Zechariah - జెకర్యా 8 | View All
Study Bible (Beta)

1. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

2. సైన్య ములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను.

“సేనల ప్రభువు...చెప్పేదేమంటే”– ఈ మాటలు ఈ అధ్యాయంలో పది సార్లు కనిపిస్తాయి. వీటితో పాటు ఇస్రాయేల్‌కు పది ఆశీస్సులను గురించిన వాగ్దానాలు ఉన్నాయి. “అత్యాసక్తి”– జెకర్యా 1:14.

3. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును.

“జెరుసలం”– జెకర్యా 1:3, జెకర్యా 1:16; జెకర్యా 2:10; యెహెఙ్కేలు 48:35. “నమ్మకమైన”– యెషయా 1:26; యెషయా 65:16; యిర్మియా 33:16; కీర్తనల గ్రంథము 15:2-3; కీర్తనల గ్రంథము 31:5 పోల్చి చూడండి. “పవిత్ర పర్వతం”– కీర్తనల గ్రంథము 14:20-21; యెషయా 2:2-4; యెషయా 11:9; ఓబద్యా 1:17. ఇది పవిత్ర దేవునికీ ఆయన పవిత్ర ప్రజలకూ పవిత్ర నివాసంగా ఉంటుంది.

4. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.

యెషయా 11:6-8; యెషయా 65:20-25.

5. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.

6. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు.
మత్తయి 19:26, మార్కు 10:27

ఆదికాండము 18:24; యిర్మియా 32:17, యిర్మియా 32:27. మనుషులకు బహు కష్టంగా అనిపించేది దేవునికి ఏ మాత్రం కష్టం కాదు.

7. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు దేశములోనుండియు పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి

ఆయా ప్రదేశాలనుంచి దేవుడు ఇప్పటికే యూదులను జెరుసలంకు రప్పించాడు. అందువల్ల దీని తరువాత యూదులను తిరిగి సమకూర్చడం గురించిన ప్రవచనం ఇది. ఆమోసు 9:14-15; యెషయా 11:10-16 చూడండి. “నా ప్రజను”– జెకర్యా 13:9; నిర్గమకాండము 6:7; ద్వితీయోపదేశకాండము 29:13; యెహెఙ్కేలు 37:27. అంటే యూదులు అని దేవుని ఉద్దేశం. హోషేయ 2:14-23; రోమీయులకు 11:29.

8. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.

“నీతినిజాయితీ”– ద్వితీయోపదేశకాండము 7:9; ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తనల గ్రంథము 33:4-5.

9. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు నదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోటపలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.

“ప్రవక్తలు”– వీరిలో హగ్గయి, జెకర్యాతో సహా ఇంకా మరి కొంతమంది ఉన్నారేమో. “కట్టడానికి”– హగ్గయి 1:7-8; హగ్గయి 2:4. “పునాది”– ఎజ్రా 3:10-11; హగ్గయి 2:18.

10. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరి మీదికొకరిని నేను రేపుచుంటిని.

“ముందు రోజుల్లో”– ఆలయం పునాది వేయకముందు కష్ట కాలం నెలకొని ఉండేది. ప్రజలు పేదరికంలో ఉండేవారు (హగ్గయి 1:6-11; హగ్గయి 2:15-18).

11. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను.

12. సమాధానసూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటి నన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

“ఇప్పుడు”– హగ్గయి 2:19. విధేయత చూపితే ఆశీస్సులు కలుగుతాయని దేవుడు మాట ఇచ్చాడు – లేవీయకాండము 26:3-10; ద్వితీయోపదేశకాండము 28:11-12. “ఇవన్నీ పొందేలా”– యెషయా 58:14; యెషయా 60:21; ఓబద్యా 1:17.

13. యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పద మగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి.

“శాపానికి”– ద్వితీయోపదేశకాండము 28:37; యిర్మియా 24:9; యిర్మియా 25:18. “దీవెన”– వ 20-23; ఆదికాండము 12:1-3. దేవుని దీవెనలు పొందడం మంచిది, ఇతరులకు దీవెనగా ఉండడం మరీ ఉత్తమం. దేవుడు యూదా ఇస్రాయేల్‌ను కలిపి మొత్తం జాతి గురించి ఇలా చెప్తున్నాడు. “ధైర్యంగా”– ద్వితీయోపదేశకాండము 31:6; ద్వితీయోపదేశకాండము 1:6-7; ద్వితీయోపదేశకాండము 23:6; కీర్తనల గ్రంథము 27:14; ఎఫెసీయులకు 6:10 పోల్చి చూడండి.

14. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడుచేయ నుద్దేశించినట్లు

“నిర్ణయించాను”– ఒక వ్యక్తికి గానీ దేశానికి గానీ విపత్తు కలిగించాలని దేవుడు అనుకుంటే దాన్ని ఆపడం సాధ్యం కాదు. అలానే వారికి మేలు చేయాలని ఆయన సంకల్పిస్తే ఎవరూ ఆపలేరు (ఎఫెసీయులకు 1:11; రోమీయులకు 11:36; దానియేలు 4:35; కీర్తనల గ్రంథము 115:3).

15. ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయ నుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.

16. మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
ఎఫెసీయులకు 4:25

దేవుడు వారిని దీవించి ఇతరులకు దీవెనగా చేద్దామని సంకల్పించాడు కాబట్టి దేవుని ఆదేశాల మేరకు నడుచుకోవలసిన బాధ్యత వారిపై ఉంది. “సత్యమే మాట్లాడాలి”– బైబిలంతటిలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఇదే. ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం (నిర్గమకాండము 20:16; కీర్తనల గ్రంథము 15:2; ఎఫెసీయులకు 4:25; కొలొస్సయులకు 3:19).

17. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణముచేయ నిష్టపడ కూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
1 కోరింథీయులకు 13:5

“అసహ్యం”– సామెతలు 6:16-19; యెషయా 29:20-21; కీర్తనల గ్రంథము 52:3-5; ప్రకటన గ్రంథం 21:8.

18. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి.

“నాలుగో”– 2 రాజులు 25:3-4 లోని సంఘటనకు జ్ఞాపకార్థంగా. “అయిదో...ఏడో”– జెకర్యా 7:3, జెకర్యా 7:5. “పదో నెలలో”– 2 రాజులు 25:1. “ఉల్లాసంతో”– గతంలోని చేదు అనుభవాలను మరపింపజేసేటంత ఆనందమయంగా భావికాలం ఉంటుంది. లేక ఆ అనుభవాల్లో కూడా దేవుని అనుగ్రహాన్ని చూస్తారు. హోషేయ 2:15; యెషయా 61:3 పోల్చి చూడండి. “గనుక”– రోమీయులకు 12:1; ఎఫెసీయులకు 4:1. “సత్యాన్ని...ప్రియమైనవిగా”– కీర్తనల గ్రంథము 51:6. స్వభావ రీత్యా మనుషులు ఇలా చెయ్యరు. వారికి సంతోషం కలిగించే అబద్ధాలంటేనే ఇష్టం. రోమీయులకు 1:18, రోమీయులకు 1:25; 2 థెస్సలొనీకయులకు 2:10 పోల్చి చూడండి.

20. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.

జెకర్యా 2:11; జెకర్యా 14:16; యెషయా 2:1-4; యెషయా 11:10, యెషయా 11:12; యెషయా 14:1; యెషయా 19:23-25; యెషయా 55:5; యెషయా 56:6-7 చూడండి. దేవుడు ఇస్రాయేల్‌ను దీవెనగా చేసిన తరువాత (వ 13) ఇది జరుగుతుంది. యూదుల మధ్య దేవుడున్నాడని తెలిసి ఇతర జాతులవారు ఆయన్ను వెతుకుతారు.

21. ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి ఆలస్యముచేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారుమేమును వత్తుమందురు.

22. అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు.

23. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.
1 కోరింథీయులకు 14:25



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Zechariah - జెకర్యా 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

జెరూసలేం పునరుద్ధరణ. (1-8) 
సీయోను యొక్క తీవ్రమైన విరోధులు ఆమె స్వంత అతిక్రమణలు. దేవుడు ఆమె పాపాలను తొలగిస్తాడు, ఆమెను ఇతర దుండగులకు అభేద్యంగా మారుస్తాడు. విశ్వాసాన్ని ప్రకటించేవారు తమ భక్తి మరియు చిత్తశుద్ధి ద్వారా దానిని ఉదహరించాలి. జెరూసలేం సత్యం యొక్క నగరంగా మరియు పవిత్రత యొక్క వెలుగుగా మారినప్పుడు, అది ప్రశాంతత మరియు శ్రేయస్సుతో వర్ధిల్లుతుంది. 4 మరియు 5 వచనాలు సమృద్ధి, స్వీయ నియంత్రణ మరియు సంతృప్తితో కూడిన లోతైన శాంతి స్థితిని అందంగా వర్ణిస్తాయి. చెల్లాచెదురైన ఇశ్రాయేలీయులు ప్రతి మూలనుండి పోగు చేయబడతారు. దేవుడు వారిపట్ల దయతో కూడిన తన వాగ్దానాన్ని నిర్విఘ్నంగా నిలబెట్టుకుంటాడు, మరియు వారు ప్రతిజ్ఞ చేసినట్లుగా, వారు అతని పట్ల తమ నిబద్ధతలో వెనుకడుగు వేయరు. ఈ హామీలు యూదు సమాజంలో వారి ప్రవాసం మరియు క్రీస్తు రాక మధ్య పాక్షికంగా గ్రహించబడ్డాయి. వారు క్రైస్తవ చర్చిలో పూర్తి నెరవేర్పును కనుగొన్నారు, కానీ చివరికి క్రైస్తవ చర్చిలో భవిష్యత్తు కాలాలను లేదా యూదు ప్రజల పునరుద్ధరణను సూచిస్తారు. బలహీనమైన ఆధ్యాత్మిక భక్తితో కూడిన మన ప్రస్తుత యుగంలో ఇటువంటి పరివర్తన ఊహించలేనిదిగా అనిపించవచ్చు, అయితే ప్రపంచ సృష్టికి తీసుకున్న దానికంటే చాలా తక్కువ సమయంలో పునరుద్ధరణ యొక్క ఆత్మ యొక్క సర్వశక్తిమంతమైన శక్తి ద్వారా దీనిని సాధించవచ్చు. కావున, సువార్త పేరున శ్రమించువారందరు దృఢ నిశ్చయముతోను స్థిరముగాను, యథార్థమైన పరిశుద్ధతతో ప్రభువును సేవించుచు, తమ ప్రయాసలు వ్యర్థము కాదనే జ్ఞానములో భద్రముగా ఉండవలెను.

ప్రజలు దేవుని అనుగ్రహానికి సంబంధించిన వాగ్దానాల ద్వారా ప్రోత్సహించబడ్డారు మరియు పవిత్రతను ప్రోత్సహించారు. (9-17) 
చేతిలో ఉన్న విధులకు కట్టుబడి ఉన్నవారు మాత్రమే దైవిక దయ యొక్క హామీతో తమ ప్రయత్నాలను బలపరుస్తారు. తమ పూర్వీకుల తప్పుల నుండి దూరంగా ఉన్నవారు శాపాలను ఆశీర్వాదాలుగా మార్చగలరు. వాగ్దానాలపై నమ్మకం ఉంచేవారు తమ విశ్వాసాన్ని తమ చర్యల ద్వారా ప్రదర్శించాలి మరియు వాటి నెరవేర్పు కోసం ఓపికగా ఎదురుచూడాలి. దేవుడు అసంతృప్తుడైనప్పుడు, వ్యాపారానికి అంతరాయం కలిగించే మరియు వ్యక్తుల మధ్య విభేదాలను పెంపొందించే శక్తి ఆయనకు ఉంది, కానీ ఆయన తన దయతో తిరిగి వచ్చినప్పుడు, అందరూ సామరస్యపూర్వకంగా మరియు సంపన్నంగా ఉంటారు. నిస్సందేహంగా, క్రీస్తులో విశ్వాసులు అబద్ధాన్ని విడిచిపెట్టి, ఇతరులతో సామరస్యపూర్వకమైన సంబంధాలను పెంపొందించుకోవాలని, ప్రభువు అంగీకరించని వాటిని తృణీకరించాలని మరియు అతనికి సంతోషాన్నిచ్చే వాటిని గౌరవించాలనే సలహాను తేలికగా పరిగణించకూడదు.

చివరి రోజుల్లో యూదులు. (18-23)
దేవుడు తన దయతో మనలను సమీపించినప్పుడు, సంతోషంతో మరియు కృతజ్ఞతతో ఆయనను అభినందించడం మన విధి. కాబట్టి, మీ వ్యవహారాలన్నింటిలో విశ్వసనీయత మరియు నిజాయితీని కొనసాగించండి, అలా చేయడంలో సంతృప్తిని కనుగొనండి, ఇతరులు సంపాదించే అక్రమ సంపాదనను కోల్పోయినప్పటికీ. ప్రజలందరితో సామరస్యంగా జీవించడానికి మీ సామర్థ్యం మేరకు కృషి చేయండి. దేవుని సత్యాలు మీ ఆలోచనలకు మార్గనిర్దేశం చేయనివ్వండి మరియు మీ హృదయాలలో దేవుని శాంతిని పరిపాలించనివ్వండి. ఈ విధంగా దేవునికి అంకితభావంతో ఉన్న సేవకులు తమ అన్యజనుల దృష్టిని ఆకర్షించారు, వారు వారి సందేశానికి మరింత గ్రహీతగా ఉన్నారు. చర్చి గణనీయమైన అభివృద్ధిని అనుభవిస్తుంది. ఈ సమయం వరకు, యూదులు తరచుగా ఇతర దేశాల విగ్రహారాధన పద్ధతులను అవలంబించారు. తమ విజేతలకు మరియు ప్రపంచంలోని అగ్రగామి దేశాలకు మతపరమైన జ్ఞానాన్ని అందించడం కంటే వారు ఊహించనిది ఏముంటుంది? అయినప్పటికీ, ఇది ఖచ్చితంగా ముందే చెప్పబడింది మరియు నెరవేరింది. ఇప్పటివరకు, ఈ ప్రవచనం అసాధారణంగా నెరవేరింది మరియు నిస్సందేహంగా, భవిష్యత్ సంఘటనలు దాని అర్థంపై మరింత వెలుగునిస్తాయి. దేవుడు తమ పక్షాన ఉన్న వారితో మనల్ని మనం కలుపుకోవడం చాలా అవసరం. మనం దేవుణ్ణి మన స్వంతంగా ఎంచుకుంటే, మనం కూడా ఆయన ప్రజలను మన స్వంతంగా స్వీకరించాలి మరియు వారితో మన విధిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే, వ్యక్తిగత విశ్వాసానికి ప్రత్యామ్నాయంగా యూదులు లేదా అన్యుల పట్ల కేవలం ఉత్సాహాన్ని పొరబడకూడదు. ఇతరులు మనతో పాటు నడవడానికి మరియు శాశ్వతమైన సంతోషం యొక్క వాగ్దానంలో పాలుపంచుకోవాలని కోరుకునేలా మనం క్రీస్తు యొక్క సజీవ ఉదాహరణలుగా, అందరికీ తెలిసిన మరియు గుర్తించబడ్డాము.



Shortcut Links
జెకర్యా - Zechariah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |