Numbers - సంఖ్యాకాండము 11 | View All

1. జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.

నిర్గమకాండము 14:11-12 సంఖ్యాకాండము 21:5 నోట్స్ చూడండి; నిర్గమకాండము 15:24 నిర్గమకాండము 16:2 సంఖ్యాకాండము 14:2 సంఖ్యాకాండము 16:11 సంఖ్యాకాండము 17:5 కూడా చూడండి. దేవుని గురించి లేక దేవుని ఏర్పాట్ల గురించి సణగడం లేక ఫిర్యాదులు చెయ్యడం భయంకరమైన పాపం, ఎందుకంటే ఇది దేవుని ప్రేమనూ న్యాయాన్నీ మంచితనాన్నీ ఆయన వాగ్దానాన్నీ శంకించడమే. ఇలా జరిగిందేమిటి అని మనం అనడంలో దేవునికంటే మనమే జ్ఞానవంతులమని అనుకుంటున్నామన్న మాట. ఇక్కడ అయితే ఈ పాపానికి వెంటనే శిక్ష పడింది. దేవుని కోపం సమస్తమైన అక్రమాన్నీ పాపాన్నీ తగలబెట్టేసే మంటల్లాంటిది (సంఖ్యాకాండము 25:3 నోట్; యెషయా 30:27 యెషయా 33:14 రోమీయులకు 1:18 హెబ్రీయులకు 12:29).

2. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.

ఆ నాడు దేవునికీ ఇస్రాయేల్ వారికీ మోషే ఎలా మధ్యవర్తిగా ఉన్నాడో అలాగే ఇప్పుడు క్రీస్తు తన ప్రజలకూ దేవునికీ మధ్యవర్తిగా ఉన్నాడు (1 యోహాను 2:1 హెబ్రీయులకు 7:25 రోమీయులకు 5:10). ప్రజల పాపాల వల్ల దేవుని కోపం వారి మీదికి రాకుండా చేసేవాడు ఆయనే. నిర్గమకాండము 32:11-13 చూడండి.

3. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను.

4. వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు?
1 కోరింథీయులకు 10:6

దేవుని కోపాగ్ని వారికి వ్యతిరేకంగా రగులుకుంటూ ఉన్నప్పటికీ వారి కోరికలు మాత్రం పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. దేవుడు పరలోకంలోనుంచి తమకు అనుగ్రహించిన ఆహారాన్ని కూడా తృణీకరించడానికి వాళ్ళు తెగించారు (నిర్గమకాండము 16:14-16 నిర్గమకాండము 16:31 ద్వితీయోపదేశకాండము 8:3 ద్వితీయోపదేశకాండము 8:16). ఇలాంటి ప్రవర్తనవల్ల మనిషి తన పతనమైన స్థితిలో ఎలాంటివాడో తెలుస్తున్నది.

5. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

6. ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.

7. ఆ మన్నా కొతిమెర గింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
యోహాను 6:31

8. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.

9. రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.

10. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.

సంఖ్యాకాండము 10:1 చూడండి. మోషేకు బాధేసింది. ఆ ప్రజలందరికీ నాయకత్వం వహించడం అనేది అతనికి మోయరాని బరువైపోయింది. దీన్ని ఇక భరించలేక తానే ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టాడు. తనను ఎక్కువ కఠినంగా కష్టపెడుతున్నాడని దేవుణ్ణి తప్పు పట్టేంతవరకు వచ్చాడు – 11-14 వచనాలు.

11. కాగా మోషే యెహోవాతో యిట్లనెను నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?

12. నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.

13. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు

14. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.

15. నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.

చనిపోతే మంచిదన్న కోరిక, ఆ మేరకు ప్రార్థనలు దేవుని ప్రజల్లో గొప్ప గొప్ప నాయకులకు కూడా పరిపాటే (1 రాజులు 19:4 యోబు 3:11 యోబు 3:21-22 యిర్మియా 20:14-18 యోనా 4:8 ఫిలిప్పీయులకు 1:23). జీవితభారం ఇక మోయరానంత దుర్భరమైపోయినప్పుడు దేవుడు తప్పక సానుభూతితో అర్థం చేసుకుని తనవారికీ ఊరట కలిగిస్తాడు.

16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.

17. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.

18. నీవు జనులను చూచి యిట్ల నుముమిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చిమాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పు కొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.

“ఈజిప్ట్‌లో...బాగున్నాయి”– ఇది ఎలా అనగలిగారు? నిర్గమకాండము 1:9-11 నిర్గమకాండము 1:13-16 నిర్గమకాండము 2:23-25 పోల్చిచూడండి. గతాన్ని మనుషులు ఎంత త్వరగా మర్చిపోతారు! సంఖ్యాకాండము 16:12-13 పోల్చిచూడండి.

19. ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.

20. ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చిఐగుప్తు లోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.

“వెగటు”– దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడని వస్తువేదైనా మనకు కావాలని మనం పట్టుపడితే ఒక్కోసారి ఆయన మనకది ఇవ్వవచ్చు గాని అది మనకు ఏమాత్రం మేలు కలిగించదు. మనకేది ఇష్టమో అది కలగడం మన పాలిట పతన కారణం – కీర్తనల గ్రంథము 106:13-15. నిజం చెప్పాలంటే ఇస్రాయేల్‌ప్రజ కోరినదాన్ని దేవుడు వారికివ్వడం దేవుణ్ణి వారు నిరాకరించినందుకు వారికి కలిగిన శిక్షే.

21. అందుకు మోషేనేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.

22. వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంప వలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేప లన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.

23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.

చంచలంగా ఉన్న మోషే నమ్మకం విషయంలో దేవుడిస్తున్న జవాబు ఇదే: దేవుడు సర్వశక్తిమంతుడు. తాను ఏమి జరిగిస్తానని చెప్పాడో దాన్ని తప్పక జరిగించగల సమర్థుడు, మాట తప్పని వాడు (ఆదికాండము 18:14 యిర్మియా 32:17 యిర్మియా 32:27 జెకర్యా 8:6 మత్తయి 19:26). ఆ ఎడారిలో దేవుడు ఆరు లక్షల మంది మగవారికీ, ఎక్కువమంది స్త్రీలకూ పిల్లలకూ మాంసం పెట్టగలిగినప్పుడు ఎవరు ఎక్కడ ఏ అవసరంలో ఉన్నప్పటికీ వారి అవసరాలను తీర్చగలడు గదా. నమ్మకం ఉంచితే చాలు దేవుడు తప్పక అలా చేస్తాడు. కీర్తనల గ్రంథము 23:1 కీర్తనల గ్రంథము 37:25-26 మత్తయి 7:9-11 2 కోరింథీయులకు 9:8 ఫిలిప్పీయులకు 4:19 పోల్చిచూడండి.

24. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా

25. యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.

“ఆత్మ”– దేవుని ఆత్మ సహాయం లేకుండా దేవుని ప్రజలకు తగిన రీతిలో దారిచూపడం ఎవరికీ సాధ్యం కాదు. “దేవుని మూలంగా పలికారు”– హీబ్రూ భాషలో ఇక్కడ ఒకే పదం ఉంది. దాని అర్థమేమంటే ఏదో ఆత్మ లేక శక్తి కమ్ముకున్నప్పుడు ఒక వ్యక్తి పలకడం. నిజమైన ప్రవక్తలందరూ దేవుని ఆత్మ తమను ఆవరించగా దేవుని మూలంగా పలికారు (2 పేతురు 1:21). అబద్ధ ప్రవక్తలు దయ్యాలు లేక అబద్ధ దేవతల మూలంగానో, లేక అహంకారం నిండిన తమ స్వంత ఊహా కల్పనల మూలంగానో పలుకుతారు (యోనా 13:2-3 1 రాజులు 18:25-26 1 రాజులు 18:25-29 యిర్మియా 23:13). నిజమైన ప్రవక్తలు అక్షరం పొల్లు పోకుండా భవిష్యత్తులో జరిగే విషయాలను వెల్లడించారు. దేవుడు వారికి ఈ విషయాలు వెల్లడించినందువల్లే ఇది సాధ్యపడింది. అప్పటికే వెల్లడైన దేవుని వాక్కులను కూడా వారు ఉపదేశించారు. ఆదికాండము 20:7 నోట్.

26. ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారి లోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.

27. అప్పుడు ఒక ¸యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా

28. మోషే ఏర్పరచు కొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచార కుడునైన యెహోషువ మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.

యెహోషువ మోషే విషయంలో అభిమానం చూపాడు. మోషే ఒక్కడే ఇస్రాయేల్ వారందరికీ దేవుని ప్రవక్తగా ఉండాలని అతని ఆకాంక్ష. మార్కు 9:38-40 పోల్చిచూడండి.

29. అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
1 కోరింథీయులకు 14:5

ఆ విషయం గురించి మోషే ఉద్దేశాలు వేరు. అవి ఉన్నతమైనవి. అతను సాధుస్వభావం, అణకువ గల మనిషి (సంఖ్యాకాండము 12:3). తనకేదో ఉన్నత స్థానం ఉండాలనీ మనుషులు తనను ఘనంగా ఎంచాలనీ అతను కోరలేదు. ఇతరులెవరైనా ఉన్నత పదవికి ఎదిగితే అసూయపడేవాడు కాదు. అతనికున్న ఒకే ఒక కోరిక ఏమంటే దేవునికే ఘనత అంతా చెందాలనీ దేవుని సేవ ముందుకు సాగాలనీ. ఈ విషయాలన్నిటిలో మోషే మనకు గొప్ప ఆదర్శం. పౌలుకు కూడా ఇలాంటి మనసే ఉంది (1 కోరింథీయులకు 3:7 1 కోరింథీయులకు 14:5 ఎఫెసీయులకు 3:8 ఫిలిప్పీయులకు 2:3). దేవుని ప్రజలకు అవసరమైనది ఇలాంటి నాయకులే గాని తమ స్వంత ఘనత, అధికారం, ధనలాభం కోరుకునే నాయకులు కాదు.

30. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి.

31. తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.

18 వచనంలో ఇచ్చిన తన మాటను దేవుడు నిలబెట్టుకున్నాడు.

32. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.

33. ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.

కీర్తనల గ్రంథము 78:26-31. మనం దేవుణ్ణి దేనికోసం కోరుకుంటున్నామో, ఎలా కోరు కొంటున్నామో జాగ్రత్త వహించాలి.

34. మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను.
1 కోరింథీయులకు 10:6

పేరాశ, పిసినిగొట్టుతనం విగ్రహ పూజతో సమానం (కొలొస్సయులకు 3:5). వీటికి వ్యతిరేకంగా దేవుని కోపం మండుతూ ఉంటుంది. “కిబ్రోత్‌హత్తావా”– అంటే పేరాశ ఉన్నవారి గోరీలు.

35. జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమై పోయి హజేరోతులో దిగిరి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
తబేరా వద్ద దహనం. (1-3) 
ప్రజలు ఫిర్యాదు చేయడం ద్వారా చెడు చేశారు. మేము నియమాలను ఒక సాకుగా ఉపయోగించినప్పుడు ఇది ఎంత చెడ్డదో చూపిస్తుంది. నియమాలు మన తప్పులను చూపుతాయి, కానీ అవి వాటిని పూర్తిగా సరిదిద్దలేవు. ప్రజలు సంతోషంగా లేనప్పుడు, మిగతావన్నీ మంచివి అయినప్పటికీ, వారు ఎల్లప్పుడూ కలత చెందడానికి ఏదో కనుగొంటారు. మోషే వినలేకపోయినప్పటికీ, ప్రజలు తమ హృదయాలలో ఏమి ఆలోచిస్తున్నారో దేవుడు విన్నాడు. మన హృదయాలలో దాగి ఉన్నవన్నీ, మనం బయటకు చెప్పని విషయాలు కూడా దేవునికి తెలుసు. దేవుడు విన్నది నచ్చలేదు మరియు వారి చెడు ప్రవర్తనకు వారిని శిక్షించాడు. ప్రజలు దేవునిపై కోపంగా ఉన్నారు, దేవుడు వారిని అగ్నితో శిక్షించాడు. కానీ ప్రజలు తమ తప్పుల నుండి నేర్చుకునేలా దేవుని శిక్ష నెమ్మదిగా జరిగింది. ప్రజలను శిక్షించడం దేవుడు ఇష్టపడడు మరియు ప్రజలు వారి పాఠాలు నేర్చుకున్నప్పుడు త్వరగా ఆగిపోతాడు. 

ప్రజలు మాంసం కోసం ఆశపడతారు మరియు మన్నాను అసహ్యించుకుంటారు. (4-9) 
కొన్నిసార్లు ప్రజలు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా తమను తాము చూసుకోరు, ఇది వారికి చాలా విషయాలు ఉన్నప్పటికీ వారు సంతోషంగా ఉండకపోవచ్చు. కొంత మంది తమకు మేలు చేసినా, సులువుగా లభించినా దేవుడు ఇచ్చిన ఆహారంతో విసిగిపోయారు. వారు ఈజిప్టులో చేపలు ఎలా తింటారు అని మాట్లాడుకున్నారు, కానీ దాని కోసం వారు కష్టపడాలని మర్చిపోయారు. మన్నా అనే ప్రత్యేకమైన ఆహారాన్ని ప్రజలు తిన్నప్పుడు, చాలా కాలం క్రితం జరిగిన ఒక శాపం కారణంగా వారు ఇతర వ్యక్తుల మాదిరిగా తమ ఆహారాన్ని పొందడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ వారు నిజంగా మంచిగా ఉన్నప్పటికీ, వారు దాని గురించి ఫిర్యాదు చేశారు. కొన్నిసార్లు ప్రజలు సంతోషంగా లేనప్పుడు, తప్పు ఏమీ లేకపోయినా వారు అసంతృప్తికి గురిచేస్తారు. మరియు అది వారిని మరింత అసంతృప్తికి గురి చేస్తుంది. ఒక్కోసారి మాంసాహారం తినాలని అనుకుంటారు. వారు తమ శారీరక కోరికలపై ఎక్కువ దృష్టి పెట్టారని ఇది చూపిస్తుంది. మన నమ్మకాలకు విరుద్ధమైన వాటిని మనం కోరుకోకూడదు మరియు మనకు కావలసినవి కావాలంటూ మనం వాటిని అడగకూడదు. మనం ఎక్కువగా కోరుకుంటే మరియు దేవుడు మనకు వాటిని కలిగి ఉండకూడదనుకుంటే సాధారణంగా బాగానే ఉన్న విషయాలు కూడా తప్పుగా మారవచ్చు. 

మోషే తన అభియోగంపై ఫిర్యాదు చేశాడు. (10-15) 
చేయకూడనిది అయినప్పటికీ మోషే చాలా కలత చెందాడు. దేవుడు తనకు ప్రత్యేక సామర్థ్యాలు ఇచ్చాడనే విషయాన్ని మరచిపోయి తన గురించి చాలా గొప్పగా ఆలోచించాడు. చేయవలసినది చేయడానికి దేవుడు తనకు సహాయం చేస్తాడని కూడా అతను నమ్మలేదు. ప్రలోభాలకు గురికాకుండా సహాయం చేయమని దేవుడిని అడగాలి.

బాధ్యతను విభజించడానికి నియమించబడిన పెద్దలు. మాంసం మాంసం వాగ్దానం చేసింది. (16-23)
మోషే తనకు సహాయం చేయడానికి నిజంగా తెలివైన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను ఎంచుకోవలసి వచ్చింది. వారు తమ పనిలో మంచిగా ఉండేలా చూస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారు తగినంతగా లేకుంటే, వారు బాగుపడటానికి దేవుడు సహాయం చేస్తాడు. సంతోషంగా ఉన్నవారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు. ఈ విధంగా, ఎవరూ ఫిర్యాదు చేయలేరు. 1. మన ఇంద్రియాలకు మంచి అనుభూతిని కలిగించే విషయాలు సరదాగా ఉంటాయి, కానీ అవి మనకు నిజంగా సంతోషాన్ని కలిగించవు. మన హృదయాన్ని మరియు ఆత్మను సంతోషపెట్టేవి మాత్రమే చేయగలవు. ప్రపంచంలోని అన్నిటిలాగే మన ఇంద్రియాలను సంతోషపెట్టే విషయాలు చివరికి దూరంగా వెళ్లిపోతాయి. 2. అతిగా తినడం మరియు త్రాగడం మన శరీరానికి హాని కలిగిస్తుంది మరియు ఇది మంచిది కాదు. కొన్నిసార్లు మంచి వ్యక్తులు కూడా విషయాలు కఠినంగా ఉన్నప్పుడు దేవుణ్ణి విశ్వసించడం చాలా కష్టం, కానీ దేవుడు చాలా శక్తిమంతుడని మరియు అలా చెప్పడం ద్వారా విషయాలు జరిగేలా చేయగలడని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకుంటారని మనం నమ్మవచ్చు. 

ఆత్మ పెద్దలపై ఆధారపడి ఉంటుంది. (24-30) 
ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో తనకు సహాయకులు ఉంటారని దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు. అతను డెబ్బై మంది నాయకులకు ప్రత్యేక జ్ఞానం మరియు సామర్థ్యాలను ఇచ్చాడు. వారు దేవుని గురించి ప్రజలతో మాట్లాడారు మరియు వారు నిజంగా దేవుని ఆత్మచే నడిపించబడ్డారని అందరూ చెప్పగలరు. ఈ నాయకులలో ఇద్దరు ఎల్దాద్ మరియు మేదాద్ సాధారణ సమావేశ స్థలానికి వెళ్లలేదు, ఎందుకంటే వారు సరిపోరని భావించారు. అయినప్పటికీ, వారు ఉన్న చోట దేవుని ఆత్మ ఇప్పటికీ వారి ద్వారా పనిచేసింది మరియు వారు ఇతరులలాగే ప్రార్థించగలరు, బోధించగలరు మరియు దేవుణ్ణి స్తుతించగలరు. వారు దేవుని ఆత్మ సహాయంతో మాట్లాడుతున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ వీచే గాలిలా దేవుని సన్నిధి ఎక్కడైనా స్ఫురిస్తుంది. వినయపూర్వకమైన వ్యక్తులు ప్రతిఫలాన్ని పొందుతారు మరియు నాయకత్వానికి బాగా సరిపోయే వారు ఎల్లప్పుడూ దానిని కోరుకోరు. జాషువా ఎవరినీ శిక్షించాలనుకోలేదు, అతను చర్చిలో సమస్యలను నివారించాలనుకున్నాడు. కొంతమంది వ్యక్తులు విభేదాలు రాకుండా లేదా మోషే నుండి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించకుండా మౌనంగా ఉంచడం ఉత్తమమని అతను భావించాడు. కానీ మోషే చింతించలేదు ఎందుకంటే దేవుని ఆత్మ వారందరితో ఉందని అతనికి తెలుసు. ఎవరైనా మనతో ఎల్లప్పుడూ ఏకీభవించనందున మనం వారిని తిరస్కరించకూడదు లేదా మంచి చేయకుండా ఆపకూడదు. దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆయన సందేశాన్ని చెప్పగలరని మోషే కోరుకున్నాడు మరియు దేవుడు తన ఆత్మను ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని కోరుకున్నాడు. నాయకుడిగా ఉండటం చాలా పెద్ద బాధ్యత అని మరియు కష్టంగా ఉంటుందని, కాబట్టి నాయకులు ఇతరుల సలహాలను వినాలని మరియు వారి సహాయానికి కృతజ్ఞతతో ఉండాలని మోసెస్ అన్నారు. దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆయన సందేశాన్ని పంచుకోగలిగితే, వారు అన్నింటికీ ఏకీభవించనప్పటికీ, ప్రజలు చెడు విషయాల నుండి దూరంగా మరియు యేసును విశ్వసించడంలో సహాయం చేయడానికి ఇంకా చాలా పని ఉంటుంది. 

పిట్టలు ఇస్తారు. (31-35)
ప్రజలకు మాంసం ఇస్తానని దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ ప్రజలు నిత్యజీవాన్ని పొందేందుకు కష్టపడి పనిచేయడం కంటే కొద్దికాలం మాత్రమే ఉండే మాంసాన్ని సేకరించడంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ ప్రపంచంలో ముఖ్యమైన వాటిని చూడటంలో మనం మంచివాళ్ళం, కానీ శాశ్వతత్వానికి ఏది ముఖ్యమైనదో అర్థం చేసుకోవడంలో మనం అంత మంచివాళ్ళం కాదు. ఇప్పుడు మనకు ప్రయోజనం కలిగించే వాటిని అనుసరించడం చాలా సులభం, కానీ మన జీవితాలను నిజంగా సుసంపన్నం చేసే వాటిని మనం మరచిపోతాము. తమ శారీరక కోరికలపై మాత్రమే దృష్టి సారించే వ్యక్తులు వారి ఆత్మలను బాధపెట్టినప్పటికీ, వారిని సంతృప్తి పరచడానికి ఏమైనా చేస్తారు. కొన్నిసార్లు మనం ఏదైనా చాలా చెడుగా కోరుకున్నప్పుడు మరియు మనం చాలా మంచిది కాని పనులను చేసినప్పుడు, మనం కోరుకున్నది మనం పొందవచ్చు, కానీ అది మనకు మంచిది కాదు. మనకు సంతోషాన్ని కలిగించే విషయాల కోసం వెతకడం మంచిది, కానీ దీర్ఘకాలంలో మనకు హాని కలిగించదు. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |