Leviticus - లేవీయకాండము 19 | View All
Study Bible (Beta)

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము.

1. The LORD told Moses

2. మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.
మత్తయి 5:48, 1 పేతురు 1:16

2. to say to the community of Israel: I am the LORD your God. I am holy, and you must be holy too!

3. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

3. Respect your father and your mother, honor the Sabbath, and don't make idols or images. I am the LORD your God.

4. మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను

4. (SEE 19:3)

5. మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీ కరింపబడునట్లుగా అర్పింపవలెను.

5. When you offer a sacrifice to ask my blessing, be sure to follow my instructions.

6. మీరు బలినర్పించునాడైనను మరునాడైనను దాని తినవలెను. మూడవ నాటివరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను.

6. You may eat the meat either on the day of the sacrifice or on the next day, but you must burn anything left until the third day.

7. మూడవనాడు దానిలో కొంచె మైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు.

7. If you eat any of it on the third day, the sacrifice will be disgusting to me, and I will reject it.

8. దానిని తినువాడు తన దోషశిక్షను భరించును. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

8. In fact, you will be punished for not respecting what I say is holy, and you will no longer belong to the community of Israel.

9. మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;

9. When you harvest your grain, always leave some of it standing along the edges of your fields and don't pick up what falls on the ground.

10. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను;

10. Don't strip your grapevines clean or gather the grapes that fall off the vines. Leave them for the poor and for those foreigners who live among you. I am the LORD your God.

11. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;

11. Do not steal or tell lies or cheat others.

12. నా నామమునుబట్టి అబద్ధప్రమా ణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు; నేను యెహోవాను.
మత్తయి 5:33

12. Do not misuse my name by making promises you don't intend to keep. I am the LORD your God.

13. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
మత్తయి 20:8, 1 తిమోతికి 5:18, యాకోబు 5:4

13. Do not steal anything or cheat anyone, and don't fail to pay your workers at the end of each day.

14. చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.

14. I am the LORD your God, and I command you not to make fun of the deaf or to cause a blind person to stumble.

15. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.
యోహాను 7:24, అపో. కార్యములు 23:3

15. Be fair, no matter who is on trial--don't favor either the poor or the rich.

16. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.

16. Don't be a gossip, but never hesitate to speak up in court, especially if your testimony can save someone's life.

17. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
మత్తయి 18:15

17. Don't hold grudges. On the other hand, it's wrong not to correct someone who needs correcting.

18. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
మత్తయి 5:43, మత్తయి 19:19, మత్తయి 22:39, మార్కు 12:31-33, లూకా 10:27, రోమీయులకు 12:19, రోమీయులకు 13:9, గలతియులకు 5:14, యాకోబు 2:8

18. Stop being angry and don't try to take revenge. I am the LORD, and I command you to love others as much as you love yourself.

19. మీరు నాకట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతర జాతిజంతువులను కలియ నీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసిన బట్ట వేసికొనకూడదు.

19. Breed your livestock animals only with animals of the same kind, and don't plant two kinds of seed in the same field or wear clothes made of different kinds of material.

20. ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.

20. If a man has sex with a slave woman who is promised in marriage to someone else, he must pay a fine, but they are not to be put to death. After all, she was still a slave at the time.

21. అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

21. The man must bring a ram to the entrance of the sacred tent and give it to a priest, who will then offer it as a sacrifice to me, so the man's sins will be forgiven.

22. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.

22. (SEE 19:21)

23. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరములవరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు.

23. After you enter the land, you will plant fruit trees, but you are not to eat any of their fruit for the first three years.

24. నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును;

24. In the fourth year the fruit must be set apart, as an expression of thanks

25. నేను మీ దేవుడనైన యెహోవాను.

25. to me, the LORD God. Do this, and in the fifth year, those trees will produce an abundant harvest of fruit for you to eat.

26. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు,

26. Don't eat the blood of any animal. Don't practice any kind of witchcraft.

27. మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,

27. I forbid you to shave any part of your head or beard or to cut and tattoo yourself as a way of worshiping the dead.

28. చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.

28. (SEE 19:27)

29. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతోనిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.

29. Don't let your daughters serve as temple prostitutes--this would bring disgrace both to them and the land.

30. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను.

30. I command you to respect the Sabbath and the place where I am worshiped.

31. కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదెగాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.

31. Don't make yourselves disgusting to me by going to people who claim they can talk to the dead.

32. తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.
1 తిమోతికి 5:1

32. I command you to show respect for older people and to obey me with fear and trembling.

33. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు,

33. Don't mistreat any foreigners who live in your land.

34. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.

34. Instead, treat them as well as you treat citizens and love them as much as you love yourself. Remember, you were once foreigners in the land of Egypt. I am the LORD your God.

35. తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.

35. Use honest scales and don't cheat when you weigh or measure anything. I am the LORD your God. I rescued you from Egypt,

36. న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.

36. (SEE 19:35)

37. కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.

37. and I command you to obey my laws.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 19 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
చట్టాలు.
ఈ అధ్యాయం వేడుకల కోసం కొన్ని ప్రత్యేక నియమాల గురించి మాట్లాడుతుంది, అయితే పది ఆజ్ఞలను అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడే నియమాలు చాలా ముఖ్యమైనవి. మనం ఆయనలా మంచిగా, స్వచ్ఛంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కాబట్టి మనం ఆయనలా పవిత్రంగా ఉండటానికి ఈ నియమాలను పాటించాలి. దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నామో వినడం మరియు ఆయన నియమాలను పాటించడం చాలా ముఖ్యం. మనం కొన్ని పనులు మాత్రమే చేసి మరికొన్నింటిని విస్మరించలేము. దేవుడు కోరుకున్న విధంగా జీవించడానికి మన వంతు ప్రయత్నం చేసినప్పుడు, మనం సంతోషంగా ఉంటాము మరియు ఇతరులను కూడా సంతోషపరుస్తాము. దేవుణ్ణి అనుసరించడం ఎంత గొప్పదో మనం ఇతరులకు కూడా చూపిస్తాము. 


Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |