Leviticus - లేవీయకాండము 8 | View All

1. Then the LORD spoke to Moses:

2. నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాప పరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని

2. 'Take Aaron and his sons with him, and the garments, the anointing oil, the sin offering bull, the two rams, and the basket of unleavened bread,

3. ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమ కూర్చుమనగా

3. and assemble the whole congregation at the entrance of the Meeting Tent.'

4. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా

4. So Moses did just as the LORD commanded him, and the congregation assembled at the entrance of the Meeting Tent.

5. మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను.

5. Then Moses said to the congregation: 'This is what the LORD has commanded to be done.'

6. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను.

6. So Moses brought Aaron and his sons forward and washed them with water.

7. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదునువేసి ఏఫోదుయొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి

7. Then he put the tunic on Aaron, wrapped the sash around him, and clothed him with the robe. Next he put the ephod on him and placed on him the decorated band of the ephod, and fastened the ephod closely to him with the band.

8. ఆ పతకములో ఊరీము తుమీ్మమను వాటిని ఉంచి

8. He then set the breastpiece on him and put the Urim and Thummim into the breastpiece.

9. అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

9. Finally, he set the turban on his head and attached the gold plate, the holy diadem, to the front of the turban just as the LORD had commanded Moses.

10. మరియమోషే అభిషేకతైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను.

10. Then Moses took the anointing oil and anointed the tabernacle and everything in it, and so consecrated them.

11. అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠముమీద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను.

11. Next he sprinkled some of it on the altar seven times and so anointed the altar, all its vessels, and the wash basin and its stand to consecrate them.

12. మరియు అతడు అభిషేకతైలములో కొంచెము అహరోను తలమీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను.

12. He then poured some of the anointing oil on the head of Aaron and anointed him to consecrate him.

13. అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసి కొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.

13. Moses also brought forward Aaron's sons, clothed them with tunics, wrapped sashes around them, and wrapped headbands on them just as the LORD had commanded Moses.

14. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి.

14. Then he brought near the sin offering bull and Aaron and his sons laid their hands on the head of the sin offering bull,

15. దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దానిప్రతిష్ఠించెను.
హెబ్రీయులకు 9:21

15. and he slaughtered it. Moses then took the blood and put it all around on the horns of the altar with his finger and decontaminated the altar, and he poured out the rest of the blood at the base of the altar and so consecrated it to make atonement on it.

16. మోషే ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠముమీద దహించెను.

16. Then he took all the fat on the entrails, the protruding lobe of the liver, and the two kidneys and their fat, and Moses offered it all up in smoke on the altar,

17. మరియయెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.

17. but the rest of the bull its hide, its flesh, and its dung he completely burned up outside the camp just as the LORD had commanded Moses.

18. తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి.

18. Then he presented the burnt offering ram and Aaron and his sons laid their hands on the head of the ram,

19. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను.
హెబ్రీయులకు 9:21

19. and he slaughtered it. Moses then splashed the blood against the altar's sides.

20. అతడు ఆ పొట్టేలుయొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను.

20. Then he cut the ram into parts, and Moses offered the head, the parts, and the suet up in smoke,

21. అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి, ఆ పొట్టేలంతయు బలిపీఠముమీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది యింపైన సువాసనగల దహనబలి ఆయెను. అది యెహోవాకు హోమము.

21. but the entrails and the legs he washed with water, and Moses offered the whole ram up in smoke on the altar it was a burnt offering for a soothing aroma, a gift to the LORD, just as the LORD had commanded Moses.

22. అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొనిరాగా అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి.

22. Then he presented the second ram, the ram of ordination, and Aaron and his sons laid their hands on the head of the ram

23. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను.

23. and he slaughtered it. Moses then took some of its blood and put it on Aaron's right earlobe, on the thumb of his right hand, and on the big toe of his right foot.

24. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి, వారి కుడిచెవుల కొనల మీదను వారి కుడిచేతుల బొట్టనవ్రేలిమీదను వారి కుడి కాళ్ల బొట్టనవ్రేలిమీదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియమోషే బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షించెను

24. Next he brought Aaron's sons forward, and Moses put some of the blood on their right earlobes, on their right thumbs, and on the big toes of their right feet, and Moses splashed the rest of the blood against the altar's sides.

25. తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి

25. Then he took the fat (the fatty tail, all the fat on the entrails, the protruding lobe of the liver, and the two kidneys and their fat) and the right thigh,

26. యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలోనుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి, ఆ క్రొవ్వుమీదను ఆ కుడి జబ్బమీదను వాటిని ఉంచి

26. and from the basket of unleavened bread that was before the LORD he took one unleavened loaf, one loaf of bread mixed with olive oil, and one wafer, and placed them on the fat parts and on the right thigh.

27. అహరోను చేతులమీదను అతని కుమారుల చేతులమీదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను.

27. He then put all of them on the palms of Aaron and his sons, who waved them as a wave offering before the LORD.

28. అప్పుడు మోషే వారి చేతులమీదనుండి వాటిని తీసి బలిపీఠముమీద నున్న దహనబలి ద్రవ్యముమీద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు.

28. Moses then took them from their palms and offered them up in smoke on the altar on top of the burnt offering they were an ordination offering for a soothing aroma; it was a gift to the LORD.

29. అది యెహోవాకు హోమము. మరియమోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.

29. Finally, Moses took the breast and waved it as a wave offering before the LORD from the ram of ordination. It was Moses' share just as the LORD had commanded Moses.

30. మరియమోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠముమీది రక్తములో కొంతయు తీసి, అహరోనుమీదను అతని వస్త్రములమీదను అతని కుమారులమీదను అతని కుమారుల వస్త్రములమీదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను.

30. Then Moses took some of the anointing oil and some of the blood which was on the altar and sprinkled it on Aaron and his garments, and on his sons and his sons' garments with him. So he consecrated Aaron, his garments, and his sons and his sons' garments with him.

31. అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారుల తోను ఇట్లనెను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారు లును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠితద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను.

31. Then Moses said to Aaron and his sons, 'Boil the meat at the entrance of the Meeting Tent, and there you are to eat it and the bread which is in the ordination offering basket, just as I have commanded, saying, 'Aaron and his sons are to eat it,'

32. ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను.

32. but the remainder of the meat and the bread you must burn with fire.

33. మీ ప్రతిష్ఠదినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును.

33. And you must not go out from the entrance of the Meeting Tent for seven days, until the day when your days of ordination are completed, because you must be ordained over a seven-day period.

34. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను.

34. What has been done on this day the LORD has commanded to be done to make atonement for you.

35. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.

35. You must reside at the entrance of the Meeting Tent day and night for seven days and keep the charge of the LORD so that you will not die, for this is what I have been commanded.'

36. యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.

36. So Aaron and his sons did all the things the LORD had commanded through Moses.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
అహరోను మరియు అతని కుమారుల పవిత్రీకరణ. (1-13) 
అహరోను మరియు అతని కుమారులు పూజించే ప్రత్యేక స్థలం సిద్ధమయ్యే వరకు యాజకులు కాలేరు మరియు వారు బలులు ఎలా చేయాలో నేర్చుకుంటారు. వారు పూజారులుగా మారడానికి ముందు, వారు ఎల్లప్పుడూ మంచిగా మరియు స్వచ్ఛంగా ఉండటానికి ప్రయత్నించాలని చూపించడానికి వారిని నీటితో శుభ్రం చేయాలి. యేసు ప్రజలను వారి పాపాలనుండి కూడా శుభ్రపరుస్తాడు మరియు వారిని ప్రత్యేక పూజారులుగా మరియు నాయకులను చేస్తాడు. హెబ్రీయులకు 10:22 అహరోను అభిషేకించబడినప్పుడు, యేసు కూడా పరిశుద్ధాత్మతో ఎలా అభిషేకించబడతాడో దానికి సంకేతం. ఈ అభిషేకం యేసుకు చాలా ప్రత్యేకమైనది మరియు ప్రత్యేకమైనది. అయితే యేసును విశ్వసించే మనందరికీ ప్రత్యేక అభిషేకం కూడా ఉంది. 

సమర్పణ సమర్పణలు. (14-36)
ఈ వాక్యభాగం యేసు గురించి మాట్లాడుతోంది, ఆయనను విశ్వసించే ప్రజలకు ప్రత్యేక నాయకుని వంటివాడు. అతను ఈ ఉద్యోగం చేయడానికి ఎంపిక చేయబడ్డాడు మరియు అతను నిజంగా ముఖ్యమైనవాడు. మన ప్రార్థనలు మరియు మతపరమైన ఆచారాలను మంచిగా మరియు అర్థవంతంగా చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. మనం కొన్నిసార్లు చెడ్డపనులు చేసినప్పటికీ, యేసు కారణంగా దేవుడు మన ఆరాధనను అంగీకరిస్తాడు. యేసు దయగలవాడని, కష్టాల్లో ఉన్నవారి పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని తెలుసుకుని మనం సంతోషించవచ్చు. నిజమైన క్రైస్తవులందరూ ఆధ్యాత్మిక ప్రపంచంలో పూజారులుగా ఉండేందుకు దేవుడు ఎన్నుకున్నారు. యేసు ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే మంచి పనులు చేయడం ద్వారా మనం ఈ ప్రమాణానికి అనుగుణంగా జీవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం మంచి పని చేస్తున్నా, దాని గురించి గొప్పగా చెప్పుకోకూడదు. బదులుగా, మనం కూడా తప్పులు చేస్తాం మరియు దేవుని సహాయం అవసరమని గుర్తుంచుకోవాలి. తప్పులు చేసే ఇతర వ్యక్తుల పట్ల కూడా మనం దయ చూపాలి మరియు వారి సహాయం కోసం ప్రార్థించాలి. 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |