Numbers - సంఖ్యాకాండము 13 | View All
Study Bible (Beta)

1. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

1. The Lord said to Moses,

2. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.

2. 'Send men to explore the land of Canaan, which I will give to the Israelites. Send one leader from each tribe.'

3. మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.

3. So Moses obeyed the Lord's command and sent the Israelite leaders out from the Desert of Paran.

4. వారి పేళ్లు ఏవనగారూబేను గోత్రమునకు

4. These are their names: from the tribe of Reuben, Shammua son of Zaccur;

5. జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;

5. from the tribe of Simeon, Shaphat son of Hori;

6. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;

6. from the tribe of Judah, Caleb son of Jephunneh;

7. ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;

7. from the tribe of Issachar, Igal son of Joseph;

8. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;

8. from the tribe of Ephraim, Hoshea son of Nun;

9. బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;

9. from the tribe of Benjamin, Palti son of Raphu;

10. జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

10. from the tribe of Zebulun, Gaddiel son of Sodi;

11. యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;

11. from the tribe of Manasseh (a tribe of Joseph), Gaddi son of Susi;

12. దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;

12. from the tribe of Dan, Ammiel son of Gemalli;

13. ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

13. from the tribe of Asher, Sethur son of Michael;

14. నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

14. from the tribe of Naphtali, Nahbi son of Vophsi;

15. గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.

15. from the tribe of Gad, Geuel son of Maki.

16. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

16. These are the names of the men Moses sent to explore the land. (Moses gave Hoshea son of Nun the new name Joshua.)

17. మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో

17. Moses sent them to explore Canaan and said, 'Go through southern Canaan and then into the mountains.

18. దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో

18. See what the land looks like. Are the people who live there strong or weak? Are there a few or many?

19. వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,

19. What kind of land do they live in? Is it good or bad? What about the towns they live in -- are they open like camps, or do they have walls?

20. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము

20. What about the soil? Is it fertile or poor? Are there trees there? Try to bring back some of the fruit from that land.' (It was the season for the first grapes.)

21. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.

21. So they went up and explored the land, from the Desert of Zin all the way to Rehob by Lebo Hamath.

22. వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.

22. They went through the southern area to Hebron, where Ahiman, Sheshai, and Talmai, the descendants of Anak lived. (The city of Hebron had been built seven years before Zoan in Egypt.)

23. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.

23. In the Valley of Eshcol, they cut off a branch of a grapevine that had one bunch of grapes on it and carried that branch on a pole between two of them. They also got some pomegranates and figs.

24. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.

24. That place was called the Valley of Eshcol, because the Israelites cut off the bunch of grapes there.

25. వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి.

25. After forty days of exploring the land, the men returned to the camp.

26. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.

26. They came back to Moses and Aaron and all the Israelites at Kadesh, in the Desert of Paran. The men reported to them and showed everybody the fruit from the land.

27. వారు అతనికి తెలియపరచినదేమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి.

27. They told Moses, 'We went to the land where you sent us, and it is a fertile land! Here is some of its fruit.

28. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.

28. But the people who live there are strong. Their cities are walled and very large. We even saw some Anakites there.

29. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.

29. The Amalekites live in the southern area; the Hittites, Jebusites, and Amorites live in the mountains; and the Canaanites live near the sea and along the Jordan River.'

30. కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.

30. Then Caleb told the people near Moses to be quiet, and he said, 'We should certainly go up and take the land for ourselves. We can certainly do it.'

31. అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.

31. But the men who had gone with him said, 'We can't attack those people; they are stronger than we are.'

32. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.

32. And those men gave the Israelites a bad report about the land they explored, saying, 'The land that we explored is too large to conquer. All the people we saw are very tall.

33. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.

33. We saw the Nephilim people there. (The Anakites come from the Nephilim people.) We felt like grasshoppers, and we looked like grasshoppers to them.'



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
కనాను దేశాన్ని శోధించడానికి పన్నెండు మందిని పంపారు, వారి సూచన. (1-20) 
కథలోని ఈ భాగం చాలా బాధాకరం. ఇశ్రాయేలీయులు కనాను అనే కొత్త దేశానికి వెళ్లవలసి ఉంది, కానీ వారు దానిని చేయగలరని నమ్మలేదు మరియు చాలా ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా, వారు అరణ్యంలో తిరుగుతూ, కొత్త భూమికి వెళ్ళలేక శిక్షించబడ్డారు. Deu 1:22 దేవుడు చెప్పనప్పటికీ, ప్రజలు కొత్త భూమిని అన్వేషించాలని కోరుకున్నారు. వారు దేవుని జ్ఞానం కంటే వారి స్వంత ఆలోచనలను ఎక్కువగా విశ్వసించారు. ఇది మంచిది కాదు, ఎందుకంటే దేవుడు మనకు చెప్పేది కాకుండా మనం చూడగలిగే మరియు వినగలిగే వాటిని మాత్రమే వినడం ద్వారా మనం చెడు ఎంపికలను చేయవచ్చు. పరిశోధకులకు ధైర్యంగా మరియు విశ్వసనీయంగా ఉండాలని మోషే చెప్పాడు, కాలేబు మరియు జాషువా మాత్రమే దీన్ని చేయటానికి తగినంత విశ్వాసం కలిగి ఉన్నారు. 

వారి చర్యలు. (21-25) 
కొత్త భూమిని అన్వేషిస్తున్న కొందరు వ్యక్తులు భూమి ఎంత బాగుందో చూపించడానికి కొన్ని రుచికరమైన ద్రాక్ష మరియు ఇతర పండ్లను తిరిగి తీసుకువచ్చారు. ఇశ్రాయేలీయులకు, ఆ దేశంలో వారు ఆశించే అన్ని మంచి విషయాలకు ఇది సూచన. మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, స్వర్గంలో మనం అనుభవించే కొంత సంతోషాన్ని మరియు మంచితనాన్ని మనం ఎలా అనుభవించగలమో అలాగే ఉంటుంది. స్వర్గం ఎలా ఉంటుందో అది మనకు కొద్దిగా రుచిని ఇస్తుంది. 

భూమి గురించి వారి ఖాతా. (26-33)
ఇశ్రాయేలు ప్రజలు కనాను అనే కొత్త ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారు విజయం సాధిస్తారని దేవుడు వారికి వాగ్దానం చేశాడు మరియు తన శక్తిని చూపించడానికి అద్భుతాలు కూడా చేశాడు. కానీ ప్రజలు దేవుణ్ణి నమ్మలేదు మరియు ఆందోళన చెందారు. వారు కొత్త స్థలాన్ని తనిఖీ చేయడానికి గూఢచారులను పంపారు మరియు వారు 40 రోజులు తిరిగి వచ్చే వరకు వేచి ఉన్నారు. గూఢచారులు తిరిగి వచ్చినప్పుడు, వారిలో చాలామంది కనానుకు వెళ్లడం చాలా కష్టమని చెప్పారు. ఎందుకంటే ప్రజలు దేవుని వాగ్దానాన్ని విశ్వసించలేదు మరియు గూఢచారులు చెప్పిన వాటిని విన్నారు. విశ్వసించవలసిన అతి ముఖ్యమైన విషయం దేవుని వాక్యమని వారు మరచిపోయారు. చాలా కాలం క్రితం, దేవుడు వాగ్దానం చేసిన కొత్త భూమిని తనిఖీ చేయడానికి కొంతమందిని పంపారు. దేవుడు వాగ్దానం చేసినంత మంచిదే అయినప్పటికీ, కొంతమంది ప్రజలు భయపడ్డారు మరియు వారు నిజంగా దానిని కలిగి ఉన్నారని నమ్మలేదు. దేవుడు తమకు వాగ్దానం చేశాడనే విషయం మర్చిపోయారు. కానీ కాలేబ్ అనే వ్యక్తి ధైర్యంగా ఉండి అందరినీ కొనసాగించమని ప్రోత్సహించాడు. భూమిని దక్కించుకోవడానికి పోరాడాలని ఆయన చెప్పలేదు, కేవలం వెళ్లి దానిని తీసుకోవాలన్నారు. దేవుని వాగ్దానాలపై మనకు విశ్వాసం ఉంటే, ఏదైనా సాధ్యమే. కానీ కొన్నిసార్లు ప్రజలు సవాళ్లను మరచిపోతారు మరియు భయపడతారు. మనం దేవుడిని నమ్మాలి మరియు ఏదైనా సాధ్యమే అని నమ్మాలి. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |