John - యోహాను సువార్త 8 | View All
Study Bible (Beta)

1. యేసు ఒలీవలకొండకు వెళ్లెను.

1. Iesus went vnto mout Oliuete.

2. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.

2. And early in the mornyng he came agayne into the temple, and all the people came vnto hym, & he sate downe and taught them.

3. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి

3. And the scribes and pharisees brought vnto hym a woman taken in adulterie, & when they had set her in the middes,

4. బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;

4. They sayde vnto hym: Maister, this woman was taken in adulterie, euen as the deede was a doyng.

5. అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
లేవీయకాండము 20:10, ద్వితీయోపదేశకాండము 22:22

5. Moyses in the lawe commaunded vs that suche shoulde be stoned: But what sayest thou?

6. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.

6. This they sayde to tempte hym, that they myght accuse hym. But Iesus stowped downe, and with his fynger wrote on the grounde.

7. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
ద్వితీయోపదేశకాండము 17:7

7. So, when they continued asking him, he lyft vp hym selfe, & sayde vnto them: Let hym that is among you without sinne, caste the first stone at her.

8. మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.

8. And agayne he stowped downe, and wrote on the grounde.

9. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.

9. And when they hearde this, beyng accused of their owne consciences, they went out one by one, begynnyng at the eldest, euen vnto the last: and Iesus was left alone, & the woman standyng in the myddes.

10. యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు

10. When Iesus had lyft vp hym selfe, & sawe no man but the woman, he sayde vnto her: Woma where are those thine accusers? Hath no man condempned thee?

11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

11. She sayde, No man Lorde. And Iesus sayde, Neither do I condempne thee: Go, and sinne no more.

12. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
యెషయా 49:6

12. Then spake Iesus agayne vnto them, saying, I am the light of ye world: He that foloweth me, doth not walke in darknesse, but shal haue the light of life.

13. కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా

13. The pharisees therfore said vnto him: Thou bearest recorde of thy selfe, thy recorde is not true.

14. యేసు నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.

14. Iesus aunswered, & saide vnto them: Though I beare recorde of my selfe, yet my recorde is true. For I knowe whence I came, & whyther I go: But ye can not tel whence I come, and whyther I go.

15. మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.

15. Ye iudge after the fleshe, I iudge no man.

16. నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.

16. And if I iudge, my iudgement is true: For I am not alone, but I and the father that sent me.

17. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.
ద్వితీయోపదేశకాండము 17:6, ద్వితీయోపదేశకాండము 19:15

17. It is also written in your lawe, that the testimonie of two men is true.

18. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.

18. I am one that beareth witnesse of my selfe, & the father that sent me beareth witnesse of me.

19. వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రినికూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.

19. Then sayde they vnto hym: Where is thy father? Iesus aunswered, Ye neither knowe me, nor yet my father: Yf ye had knowen me, ye should haue knowen my father also.

20. ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

20. These wordes spake Iesus in ye treasurie, as he taught in the temple, and no man layde handes on hym, for his houre was not yet come.

21. మరియొకప్పుడు ఆయననేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.

21. Then sayde Iesus againe vnto them: I go my way, and ye shall seeke me, and shall dye in your synnes: Whyther I go, thyther can ye not come.

22. అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.

22. Then sayde the Iewes: Wyll he kyll hym selfe, because he saith, whyther I go, thyther can ye not come?

23. అప్పుడాయన మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.

23. And he sayde vnto them: ye are from beneathe, I am from aboue: ye are of this worlde, I am not of this worlde.

24. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

24. I sayde therefore vnto you, that you shall dye in your sinnes. For yf ye beleue not that I am he, ye shall dye in your sinnes.

25. కాబట్టి వారు నీవెవరవని ఆయన నడుగగా యేసు వారితో మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.

25. Then sayde they vnto hym: Who art thou? And Iesus saith vnto them: Euen the very same thyng that I sayde vnto you from the begynnyng.

26. మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.

26. I haue many thynges to saye, and to iudge of you. Yea, & he that sent me, is true: And I speake to the world, those thynges which I haue hearde of hym.

27. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.

27. Howebeit, they vnderstoode not that he spake to them of his father.

28. కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

28. Then saide Iesus vnto them: When ye haue lift vp [an hye] the sonne of man, then shall ye knowe that I am he, and that I do nothyng of my selfe: but as my father hath taught me, euen so I speake these thynges.

29. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.

29. And he that sent me, is with me. The father hath not left me alone: For I do alwayes those thynges that please him.

30. ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి.

30. As he spake those wordes, many beleued on hym.

31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;

31. Then sayde Iesus to those Iewes which beleued on him: Yf ye continue in my word, then are ye my very disciples.

32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

32. And ye shall knowe the trueth, and the trueth shall make you free.

33. వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
Neh-h 9 36:1

33. They aunswered hym: We be Abrahams seede, and were neuer bonde to any man: howe sayest thou then, ye shalbe made free?

34. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

34. Iesus aunswered them: Ueryly, veryly I say vnto you, that whosoeuer comitteth sinne, is the seruaunt of sinne.

35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారుడెల్లప్పుడును నివాసముచేయును.
నిర్గమకాండము 21:2, ద్వితీయోపదేశకాండము 15:12

35. And the seruaut abideth not in ye house for euer: but the sonne abydeth euer.

36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

36. Yf the sonne therefore shall make you free, then are ye free in deede.

37. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.

37. I know that ye are Abrahams seede, but ye seke [meanes] to kyll me, because my worde hath no place in you.

38. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను.

38. I speake that whiche I haue seene with my father: and ye do that whiche ye haue seene with your father.

39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.

39. They aunswered, and saide vnto him: Abraham is our father. Iesus saith vnto them: Yf ye were Abrahams childre, ye woulde do the workes of Abraham.

40. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు

40. But now ye go about to kyll me, a ma that hath tolde you the trueth, which I haue heard of god: this did not Abraha.

41. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా
ద్వితీయోపదేశకాండము 32:6, యెషయా 63:16, యెషయా 64:8

41. Ye do the deedes of your father. Then said they to him: We be not borne of fornication, we haue one father, euen God.

42. యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.

42. Iesus saide vnto them: Yf God were your father, truely ye woulde loue me: For I proceaded foorth, and came from God: neither came I of my selfe, but he sent me.

43. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా?

43. Why do ye not knowe my speache? euen because ye cannot heare my word.

44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
ఆదికాండము 3:4

44. Ye are of your father the deuyll, and the lustes of your father wyll ye do. He was a murtherer from the begynnyng, and abode not in the trueth: because there is no trueth in hym. When he speaketh a lye, he speaketh of his owne: For he is a lyer, and the father of the same thyng.

45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.

45. And because I tel you the trueth, therfore ye beleue me not.

46. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

46. Which of you rebuketh me of sinne? Yf I say the trueth, why do not ye beleue me?

47. దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.

47. He that is of god, heareth gods wordes. Ye therfore heare the not, because ye are not of God.

48. అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

48. Then aunswered the Iewes, & saide vnto hym: Say we not well that thou art a Samaritane, and hast the deuyl?

49. యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.

49. Iesus aunswered, I haue not the deuyll: but I honour my father, and ye haue dishonoured me.

50. నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు.

50. I seke not myne owne praise, there is one that seketh, and iudgeth.

51. ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.

51. Ueryly veryly I saye vnto you, yf a man kepe my saying, he shall neuer see death.

52. అందుకు యూదులు నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.

52. Then sayde the Iewes vnto hym: Now know we that thou hast ye deuyll. Abraham is dead, & the prophetes: and thou sayest, yf a man kepe my saying, he shall neuer taste of death.

53. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.

53. Art thou greater the our father Abraham, which is dead? and the prophetes are dead: whom makest thou thy selfe?

54. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.

54. Iesus aunswered: Yf I honour my selfe, mine honour is nothing. It is my father that honoureth me, which ye say is your God:

55. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.

55. And yet ye haue not knowen him, but I knowe hym: And if I say I knowe hym not, I shalbe a lyer lyke vnto you. But I knowe hym, & kepe his saying.

56. మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.

56. Your father Abraham was glad to see my day: and he saw it, and reioyced.

57. అందుకు యూదులు నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,

57. Then sayde the Iewes vnto hym: Thou art not yet fiftie yeres olde, & hast thou seene Abraham.

58. యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

58. Iesus sayde vnto them: Ueryly, veryly I saye vnto you, before Abraham was, I am.

59. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.

59. Then toke they vp stones to caste at hym: but Iesus hyd hym selfe, and went out of the temple.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 8 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

పరిసయ్యులు మరియు వ్యభిచారి. (1-11) 
క్రీస్తు చట్టాన్ని విమర్శించలేదు లేదా నిందితుల అపరాధాన్ని క్షమించలేదు. అతను పరిసయ్యుల బూటకపు ఉత్సాహాన్ని కూడా ఆమోదించలేదు. అదే చర్యలకు పాల్పడుతూ ఇతరులను తీర్పు తీర్చే వారు తమను తాము ఖండించుకుంటారు. ఇతరుల లోపాలను ఎత్తి చూపే పనిలో ఉన్నవారు ముఖ్యంగా తమను తాము పరీక్షించుకుని స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఈ పరిస్థితిలో, క్రీస్తు తన ప్రాథమిక లక్ష్యంపై దృష్టి సారించాడు: పాపులను పశ్చాత్తాపానికి తీసుకురావడం, నాశనం చేయడం కాదు. అతని లక్ష్యం మోక్షం, ఖండించడం కాదు.
దయ ద్వారా నిందితులను మాత్రమే కాకుండా వారి పాపాలను బహిర్గతం చేయడం ద్వారా ప్రాసిక్యూటర్లను కూడా పశ్చాత్తాపానికి దారితీయాలని క్రీస్తు లక్ష్యంగా పెట్టుకున్నాడు. పరిసయ్యులు అతనిని ట్రాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, క్రీస్తు వారిని ఒప్పించి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మేజిస్ట్రేట్ పాత్రలో జోక్యం చేసుకోకుండా తెలివిగా తప్పించుకున్నాడు. కొన్ని నేరాలు కఠినమైన శిక్షకు అర్హమైనప్పటికీ, మనకు అప్పగించని బాధ్యతలను చేపట్టడం మన స్థలం కాదు.
ఇకపై పాపం చేయవద్దని క్రీస్తు స్త్రీకి సూచించినప్పుడు, అది ఒక కీలకమైన జాగ్రత్తను తీసుకుంది. నేరస్థుడి ప్రాణాలను రక్షించడంలో పాలుపంచుకున్న వారు వారి ఆత్మను కాపాడుకోవడంలో కూడా శ్రద్ధ వహించాలి, ప్రవర్తనలో మార్పు అవసరాన్ని నొక్కి చెప్పారు. క్రీస్తు శిక్ష నుండి తప్పించుకోవడంలో నిజమైన ఆనందం ఉంది. గత పాపాల క్షమాపణ ఇకపై పాపానికి నిబద్ధతను ప్రేరేపించాలి.

పరిసయ్యులతో క్రీస్తు ప్రసంగం. (12-59)
12-16
క్రీస్తు వెలుగుగా వర్ణించబడిన దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచానికి వెలుగుగా పనిచేస్తాడు. ఈ సారూప్యతలో, ఒక సూర్యుడు మొత్తం ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసినట్లే, ఒక క్రీస్తు కాంతిని తెస్తాడు మరియు అదనపు మూలం అవసరం లేదు. సూర్యుడు లేకపోవటం ప్రపంచాన్ని ఎలా చీకటిలోకి నెట్టివేస్తుందో అదే విధంగా, ప్రపంచంలోకి ప్రవేశించిన కాంతి యేసు లేకుండా, అది ఆధ్యాత్మిక చీకటిగా ఉంటుంది.
క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకునే వారు తమను తాము అంధకారంలో నడవలేరు. ఆయనతో జతకట్టడం ద్వారా, వారు అబద్ధాన్ని ఆలింగనం చేయకుండా కాపాడే మరియు విధి మార్గంలో మార్గనిర్దేశం చేసే ముఖ్యమైన సత్యాలకు ప్రాప్తిని పొందుతారు, పాపాన్ని ఖండించకుండా వారిని నిరోధిస్తారు. వెలుతురుగా క్రీస్తు పాత్ర ఆయనను అనుసరించే వారు ఆధ్యాత్మిక అస్పష్టతలో ఉండకుండా చూస్తుంది.

17-20
క్రీస్తును గూర్చిన లోతైన అవగాహన తండ్రిని బాగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది. క్రీస్తు నుండి నేర్చుకునేందుకు నిరాకరించే వారు దేవుని గురించి తప్పుదారి పట్టించేవారు, వారి ఆలోచనలను వ్యర్థం చేస్తారు. క్రీస్తు ద్వారా దేవుని మహిమ మరియు దయ యొక్క జ్ఞానం అవసరం; అది లేకుండా, తనను పంపిన తండ్రి గురించి తెలియని వ్యక్తిగా మిగిలిపోతాడు.
మనం ఈ లోకం నుండి బయలుదేరే సమయం దేవుని ఆధీనంలో ఉంటుంది. మన విరోధులు గాని, మన మిత్రులు గాని దానిని వేగవంతం చేయలేరు, తండ్రి నిర్ణయించిన సమయానికి మించి దానిని వాయిదా వేయలేరు. ప్రతి నిజమైన విశ్వాసి తమ విధి దేవుని చేతుల్లో ఉందని, తమ స్వంత నియంత్రణలో ఉండటం కంటే ఇది ఉత్తమమైన పరిస్థితి అని ఆనందంగా అంగీకరించవచ్చు. దేవుని ప్రతి ఉద్దేశ్యానికి ఒక నిర్దిష్ట సమయం ఉంది.

21-29
అవిశ్వాసాన్ని కొనసాగించేవారు ఆ స్థితిలో మరణిస్తే శాశ్వతమైన నాశనాన్ని ఎదుర్కొంటారు. ప్రస్తుత అవినీతి ప్రపంచానికి చెందిన యూదులు, యేసు యొక్క స్వర్గపు మరియు దైవిక స్వభావాన్ని వారి ప్రాధాన్యతలకు విరుద్ధంగా కనుగొన్నారు. అయితే, సువార్త యొక్క కృపను స్వీకరించిన వారికి చట్టం యొక్క శాపం తొలగించబడుతుంది. క్రీస్తు దయ యొక్క సిద్ధాంతం మాత్రమే శక్తివంతమైన వాదనగా పనిచేస్తుంది మరియు క్రీస్తు దయ యొక్క ఆత్మ మాత్రమే మనలను పాపం నుండి దేవుని వైపుకు తిప్పడానికి సమర్థవంతమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈ ఆత్మ మరియు సిద్ధాంతం క్రీస్తును విశ్వసించే వారిపై ప్రత్యేకంగా పనిచేయడానికి ఇవ్వబడ్డాయి.
కొందరు యేసును ప్రవక్తగా మరియు అసాధారణమైన బోధకునిగా గుర్తిస్తూ, ఆయనకు జీవి హోదా కంటే ఎక్కువ ఆపాదిస్తూ ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ, దేవుడు ఎప్పటికీ ఆశీర్వదించినట్లుగా, ఆయనను సర్వోన్నతుడిగా గుర్తించడానికి వారు సంకోచిస్తారు. యేసు ఈ సంశయవాదానికి ప్రతిస్పందించాడు, అతను తనకు అత్యున్నతమైన గౌరవాలను పొందుతున్నప్పుడు కూడా తండ్రి యొక్క సంతోషానికి అనుగుణంగా మాట్లాడేవాడు మరియు ప్రవర్తించాడని నొక్కి చెప్పాడు. అతని దైవిక స్థితి యొక్క రుజువు కొంతమందిని మార్చడంలో మరియు మరికొందరిని ఖండించడంలో స్పష్టంగా కనిపిస్తుంది.

30-36
మన ప్రభువు మాటలు చాలా బలవంతపు శక్తిని కలిగి ఉన్నాయి, చాలామంది ఒప్పించబడ్డారు మరియు ఆయనపై తమ నమ్మకాన్ని బహిరంగంగా ప్రకటించారు. వివిధ ప్రలోభాలను ఎదుర్కొన్నప్పటికీ తన బోధనలలో చురుకుగా పాల్గొనాలని, ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచాలని మరియు ఆయన ఆదేశాలను పాటించాలని ఆయన వారిని కోరారు. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా, వారు నిశ్చయంగా ఆయన శిష్యులు అవుతారు. అతని మాట మరియు ఆత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా, వారు తమ ఆశ మరియు శక్తి యొక్క మూలాన్ని అర్థం చేసుకుంటారు.
క్రీస్తు ఆధ్యాత్మిక స్వేచ్ఛ యొక్క భావనను నొక్కి చెప్పాడు, అయితే ప్రాపంచిక ఆందోళనలు ఉన్నవారు భౌతిక అసౌకర్యాలు మరియు వారి భౌతిక శ్రేయస్సుకు సవాళ్లపై మాత్రమే దృష్టి పెడతారు. వారు తమ వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు ఆస్తుల గురించి చర్చలను తక్షణమే అర్థం చేసుకుంటూ, పాపం యొక్క బానిసత్వం, సాతానుకు బానిసత్వం మరియు క్రీస్తు అందించే స్వేచ్ఛ గురించి వారి చెవులకు తెలియని భావనలను తెస్తుంది.
పాపపు అలవాట్లలో మునిగితేలేవారు వాస్తవానికి ఆ పాపాలకు బానిసలవుతారని యేసు సూటిగా ఎత్తి చూపాడు—వారిలో అనేకుల ప్రస్తుత స్థితిని వివరిస్తుంది. సువార్తలో, క్రీస్తు నిజమైన స్వాతంత్ర్యానికి సంబంధించిన ప్రతిపాదనను విస్తరింపజేసాడు, దానిని మంజూరు చేసే శక్తిని కలిగి ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ, కొన్ని పాపపు కోరికలకు బానిసలుగా ఉంటూనే వ్యక్తులు వివిధ రకాల స్వేచ్ఛల గురించి ఉద్రేకంతో చర్చించడం అసాధారణం కాదు.

37-40
మన ప్రభువు యూదుల యొక్క అహంకార మరియు తప్పుడు విశ్వాసాన్ని ఎదుర్కొన్నాడు, అబ్రాహాము నుండి వచ్చిన వారి వంశం విరుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉన్నవారికి ఎటువంటి ప్రయోజనాన్ని అందించలేదని హైలైట్ చేసింది. దేవుని వాక్యాన్ని విస్మరించిన చోట, మంచితనాన్ని ఊహించలేమని, అది అన్ని రకాల దుష్టత్వాలకు నిలయంగా మారుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఇది తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగి వైద్య చికిత్స మరియు జీవనోపాధి రెండింటినీ తిరస్కరించడం వంటిది, కోలుకోవడానికి ఆశకు మించిన పాయింట్‌ని సూచిస్తుంది.
సత్యం స్వస్థత చేకూర్చడమే కాకుండా దానిని స్వీకరించిన వారి హృదయాలను కూడా పోషిస్తుంది. ఈ పరివర్తన శక్తి దేవుని సత్యానికి ప్రత్యేకమైనది మరియు తత్వవేత్తల బోధనల ద్వారా ప్రతిరూపం కాదు. అబ్రహంతో అనుబంధించబడిన అధికారాలను క్లెయిమ్ చేసేవారు తప్పనిసరిగా అబ్రహం యొక్క చర్యలకు అద్దం పట్టాలి-వారు ఈ ప్రపంచంలో అపరిచితులుగా మరియు విదేశీయులుగా జీవించాలి, వారి ఇళ్లలో దేవుని ఆరాధనను కొనసాగించాలి మరియు దేవుని మార్గదర్శకానికి అనుగుణంగా స్థిరంగా నడుచుకోవాలి.

41-47
సాతాను వ్యక్తులను వారి స్వంత నాశనానికి మరియు ఇతరులకు హాని కలిగించే ప్రవర్తనలలో పాల్గొనమని ప్రేరేపిస్తాడు. అతను మనస్సులో కలిగించే ఆలోచనలు వ్యక్తుల ఆత్మలను పాడు చేసే ధోరణిని కలిగి ఉంటాయి. అతను వివిధ రకాల అబద్ధాల యొక్క ప్రధాన ప్రచారకుడు, మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని వక్రీకరించడం ద్వారా స్థిరంగా మోసగించడం మరియు పాపపు చర్యలలో స్వేచ్ఛ యొక్క తప్పుడు వాగ్దానంతో ప్రలోభపెట్టడం. అతను అన్ని అబద్ధాలకు మూలకర్త, మరియు అసత్యంలో నిమగ్నమై ఉన్నవారు అతనితో కలిసిపోతారు మరియు తదనుగుణంగా పరిణామాలను ఎదుర్కొంటారు.
ఆధ్యాత్మిక దుష్టత్వాన్ని ప్రోత్సహించడం, మనస్సు యొక్క అనారోగ్యకరమైన కోరికలను పెంపొందించడం, అవినీతి తర్కాన్ని ప్రోత్సహించడం, అహంకారం మరియు అసూయను పెంచడం, కోపం మరియు దుర్మార్గాన్ని ప్రేరేపించడం, మంచి పట్ల శత్రుత్వాన్ని కలిగి ఉండటం మరియు ఇతరులను తప్పుగా ప్రలోభపెట్టడం వంటివి డెవిల్ యొక్క ప్రత్యేక దుర్గుణాలు. సత్యం యొక్క సందర్భంలో, ఇది యేసుక్రీస్తు ద్వారా మానవాళి యొక్క మోక్షానికి సంబంధించి వెల్లడైన దేవుని చిత్తాన్ని సూచిస్తుంది, ఇది క్రీస్తు చురుకుగా బోధిస్తున్నప్పటికీ యూదులచే ప్రతిఘటించబడిన సత్యం.

48-53
క్రీస్తు ప్రజల ఆమోదం పట్ల ఎంత తక్కువ శ్రద్ధ చూపుతున్నాడో గమనించండి. ఇతరుల పొగడ్తలను పట్టించుకోని వారు వారి అసమ్మతిని సహించగలరు. తమను తాము కోరుకోవడంలో నిమగ్నమై లేని వారి గౌరవాన్ని దేవుడు చురుకుగా కొనసాగిస్తాడు. ఈ శ్లోకాలలో, బోధన విశ్వాసుల శాశ్వతమైన ఆనందాన్ని నొక్కి చెబుతుంది. ఇది విశ్వాసి యొక్క లక్షణాలను వివరిస్తుంది: యేసు ప్రభువు బోధలను నమ్మకంగా అనుసరించే వ్యక్తి. అదనంగా, ఇది విశ్వాసులకు అందించబడిన అధికారాన్ని హైలైట్ చేస్తుంది-వారు శాశ్వతంగా మరణాన్ని అనుభవించరు. వారు ప్రస్తుతం మరణాన్ని ఎదుర్కోవచ్చు మరియు రుచి చూసినప్పటికీ, నిర్గమకాండము 14:13లో చెప్పబడినట్లుగా, అది వారికి ఇకపై వాస్తవం కానటువంటి సమయం వస్తుంది.

54-59
క్రీస్తు మరియు ఆయనకు చెందిన వారందరూ తమ గౌరవం కోసం దేవునిపై ఆధారపడతారు. వ్యక్తులు దేవుని గురించి వేదాంతపరమైన చర్చలలో పాల్గొనవచ్చు, ఆయన గురించిన నిజమైన జ్ఞానం వారికి దూరంగా ఉండవచ్చు. దేవుని గురించి తెలియని వారు మరియు క్రీస్తు బోధలను తిరస్కరించేవారు ప్రకటన 13:8లో చూసినట్లుగా, తమను తాము ఒకచోట చేర్చుకుంటారు. ప్రభువైన యేసు దేవుని జ్ఞానం, నీతి, పవిత్రీకరణ మరియు విమోచనను మూర్తీభవించాడు, ఆదాము, హేబెల్ మరియు అబ్రాహాము కాలానికి ముందే ఆయనలో విశ్వాసంతో జీవించి మరణించిన వారందరికీ విస్తరించాడు.
దూషించినందుకు యూదులు రాళ్లతో కొట్టబడతారనే బెదిరింపును ఎదుర్కొంటూ, యేసు యుక్తిగా ఉపసంహరించుకున్నాడు, క్షేమంగా వారి గుండా వెళుతూ తన అద్భుత శక్తిని ప్రదర్శించాడు. దేవుని గురించి మనం అర్థం చేసుకున్న మరియు విశ్వసించే వాటిని దృఢంగా ప్రకటిస్తాము. మనం అబ్రాహాము విశ్వాసానికి వారసులమైనట్లయితే, రక్షకుడు మహిమలో ప్రత్యక్షమయ్యే రోజుని ఊహించి, తన విరోధులను కలవరపెట్టి, ఆయనపై విశ్వాసం ఉంచే వారందరి రక్షణను నెరవేర్చడంలో మనం ఆనందాన్ని పొందుతాము.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |