Luke - లూకా సువార్త 9 | View All
Study Bible (Beta)

1. ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి

1. फिर उस ने बारहों को बुलाकर उन्हें सब दुष्टात्माओं और बिमारियों को दूर करने की सामर्थ और अधिकार दिया।

2. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారినంపెను.

2. और उन्हें परमेश्वर के राज्य का प्रचार करने, और बिमारों को अच्छा करने के लिये भेजा।

3. మరియు ఆయనమీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు.

3. और उस ने उससे कहा, मार्ग के लिये कुछ न लेना: न तो लाठी, न झोली, न रोटी, न रूपये और न दो दो कुरते।

4. మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

4. और जिस किसी घर में तुम उतरो, वहीं रहो; और वहीं से विदा हो।

5. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను.

5. जो कोई तुम्हें ग्रहण न करेगा उस नगर से निकलते हुए अपने पांवों की धूल झाड़ डालो, कि उन पर गवाही हो।

6. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి.

6. सो वे निकलकर गांव गांव सुसमाचार सुनाते, और हर कहीं लोगों को चंगा करते हुए फिरते रहे।।

7. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలోనుండి లేచెననియు,

7. और देश की चौथाई का राजा हेरोदेस यह सब सुनकर घबरा गया, क्योंकि कितनों ने कहा, कि यूहन्ना मरे हुओं में से जी उठा है।

8. కొందరు ఏలీయా కనబడెననియు; కొందరు పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి.

8. और कितनों ने यह, कि एलिरयाह दिखाई दिया है: औरों ने यह, कि पुराने भविष्यद्वक्ताओं में से कोई जी उठा है।

9. అప్పుడు హేరోదు నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.

9. परन्तु हेरोदेस ने कहा, युहन्ना का तो मैं ने सिर कटवाया अब यह कौन है, जिस के विषय में ऐसी बातें सुनता हूं? और उस ने उसे देखने की इच्छा की।।

10. అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను.

10. फिर प्रेरितों ने लौटकर जो कुछ उन्हों ने किया था, उस को बता दिया, और वह उन्हें अलग करके बैतसैदा नाम एक नगर को ले गया।

11. జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను.

11. यह जानकर भीड़ उसके पीछे हो ली: और वह आनन्द के साथ उन से मिला, और उन से परमेश्वर के राज्य की बातें करने लगा: और जो चंगे होना चाहते थे, उन्हें चंगा किया।

12. ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బసచూచుకొని, ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహ మును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.

12. जब दिन ढलने लगा, तो बारहों ने आकर उससे कहा, भीड़ को विदा कर, कि चारों ओर के गावों और बस्तियों में जाकर टिकें, और भोजन का उपाय करें, क्योंकि हम यहां सुनसान जगह में हैं।

13. ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొనితెత్తుమా అని చెప్పిరి.

13. उस ने उन से कहा, तुम ही उन्हें खाने को दो: उन्हों ने कहा, हमारे पास पांच रोटियां और दो मछली को छोड़ और कुछ नहीं: परन्तु हां, यदि हम जाकर इन सब लोगों के लिये भोजन मोल लें, तो हो सकता है: वे लोग तो पांच हजार पुरूषों के लगभग थे।

14. వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయనవారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,

14. जब उस ने अपने चेलों से कहा, उन्हें पचास पचास करके पांति में बैठा दो।

15. వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.

15. उन्हों ने ऐसा ही किया, और सब को बैठा दिया।

16. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.

16. तब उस ने वे पांच रोटियां और दो मछली लीं, और स्वर्ग की और देखकर धन्यवाद किया, और तोड़ तोड़कर चेलों को देता गया, कि लोगों को परोसें।

17. వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
2 రాజులు 4:44

17. सो सब खाकर तृप्त हुए, और बचे हुए टुकड़ों से बारह टोकरी भरकर उठाई।।

18. ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారినడుగగా

18. जब वह एकान्त में प्रार्थना कर रहा था, और चेले उसके साथ थे, तो उस ने उन से पूछा, कि लोग मुझे क्या कहते हैं?

19. వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయాయనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి.

19. उन्हों ने उत्तर दिया, युहन्ना बपतिस्मा देनेवाला, और कोई कोई एलिरयाह, और कोई यह कि पुराने भविष्यद्वक्ताओं में से कोई जी उठा है।

20. అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురునీవు దేవుని క్రీస్తువనెను.

20. उस ने उन से पूछा, परन्तु तुम मुझे क्या कहते हो? पतरस ने उत्तर दिया, परमेश्वर का मसीह।

21. ఆయన ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి

21. तब उस ने उन्हें चिताकर कहा, कि यह किसी से न कहना।

22. మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను.

22. और उस ने कहा, मनुष्य के पुत्रा के लिये अवश्य है, कि वह बहुत दुख उठाए, और पुरनिए और महायाजक और शास्त्री उसे तुच्छ समझकर मार डालें, और वह तीसरे दिन जी उठे।

23. మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.

23. उस ने सब से कहा, यदि कोई मेरे पीछे आना चाहे, तो अपने आप से इन्कार करे और प्रति दिन अपना क्रूस उठाए हुए मेरे पीछे हो ले।

24. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.

24. क्योंकि जो कोई अपना प्राण बचाना चाहेगा वह उसे खोएगा, परन्तु जो कोई मेरे लिय अपना प्राण खोएगा वही उसे बचाएगा।

25. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము?

25. यदि मनुष्य सारे जगत को प्राप्त करे, और अपना प्राण खो दे, या उस की हानि उठाए, तो उसे क्या लाभ होगा?

26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

26. जो कोई मुझ से और मेरी बातों से लजाएगा; मनुष्य का पुत्रा भी जब अपनी, और अपने पिता की, और पवित्रा स्वर्ग दूतों की, महिमा सहित आएगा, तो उस से लजाएगा।

27. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.

27. मैं तुम से सच कहता हूं, कि जो यहां खड़े हैं, उन में से कोई कोई ऐसे हैं कि जब तक परमेश्वर का राज्य न देख लें, तब तक मृत्यु का स्वाद न चखेंगे।

28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను.

28. इन बातों के कोई आठ दिन बाद वह पतरस और यूहन्ना और याकूब को साथ लेकर प्रार्थना करने के लिये पहाड़ पर गया।

29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను.

29. जब वह प्रार्थना कर ही रहा था, तो उसके चेहरे का रूप बदल गया: और उसका वस्त्रा श्वेत होकर चमकने लगा।

30. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.

30. और देखो, मूसा और एलिरयाह, ये दो पुरूष उसके साथ बातें कर रहे थे।

31. వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడు చుండిరి.

31. ये महिमा सहित दिखाई दिए; और उसके मरने की चर्चा कर रहे थे, जो यरूशलेम में होनवाला था।

32. పేతురును అతనితో కూడ ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతో కూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి.

32. पतरस और उसके साथी नींद से भरे थे, और जब अच्छी तरह सचेत हुए, तो उस की महिमा; और उन दो पुरूषों को, जो उसके साथ खड़े थे, देखा।

33. (ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.

33. जब वे उसके पास से जाने लगे, तो पतरस ने यीशु से कहा; हे स्वामी, हमारा यहां रहना भला है: सो हम तीन मण्डप बनाएं, एक तेरे लिये, एक मूसा के लिये, और एक एलिरयाह के लिये। वह जानता न था, कि क्या कह रहा है।

34. అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి.

34. वह यह कह ही रहा था, कि एक बादल ने आकर उन्हें छा लिया, और जब वे उस बादल से घिरने लगे, तो डर गए।

35. మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
ద్వితీయోపదేశకాండము 18:15, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

35. और उस बादल में से यह शब्द निकला, कि यह मेरा पुत्रा और मेरा चुना हुआ है, इस की सुनो।

36. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.

36. यह शब्द होते ही यीशु अकेला पाया गया: और वे चुप रहे, और कुछ देखा था, उस की कोई बात उन दिनों में किसी से न कही।।

37. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.

37. और दूसरे दिन जब वे पहाड़ से उतरे, तो एक बड़ी भीड़ उस से आ मिली।

38. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.

38. और देखो, भीड़ में से एक मनुष्य ने चिल्ला कर कहा, हे गुरू, मैं तुझ से बिनती करता हूं, कि मेरे पुत्रा पर कृपादृष्टि कर; क्योंकि वह मेरा एकलौता है।

39. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడువాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును.

39. और देख, एक दुष्टात्मा उसे पकड़ता है, और वह एकाएक चिल्ला उठता है; और वह उसे ऐसा मरोड़ता है, कि वह मुंह में फेन भर लाता है; और उसे कुचलकर कठिनाई से छोड़ता है।

40. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

40. और मै ने तेरे चेलों से बिनती की, कि उसे निकालें; परन्तु वे न निकाल सके।

41. అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను.

41. यीशु न उत्तर दिया, हे अविश्वासी और हठिले लोगो, मैं कब तक तुम्हारे साथ रहूंगा, और तुम्हारी सहूंगा? अपने पुत्रा को यहां ले आ।

42. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రి కప్పగించెను.

42. वह आ ही रहा था कि दुष्टात्मा ने उसे पटककर मरोड़ा, परन्तु यीशु ने अशुद्ध आत्मा को डांटा और लकड़े को अच्छा करके उसके पिता को सौंप दिया।

43. గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.

43. तब सब लोग परमेश्वर के महासामर्थ से चकित हुए।।

44. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.

44. परन्तु जब सब लोग उन सब कामों से जो वह करता था, अचम्भा कर रहे थे, तो उस ने अपने चेलों से कहा; ये बातें तुम्हारे कानों में पड़ी रहें, क्योंकि मनुष्य का पुत़्रा मनुष्यों के हाथ में पकड़वाया जाने को है।

45. అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.

45. परन्तु वे इस बात को न समझते थे, और यह उन से छिपी रही; कि वे उसे जानने न पाएं, और वे इस बात के विषय में उस से पूछने से डरते थे।।

46. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా

46. फिर उन में यह विवाद होने लगा, कि हम में से बड़ा कौन है?

47. యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి.

47. पर यीशु ने उन के मन का विचार जान लिया : और एक बालक को लेकर अपने पास खड़ा किया।

48. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను

48. और उन से कहा; जो कोई मेरे नाम से इस बालक को ग्रहण करता है, वह मुझे ग्रहण करता है, वह मेरे भेजनेवाले को ग्रहण करता है क्योंकि जो तुम में सब से छोटे से छोटा है, वही बड़ा है।

49. యోహాను ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితివిు; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను.

49. तब युहन्ना ने कहा, हे स्वामी, हम ने एक मनुष्य को तेरे नाम से दुष्टात्माओं को निकालते देखा, और हम ने उसे मना किया, कयोंकि वह हमारे साथ होकर तेरे पीछे नहीं हो लेता।

50. అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.

50. यीशु ने उस से कहा, उसे मना मत करो; क्योंकि जो तुम्हारे विरोध में नहीं, वह तुम्हारी ओर है।।

51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు

51. जब उसके ऊपर उठाए जाने के दिन पूरे होने पर थे, जो उस ने यरूशलेम को जाने का विचार दृढ़ किया।

52. ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని

52. और उस ने अपने आगे दूत भेजे: वे सामरियों के एक गांव में गए, कि उसके लिये जगह तैयार करें।

53. ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.

53. परन्तु उन लोगों ने उसे उतरने न दिया, क्योंकि वह यरूशलेम को जा रहा था।

54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
2 రాజులు 1:10

54. यह देखकर उसके चेले याकूब और यूहन्ना ने कहा; हे प्रभु; क्या तू चाहता है, कि हम आज्ञा दें, कि आकाश से आग गिरकर उन्हें भस्म कर दे।

55. ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.

55. परन्तु उस ने फिरकर उन्हें डांटा और कहा, तुम नहीं जानते कि तुम कैसी आत्मा के हो।

56. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.

56. क्योंकि मनुष्य का पुत्रा लोगों के प्राणों को नाश करने नहीं बरन बचाने के लिये आया है: और वे किसी और गांव में चले गए।।

57. వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడు నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.

57. जब वे मार्ग में चले जाते थे, तो किसी न उस से कहा, जहां जहां तू जाएगा, मैं तेरे पीछे हो लूंगा।

58. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.

58. यीशु ने उस से कहा, लोमड़ियों के भट और आकाश के पक्षियों के बसेरे होते हैं, पर मनुष्य के पुत्रा को सिर धरने की भी जगह नहीं।

59. ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవిచేసెను

59. उस ने दूसरे से कहा, मेरे पीछे हो ले; उस ने कहा; हे प्रभु, मुझे पहिले जाने दे कि अपने पिता को गाड़ दूं।

60. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుమని వానితో చెప్పెను.

60. उस ने उस से कहा, मरे हुओं को अपने मुरदे गाड़ने दे, पर तू जाकर परमेश्वर के राज्य की कथा सुना।

61. మరియొకడు ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా
1 రాజులు 19:20

61. एक और ने भी कहा; हे प्रभु, मैं तेरे पीछे हो लूंगा; पर पहिले मुझे जाने दे कि अपने घर के लोगों से विदा हो आऊं।

62. యేసు నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.

62. यीशु ने उस से कहा; जो कोई अपना हाथ हर पर रखकर पीछे देखता है, वह परमेश्वर के राज्य के योग्य नहीं।।



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అపొస్తలులు పంపారు. (1-9) 
క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులను ఒక మిషన్‌కు పంపాడు, ప్రభువు నుండి వారు పొందిన బోధనలను ఇతరులతో పంచుకోవడానికి వారిని సిద్ధం చేశాడు. వారు తమ బాహ్య రూపాలతో ప్రజలను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టకూడదని, వారు ఉన్నట్లుగా ముందుకు సాగాలని ఆయన ఉద్ఘాటించారు. శక్తి మరియు అధికారం యొక్క అంతిమ మూలం ప్రభువైన యేసు, మరియు అన్ని జీవులు, ఒక విధంగా లేదా మరొక విధంగా, ఆయనకు సమర్పించాలి. పాపులను సాతాను బారి నుండి విడిపించడానికి ఆయన తన దైవిక అధికారంతో తన పరిచారకులతో కలిసి వచ్చినప్పుడు, ఆయన వారి అవసరాలను తీరుస్తాడని వారు నమ్మకంతో ఉండవచ్చు. సత్యం మరియు ప్రేమ వారి సందేశంలో పెనవేసుకుని, ఇంకా దేవుని వాక్యం తిరస్కరించబడినప్పుడు మరియు అపహాస్యం చేయబడినప్పుడు, దానిని తిరస్కరించేవారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పనిచేస్తుంది మరియు వారిని క్షమించకుండా వదిలివేస్తుంది.
హేరోదు, తన అపరాధ మనస్సాక్షితో బాధపడుతూ, యోహాను మృతులలోనుండి లేచి ఉండవచ్చని కూడా ఊహించాడు. అతను యేసును చూడాలనుకున్నాడు కానీ గర్వం కారణంగా లేదా అతని పాపాలకు మరింత మందలించకుండా ఉండాలనే కోరిక కారణంగా అలా చేయడం మానేశాడు. అతను ఆలస్యం చేయడంతో, అతని హృదయం గట్టిపడింది, చివరకు అతను యేసును ఎదుర్కొన్నప్పుడు, లూకా 23:11లో చూసినట్లుగా, ఇతరులవలే ఆయన పట్ల పక్షపాతంతో ఉన్నాడు.

సమూహం అద్భుతంగా తినిపించింది. (10-17) 
జనసమూహం యేసును వెంబడించారు, అసౌకర్య సమయంలో వచ్చారు, అయినప్పటికీ వారు కోరిన వాటిని ఆయన దయతో వారికి అందించాడు. అతను దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడాడు మరియు స్వస్థత అవసరమైన వారిని స్వస్థపరిచాడు. కేవలం ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో, క్రీస్తు అద్భుతంగా ఐదు వేల మందికి ఆహారం ఇచ్చాడు. తనకు భయపడి, నమ్మకంగా సేవించే వారికి ఏమీ లోటు లేకుండా చూస్తాడు. మనం భౌతిక సుఖాలను పొందినప్పుడు, మనం దేవుడిని మూలంగా గుర్తించాలి మరియు మన అనర్హతను గుర్తించాలి. మేము ఆయనకు ప్రతిదానికీ రుణపడి ఉంటాము మరియు శాపాన్ని తొలగించే క్రీస్తు మధ్యవర్తిత్వానికి మన సౌలభ్యం ఆపాదించబడింది. క్రీస్తు ఆశీర్వాదం కొంచెం దూరం వెళ్ళేలా చేస్తుంది, ఆకలితో ఉన్న ప్రతి ఆత్మను అతని ఇంటి మంచితనంతో సంతృప్తిపరుస్తుంది. మా నాన్న ఇంట్లో ఉన్న సమృద్ధిని వివరిస్తూ మిగిలిపోయినవి కూడా సేకరించబడ్డాయి. క్రీస్తులో, మనం ఎన్నటికీ పరిమితం కాదు లేదా లోపము లేదు.

క్రీస్తుకు పీటర్ యొక్క సాక్ష్యం, స్వీయ-తిరస్కరణ ఆజ్ఞాపించింది. (18-27) 
అపారమైన ఓదార్పు మన ప్రభువైన యేసు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అనే వాస్తవంలో ఉంది. అతను మెస్సీయగా మాత్రమే కాకుండా ఈ పాత్రకు పూర్తిగా సన్నద్ధమయ్యాడని ఇది సూచిస్తుంది. యేసు తన స్వంత బాధలను మరియు మరణాన్ని చర్చిస్తున్నాడు. అతని బాధలను నివారించడానికి మార్గాల గురించి ఆలోచించే బదులు, అతని శిష్యులు వారి స్వంత సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. మన విధులను నిర్వర్తించేటప్పుడు మనం తరచుగా పరీక్షలను ఎదుర్కొంటాము మరియు మనం వాటిని ఉద్దేశపూర్వకంగా వెతకకూడదు, అవి మనకు అందించబడినప్పుడు, మనం వాటిని భరించాలి మరియు క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. మన శ్రేయస్సు మన ఆత్మల స్థితి ద్వారా నిర్ణయించబడుతుంది; మరణానంతర జీవితంలో ఒక దయనీయమైన ఆత్మ ఈ ప్రపంచంలో ఆరోగ్యకరమైన శరీరంలో ఆనందాన్ని పొందదు. ఏది ఏమయినప్పటికీ, శరీరం చాలా భారంగా మరియు బాధలో ఉన్నప్పుడు కూడా సంతోషకరమైన ఆత్మ ఇంకా వృద్ధి చెందుతుంది. క్రీస్తు మరియు అతని సువార్త కొరకు నిలబడటానికి మనం ఎన్నటికీ వెనుకాడకూడదు.

రూపాంతరం. (28-36) 
క్రీస్తు రూపాంతరం ప్రపంచాన్ని తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చే మహిమ యొక్క సంగ్రహావలోకనం అందించింది. ఇది అతని శిష్యులకు అతని కొరకు బాధలను భరించడానికి ప్రోత్సాహకరంగా పనిచేసింది. ప్రార్థన అనేది ఒక ప్రకాశవంతమైన ముఖాన్ని ప్రసరింపజేసే పరివర్తన, రూపాంతరం చేసే విధి. తన రూపాంతరం సమయంలో కూడా, మన ప్రభువైన యేసు తన రాబోయే మరణం మరియు బాధలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన గొప్ప భూసంబంధమైన విజయాలను అనుభవించినప్పుడు, ఈ ప్రపంచంలో మనకు శాశ్వత నివాసం లేదని గుర్తుంచుకోండి. మన ఆత్మలను పునరుజ్జీవింపజేసే మరియు మనల్ని సజీవంగా చేసే కృప కోసం మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలి. శిష్యులు చివరికి ఈ స్వర్గపు చిహ్నాన్ని చూసేందుకు మేల్కొన్నారు, సంఘటనల యొక్క వివరణాత్మక ఖాతాను అందించడానికి వారిని అనుమతించారు. అయితే, పరలోకంలో మహిమపరచబడిన పరిశుద్ధుల కోసం భూసంబంధమైన గుడారాలను నిర్మించడం గురించి చర్చించే వారు వారి మాటల పరిమాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు.

ఒక దుష్టాత్మ తరిమివేయబడింది. (37-42) 
ఈ పిల్లవాడి పరిస్థితి ఎంత బాధాకరమో! అతను దుష్టశక్తితో బాధపడ్డాడు మరియు ఈ రకమైన అనారోగ్యాలు పూర్తిగా సహజ కారణాల వల్ల వచ్చే వాటి కంటే చాలా భయంకరమైనవి. సాతాను తన నియంత్రణను పొందినప్పుడు నాశనం చేయగల నాశనాన్ని చూడటం నిజంగా ఆందోళనకరం. అయితే, క్రీస్తును సమీపించే అవకాశం ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు. తన శిష్యులు కూడా చేయలేని వాటిని ఆయన మనకోసం సాధించగలడు. క్రీస్తు నుండి వచ్చిన ఒక్క మాట బిడ్డకు స్వస్థత చేకూర్చింది మరియు మన స్వంత పిల్లలు అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు, వారు క్రీస్తు హస్త స్పర్శతో స్వస్థత పొందినట్లు వారిని స్వీకరించడం గొప్ప ఓదార్పునిస్తుంది.

క్రీస్తు తన శిష్యుల ఆశయాన్ని తనిఖీ చేస్తాడు. (43-50) 
క్రీస్తు రాబోయే బాధల అంచనా చాలా స్పష్టంగా ఉంది, కానీ శిష్యులు దానిని గ్రహించడంలో విఫలమయ్యారు ఎందుకంటే అది వారి ముందస్తు ఆలోచనలతో సరిపెట్టలేదు. సరళత మరియు వినయం యొక్క సూత్రాలను వివరించడానికి క్రీస్తు చిన్న పిల్లల చిత్రాన్ని ఉపయోగించాడు. దేవుడు మరియు క్రీస్తు యొక్క దూతగా ప్రజలచే గుర్తించబడటం మరియు దేవుడు మరియు క్రీస్తు తమను తాము స్వీకరించినట్లు మరియు వారి ద్వారా స్వాగతించబడినట్లు గుర్తించడం కంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ గొప్ప గౌరవాన్ని సాధించగలరు! ఈ భూమ్మీద ఉన్న క్రైస్తవులలో ఏదైనా సమూహం తమ స్వంత విశ్వాసం లేని వారిని మినహాయించడానికి ఎప్పుడైనా కారణం ఉన్నప్పటికీ, పన్నెండు మంది శిష్యులు, ఆ సమయంలో, బలవంతపు ఒకదాన్ని కలిగి ఉన్నారు. అయినప్పటికీ, అలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని క్రీస్తు వారిని హెచ్చరించాడు. క్రీస్తుకు నమ్మకమైన అనుచరులమని నిరూపించుకుని, ఆయన అంగీకారాన్ని పొందే వారు మనలాగే అదే మార్గంలో నడవాల్సిన అవసరం లేదు.

అతను వారి తప్పు ఉత్సాహాన్ని ఖండించాడు. (51-56) 
సమరయుల ప్రవర్తన ప్రాథమికంగా జాతీయ పక్షపాతాలు మరియు దేవుని పదం మరియు ఆరాధన పట్ల ప్రత్యక్ష శత్రుత్వం కంటే అసహనంతో ముడిపడి ఉందని శిష్యులు గుర్తించలేకపోయారు. క్రీస్తును మరియు ఆయన శిష్యులను స్వీకరించడానికి వారు నిరాకరించినప్పటికీ, వారు వారితో దుర్మార్గంగా ప్రవర్తించలేదు లేదా హాని చేయలేదు, వారి పరిస్థితిని అహజ్యా మరియు ఎలిజాల నుండి భిన్నంగా చేసింది. ఇంకా, సువార్త యుగం దయగల అద్భుతాల ద్వారా వర్గీకరించబడిందని వారికి తెలియదు. చాలా ముఖ్యమైనది, వారు తమ స్వంత హృదయాలలో ఉన్న ఆధిపత్య ప్రేరణలను విస్మరించారు, అవి గర్వం మరియు ప్రాపంచిక ఆశయం. దీని గురించి యేసు వారిని హెచ్చరించాడు. "ప్రభువు కోసం మన ఉత్సాహాన్ని చూసి రండి!" అని ప్రకటించడం మనకు చాలా సులభం. వాస్తవానికి, మనం మన వ్యక్తిగత ప్రయోజనాలను అనుసరిస్తూ మరియు అనుకోకుండా మంచి చేయడానికి బదులుగా ఇతరులకు హాని కలిగిస్తున్నప్పుడు మనం అతని కారణానికి అనూహ్యంగా నమ్మకంగా ఉన్నామని పొరపాటుగా నమ్ముతున్నాము.

క్రీస్తు కొరకు ప్రతి వస్తువును వదులుకోవాలి. (57-62)
ఇక్కడ మనకు ఒక వ్యక్తి క్రీస్తుని అనుసరించడానికి ఆసక్తిని కలిగి ఉన్నాడు, కానీ పూర్తి చిక్కులను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపాటుతో వ్యవహరించినట్లు కనిపిస్తాడు. మనం క్రీస్తుని అనుసరించాలని అనుకుంటే, ప్రాపంచిక విజయం కోసం ఆశయాలను పక్కన పెట్టాలి. మన క్రైస్తవ విశ్వాసాన్ని భౌతిక లాభాల సాధనతో కలపడానికి మనం ప్రయత్నించకూడదు. అప్పుడు, క్రీస్తును అనుసరించాలని నిశ్చయించుకున్న మరొక వ్యక్తిని మనం కలుస్తాము, కానీ కొద్దిసేపు ఆలస్యం చేయమని కోరతాడు. క్రీస్తు మొదట్లో ఈ వ్యక్తికి పిలుపునిచ్చాడు, "నన్ను అనుసరించు" అని చెప్పాడు. మతం మనకు దయగా మరియు సద్గుణంగా ఉండాలని, మన ఇళ్లలో భక్తిని ప్రదర్శించాలని మరియు మన తల్లిదండ్రులను గౌరవించాలని బోధిస్తున్నప్పటికీ, దేవుని పట్ల మన కర్తవ్యాన్ని విస్మరించడానికి వీటిని సాకులుగా ఉపయోగించకూడదు.
తరువాతి సందర్భంలో, క్రీస్తును అనుసరించడానికి ఇష్టపడే వ్యక్తిని మనం చూస్తాము, అయితే కుటుంబ సభ్యులతో సంప్రదించి ఇంటి వ్యవహారాలను నిర్వహించడానికి కొంత సమయం కోరుతుంది. అతను ప్రాపంచిక ఆందోళనలతో ఎక్కువగా నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది, క్రీస్తును అనుసరించాలనే అతని నిబద్ధత నుండి అతన్ని మళ్లించే అవకాశం ఉంది. ఇతర విషయాలలో పరధ్యానంలో ఉంటే దేవుని పనిని సమర్థవంతంగా నిర్వహించలేరు. దేవుణ్ణి సేవించే మార్గాన్ని ప్రారంభించేవారు పట్టుదలతో ఉండాలని నిర్ణయించుకోవాలి, ఎందుకంటే వెనక్కి తిరిగి చూడటం తిరోగమనానికి దారితీస్తుంది మరియు తిరోగమనం ఆధ్యాత్మిక నాశనానికి దారితీస్తుంది. చివరి వరకు సహించే వారికే మోక్షం లభిస్తుంది.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |