Luke - లూకా సువార్త 14 | View All
Study Bible (Beta)

1. విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి.

“విశ్రాంతి దినం”– నిర్గమకాండము 20:8-11. “పరిసయ్యులు”– మత్తయి 3:7. లూకా 13:10-17లో జరిగిన విషయాన్ని బట్టి వారంతా యేసును జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉన్నారు లూకా 13:10-17.

2. అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.

3. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?

యేసుకు జవాబు తెలుసు – లూకా 13:15-16; మత్తయి 12:11-12. వారు కాస్తంత బుద్ధిని ఉపయోగించి ఆలోచించేలా చెయ్యాలని ఆయన ప్రయత్నం.

4. అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి

5. మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా? అని వారినడిగెను.

6. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.

7. పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచు కొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

మత్తయి 23:6-7.

8. నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా

9. నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.

10. అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండుము.
సామెతలు 25:7

11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

పై సంగతిలోని ఆధ్యాత్మిక పాఠాన్ని యేసుప్రభువు చెప్తున్నాడు. మనుషులను దిగజార్చేదీ, హెచ్చించేదీ దేవుడే. వారి గుణశీలాలు, మనస్తత్వం ఆధారంగా చేసుకుని ఆయన అలా చేస్తాడు – లూకా 11:43; లూకా 18:14; లూకా 20:46; సామెతలు 3:34; సామెతలు 25:6-7; మత్తయి 18:4; మత్తయి 23:12; యాకోబు 4:10; 1 పేతురు 5:6.

12. మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును.

మనం అనుసరించవలసిన మంచి సూత్రాన్ని యేసు ఇక్కడ చెప్తున్నాడు. అయితే దీన్ని పాటించేదెవరు? ఎక్కువమందికి దీన్ని వినడమే ఇష్టం గాని ఆచరించడం ఇష్టం ఉండదు.

13. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.

14. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

“న్యాయవంతులు...లేచేటప్పుడు”– యోహాను 5:28-29; 1 కోరింథీయులకు 15:22-23, 1 కోరింథీయులకు 15:51-52; 1 థెస్సలొనీకయులకు 4:16; ప్రకటన గ్రంథం 20:4-6. “ప్రతిఫలం కలుగుతుంది”– దేవుడే ప్రతిఫలమిస్తాడు – సామెతలు 19:17; సామెతలు 14:21; మత్తయి 10:42.

15. ఆయనతో కూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు వినిదేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా

“భోజనానికి”– యెషయా 25:6; మత్తయి 8:11; మత్తయి 25:1-10; మత్తయి 26:29; ప్రకటన గ్రంథం 19:9. “దేవుని రాజ్యం”– మత్తయి 4:17. అందులో భోజనానికి కూర్చునేవారంతా నిజంగా ధన్యజీవులు. అయితే తరువాత చెప్తున్న ఉదాహరణలో యేసుప్రభువు చాలమంది దీన్ని అర్థం చేసుకోరనీ, ఆ విందుకు రమ్మని వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ నిరాకరిస్తారనీ చెప్పాడు. మత్తయి 22:1-14 పోల్చి చూడండి.

16. ఆయన అతనితో నిట్లనెను ఒక మనుష్యుడు గొప్పవిందు చేయించి అనేకులను పిలిచెను.

“ఒక మనిషి”అంటే దేవుడే. క్రీస్తు ఎవరి దగ్గరికి వచ్చాడో ఆ యూదులకు ముందుగా ఆయన ఆహ్వానం పంపించాడు – మత్తయి 10:6; మత్తయి 15:24; రోమీయులకు 1:16. ఇప్పుడు లోకమంతటా ఉన్న ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాడు – మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-47.

17. విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైయున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకు తన దాసుని పంపెను.

పాప విముక్తికీ, దేవుని రాజ్యానికీ సంబంధించిన వాటన్నిటినీ దేవుడు తానే సిద్ధం చేశాడు. దేవుడు సిద్ధపరచిన విందు యేసు క్రీస్తే. యోహాను 6:27, యోహాను 6:33, యోహాను 6:35, యోహాను 6:53-58 పోల్చి చూడండి. మనుషులు చేయవలసినదల్లా దేవుని ఆహ్వానాన్ని అంగీకరించి నమ్మకంతో క్రీస్తు చెంతకు రావడమే.

18. అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లిదాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.

ఇది విచిత్రమైన సంగతి. గొప్ప విందుకు వెళ్ళకుండా ఎవరుంటారు? ఏ విధంగానైనా తప్పించుకోదగిన అప్రియమైన చోటికి రమ్మని తమను ఆహ్వానించినట్టు వీరంతా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తనకు కారణం యోహాను 7:7; యోహాను 15:18; రోమీయులకు 8:6-7; 2 కోరింథీయులకు 4:3-4; ఎఫెసీయులకు 4:18 మొదలైన చోట్ల కనిపిస్తున్నది. క్రీస్తును తమ ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించకుండా ఉండేందుకు మనుషులు చెప్పే సాకులన్నీ ఇక్కడున్న సాకులంత బుద్ధిలేనివే. పొలాన్ని ముందుగా చూచుకొకుండా ఏ బుద్ధిలేనివాడు దాన్ని కొంటాడు? ఎద్దుల్ని ముందు చూచుకుని పరీక్ష చేయకుండా ఎవరు కొంటారు? (వ 19). బహుశా తన భార్య కూడా తనతోపాటు విందుకు రావాలనుకుంటుందని కాస్త తెలివితేటలున్నవాడెవడికైనా ఆలోచన వస్తుంది కదా (వ 20). అసలు సంగతేమిటంటే విందుకు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు అంతే. ఎన్ని సాకులు చెప్పినా ఈ సత్యాన్ని దాచలేవు.

19. మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.

20. మరియొకడు నేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.

21. అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ యింటి యజమానుడు కోపపడినీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొనిరమ్మని ఆ దాసునితో చెప్పెను

ఆ మనిషికి కోపం రావడం సహజమే. అతని ఆహ్వానాన్ని మన్నించకపోవడం ద్వారా వారు అతణ్ణి ఘోరంగా అవమానించారు. పాపవిముక్తి, పరలోక ధన్యతలనిస్తానని దేవుడు ఆహ్వానిస్తుంటే నిరాకరించేవారు ఆయన్ను అవమానిస్తున్నారు. అయితే చివర్లో ఆయన ఇల్లు అతిథులతో నిండిపోతుంది. వారు పేదలు, అంగహీనులు అయినప్పటికీ విందులోకి వస్తారు 1 కోరింథీయులకు 1:26-29 పోల్చి చూడండి.

22. అంతట దాసుడు ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను.

23. అందుకు యజమానుడు - నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికిని వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడివారిని బలవంతము చేయుము;

మనుషుల పాప విముక్తికోసం దేవుడెంత తహతహ లాడుతాడో ఇది తెలియజేస్తున్నది. ఆయన క్రీస్తులో ఆ విందునంతా సిద్ధం చేయడంతో, క్రీస్తు సేవకులద్వారా అన్ని చోట్లకీ ఆహ్వానం పంపడంతో అయిపోలేదు. పాపవిముక్తి పొందేందుకు మనుషులకున్న సంకోచాన్ని తొలగించేందుకు అవసరమైనదంతా ఆయన చేస్తాడు. మనుషులు ఆత్రుతగా పరిగెడుతూ వచ్చి పొందదగిన దీవెనలను వారికిచ్చేందుకు సృష్టికర్త తాను సృష్టించిన జీవులను బ్రతిమాలుతున్నాడు.

24. ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.

ఆయన్ను తిరస్కరిస్తున్న యూద జాతికి ఇది ఒక హెచ్చరిక (మత్తయి 21:43). అంతేగాక క్రీస్తుచెంతకు రమ్మన్న ఆహ్వానాన్ని లెక్క చెయ్యకుండా ఉంటున్న ప్రతి వ్యక్తికీ ఇది హెచ్చరిక.

25. బహు జనసమూహములు ఆయనతో కూడ వెళ్లుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి

అలాంటి జనసమూహంలో అనేకమంది తనను నిజంగా అనుసరించేవారు కారని యేసుకు తెలుసు. అంతేగాక అనేకమంది 16-23 వచనాల్లోని ఉదాహరణల్లాంటివాటిని అపార్థం చేసుకుని శిష్యరికం చెయ్యడానికి గల నియమాలు అంత కష్టతరమైనవి కాదనుకుంటారు కూడా. ఇలాంటి అపార్థాలేవైనా ఉంటే ఇప్పుడు యేసుప్రభువు వాటిని సవరించబూను కుంటున్నాడు. తనను అనుసరిస్తూ తనదగ్గర నేర్చుకోగోరే వారు తప్పనిసరిగా పాటించవలసిన మూడు నియమాలను ఇక్కడ చెప్తున్నాడు. ఇతరులపట్ల ఒక శిష్యుని మనస్తత్వం సరిగా ఉండాలి (వ 26), తనపట్ల తనకు సరైన అభిప్రాయం ఉండాలి (వ 26, 27), ఇహలోక విషయాలపట్ల అతని మనస్తత్వం సరిగా ఉండాలి (వ 33), నియమాలన్నీ అంతరంగంలో ఉండే స్థితికి సంబంధించినవి, ఆత్మలో దేవుడు జరిగించిన కార్యాన్ని వెల్లడించేవి. తెలివి, చదువు, ఈ లోకంలోని స్థానం, జాతి మొదలైనవాటికి మనుషులు చాలా ప్రాధాన్యత ఇస్తారు గాని పై విషయాలు ఇలాంటివాటిపై ఆధారపడి లేవు. ఈ మనస్తత్వాలు సహజసిద్ధంగా ఎవరిలోనూ ఉండవు. ఇవి దేవుని కృపవల్ల పవిత్రాత్మ పని ద్వారా కలిగేవి.

26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
ద్వితీయోపదేశకాండము 33:9

తన శిష్యుని విషయంలో యేసు ప్రథమ స్థానం కోరుతున్నాడు. మత్తయి 10:37 చూడండి. క్రీస్తు మొదట, ఇతరులు తరువాత, తాను చివర (లేక “నేను” అనేదానికి అసలు స్థానం ఉండకూడదు) – ఇదీ అసలైన క్రమం. అయ్యో, క్రైస్తవులమని చెప్పుకునేవారిలో ఈ క్రమం తలక్రిందులుగా ఉంటుంది. “నేను” మొదట, ఇతరులు తరువాత, క్రీస్తు చివర. “ద్వేషించకపోతే”– తక్కువగా ప్రేమించడం అని అర్థం (మత్తయి 10:37 పోల్చి చూడండి). శిష్యులు అక్షరాలా ఎవరినీ ద్వేషించకూడదు – మత్తయి 5:43-48; మత్తయి 22:37-38. అయితే క్రీస్తు పట్ల మన ప్రేమతో పోల్చుకుంటే మన కుటుంబ సభ్యులపట్ల మనం చూపే ప్రేమ కొన్ని సార్లు ద్వేషంలాగా కనిపించాలి. ఆయనపై మనకున్న ప్రేమ మనల్ని అవసరమైతే వారిని వదిలి ఆయన్ను అనుసరించేలా, వారికి బదులుగా క్రీస్తుకే మన ప్రాణాలు సైతం ఇవ్వగలిగేలా చెయ్యాలి. శిష్యుడు తన స్వార్థంకోసమే బ్రతకరాదు. క్రీస్తు కోసం అతని ప్రేమ ఎలా ఉండాలంటే అతడు తనను తాను ప్రేమించుకునేది ద్వేషంలాగా కనిపించాలి. ఆ ప్రేమ తన స్వార్థాన్నంతా చంపేసుకునే ప్రయత్నం చెయ్యడానికి అతణ్ణి పురిగొల్పాలి. “శిష్యుడు”– మత్తయి 10:1 నోట్ చూడండి.

27. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు.

మత్తయి 10:38; లూకా 9:23.

28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా?

శిష్యత్వం అంటే ఒక బ్రతుకును కట్టడం. అంటే దేవునికోసం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించడం (మత్తయి 7:24). పై చెప్పిన నియమాలను అనుసరించని వ్యక్తి ఇలా కట్టి పూర్తి చేయలేడు. చాలమంది ఆరంభం బాగానే ఉంటుంది. గాని కొనసాగరు. ముందునుంచీ వారి హృదయం సరైనది కాదు కాబట్టే ఇలా జరుగుతుంది.

29. చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున

30. చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయసాగుదురు.

31. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?

శిష్యత్వమంటే యుద్ధం లాంటిది – ఆధ్యాత్మిక పోరాటం జరుగుతుంది (ఎఫెసీయులకు 6:10-18). క్రీస్తు చెప్పిన ప్రకారం చేయనివారు జయించలేరు. సైతానును జయించడానికి ఏకైక మార్గం అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించడం. ప్రకటన గ్రంథం 12:11 పోల్చి చూడండి. క్రీస్తుకు శిష్యులుగా ఉండగోరినవారు తాము ఎలా ముగించాలో, ఎలా విజయం సాధించాలో ముందుగానే జాగ్రత్తగా గమనించి తెలుసుకొంటే మంచిది.

32. శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.

33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

ఇహలోక వస్తువులపట్ల శిష్యుడి మనస్తత్వం సరిగా ఉండాలి (లూకా 6:20-24; లూకా 12:15; మత్తయి 6:19; 1 తిమోతికి 6:6-11). లేకపోతే దేవుడు ఆ ఆధ్యాత్మిక నిర్మాణం పూర్తి చేయగలిగేందుకు అవసరమైన వనరులను మనకు ఇవ్వడు. క్రీస్తుకోసం మనకున్న వాటినన్నిటినీ వదిలి పెట్టడానికి ఇష్టపడకపోతే పోరాటంలో జయం ఇవ్వడు. ఫిలిప్పీయులకు 3:7-8 పోల్చి చూడండి. ఇది ఎన్నటికీ విఫలం కాని సూత్రం – విడిచిపెట్టిన వాడికి దొరుకుతుంది. ఆత్రంగా అన్నిటినీ కోరుకునేవాడు అన్నిటినీ కోల్పోతాడు (లూకా 9:24; లూకా 17:33; మత్తయి 10:39; యోహాను 12:25 పోల్చి చూడండి).

34. ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?

మత్తయి 5:13; మార్కు 9:50. క్రీస్తును అనుసరించేవారమని చెప్పుకొంటూ, శిష్యులనబడ్డవారిలో ఉండవలసిన మనస్తత్వాలు లేకపోతే అది రుచిలేని ఉప్పులాటిది. ఉప్పదనం లేని ఉప్పులాగా అది నిరుపయోగం, దేనికీ పనికి రాదు. బయట పారవేయడానికి అది తగినది (మత్తయి 25:30 పోల్చి చూడండి).

35. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు విశ్రాంతి రోజున మనిషిని స్వస్థపరుస్తాడు. (1-6) 
ఈ పరిసయ్యుడు, ఇతరులతో పాటు, యేసును తన ఇంటికి ఆహ్వానించేటప్పుడు నిగూఢమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. అయితే, సబ్బాత్ రోజున అతని చర్యలు వివాదాన్ని రేకెత్తిస్తాయనే విషయాన్ని ముందుగానే చూసినప్పటికీ, మన ప్రభువు ఒక వ్యక్తిని స్వస్థపరచాలని నిశ్చయించుకున్నాడు. సబ్బాత్‌ను పాటించేటప్పుడు మతపరమైన భక్తి మరియు దయతో కూడిన చర్యల మధ్య సరైన సమతుల్యతను గుర్తించడం, అవసరమైన పనులు మరియు స్వీయ-ఆనందపూరిత ప్రవర్తనల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా అవసరం. దైవిక జ్ఞానం సహనాన్ని ప్రదర్శించమని మరియు మంచి పనులు చేయడంలో పట్టుదలతో ఉండాలని నిర్దేశిస్తుంది.

అతను వినయాన్ని బోధిస్తాడు. (7-14) 
మన రోజువారీ కార్యకలాపాలలో కూడా, క్రీస్తు మన చర్యలను మన మతపరమైన సమావేశాలలోనే కాకుండా మన డైనింగ్ టేబుల్స్ చుట్టూ కూడా గమనిస్తాడు. ఒక వ్యక్తి యొక్క అహంకారం వారి పతనానికి దారితీస్తుందని మరియు గౌరవం కంటే వినయం ముందు వస్తుందని మనం తరచుగా చూస్తాము. ఈ సందర్భంలో, మన రక్షకుడు బహిరంగ ప్రదర్శన కోసం చేసే చర్యల కంటే నిజమైన దాతృత్వ చర్యలకు ఎక్కువ విలువ ఉంటుందని పాఠం చెబుతాడు. ఏది ఏమైనప్పటికీ, మన ప్రభువు గర్వించదగిన మరియు నిష్కపటమైన దాతృత్వానికి ప్రతిఫలమివ్వాలని ఉద్దేశించలేదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, కానీ తన పట్ల ఉన్న ప్రేమతో పేదలకు మరియు బాధలో ఉన్నవారికి సహాయం చేయాలన్న తన ఆజ్ఞను పాటించడాన్ని నొక్కి చెప్పడం.

గొప్ప విందు యొక్క ఉపమానం. (15-24) 
ఈ ఉపమానం దేవుని యొక్క సమృద్ధిగా ఉన్న దయ మరియు దయను హైలైట్ చేస్తుంది, క్రీస్తు సువార్త ద్వారా ప్రసరిస్తుంది, ఇది వారి స్వంత అవసరాలు మరియు బాధలను గుర్తించే వారికి పోషణ మరియు ఆధ్యాత్మిక విందుగా పనిచేస్తుంది. ఆహ్వానించబడిన అతిథులందరూ హాజరుకాకుండా ఉండటానికి వివిధ సాకులను కనుగొన్నారు, ఇది క్రీస్తు యొక్క దయగల ఆహ్వానాలను నిర్లక్ష్యం చేసినందుకు యూదు దేశానికి మందలింపుగా ఉపయోగపడుతుంది. సువార్త పిలుపుకు ప్రతిస్పందించడంలో ప్రజలు తరచుగా ప్రదర్శించే సంకోచాన్ని కూడా ఇది వివరిస్తుంది.
సువార్త యొక్క ప్రతిపాదనలను తిరస్కరించే వారు ప్రదర్శించే కృతజ్ఞతా లోపము మరియు స్వర్గపు దేవుని పట్ల వారి ధిక్కారము న్యాయంగా దైవిక అసంతృప్తిని రేకెత్తిస్తాయి. తత్ఫలితంగా, యూదులు ఆహ్వానాన్ని తిరస్కరించినప్పుడు అపొస్తలులు తమ దృష్టిని అన్యుల వైపు మళ్లించారు మరియు చర్చి ఈ కొత్త విశ్వాసులతో నిండిపోయింది. క్రీస్తు సువార్తలో విలువైన ఆత్మల కోసం చేసిన ఏర్పాట్లు ఫలించలేదు, కొందరు తిరస్కరించవచ్చు, మరికొందరు కృతజ్ఞతతో ప్రతిపాదనను అంగీకరిస్తారు. సమాజంలోని పేదవారు మరియు అణగారినవారు కూడా క్రీస్తు ఆలింగనంలో సంపన్నులు మరియు శక్తివంతుల వలె స్వాగతించబడతారు మరియు తరచుగా, ప్రాపంచిక ప్రతికూలతలు మరియు శారీరక బలహీనతలను ఎదుర్కొనేవారిలో సువార్త గొప్ప విజయాన్ని పొందుతుంది.

పరిశీలన మరియు స్వీయ-తిరస్కరణ యొక్క ఆవశ్యకత. (25-35)
క్రీస్తు శిష్యులందరూ శిలువ వేయబడనప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ స్వంత శిలువను భరించారు, వారు తప్పక నిర్వర్తించాల్సిన బాధ్యత. ఈ వాస్తవికతను గుర్తించి, దాని చిక్కులను అంచనా వేయమని యేసు వారికి సూచించాడు. మన రక్షకుడు దీనిని రెండు పోలికలతో విశదీకరించాడు: మొదటిది మన విశ్వాసం యొక్క ఖర్చులను నొక్కి చెబుతుంది మరియు రెండవది దాని వలన కలిగే ప్రమాదాలను నొక్కి చెబుతుంది. అందువల్ల, ఖర్చును అంచనా వేయడానికి కొంత సమయం కేటాయించండి; పాపం, అత్యంత ప్రతిష్టాత్మకమైన టెంప్టేషన్లు కూడా అణచివేయడం అవసరమని అర్థం చేసుకోండి.
గర్వించదగిన మరియు అత్యంత సాహసోపేతమైన పాపాత్ముడు కూడా దేవుని కోపాన్ని తట్టుకోలేడు, ఎందుకంటే అతని కోపం యొక్క పరిమాణాన్ని ఎవరు గ్రహించగలరు? అతనితో సయోధ్యను కొనసాగించడం మా ఉత్తమ ఆసక్తి. శాంతి నిబంధనలను చర్చించడానికి మేము దూతలను పంపనవసరం లేదు; ఈ నిబంధనలు మాకు తక్షణమే విస్తరించబడ్డాయి మరియు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. క్రీస్తు యొక్క ప్రతి శిష్యుడు అనివార్యంగా పరీక్షలను ఎదుర్కొంటాడు. మన నిబద్ధతలో ఆత్మసంతృప్తిని నివారించి మరియు మనకు ఎదురయ్యే సవాళ్ల నుండి కుంచించుకుపోకుండా నిజమైన శిష్యులుగా ఉండటానికి కృషి చేద్దాం. అలా చేయడం ద్వారా, మనం భూమికి ఉప్పుగా మారవచ్చు, మన చుట్టూ ఉన్నవారికి క్రీస్తు రుచిని అందజేస్తాము.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |