Mark - మార్కు సువార్త 10 | View All
Study Bible (Beta)

1. ఆయన అక్కడనుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను.

1. From there he went to the area of Judea across the Jordan. A crowd of people, as was so often the case, went along, and he, as he so often did, taught them.

2. పరిసయ్యులు ఆయనయొద్దకు వచ్చి, ఆయనను శోధించుటకైపురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని ఆయన నడిగిరి.

2. Pharisees came up, intending to give him a hard time. They asked, 'Is it legal for a man to divorce his wife?'

3. అందుకాయన మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారినడిగెను.

3. Jesus said, 'What did Moses command?'

4. వారుపరిత్యాగ పత్రిక వ్రాయించి, ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా
ద్వితీయోపదేశకాండము 24:1-3

4. They answered, 'Moses gave permission to fill out a certificate of dismissal and divorce her.'

5. యేసు మీ హృదయకాఠిన్యమును బట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసియిచ్చెను గాని

5. Jesus said, 'Moses wrote this command only as a concession to your hardhearted ways.

6. సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను.
ఆదికాండము 1:27, ఆదికాండము 5:2

6. In the original creation, God made male and female to be together.

7. ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును;
ఆదికాండము 2:24

7. Because of this, a man leaves father and mother, and in marriage

8. వారిద్దరు ఏకశరీరమై యుందురు, గనుక వారిక ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.
ఆదికాండము 2:24

8. he becomes one flesh with a woman--no longer two individuals, but forming a new unity.

9. కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని వారితో చెప్పెను.

9. Because God created this organic union of the two sexes, no one should desecrate his art by cutting them apart.'

10. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి.

10. When they were back home, the disciples brought it up again.

11. అందుకాయన తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును.

11. Jesus gave it to them straight: 'A man who divorces his wife so he can marry someone else commits adultery against her.

12. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను.

12. And a woman who divorces her husband so she can marry someone else commits adultery.'

13. తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొనివచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.

13. The people brought children to Jesus, hoping he might touch them.

14. యేసు అది చూచి కోపపడిచిన్నబిడ్డలను నాయెద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే.

14. The disciples shooed them off. But Jesus was irate and let them know it: 'Don't push these children away. Don't ever get between them and me. These children are at the very center of life in the kingdom.

15. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి

15. Mark this: Unless you accept God's kingdom in the simplicity of a child, you'll never get in.'

16. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.

16. Then, gathering the children up in his arms, he laid his hands of blessing on them.

17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను.

17. As he went out into the street, a man came running up, greeted him with great reverence, and asked, 'Good Teacher, what must I do to get eternal life?'

18. యేసు నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.

18. Jesus said, 'Why are you calling me good? No one is good, only God.

19. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.
నిర్గమకాండము 20:12, నిర్గమకాండము 20:13-16, ద్వితీయోపదేశకాండము 5:16, ద్వితీయోపదేశకాండము 5:17-20, ద్వితీయోపదేశకాండము 24:14

19. You know the commandments: Don't murder, don't commit adultery, don't steal, don't lie, don't cheat, honor your father and mother.'

20. అందుకతడు బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను.

20. He said, 'Teacher, I have--from my youth--kept them all!'

21. యేసు అతని చూచి అతని ప్రేమించినీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.

21. Jesus looked him hard in the eye--and loved him! He said, 'There's one thing left: Go sell whatever you own and give it to the poor. All your wealth will then be heavenly wealth. And come follow me.'

22. అతడు మిగుల ఆస్తిగలవాడు, గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని, దుఃఖపడుచు వెళ్లిపోయెను.

22. The man's face clouded over. This was the last thing he expected to hear, and he walked off with a heavy heart. He was holding on tight to a lot of things, and not about to let go.

23. అప్పుడు యేసు చుట్టు చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను.

23. Looking at his disciples, Jesus said, 'Do you have any idea how difficult it is for people who 'have it all' to enter God's kingdom?'

24. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;
యెషయా 52:14

24. The disciples couldn't believe what they were hearing, but Jesus kept on: 'You can't imagine how difficult.

25. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.

25. I'd say it's easier for a camel to go through a needle's eye than for the rich to get into God's kingdom.'

26. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణపొందగలడని ఆయన నడిగిరి.

26. That set the disciples back on their heels. 'Then who has any chance at all?' they asked.

27. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.
ఆదికాండము 18:14, యోబు 42:2, జెకర్యా 8:6

27. Jesus was blunt: 'No chance at all if you think you can pull it off by yourself. Every chance in the world if you let God do it.'

28. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.

28. Peter tried another angle: 'We left everything and followed you.'

29. అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు

29. Jesus said, 'Mark my words, no one who sacrifices house, brothers, sisters, mother, father, children, land--whatever--because of me and the Message

30. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

30. will lose out. They'll get it all back, but multiplied many times in homes, brothers, sisters, mothers, children, and land--but also in troubles. And then the bonus of eternal life!

31. మొదటి వారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.

31. This is once again the Great Reversal: Many who are first will end up last, and the last first.'

32. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరల పండ్రెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవువాటిని వారికి తెలియజెప్పనారంభించి

32. Back on the road, they set out for Jerusalem. Jesus had a head start on them, and they were following, puzzled and not just a little afraid. He took the Twelve and began again to go over what to expect next.

33. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు.

33. 'Listen to me carefully. We're on our way up to Jerusalem. When we get there, the Son of Man will be betrayed to the religious leaders and scholars. They will sentence him to death. Then they will hand him over to the Romans,

34. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.

34. who will mock and spit on him, give him the third degree, and kill him. After three days he will rise alive.'

35. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నామని చెప్పగా

35. James and John, Zebedee's sons, came up to him. 'Teacher, we have something we want you to do for us.'

36. ఆయననేను మీకేమి చేయ గోరుచున్నారని వారి నడిగెను.

36. 'What is it? I'll see what I can do.'

37. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి.

37. 'Arrange it,' they said, 'so that we will be awarded the highest places of honor in your glory--one of us at your right, the other at your left.'

38. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా? అని వారి నడుగగా వారుమాచేత అగుననిరి.

38. Jesus said, 'You have no idea what you're asking. Are you capable of drinking the cup I drink, of being baptized in the baptism I'm about to be plunged into?'

39. అప్పుడు యేసునేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని

39. 'Sure,' they said. 'Why not?' Jesus said, 'Come to think of it, you will drink the cup I drink, and be baptized in my baptism.

40. నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరకునని) వారితో చెప్పెను.

40. But as to awarding places of honor, that's not my business. There are other arrangements for that.'

41. తక్కినపదిమంది శిష్యులు ఆ మాట విని, యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి.

41. When the other ten heard of this conversation, they lost their tempers with James and John.

42. యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురని మీకు తెలియును.

42. Jesus got them together to settle things down. 'You've observed how godless rulers throw their weight around,' he said, 'and when people get a little power how quickly it goes to their heads.

43. మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను.

43. It's not going to be that way with you. Whoever wants to be great must become a servant.

44. మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను.

44. Whoever wants to be first among you must be your slave.

45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

45. That is what the Son of Man has done: He came to serve, not to be served--and then to give away his life in exchange for many who are held hostage.'

46. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.

46. They spent some time in Jericho. As Jesus was leaving town, trailed by his disciples and a parade of people, a blind beggar by the name of Bartimaeus, son of Timaeus, was sitting alongside the road.

47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను.

47. When he heard that Jesus the Nazarene was passing by, he began to cry out, 'Son of David, Jesus! Mercy, have mercy on me!'

48. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.

48. Many tried to hush him up, but he yelled all the louder, 'Son of David! Mercy, have mercy on me!'

49. అప్పుడు యేసు నిలిచివానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.

49. Jesus stopped in his tracks. 'Call him over.' They called him. 'It's your lucky day! Get up! He's calling you to come!'

50. అంతట వాడు బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను.

50. Throwing off his coat, he was on his feet at once and came to Jesus.

51. యేసు - నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడు - బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను.

51. Jesus said, 'What can I do for you?' The blind man said, 'Rabbi, I want to see.'

52. అందుకు యేసు నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయనవెంట చూపుపొందివెళ్లెను.

52. 'On your way,' said Jesus. 'Your faith has saved and healed you.' In that very instant he recovered his sight and followed Jesus down the road.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 10 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

విడాకుల గురించి పరిసయ్యుల ప్రశ్న. (1-12) 
యేసు ఎక్కడికి వెళ్లినా, పెద్ద సమూహాలు ఆయనను వెంబడించాయి మరియు అతను నిరంతరం బోధించడంలో మరియు బోధించడంలో నిమగ్నమయ్యాడు. క్రీస్తు యొక్క సాధారణ అభ్యాసం అతని బోధనలను తెలియజేయడం. ఈ సందర్భంలో, మోషే చట్టం విడాకులను అనుమతించడానికి కారణం ప్రజల కఠిన హృదయాల కారణంగా ఉందని, అయితే వారు ఈ అనుమతిని వెంటనే పొందకూడదని అతను వివరించాడు. దేవుడే భార్యాభర్తలను ఏకం చేసి, ఒకరికొకరు ఓదార్పు మరియు సహాయానికి మూలాలుగా వారిని సృష్టించాడు. దేవుడు ఏర్పరచిన బంధాన్ని తేలికగా విడగొట్టకూడదు. తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇవ్వాలని ఆలోచించే వారు దేవుడు వారితో కూడా అలాగే ప్రవర్తిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి.

చిన్న పిల్లల పట్ల క్రీస్తు ప్రేమ. (13-16) 
కొంతమంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చిన్న పిల్లలను యేసు వద్దకు తీసుకువచ్చారు, వారిని తాకడం ద్వారా వారిని ఆశీర్వదించమని అభ్యర్థించారు. ఈ పిల్లలకు శారీరక వైద్యం అవసరం లేదని, ఇంకా వారికి బోధించే సామర్థ్యం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ, వారికి బాధ్యులు క్రీస్తు ఆశీర్వాదం వారి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు, కాబట్టి వారు వారిని అతని వద్దకు తీసుకువచ్చారు. ఏ ఆటంకం లేకుండా పిల్లలను తన వద్దకు తీసుకురావాలని యేసు ఆదేశించాడు. రక్షకుని బోధలను అర్థం చేసుకోగలిగిన వెంటనే పిల్లలకు పరిచయం చేయడం చాలా ముఖ్యం. అదనంగా, పిల్లలు తమ తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు ఉపాధ్యాయుల పట్ల కలిగి ఉన్న విధంగా క్రీస్తు మరియు ఆయన కృప పట్ల సమానమైన వాత్సల్యాన్ని కలిగి ఉండి, పిల్లల సరళత మరియు నమ్మకంతో మనం దేవుని రాజ్యాన్ని స్వీకరించాలి.

ధనవంతుడైన యువకుడితో క్రీస్తు ప్రసంగం. (17-22) 
యువ పాలకుడు దృఢమైన శ్రద్ధను ప్రదర్శించాడు. శాశ్వతమైన ఆనందాన్ని పొందేందుకు ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన ఆరా తీశారు. చాలా మంది వ్యక్తులు సాధారణంగా తక్షణ ప్రాపంచిక ప్రయోజనాలను కోరుకుంటారు, మత్తయి 6:24లో హైలైట్ చేయబడినట్లుగా, "మీరు దేవుణ్ణి మరియు మమ్మోన్ రెండింటినీ సేవించలేరు."

ధనవంతుల అడ్డంకి. (23-31) 
ఈ సందర్భంగా, సమృద్ధిగా ప్రాపంచిక సంపదను కలిగి ఉన్నవారికి మోక్షానికి సంబంధించిన సవాళ్లను గురించి క్రీస్తు తన శిష్యులతో ప్రసంగించే అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రాపంచిక సంపదను ఉత్సాహంగా వెంబడించే వారు క్రీస్తును మరియు ఆయన కృపను నిజంగా విలువైనదిగా పరిగణిస్తారు. ఇంకా, ఈ లోకంలో కొంత భాగాన్ని కలిగి ఉన్న మరియు క్రీస్తును అనుసరించడం కోసం దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడే వారి రక్షణ యొక్క ప్రాముఖ్యతను అతను నొక్కి చెప్పాడు. సద్గురువు యొక్క దృఢత్వం యొక్క అత్యంత డిమాండ్ పరీక్ష, యేసు పట్ల వారి ప్రేమ స్నేహితులు మరియు బంధువుల కోసం వారి ప్రేమను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు సంభవిస్తుంది. క్రీస్తు నిమిత్తము ఒకడు లాభపడినప్పటికీ, వారు పరలోకానికి చేరే వరకు కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. నిరాడంబర స్థితిలో ఉన్నప్పుడు సంతృప్తిని పెంపొందించుకుందాం మరియు సమృద్ధిగా ఉన్నప్పుడు సంపద యొక్క ఆకర్షణకు వ్యతిరేకంగా కాపాడుకుందాం. క్రీస్తు సేవలో, అవసరమైతే, ప్రతిదానిని విడిచిపెట్టడానికి మరియు అతని ప్రయోజనాల కోసం మనకు అప్పగించబడినవన్నీ ఉపయోగించుకునే శక్తి కోసం ప్రార్థించండి.

క్రీస్తు తన బాధలను ముందే చెప్పాడు. (32-45) 
మానవాళి యొక్క మోక్షానికి తన మిషన్ పట్ల క్రీస్తు యొక్క అచంచలమైన నిబద్ధత అతని శిష్యులను ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరియు ఎప్పటికీ ఉంటుంది. భూసంబంధమైన ప్రతిష్ట తరచుగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు క్రీస్తు స్వంత అనుచరులు కూడా కొన్నిసార్లు దాని మెరుపుతో ఆకర్షితులయ్యారు. అతనితో పాటు ఎలా సహించాలో అర్థం చేసుకోవడానికి మనకు జ్ఞానం మరియు దయ ఉండటం మన ప్రాథమిక ఆందోళన. మన అంతిమ మహిమ యొక్క కొలమానాన్ని నిర్ణయించడానికి మనం అతనిపై మన నమ్మకాన్ని ఉంచవచ్చు.
ప్రపంచంలో అధికారం తరచుగా దుర్వినియోగం చేయబడుతుందని క్రీస్తు వివరిస్తున్నాడు. యేసు మన కోరికలన్నిటిని నెరవేర్చినట్లయితే, మనం గుర్తింపు లేదా అధికారాన్ని కోరుకుంటాము మరియు అతని సవాళ్లను అనుభవించడానికి లేదా అతని పరీక్షలను అనుభవించడానికి ఇష్టపడరు. ఇది తప్పుదారి పట్టించే ప్రార్థనల నెరవేర్పు ద్వారా మనకు హాని కలిగించవచ్చు. అయినప్పటికీ, ఆయన మనపట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడు మరియు తన ప్రజలకు నిజంగా ప్రయోజనకరమైన వాటిని మాత్రమే ఇస్తాడు.

బార్టిమస్ నయం. (46-52)
బర్తిమయస్ యేసు గురించి మరియు అతని అద్భుత కార్యాల గురించి విన్నాడు. యేసు ప్రయాణిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, అతను తన కంటి చూపును తిరిగి పొందగలడనే నిరీక్షణను కలిగి ఉన్నాడు. సహాయం మరియు స్వస్థత కోసం క్రీస్తును సంప్రదించినప్పుడు, ఆయనను వాగ్దానం చేయబడిన మెస్సీయగా పరిగణించడం చాలా అవసరం. తన వద్దకు రావాలని క్రీస్తు అందించిన దయగల ఆహ్వానాలు మనం అలా చేస్తే, మన కోరికలు నెరవేరుతాయని మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. హెబ్రీయులకు 12:1లో చెప్పబడినట్లుగా, యేసును చేరుకోవాలనుకునే వారు స్వయం సమృద్ధి అనే అంగీని విడిచిపెట్టి, ఏవైనా భారాలను వదిలించుకోవాలి మరియు తక్షణమే తమను వలలో వేసుకునే పాపాలను అధిగమించాలి.
బార్టిమేయస్ తన దృష్టిని పునరుద్ధరించమని వేడుకున్నాడు. జీవనోపాధి పొందగలగడం చాలా అభిలషణీయం, మరియు దేవుడు వ్యక్తులకు అవయవాలు మరియు ఇంద్రియాలను ప్రసాదించినప్పుడు, మూర్ఖత్వం మరియు సోమరితనం ద్వారా తనను తాను అంధుడిగా మరియు వికలాంగుడిగా మార్చుకోవడం అవమానకరం. అతని దృష్టి పునరుద్ధరించబడింది మరియు యేసు తన స్వస్థతకు విశ్వాసం కారణమని చెప్పాడు. దావీదు కుమారునిగా క్రీస్తుపై ఆయనకున్న విశ్వాసం, క్రీస్తు కరుణ మరియు శక్తిపై నమ్మకంతో పాటు పరివర్తనకు దారితీసింది. అతని పదే పదే విన్నపాలు మాత్రమే కాదు, అతని విశ్వాసం, క్రీస్తును చర్య తీసుకునేలా ప్రేరేపించింది.
అంధుడైన బార్టిమేయస్‌ను అనుకరించడానికి పాపులు ప్రోత్సహించబడ్డారు. ఎక్కడైనా సువార్త ప్రకటించబడినా లేదా వ్రాతపూర్వక సత్యాలు పంచుకోబడినా, యేసు ఒక అద్వితీయమైన అవకాశాన్ని అందిస్తున్నాడు. ఆధ్యాత్మిక స్వస్థత కోసం మాత్రమే క్రీస్తును వెతకడం సరిపోదు; ఒకసారి నయం అయిన తర్వాత, అతనిని అనుసరించడం కొనసాగించడం చాలా ముఖ్యం. అలా చేయడం ద్వారా, మేము ఆయనను గౌరవిస్తాము మరియు అతని నుండి మార్గదర్శకత్వం పొందుతాము. ఆధ్యాత్మిక అంతర్దృష్టి ఉన్నవారు క్రీస్తు సౌందర్యాన్ని గ్రహిస్తారు, ఆయనను తీవ్రంగా వెంబడించేలా వారిని బలవంతం చేస్తారు.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |