Mark - మార్కు సువార్త 7 | View All
Study Bible (Beta)

1. యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి

1. And the Farisees and summe of the scribis camen fro Jerusalem togidir to hym.

2. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.

2. And whanne thei hadden seen summe of hise disciplis ete breed with vnwaisschen hoondis, thei blameden.

3. పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు.

3. The Farisees and alle the Jewis eten not, but thei waisschen ofte her hoondis, holdynge the tradiciouns of eldere men.

4. మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు.

4. And whanne thei turnen ayen fro chepyng, thei eten not, but thei ben waisschen; and many other thingis ben, `that ben taken `to hem to kepe, wasschyngis of cuppis, and of watir vessels, and of vessels of bras, and of beddis.

5. అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి.

5. And Farisees and scribis axiden hym, and seiden, Whi gon not thi disciplis aftir the tradicioun of eldere men, but with vnwasschen hondis thei eten breed?

6. అందుకాయన వారితో ఈలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
యెషయా 29:13

6. And he answeride, and seide to hem, Ysaie prophesiede wel of you, ypocritis, as it is writun, This puple worschipith me with lippis, but her herte is fer fro me;

7. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.
యెషయా 29:13

7. and in veyn thei worschipen me, techinge the doctrines and the heestis of men.

8. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.

8. For ye leeuen the maundement of God, and holden the tradiciouns of men, wasschyngis of watir vessels, and of cuppis; and many othir thingis lijk to these ye doon.

9. మరియు ఆయన మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.

9. And he seide to hem, Wel ye han maad the maundement of God voide, `to kepe youre tradicioun.

10. నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.
నిర్గమకాండము 20:12, నిర్గమకాండము 21:17, లేవీయకాండము 20:9, ద్వితీయోపదేశకాండము 5:16

10. For Moyses seide, Worschipe thi fadir and thi modir; and he that cursith fadir or modir, die he by deeth.

11. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల,

11. But ye seien, If a man seie to fadir or modir, Corban, that is, What euer yifte is of me, it schal profite to thee;

12. తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక

12. and ouer ye suffren not hym do ony thing to fadir or modir,

13. మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.

13. and ye breken the word of God bi youre tradicioun, that ye han youun; and ye don many suche thingis.

14. అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.

14. And he eftsoone clepide the puple, and seide to hem, Ye alle here me, and vndurstonde.

15. వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,

15. No thing that is withouten a man, that entrith in to hym, may defoule him; but tho thingis that comen forth of a man, tho it ben that defoulen a man.

16. లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.

16. If ony man haue eeris of hering, here he.

17. ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు, ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా

17. And whanne he was entrid in to an hous, fro the puple, hise disciplis axiden hym the parable.

18. ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై యున్నారా? వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానినపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?

18. And he seide to hem, Ye ben vnwise also. Vndurstonde ye not, that al thing without forth that entreth in to a man, may not defoule hym?

19. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును.

19. for it hath not entrid in to his herte, but in to the wombe, and bynethe it goith out, purgynge alle metis.

20. మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.

20. But he seide, The thingis that gon out of a man, tho defoulen a man.

21. లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును

21. For fro with ynne, of the herte of men comen forth yuel thouytis, auowtries,

22. నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.

22. fornycaciouns, mansleyingis, theftis, auaricis, wickidnessis, gile, vnchastite, yuel iye, blasfemyes, pride, foli.

23. ఈ చెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.

23. Alle these yuels comen forth fro with ynne, and defoulen a man.

24. ఆయన అక్కడనుండి లేచి, తూరు సీదోనుల ప్రాంత ములకు వెళ్లి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండలేకపోయెను.

24. And Jhesus roos vp fro thennus, and wente in to the coostis of Tyre and of Sidon. And he yede in to an hous, and wolde that no man wiste; and he myyte not be hid.

25. అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను.

25. For a womman, anoon as sche herd of hym, whos douytir hadde an vnclene spirit, entride, and fel doun at hise feet.

26. ఆ స్త్రీ సురోఫెనికయ వంశ మందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను.

26. And the womman was hethen, of the generacioun of Sirofenyce. And sche preiede hym, that he wolde caste out a deuel fro hir douyter.

27. ఆయన ఆమెను చూచిపిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను.

27. And he seide to hir, Suffre thou, that the children be fulfillid first; for it is not good to take the breed of children, and yyue to houndis.

28. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.

28. And sche answeride, and seide to him, Yis, Lord; for litil whelpis eten vndur the bord, of the crummes of children.

29. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను.

29. And Jhesus seide to hir, Go thou, for this word the feend wente out of thi douytir.

30. ఆమె యింటికి వచ్చి , తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను.

30. And whanne sche was gon in to hir hous home, sche foonde the damysel ligynge on the bed, and the deuel gon out fro hir.

31. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను.

31. And eftsoones Jhesus yede out fro the coostis of Tire, and cam thorou Sidon to the see of Galilee, bitwixe the myddil of the coostis of Decapoleos.

32. అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి.

32. And thei bryngen to hym a man deef and doumbe, and preieden hym to leye his hoond on hym.

33. సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి

33. And he took hym asidis fro the puple, and puttide hise fyngris in to hise eris; and he spetide, and touchide his tonge.

34. ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.

34. And he bihelde in to heuene, and sorewide with ynne, and seide, Effeta, that is, Be thou openyd.

35. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను.

35. And anoon hise eris weren openyd, and the boond of his tunge was vnboundun, and he spak riytli.

36. అప్పుడాయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు

36. And he comaundide to hem, that thei schulden seie to no man; but hou myche he comaundide to hem, so myche more thei prechiden,

37. ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.
యెషయా 35:5-6, యెషయా 52:14

37. and bi so myche more thei wondriden, and seiden, He dide wel alle thingis, and he made deef men to here, and doumbe men to speke.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పెద్దల సంప్రదాయాలు. (1-13) 
క్రీస్తు రాక యొక్క ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం ఆచార చట్టాన్ని రద్దు చేయడం. ఈ లక్ష్య సాధనలో, దేవుని అసలు చట్టానికి ప్రజలు జోడించిన అదనపు ఆచారాలు మరియు అభ్యాసాలను అతను ఖండించాడు. క్రీస్తు తన అనుచరులకు అందించే హృదయ స్వచ్ఛత మరియు చేతుల శుభ్రత చరిత్ర అంతటా పరిసయ్యులు సమర్థించిన బాహ్య మరియు మూఢ ఆచారాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దేవుని ఆజ్ఞలను విస్మరించినందుకు యేసు వారిని మందలించాడు.
నిరుపేద తల్లిదండ్రులకు తమ సామర్థ్యాల మేరకు సహాయం చేయాల్సిన బాధ్యత పిల్లలకు ఉందని స్పష్టమవుతోంది. అంతేకాకుండా, తమ తల్లిదండ్రులను శపించేవారు లేదా నిర్లక్ష్యం చేసేవారు, ప్రత్యేకించి తమ తల్లిదండ్రులను ఆకలితో ఉండేలా అనుమతించే వారు ఖండించబడతారు. అయితే, ఒక వ్యక్తి పరిసయ్యుల సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటే, వారు ఈ విషయంలో తమ బాధ్యత నుండి తప్పించుకోవడానికి మార్గాలను రూపొందించారు.

ఏది మనిషిని అపవిత్రం చేస్తుంది. (14-23) 
మన పాపపు ఆలోచనలు, భావోద్వేగాలు, మాటలు మరియు పనులు మనల్ని కలుషితం చేస్తాయి, మరేమీ కాదు. కలుషితమైన మూలం అశుద్ధ జలాలను అందించినట్లే, పాడైన హృదయం పాపపు ఆలోచనలు, కోరికలు, కోరికలు మరియు దాని నుండి ఉత్పన్నమయ్యే అన్ని చెడు మాటలు మరియు చర్యలకు దారి తీస్తుంది. ఒక వ్యక్తి దేవుని చట్టం యొక్క ఆధ్యాత్మిక అవగాహనను మరియు పాపం యొక్క దుర్మార్గాన్ని గ్రహించినప్పుడు, వారు తమలో రేకెత్తించే పాపపు ఆలోచనలు మరియు భావోద్వేగాలను అరికట్టడానికి పరిశుద్ధాత్మ యొక్క దయను వెతకడానికి పురికొల్పబడతారు.

కనాను కుమార్తె స్త్రీ స్వస్థత పొందింది. (24-30) 
బాధలో ఉన్న ఆత్మ చేయగలిగినట్లుగా, వినయపూర్వకంగా తన వద్దకు వచ్చిన ఎవరినైనా క్రీస్తు ఎప్పుడూ తిప్పికొట్టలేదు. ఈ స్త్రీ సద్గుణవంతురాలు మాత్రమే కాదు, అంకితభావం గల తల్లి కూడా, ఇది ఆమెను క్రీస్తు సహాయాన్ని కోరడానికి దారితీసింది. "మొదట పిల్లలకు భోజనం పెట్టనివ్వండి" అనే అతని ప్రకటన, అన్యజనులపై దయ చూపడానికి ఇంకా స్థలం ఉందని సూచిస్తుంది మరియు ఇది సుదూర అవకాశం కాదు. ఆమె దయను తగ్గించడానికి మాట్లాడలేదు కానీ యూదు సమాజంలోని అద్భుతమైన స్వస్థతలను నొక్కిచెప్పడానికి మాట్లాడలేదు, ఇక్కడ ఒక అద్భుతం కూడా పోల్చి చూస్తే చిన్న చిన్న ముక్కలా అనిపించింది. ఆ విధంగా, గర్విష్ఠులైన పరిసయ్యులు కరుణామయుడైన రక్షకునిచే తాకబడకుండా ఉండిపోయినప్పుడు, అతను పిల్లల కోసం ఉద్దేశించిన జీవనోపాధి కోసం తన వైపు చూసే వినయపూర్వకమైన మరియు పశ్చాత్తాపపడిన పాపులకు తన దయను వెల్లడించాడు. పోగొట్టుకున్నవాటిని వెతుక్కోవడానికి మరియు విమోచించడానికి అతను ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

క్రీస్తు మనిషిని వినికిడి మరియు మాటలను పునరుద్ధరించాడు. (31-37)
మూగ మరియు చెవిటి వ్యక్తి యొక్క వైద్యం గురించి ఇక్కడ వివరించబడింది. ఈ బాధిత వ్యక్తిని క్రీస్తు వద్దకు తీసుకువచ్చిన వ్యక్తులు పరిస్థితిని గమనించి అతని దైవిక శక్తిని ప్రదర్శించమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా, మన ప్రభువు వైద్యం చేయడంలో ఆచారం కంటే ఎక్కువ బాహ్య చర్యలను ఉపయోగించాడు. ఈ చర్యలు మనిషిని స్వస్థపరిచే క్రీస్తు సామర్థ్యానికి చిహ్నాలుగా పనిచేశాయి, మనిషి విశ్వాసానికి మరియు అతనిని తీసుకువచ్చిన వారికి భరోసా ఇస్తున్నాయి. క్రీస్తు సహాయాన్ని కోరినవారిలో విభిన్నమైన పరిస్థితులను మరియు ఉపశమన పద్ధతులను మనం గమనిస్తున్నప్పటికీ, వారందరూ చివరికి వారు కోరుతున్న ఉపశమనాన్ని పొందారు. ఇది మన ఆత్మల యొక్క లోతైన విషయాలలో కొనసాగుతున్న వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |