Leviticus - లేవీయకాండము 7 | View All
Study Bible (Beta)

1. అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా

1. This is the lawe of the trespaceofferynge which is most holy.

2. దహనబలి పశువులను వధించుచోట అపరాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

2. In the place where the burntoffrynge is kylled, the trespaceoffrynge shalbe kylled also: ad his bloude shalbe sprikled rounde aboute apon the alter.

3. దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును

3. And all the fatt thereof shalbe offered: the rompe and the fatt that couered the inwardes,

4. రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను.

4. and the .ij. kydneyes with the fatt that lyeth on them and apon the loynes: and the kall on the lyuer shalbe taken awaye with the kydneyes,

5. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;

5. And the preast shall burne them apon the altare, to be an offerynge vnto the Lorde: this is a trespaceofferynge.

6. అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
1 కోరింథీయులకు 10:18

6. All the males amonge the preastes shal eate thereof in the holy place, for it is most holy.

7. పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకునిదగును.

7. As the synneofferynge is, so is the trespaceofferynge, one lawe serueth for both: and it shall be the preastes that reconcyleth therewith.

8. ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.

8. And the preast that offered a mans burntofferynge, shall haue the skyn of the burntofferynge which he hath offered.

9. పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.

9. And all the meatofferynges that are baken in the ouen, ad all that is dressed apon the gredyerne ad in the fryenge pan, shalbe the preastes that offereth them.

10. అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.

10. And all the meatofferynges that are myngled with oyle or drye, shall pertayne vnto all the sonnes of Aaron, and one shall haue as moche as another.

11. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా

11. This is the lawe of the peaceoffringes whiche shalbe offered vnto the Lorde.

12. వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
హెబ్రీయులకు 13:15

12. Yf he offer to geue thanckes, he shall brynge vnto his thanckofferynge: swete cakes myngled with oyle and swete wafers anoynted with oyle, and cakes myngled with oyle of fine floure fryed,

13. ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.

13. ad he shall brynge his offerynge apon cakes made of leuended bred vnto the thanckoffrynge of his peaceofferynges,

14. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.

14. ad of them all he shall offer one to be an heueoffrynge vnto the Lorde, ad it shalbe the preastes that sprynkleth the bloude of the peaceofferynges.

15. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
1 కోరింథీయులకు 10:18

15. And the fleshe of the thankofferynge of his peaceofferynges shalbe eaten the same daye that it is offred, and there shall none of it be layde vpp vntyll the mornynge.

16. అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.

16. Yf it be a vowe or a fre willofferynge that he bryngeth, the same daye that he offereth it, it shalbe eaten, and that which remayneth may be eaten on the morowe:

17. మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చి వేయవలెను.

17. but as moche of the offered flesh as remaneth vnto the thirde daye shalbe burned with fire.

18. ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.

18. For yf any of the flesh of the peaceoffrynges be eaten the thirde daye then shall he that offered it optayne no fauour, nether shall it be rekened vnto him: but shalbe an abhomynacion, and the soule that eateth of it shall beare the synne thereof.

19. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని

19. The flesh that twycheth any vnclene thinge shall not be eaten. but burnt with fire: and all that be clene in their flesh, maye eate flesh.

20. ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహోవాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

20. Yf any soule eate of the flesh of the peaceofferynges, that pertayne vnto the Lorde and hys vnclennesse yet apon him, the same soule shall perisshe from amonge his peoole.

21. ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్రమైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంసమును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

21. Moreouer yf a soule twych any vnclene thinge, whether it be the vnclennesse of man or of any vnclene beest or any abhominacion that is vnclene: ad the eate of the flesh of the peaceoffrynges whiche pertayne vnto the Lord, that soule shall perissh from his people.

22. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

22. And the Lorde spake vnto Moses saynge:

23. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎద్దుదేగాని గొఱ్ఱెదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.

23. speake vnto the childern of Israel ad saye. Ye shall eate no maner fatt of oxen, shepe or gootes:

24. చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు.

24. neuerthelater the fatt of the beest that dyeth alone ad the fatt of that which is torne with wilde beestes, maye be occupide in all maner vses: but ye shal in no wise eate of it.

25. ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

25. For whosoeuer eateth the fatt of the beest of which me bring an offring vnto the Lorde, that soule that eateth it shall perissh fro his people.

26. మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.

26. Moreouer ye shall eate no maner of bloud, wheresoeuer ye dwell, whether it be of foule or of beest.

27. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

27. What soeuer soule it be that eateth any maner of bloude the same soule shal perisshe fro his people.

28. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

28. And the Lorde talked with Moses sayenge:

29. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు యెహోవాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను.

29. speake vnto the childre of Israel ad saye He that offereth his peaceofferynge vnto the Lord, shall bringe his gifte vnto the Lord of his peaceoffrynges:

30. అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.

30. his owne handes shal bringe the offrynge of the Lorde: eue the fatt apo the brest he shall bringe with the brest to waue it a waueoffrynge before the Lorde.

31. యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.

31. And the preast shall burne the fatt apon the alter, ad the brest shalbe Aaros ad his sonnes.

32. సమాధాన బలిపశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను.

32. And the right shulder they shall geue vnto the preast, to be an heueoffrynge, of their peaceoffringes.

33. అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.

33. And the same that offreth the bloud of the peaceoffringes ad the fatt, amog the sones of Aaro, shall haue the right shulder vnto his parte,

34. ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.

34. for the wauebrest ad the heueshulder I haue take of the childern of Israel, euen of their peaceoffringes, ad haue geue it vnto Aaro the prest and vnto his sonnes: to be a dutie for euer of the childern of Israel.

35. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య ములలోనుండినది అభిషేక మునుబట్టి అహరోనుకును అభి షేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.

35. This is the anoyntinge of Aaron ad of the sacryfices of the Lorde, in the daye when they were offered to be preastes vnto the Lorde,

36. వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను.

36. whiche the Lorde commaunded to be geuen them in the daye when he anoynted them, of the childern of Israel, and to be a dutie for euer amonge their generacions.

37. ఇది దహనబలిని గూర్చియు అపరాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహారార్థబలినిగూర్చియు అపరాధ పరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి.

37. This is the lawe of burntoffrynges, of meatoffrynges, of synneoffrynges, of trespaceoffrynges, of fulloffrynges, of peaceoffrynges,

38. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.

38. which the Lorde commaunded Moses in the mount of Sinai, in the daye when he commaunded the childern of Israel to offer their offrynges vnto the Lorde in the wildernesse of Sinai.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
అపరాధ అర్పణ గురించి. (1-10) 
ప్రజలు ఏదైనా తప్పు చేసినప్పుడు, క్షమించమని దేవునికి ప్రత్యేక బహుమతి ఇస్తారు. కొన్నిసార్లు వారు బహుమతిలో కొంత భాగాన్ని పూజారికి మరియు కొంత భాగాన్ని దేవునికి ఇచ్చేవారు. వారు బాధపడతారు మరియు ఈ సమయంలో జరుపుకోరు. ఇతర సమయాల్లో, వారు సంతోషంగా ఉన్నారని మరియు దేవుని క్షమించినందుకు కృతజ్ఞతతో ఉన్నారని చూపించడానికి వారు బహుమతిని ఇస్తారు. 

శాంతి సమర్పణకు సంబంధించినది. (11-27) 
ప్రజలు తప్పు చేసినందుకు చింతిస్తున్నారని దేవునికి చూపించాలనుకున్నప్పుడు, విషయాలను సరిదిద్దడానికి వారు బలిని తీసుకురావాలి. కానీ ఏదైనా మంచి జరిగినందుకు తాము కృతజ్ఞతతో ఉన్నామని దేవునికి చూపించాలనుకున్నప్పుడు, బహుమతిగా ఏమి తీసుకురావాలో వారు ఎంచుకోవచ్చు. ఇది వారి బహుమతులను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి వారికి ఇందులో స్వేచ్ఛ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయినప్పటికీ, వారు త్యాగం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని దేవుడు ఇంకా కోరుకున్నాడు, కాబట్టి వారు తమ పాపాలను భర్తీ చేయడానికి ఒక నిర్దిష్ట బలిని తీసుకురావాలని వారికి తెలుసునని ఆయన నిర్ధారించాడు. రక్తం తినడానికి అనుమతించబడకపోవడానికి కారణం, పాపాలను భర్తీ చేయడానికి దేవుడు దానిని బలి కోసం పక్కన పెట్టాడు. త్యాగాలను ఉపయోగించే ఈ పద్ధతి ఒక చిహ్నంగా ఉంది మరియు యేసు సిలువపై మరణించి, అన్ని పాపాలను భర్తీ చేయడానికి తన రక్తాన్ని చిందించినప్పుడు ఇది ముగిసింది. కాబట్టి, త్యాగం గురించి పాత చట్టాలు ఇకపై విశ్వాసులకు అవసరం లేదు. 

వేవ్ మరియు హీవ్ అర్పణలు. (28-34) 
ఎవరైనా దేవునికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, వారు దానిని సంతోషంగా మరియు వారి స్వంత చేతులతో చేయాలి. దాన్ని పైకి లేపి అటూ ఇటూ ఊపుతూ దేవుణ్ణి నమ్ముతామని చూపిస్తారు. మనకు శాంతిని కలిగించే యేసును మనం జరుపుకునేటప్పుడు మరియు ఆనందిస్తున్నప్పుడు మనం దీనిని గుర్తుంచుకోవాలి. శాంతి సమర్పణ అనేది పూజారులు మరియు సాధువుల వంటి ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే కాకుండా ఎవరైనా కలిగి ఉండే ప్రత్యేక విషయం. క్షమించమని అడగడానికి మరియు దేవుని వైపు తిరిగి రావడానికి ఎక్కువసేపు వేచి ఉండకపోవడమే ముఖ్యం. కొందరు వ్యక్తులు చనిపోయే వరకు వేచి ఉండవచ్చని అనుకుంటారు, కానీ అది మంచి ఆలోచన కాదు. శాంతి ప్రసాదం తినడానికి చాలాసేపు వేచి ఉన్నట్లే - మీరు ఎక్కువసేపు వేచి ఉంటే, అది లెక్కించబడదు. క్షమాపణ అడగడం మరియు ఆలస్యం కాకముందే ఇప్పుడు దేవుని వైపు తిరగడం మంచిది. 

ఈ సంస్థల ముగింపు. (35-38)
మనం మతపరమైన ఆరాధనను తీవ్రంగా పరిగణించాలి మరియు అది ముఖ్యమైనది కాబట్టి దానిని దాటవేయకూడదు. మోషే నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో యేసు నియమాలను పాటించడం కూడా అంతే ముఖ్యం.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |