Leviticus - లేవీయకాండము 27 | View All
Study Bible (Beta)

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. And Jehovah speaketh unto Moses, saying,

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను.

2. 'Speak unto the sons of Israel, and thou hast said unto them, When a man maketh a wonderful vow, by thy valuation the persons [are] Jehovah's.

3. నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.

3. When thy valuation hath been of the male from a son of twenty years even unto a son of sixty years, then hath been thy valuation fifty shekels of silver by the shekel of the sanctuary.

4. ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.

4. And if it [is] a female -- then hath thy valuation been thirty shekels;

5. అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

5. and if from a son of five years even unto a son of twenty years -- then hath thy valuation been of the male twenty shekels, and for the female, ten shekels;

6. ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.

6. and if from a son of a month even unto a son of five years -- then hath thy valuation been of the male five shekels of silver, and for the female thy valuation [is] three shekels of silver;

7. అరువది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.

7. and if from a son of sixty years and above -- if a male, then hath thy valuation been fifteen shekels, and for a female, ten shekels.

8. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

8. 'And if he is poorer than thy valuation, then he hath presented himself before the priest, and the priest hath valued him; according to that which the hand of him who is vowing doth reach doth the priest value him.

9. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను.

9. 'And if [it is] a beast of which they bring near an offering to Jehovah, all that [one] giveth of it to Jehovah is holy;

10. అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును.

10. he doth not change it nor exchange it, a good for a bad, or a bad for a good; and if he really change beast for beast, -- then it hath been -- it and its exchange is holy.

11. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.

11. 'And if [it is] any unclean beast of which they do not bring near an offering to Jehovah, then he hath presented the beast before the priest,

12. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.

12. and the priest hath valued it; whether good or bad, according to thy valuation, O priest, so it is;

13. అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.

13. and if he really redeem it, then he hath added its fifth to thy valuation.

14. ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డ దైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.

14. 'And when a man sanctifieth his house, a holy thing to Jehovah, then hath the priest valued it, whether good or bad; as the priest doth value it so it standeth;

15. తన యిల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.

15. and if he who is sanctifying doth redeem his house, then he hath added a fifth of the money of thy valuation to it, and it hath become his.

16. ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహో వాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.

16. 'And if of the field of his possession a man sanctify to Jehovah, then hath thy valuation been according to its seed; a homer of barley-seed at fifty shekels of silver;

17. అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి ష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.

17. if from the year of the jubilee he sanctify his field, according to thy valuation it standeth;

18. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠిం చినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.

18. and if after the jubilee he sanctify his field, then hath the priest reckoned to him the money according to the years which are left, unto the year of the jubilee, and it hath been abated from thy valuation.

19. పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.

19. 'And if he really redeem the field -- he who is sanctifying it -- then he hath added a fifth of the money of thy valuation to it, and it hath been established to him;

20. అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.

20. and if he do not redeem the field, or if he hath sold the field to another man, it is not redeemed any more;

21. ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.

21. and the field hath been, in its going out in the jubilee, holy to Jehovah as a field which is devoted; to the priest is its possession.

22. ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల

22. 'And if the field of his purchase (which [is] not of the fields of his possession) [one] sanctify to Jehovah --

23. యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.

23. then hath the priest reckoned to him the amount of thy valuation unto the year of jubilee, and he hath given thy valuation in that day -- a holy thing to Jehovah;

24. సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.

24. in the year of the jubilee the field returneth to him from whom he bought it, to him whose [is] the possession of the land.

25. నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.

25. And all thy valuation is by the shekel of the sanctuary: twenty gerahs is the shekel.

26. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.

26. 'Only, a firstling which is Jehovah's firstling among beasts -- no man doth sanctify it, whether ox or sheep; it [is] Jehovah's.

27. అది అపవిత్రజంతువైనయెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.

27. And if among the unclean beasts, then he hath ransomed [it] at thy valuation, and he hath added its fifth to it; and if it is not redeemed, then it hath been sold at thy valuation.

28. అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతి ష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.

28. 'Only, no devoted thing which a man devoteth to Jehovah, of all that he hath, of man, and beast, and of the field of his possession, is sold or redeemed; every devoted thing is most holy to Jehovah.

29. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను.

29. 'No devoted thing, which is devoted of man, is ransomed, it is surely put to death.

30. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
మత్తయి 23:23, లూకా 11:42

30. And all tithe of the land, of the seed of the land, of the fruit of the tree, is Jehovah's -- holy to Jehovah.

31. ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను.

31. 'And if a man really redeem [any] of his tithe, its fifth he addeth to it.

32. గోవులలోనేగాని గొఱ్ఱె మేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.

32. 'And all the tithe of the herd and of the flock -- all that passeth by under the rod -- the tenth is holy to Jehovah;

33. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము.

33. he enquireth not between good and bad, nor doth he change it; and if he really change it -- then it hath been -- it and its exchange is holy; it is not redeemed.'

34. ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

34. These [are] the commands which Jehovah hath commanded Moses for the sons of Israel, in mount Sinai.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
వ్యక్తులు మరియు జంతువుల ప్రమాణాలకు సంబంధించిన చట్టం. (1-13) 
చాలా కాలం క్రితం, కొందరు వ్యక్తులు దేవుని సేవ చేయడంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు మరియు తమను లేదా తమ పిల్లలను ఎప్పటికీ దేవుని మందిరంలో పని చేయడానికి అంకితం చేయాలని కోరుకున్నారు. ఈ వ్యక్తులలో కొందరు సహాయకులు కావచ్చు, కానీ వారిలో ఎక్కువ మందిని కొంత ధరకు తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేవుణ్ణి సేవించాలనే బలమైన కోరిక కలిగి ఉండటం చాలా గొప్ప విషయం, అయితే ఏదైనా వాగ్దానాలు లేదా కట్టుబాట్లు చేసే ముందు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం జాగ్రత్తగా ఉండకపోతే, మన వాగ్దానాలను ఉల్లంఘించి, మనకు మరియు దేవునికి సమస్యలను కలిగించవచ్చు. 

ఇళ్లు మరియు భూమికి సంబంధించిన ప్రమాణాలు. (14-25) 
మన ఇళ్లు, వస్తువులు, జంతువులు ఇలా మనకున్న ప్రతిదాన్ని దేవుడిని సంతోషపెట్టే విధంగా ఉపయోగించాలి. దేవుని చర్చికి సహాయం చేయడానికి మరియు అతని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మనకు ఉన్న వాటిలో కొంత ఇవ్వడం సరైంది, కానీ మన స్వంత కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోయేలా చేయడంపై మనం దృష్టి పెట్టకూడదు. అది దేవునికి కూడా సంతోషాన్ని కలిగించదు.

విమోచించకూడని అంకితమైన విషయాలు. (26-33) 
ఏదైనా లేదా ఎవరైనా దేవునికి అంకితమైనప్పుడు, అది ఆయనకు చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనది. దానిని మరేదైనా ఉపయోగించలేరు లేదా తీసివేయలేరు. ప్రజలు దేవునికి గౌరవం చూపించడానికి తమకు ఉన్న దానిలో పదవ వంతు ఇస్తారు మరియు ఆయన అందించిన దానికి ధన్యవాదాలు. తమ భూమి, తాము పండించే ఆహారంతో సహా అన్నింటికీ దేవుడే యజమాని అని వారు గుర్తించారు. వారు ఆయనపై ఆధారపడి ఉన్నారు మరియు తమ వద్ద ఉన్నదానితో గౌరవం మరియు కృతజ్ఞతలు చూపడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని కొనసాగించాలని కోరుకున్నారు. మనకున్న దానితో మనం కూడా దేవునికి గౌరవం చూపించాలి. 

ముగింపు. (34)
ఇందులోని కొన్ని నియమాలు ప్రతిఒక్కరూ ఎల్లవేళలా పాటించడం ఎలా ముఖ్యమో పుస్తకం చివరి భాగం చెబుతుంది, అయితే కొన్ని కేవలం ఒక వర్గానికి మాత్రమే. కొన్ని నియమాలు కేవలం ఒక సమూహానికి మాత్రమే అయినప్పటికీ, అవి మన జీవితాలను ఎలా మంచి మార్గంలో జీవించాలనే దాని గురించి ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి. మరియు ఈ నియమాలు బైబిల్ యొక్క సువార్త ఇప్పుడు మరియు చాలా కాలం క్రితం అందరికీ ఎలా వర్తిస్తుందో కూడా మనకు చూపుతుంది. హెబ్రీయులకు 4:2 మధ్యస్థుడైన యేసు ద్వారా దేవునితో స్నేహం చేయడానికి మార్గం, వస్తువులను అర్పణలుగా కాల్చడం గురించి కాదు, యేసును మరియు అతను మన కోసం ఏమి చేసాడో అర్థం చేసుకోవడం మరియు విశ్వసించడం ద్వారా. మన హృదయాలతో మరియు సత్యంతో యేసు ద్వారా దేవుణ్ణి ఆరాధించమని చెప్పే సువార్త బోధనలను మేము అనుసరిస్తాము. కానీ మనం నిర్దిష్టమైన వేడుకలు చేయనవసరం లేదు లేదా వస్తువులను సమర్పించాల్సిన అవసరం లేదు కాబట్టి, దేవుడిని గౌరవించడానికి మనం సమయాన్ని మరియు కృషిని తీసుకోకూడదని కాదు. యేసు వల్ల మనం నమ్మకంగా మరియు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |