఇది పాత ఒడంబడికలోని ధర్మశాస్త్రానికి పునాది. సమస్య ఏమిటంటే మనుషులు భ్రష్ట స్వభావం వల్ల ఏ ఒక్కరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించ లేకపోయారు. రోమీయులకు 3:9-12 రోమీయులకు 3:23 నిర్గమకాండము 19:8 నోట్స్ చూడండి. భ్రష్ట స్వభావం లేని యేసుక్రీస్తు ఒక్కడే దాన్ని పూర్తిగా పాటించాడు. కానీ ఈజిప్ట్వారూ కనానువారూ అనుసరించే అసహ్యకరమైన పాపాలను, విగ్రహపూజలను ఇస్రాయేల్వారు అనుసరించకుండా ఉండగలగడం అసాధ్యమేమీ కాదు.
6. మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.
ఒకే కుటుంబంవారి మధ్య సంపర్కం, వివాహం నిషేధం.
7. నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.1 కోరింథీయులకు 5:1
8. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.1 కోరింథీయులకు 5:1
9. నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్కయైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.
10. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు; అది నీది.
11. నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
12. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
13. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
14. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.
15. నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.
16. నీ సహోదరుని భార్యమానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.మత్తయి 14:3-4, మార్కు 6:18
17. ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము నైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్తసంబంధులు; అది దుష్కామప్రవర్తన.
18. నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.
19. అపవిత్రతవలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.
20. నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.
నిర్గమకాండము 20:14 లేవీయకాండము 20:10 సామెతలు 6:29 మత్తయి 5:27-28 1 కోరింథీయులకు 6:9 హెబ్రీయులకు 13:4.
21. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.
అమ్మోన్వాళ్ళ దేవుళ్ళలో మోలెక్ ఒకడు (1 రాజులు 11:7). వీరు కనాను తూర్పు ప్రాంతంలో నివసించేవారు. మోలెక్ భక్తులు తమ పిల్లలను ఆ దేవుడికి అర్పించి కాల్చివేసేవారు. ఇలాంటి పని ఇస్రాయేల్ వారెవరైనా చేస్తే అలాంటివాడికి మరణశిక్ష విధించాలి (లేవీయకాండము 20:2-5). దేవుడు ఈ హెచ్చరిక ఇచ్చినా తరువాతి కాలంలో సొలొమోనురాజు మోలెక్ దేవుడికి ఎత్తయిన పూజా స్థలాన్ని కట్టించాడు (1 రాజులు 11:6-8).
22. స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.రోమీయులకు 1:27
లేవీయకాండము 20:13 ద్వితీయోపదేశకాండము 23:18 రోమీయులకు 1:27 1 కోరింథీయులకు 6:9. ఆదికాండము 19:4-5 నోట్.
23. ఏ జంతువు నందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
నిర్గమకాండము 22:19 లేవీయకాండము 20:15-16 ద్వితీయోపదేశకాండము 27:21.
24. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొన కూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.
లేవీయకాండము 20:23 ద్వితీయోపదేశకాండము 9:5 ద్వితీయోపదేశకాండము 18:11 రోమీయులకు 1:18 కొలొస్సయులకు 3:6. రానురాను కనాను దేశంలో నివసించే జాతులు అనుసరించే ఆచారాలూ కార్యాలూ అసహ్యమైపోయి చివరికి దేవుని కోపాగ్నిని తమ మీదికి తెచ్చిపెట్టింది. ఆదికాండము 6:7 నోట్ చూడండి. దేవుడు వాళ్ళను వెళ్ళగొట్టేసి తన ప్రజలైన ఇస్రాయేల్వారికి ఆ భూమిని ఇవ్వడానికి నిశ్చయించాడు. శిక్షకు పాత్రులు కానివారిని దేవుడు ఎన్నడూ శిక్షించడు.
25. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.
26. కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,
27. అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,
28. యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.
29. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొ నుండి కొట్టివేయబడుదురు.
30. కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
లేవీయకాండము 22:9 ద్వితీయోపదేశకాండము 11:1.