Leviticus - లేవీయకాండము 26 | View All
Study Bible (Beta)

1. మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

1. ''Do not make idols or set up an image or a sacred stone for yourselves, and do not place a carved stone in your land to bow down before it. I am the LORD your God.

2. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను.

2. ''Observe my Sabbaths and have reverence for my sanctuary. I am the LORD.

3. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

3. ''If you follow my decrees and are careful to obey my commands,

4. మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,

4. I will send you rain in its season, and the ground will yield its crops and the trees of the field their fruit.

5. మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.

5. Your threshing will continue until grape harvest and the grape harvest will continue until planting, and you will eat all the food you want and live in safety in your land.

6. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;

6. ''I will grant peace in the land, and you will lie down and no one will make you afraid. I will remove savage beasts from the land, and the sword will not pass through your country.

7. మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.

7. You will pursue your enemies, and they will fall by the sword before you.

8. మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.

8. Five of you will chase a hundred, and a hundred of you will chase ten thousand, and your enemies will fall by the sword before you.

9. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.

9. ''I will look on you with favor and make you fruitful and increase your numbers, and I will keep my covenant with you.

10. మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.

10. You will still be eating last year's harvest when you will have to move it out to make room for the new.

11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.
2 కోరింథీయులకు 6:16, ప్రకటన గ్రంథం 21:3

11. I will put my dwelling place among you, and I will not abhor you.

12. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.
2 కోరింథీయులకు 6:16, ప్రకటన గ్రంథం 21:3

12. I will walk among you and be your God, and you will be my people.

13. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

13. I am the LORD your God, who brought you out of Egypt so that you would no longer be slaves to the Egyptians; I broke the bars of your yoke and enabled you to walk with heads held high.

14. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక

14. ''But if you will not listen to me and carry out all these commands,

15. నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,

15. and if you reject my decrees and abhor my laws and fail to carry out all my commands and so violate my covenant,

16. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

16. then I will do this to you: I will bring upon you sudden terror, wasting diseases and fever that will destroy your sight and drain away your life. You will plant seed in vain, because your enemies will eat it.

17. నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

17. I will set my face against you so that you will be defeated by your enemies; those who hate you will rule over you, and you will flee even when no one is pursuing you.

18. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

18. ''If after all this you will not listen to me, I will punish you for your sins seven times over.

19. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

19. I will break down your stubborn pride and make the sky above you like iron and the ground beneath you like bronze.

20. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫలమియ్యకుండును.

20. Your strength will be spent in vain, because your soil will not yield its crops, nor will the trees of the land yield their fruit.

21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.
ప్రకటన గ్రంథం 15:1-6-8, ప్రకటన గ్రంథం 21:9

21. ''If you remain hostile toward me and refuse to listen to me, I will multiply your afflictions seven times over, as your sins deserve.

22. మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

22. I will send wild animals against you, and they will rob you of your children, destroy your cattle and make you so few in number that your roads will be deserted.

23. శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

23. ''If in spite of these things you do not accept my correction but continue to be hostile toward me,

24. నేనుకూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.

24. I myself will be hostile toward you and will afflict you for your sins seven times over.

25. మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.

25. And I will bring the sword upon you to avenge the breaking of the covenant. When you withdraw into your cities, I will send a plague among you, and you will be given into enemy hands.

26. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

26. When I cut off your supply of bread, ten women will be able to bake your bread in one oven, and they will dole out the bread by weight. You will eat, but you will not be satisfied.

27. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల

27. ''If in spite of this you still do not listen to me but continue to be hostile toward me,

28. నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.

28. then in my anger I will be hostile toward you, and I myself will punish you for your sins seven times over.

29. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

29. You will eat the flesh of your sons and the flesh of your daughters.

30. నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

30. I will destroy your high places, cut down your incense altars and pile your dead bodies on the lifeless forms of your idols, and I will abhor you.

31. నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.

31. I will turn your cities into ruins and lay waste your sanctuaries, and I will take no delight in the pleasing aroma of your offerings.

32. నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

32. I will lay waste the land, so that your enemies who live there will be appalled.

33. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.

33. I will scatter you among the nations and will draw out my sword and pursue you. Your land will be laid waste, and your cities will lie in ruins.

34. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.

34. Then the land will enjoy its sabbath years all the time that it lies desolate and you are in the country of your enemies; then the land will rest and enjoy its sabbaths.

35. అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.

35. All the time that it lies desolate, the land will have the rest it did not have during the sabbaths you lived in it.

36. మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

36. ''As for those of you who are left, I will make their hearts so fearful in the lands of their enemies that the sound of a windblown leaf will put them to flight. They will run as though fleeing from the sword, and they will fall, even though no one is pursuing them.

37. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేక పోయెదరు.

37. They will stumble over one another as though fleeing from the sword, even though no one is pursuing them. So you will not be able to stand before your enemies.

38. మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.

38. You will perish among the nations; the land of your enemies will devour you.

39. మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

39. Those of you who are left will waste away in the lands of their enemies because of their sins; also because of their fathers' sins they will waste away.

40. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

40. ''But if they will confess their sins and the sins of their fathers-- their treachery against me and their hostility toward me,

41. నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,
అపో. కార్యములు 7:51

41. which made me hostile toward them so that I sent them into the land of their enemies-- then when their uncircumcised hearts are humbled and they pay for their sin,

42. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.
లూకా 1:72-73

42. I will remember my covenant with Jacob and my covenant with Isaac and my covenant with Abraham, and I will remember the land.

43. వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు.

43. For the land will be deserted by them and will enjoy its sabbaths while it lies desolate without them. They will pay for their sins because they rejected my laws and abhorred my decrees.

44. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

44. Yet in spite of this, when they are in the land of their enemies, I will not reject them or abhor them so as to destroy them completely, breaking my covenant with them. I am the LORD their God.

45. నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

45. But for their sake I will remember the covenant with their ancestors whom I brought out of Egypt in the sight of the nations to be their God. I am the LORD.''

46. యెహోవా మోషే ద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

46. These are the decrees, the laws and the regulations that the LORD established on Mount Sinai between himself and the Israelites through Moses.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఆజ్ఞలను పాటిస్తూ వాగ్దానాలు. (1-13) 
ఈ భాగం మోషే ఇచ్చిన అన్ని నియమాలను అనుసరించడం గురించి మాట్లాడుతుంది. ప్రజలు నిబంధనలు పాటిస్తే వారికి ప్రతిఫలం లభిస్తుంది. కానీ వారు పాటించకపోతే, వారు శిక్షించబడతారు. ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ, విశ్రాంతి దినాలు తీసుకుంటూ, పవిత్ర స్థలాన్ని ఆరాధనకు ఉపయోగిస్తుంటే, దేవుడు వారికి మంచి వస్తువులను ఇస్తాడు మరియు మతపరమైన విషయాలలో వారికి సహాయం చేస్తాడు. ఈ వాగ్దానాలు ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే దేవుడు తనను అనుసరించే ప్రజలకు మంచివాటిని ఇస్తాడని అవి చూపిస్తున్నాయి. యేసు తనను విశ్వసించే ప్రజలకు మంచివాటిని ఎలా ఇస్తాడో అలాగే ఇది కూడా. 1. భూమిపై చాలా రుచికరమైన పండ్లు పెరుగుతాయి. మనం వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి మరియు అవి దేవుని నుండి వచ్చినవని గుర్తుంచుకోవాలి. అతను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను మనకు ఈ బహుమతులు ఇస్తాడు. 2. మనం దేవునిచే రక్షించబడినప్పుడు, మనం శాంతి మరియు భద్రతతో జీవించగలము. 3. ప్రజలు యుద్ధాలలో గెలుపొందినప్పుడు, వారికి చాలా మంది సైనికులు ఉన్నా లేదా కొద్దిమంది మాత్రమే ఉన్నా దేవుడు వారికి సహాయం చేశాడు. 4. సువార్తను విశ్వసించే వ్యక్తుల సమూహం పెరుగుతుంది మరియు చాలా మంది పిల్లలను కలిగి ఉంటుంది. 5. దేవుని దయ మనకు అన్ని మంచి వస్తువులను అందించే మాయా ఫౌంటెన్ లాంటిది. 6. దేవుడు తన ప్రత్యేక నియమాలు మరియు సంప్రదాయాల ద్వారా మనతో ఉన్నాడని మనకు చూపిస్తాడు. ఎల్లప్పుడూ అనుసరించడం మరియు వాటిని మనకు దగ్గరగా ఉంచుకోవడం ముఖ్యం. 7. దేవుడు మనతో ఉంటాడని మరియు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటానని వాగ్దానం చేసాడు మరియు మేము అతనిని అనుసరిస్తామని వాగ్దానం చేసాము. ఈ వాగ్దానం నిజంగా ప్రత్యేకమైనది మరియు మేము చాలా మంచి విషయాలను పొందుతామని అర్థం. ఇది మీరు మీ స్నేహితుడితో ఒప్పందం చేసుకున్నప్పుడు మరియు మీరిద్దరూ ఒకరికొకరు మంచిగా ఏదైనా చేయడానికి అంగీకరించినప్పుడు. దేవుడు తన ప్రేమతో మనలను కొన్నాడు మరియు మనం అతనితో ఉన్నంత కాలం మనతో ఉంటాడు. 

అవిధేయతకు వ్యతిరేకంగా బెదిరింపులు. (14-39) 
దేవుడు ప్రజలకు ఎంపిక ఇచ్చాడు. అతను కోరినది చేస్తే, వారు సంతోషంగా ఉంటారు. కానీ వారు వినకపోతే, చెడు విషయాలు జరుగుతాయి మరియు వారు సంతోషంగా ఉంటారు. ఈ చెడు విషయానికి కారణమయ్యే రెండు అంశాలు ఉన్నాయి. 1. ఎవరైనా దేవుని నియమాలను వినకపోతే, వారు దేవుణ్ణి విశ్వసించడం పూర్తిగా మానేయవచ్చు. 2. ఎవరైనా దేవుని దిద్దుబాట్లను వినకపోతే మరియు ఆయనకు అవిధేయత చూపుతూ ఉంటే, అది దేవునికి సంతోషాన్ని కలిగించదు. ప్రజల జీవితాల్లో సమస్యలు రావడానికి ఇదే కారణం. ప్రపంచం మొత్తం కూడా వారికి వ్యతిరేకంగా తిరగవచ్చు. వారు వినకపోతే చెడు విషయాలు జరుగుతాయని దేవుడు వారిని హెచ్చరించాడు మరియు ఈ అంచనాలు నిజమయ్యాయి. ప్రజలు తప్పుడు పనులు చేయడం మానుకోకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు ఇష్టపడే వస్తువులను కోల్పోవచ్చు మరియు వారు ఇకపై దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండరు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మరియు అది తప్పు అని తెలిస్తే, వారు ఎల్లప్పుడూ భయపడి మరియు నేరాన్ని అనుభవిస్తారు. చెడ్డపనులు చేస్తే ఫర్వాలేదు అనుకునేవారు క్షమించబడడం పట్ల నిస్సహాయంగా భావించడం దేవుడికి న్యాయం. కానీ మనం పుట్టిన లేదా చేసిన చెడు పనుల వల్ల మనం బాధపడకుండా ఉంటే, అది దేవుని దయ వల్లనే. 

పశ్చాత్తాపపడే వారిని గుర్తుంచుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. (40-46)
గతంలో, ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు బాగా చేసారు మరియు కొన్నిసార్లు చేయలేదు, కానీ మొత్తం సమూహం మంచిగా ఉన్నప్పుడు, వారికి మంచి జరిగింది, మరియు వారు చెడ్డగా ఉన్నప్పుడు, వారికి చెడు జరిగింది. ఇశ్రాయేలు దేవునితో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కలిగి ఉంది. దేశం మొత్తం చెడ్డది అయినప్పుడు, అది దేశం పతనానికి దారి తీస్తుంది. పాపం మంచిది కాదు మరియు దేశాన్ని నాశనం చేస్తుంది. మన తప్పులకు చింతిస్తూ చెడు పరిణామాలను నివారించడానికి ప్రయత్నించాలి. మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉంచే విషయాలపై మనం దృష్టి పెట్టాలి. 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |