Numbers - సంఖ్యాకాండము 32 | View All
Study Bible (Beta)

1. రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని

1. Now the Reubenites and the Gadites owned a very great number of cattle. When they saw that the land of Jazer and the land of Gilead was a good place for cattle,

2. వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతొ

2. the Gadites and the Reubenites came and spoke to Moses, to Eleazar the priest, and to the leaders of the congregation, saying,

3. అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా

3. Ataroth, Dibon, Jazer, Nimrah, Heshbon, Elealeh, Sebam, Nebo, and Beon--

4. ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.

4. the land that the LORD subdued before the congregation of Israel-- is a land for cattle; and your servants have cattle.

5. కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా

5. They continued, If we have found favor in your sight, let this land be given to your servants for a possession; do not make us cross the Jordan.

6. మోషే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?

6. But Moses said to the Gadites and to the Reubenites, Shall your brothers go to war while you sit here?

7. యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు?

7. Why will you discourage the hearts of the Israelites from going over into the land that the LORD has given them?

8. ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా

8. Your fathers did this, when I sent them from Kadesh-barnea to see the land.

9. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లక పోయిరి.

9. When they went up to the Wadi Eshcol and saw the land, they discouraged the hearts of the Israelites from going into the land that the LORD had given them.

10. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని

10. The LORD's anger was kindled on that day and he swore, saying,

11. ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యెహోషువయు తప్ప

11. 'Surely none of the people who came up out of Egypt, from twenty years old and upward, shall see the land that I swore to give to Abraham, to Isaac, and to Jacob, because they have not unreservedly followed me--

12. మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.

12. none except Caleb son of Jephunneh the Kenizzite and Joshua son of Nun, for they have unreservedly followed the LORD.'

13. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.

13. And the LORD's anger was kindled against Israel, and he made them wander in the wilderness for forty years, until all the generation that had done evil in the sight of the LORD had disappeared.

14. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.

14. And now you, a brood of sinners, have risen in place of your fathers, to increase the LORD's fierce anger against Israel!

15. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను.

15. If you turn away from following him, he will again abandon them in the wilderness; and you will destroy all this people.

16. అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము.

16. Then they came up to him and said, We will build sheepfolds here for our flocks, and towns for our little ones,

17. ఇశ్రాయేలీయులను వారివారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.

17. but we will take up arms as a vanguard before the Israelites, until we have brought them to their place. Meanwhile our little ones will stay in the fortified towns because of the inhabitants of the land.

18. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగి రాము.

18. We will not return to our homes until all the Israelites have obtained their inheritance.

19. తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి.

19. We will not inherit with them on the other side of the Jordan and beyond, because our inheritance has come to us on this side of the Jordan to the east.

20. అప్పుడు మోషే వారితోమీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్ల గొట్టువరకు

20. So Moses said to them, If you do this-- if you take up arms to go before the LORD for the war,

21. యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల

21. and all those of you who bear arms cross the Jordan before the LORD, until he has driven out his enemies from before him

22. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై యుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.

22. and the land is subdued before the LORD-- then after that you may return and be free of obligation to the LORD and to Israel, and this land shall be your possession before the LORD.

23. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపముచేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.

23. But if you do not do this, you have sinned against the LORD; and be sure your sin will find you out.

24. మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను.

24. Build towns for your little ones, and folds for your flocks; but do what you have promised.

25. అందుకు గాదీయులును రూబేనీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.

25. Then the Gadites and the Reubenites said to Moses, Your servants will do as my lord commands.

26. మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.

26. Our little ones, our wives, our flocks, and all our livestock shall remain there in the towns of Gilead;

27. నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికివచ్చెదమనిరి.

27. but your servants will cross over, everyone armed for war, to do battle for the LORD, just as my lord orders.

28. కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరు కును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీ యుల గోత్రములలో పితరుల కుటుంబ ముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

28. So Moses gave command concerning them to Eleazar the priest, to Joshua son of Nun, and to the heads of the ancestral houses of the Israelite tribes.

29. గాదీయులును రూబేనీయులును అందరు యెహో వా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.

29. And Moses said to them, If the Gadites and the Reubenites, everyone armed for battle before the LORD, will cross over the Jordan with you and the land shall be subdued before you, then you shall give them the land of Gilead for a possession;

30. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా

30. but if they will not cross over with you armed, they shall have possessions among you in the land of Canaan.

31. గాదీయులును రూబేనీయులును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.

31. The Gadites and the Reubenites answered, As the LORD has spoken to your servants, so we will do.

32. మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమైనది దాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.

32. We will cross over armed before the LORD into the land of Canaan, but the possession of our inheritance shall remain with us on this side of the Jordan.

33. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.

33. Moses gave to them-- to the Gadites and to the Reubenites and to the half-tribe of Manasseh son of Joseph-- the kingdom of King Sihon of the Amorites and the kingdom of King Og of Bashan, the land and its towns, with the territories of the surrounding towns.

34. And the Gadites rebuilt Dibon, Ataroth, Aroer,

35. Atroth-shophan, Jazer, Jogbehah,

36. అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.

36. Beth-nimrah, and Beth-haran, fortified cities, and folds for sheep.

37. And the Reubenites rebuilt Heshbon, Elealeh, Kiriathaim,

38. షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.

38. Nebo, and Baal-meon (some names being changed), and Sibmah; and they gave names to the towns that they rebuilt.

39. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.

39. The descendants of Machir son of Manasseh went to Gilead, captured it, and dispossessed the Amorites who were there;

40. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను

40. so Moses gave Gilead to Machir son of Manasseh, and he settled there.

41. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.

41. Jair son of Manasseh went and captured their villages, and renamed them Havvoth-jair.

42. నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.

42. And Nobah went and captured Kenath and its villages, and renamed it Nobah after himself.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 32 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
రూబెన్ మరియు గాద్ తెగలు జోర్డాన్ తూర్పున వారసత్వంగా అభ్యర్థించారు. (1-5) 
రూబేనీయులు మరియు గాదీయులు తాము గెలిచిన భూమిని తమకు ఇవ్వాలని కోరారు. ఎక్కువ భూమిని కోరుకోవడం లేదా ముఖ్యమైనదిగా భావించడం వంటి ప్రాపంచిక విషయాల ద్వారా వారు శోదించబడినందున ఇది జరిగి ఉండవచ్చు. ఇది మంచి ఆలోచన కాదు ఎందుకంటే వారు ప్రతి ఒక్కరికీ ఏది మంచిదో దాని గురించి కాకుండా తమ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో, కొంతమంది యేసు ఏమి కోరుకుంటున్నారో దానికంటే తమ స్వంత ప్రయోజనాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మరియు పరలోకంలో కాకుండా భూమిపై తమకు ఏమి ప్రయోజనం చేకూరుస్తుందనే దాని ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.

మోషే రూబేనీయులు మరియు గాదీయులను గద్దించాడు. (6-15) 
ప్రజలు కనాను దేశాన్ని గౌరవించని, దేవుని వాగ్దానాన్ని విశ్వసించని, అక్కడ నివసించే ప్రజలను జయించడం మరియు వెళ్లగొట్టడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడని ప్రణాళికను ప్రతిపాదించారు. మోషే వారితో కలత చెందాడు. దేవుని ప్రజలు తమ తోటి ప్రజల పట్ల శ్రద్ధ వహించడం మరియు కష్టమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితులలో వారికి సహాయం చేయడం చాలా ముఖ్యం. వారు దేవుణ్ణి నమ్మనప్పుడు మరియు కనానులోకి ప్రవేశించడానికి చాలా భయపడినప్పుడు వారి పూర్వీకులకు ఏమి జరిగిందో మోషే వారికి గుర్తు చేశాడు. పాపం యొక్క చెడు ఫలితాల గురించి ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తే, వారు దానిని చేయడం ప్రారంభించడానికి కూడా భయపడతారు.

వారు తమ అభిప్రాయాలను, మోషే సమ్మతిని వివరిస్తారు. (16-27) 
మోషే ఇశ్రాయేలీయులకు వారి తప్పుల గురించి చెప్పినప్పుడు, వారు విన్నారు మరియు ఫిర్యాదు చేయకుండా వారు చేయవలసినది చేసారు. ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం మరియు కష్టంగా ఉన్నప్పటికీ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండటం ముఖ్యం. కొంతమంది ప్రజలు ఇశ్రాయేలీయులకు కనాను అనే దేశాన్ని జయించడంలో సహాయం చేయడానికి యుద్ధానికి వెళ్లాలనుకున్నారు. మోషే వారిని అనుమతించాడు, కానీ వారు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని లేదా వారు దేవునికి అవిధేయత చూపుతారని హెచ్చరించాడు. మనం ఏదైనా తప్పు చేస్తే, అది ఇతరులకు మాత్రమే అయినా, అది దేవుడిని కలవరపెడుతుంది మరియు దాని పర్యవసానాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. మన తప్పులను గుర్తించి, అవి మరింత ఇబ్బంది కలిగించే ముందు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.

వారు జోర్డాన్‌కు తూర్పున ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. (28-42)
చాలా కాలం క్రితం, కొన్ని సమూహాల ప్రజలు కొన్ని ప్రదేశాలలో నివసించడానికి వచ్చి అక్కడ నగరాలను స్థిరీకరించారు. పాత, చెడు మార్గాలను గుర్తుంచుకోవడానికి ఇష్టపడని వారు నగరాల పేర్లను కూడా మార్చారు. మనమే కాకుండా ఇతరుల గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మనం నిజంగా దేవుణ్ణి విశ్వసించి, యేసును ప్రేమిస్తే, ఇతరులు కూడా వారి ఆధ్యాత్మిక జీవితంలో మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి. మనం ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండేందుకు కృషి చేయాలి, తద్వారా వారు కూడా దేవుణ్ణి మహిమపరచగలరు.



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |