Romans - రోమీయులకు 16 | View All
Study Bible (Beta)

1. కెంక్రేయలో ఉన్న సంఘపరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని,

బైబిల్లోని భాగాలన్నీ దేవుడు మనుషులచేత రాయించినవే. ప్రతి భాగంలోనూ మనం నేర్చుకోదగిన పాఠాలున్నాయి. ఈ వచనాల్లో రోమ్‌లో విశ్వాసులపట్ల పౌలు ప్రేమ, శ్రద్ధ (ప్రభు ప్రేమ, శ్రద్ధ కూడా) మనం చూడవచ్చు. అతనికి (ప్రభువుక్కూడా) వారిలో నచ్చిన విషయాలను అంటే మన జీవితం, పరిచర్యకు మంచి ఆదర్శాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ రాసివున్న ఈ విషయాలను చూస్తూ మనందరి గురించి పరలోకంలో రాసి ఉన్న విషయాలను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు (హెబ్రీయులకు 12:23; మలాకీ 3:16; ప్రకటన గ్రంథం 20:12; దానియేలు 7:10; లూకా 10:20; ఫిలిప్పీయులకు 4:3). ఇక్కడ “సోదరి” అంటే ఆత్మ సంబంధమైన బంధుత్వమే గాని రక్తసంబంధమైనది కాదు. “సేవకురాలు”– ఈ గ్రీకు పదాన్ని క్రైస్తవ “సంఘ పరిచారిక” అని కూడా తర్జుమా చేయవచ్చు, ఫీబే స్థానిక సంఘంలో ఒక బాధ్యత నిర్వహించింది. కెంక్రేయ కొరింతుకు ఏడు మైళ్ళ దూరంలోని రేవుపట్టణం. బహుశా ఆమె పౌలు ఉత్తరాన్ని రోమ్‌కు తీసుకువెళ్ళింది.

2. ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను.
నిర్గమకాండము 9:9-10

3. క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.

అపో. కార్యములు 18:2, అపో. కార్యములు 18:18, అపో. కార్యములు 18:26; 1 కోరింథీయులకు 16:19; 2 తిమోతికి 4:19.

4. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు.

రోమీయులకు 5:7; 1 యోహాను 3:16. వారు దేవుని వాక్కును బోధించడం మాత్రమే కాదు అనుసరించారు కూడా.

5. ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.

ఆ ప్రారంభ దినాల్లో సహవాసం, ఉపదేశం కోసం క్రైస్తవులు తరచుగా ఇళ్ళల్లో సమకూడేవారు. “ఆసియా”– అపో. కార్యములు 18:19; అపో. కార్యములు 19:10.

6. మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు.

అప్పుడు మరియ చాలా సామాన్యమైన పేరు. ఈ మరియ గురించి మనకు ఏమీ తెలియదు.

7. నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అంద్రొనీకుకును, యూనీయకును వందనములు; వీరు అపొస్తలులలో ప్రసిద్ధి కెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు.

పౌలు అనేక సార్లు చెరసాలలో ఉన్నాడు (2 కోరింథీయులకు 11:23). ఇక్కడ చెప్తున్నది ఏ సందర్భం గురించో తెలియదు. “రాయబారులు”– ఇక్కడ ఈ మాటకు అర్థం ఒక పనిమీద పంపబడినవారు. ఈ దేవ సేవకులు క్రీస్తు నియమించిన పన్నెండుమంది రాయబారుల్లో లేరు గాని సంఘంలో ముఖ్యమైన వ్యక్తులని అనుకోవచ్చు.

8. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు.

9. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు.

10. క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు. అరిస్టొబూలు ఇంటివారికి వందనములు.

ఏ విశ్వాసికి అయినా ఇది గొప్ప పొగడ్త. 1 కోరింథీయులకు 9:27; 2 తిమోతికి 2:15 పోల్చి చూడండి.

11. నా బంధువుడగు హెరోది యోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు.

12. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు; ఆమె ప్రభువు నందు బహుగా ప్రయాసపడెను.

కొందరు విశ్వాసులు ప్రయాసపడ్డారు, మరికొందరు అధికంగా ప్రయాసపడ్డారు (వ 6). పౌలు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాడు. మనం దేవుని ముందు నిలబడే రోజున కూడా ఇలానే ఉంటుంది. నిజం కానివేమీ దేవుడు మన గురించి చెప్పడు. మనం చేయనివాటికి మనకు ప్రతిఫలం ఇయ్యడు – రోమీయులకు 2:6; 1 కోరింథీయులకు 3:12-15. లూకా 19:12-26 కూడా చూడండి.

13. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు; అతని తల్లికి వందనములు; ఆమె నాకును తల్లి.

“తల్లి”– మార్కు 10:29-30.

14. అసుంక్రితుకును, ప్లెగో నుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును వందనములు.

15. పిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని వందనములు.

16. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

చెక్కిలిపై ముద్దు పెట్టుకోవడం ఆ రోజుల్లో సామాన్యంగా అభివందనం తెలిపే పద్ధతి, గౌరవం చూపే పద్ధతి (లూకా 7:45). “పవిత్రమైన ముద్దు” అంటే అందులో శరీర సంబంధమైనది ఏదీ ఉండకూడదన్నమాట. క్రీస్తులో తోటి విశ్వాసులను గుర్తించి గౌరవించడం మాత్రమే అందులో వెల్లడి కావాలి.

17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.

పౌలు తన లేఖలు చాలా వాటిల్లో కపట బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించాడు (2 కోరింథీయులకు 11:13-15; గలతియులకు 1:6-8; కొలొస్సయులకు 2:8, కొలొస్సయులకు 2:18; 1 తిమోతికి 4:1-3; 2 తిమోతికి 3:1-8; 2 తిమోతికి 4:2-4). మత్తయి 7:15-16; మత్తయి 24:4-5, మత్తయి 24:24; అపో. కార్యములు 20:29-31; 2 పేతురు 2:1-2; 1 యోహాను 2:18-19; యూదా 1:4 కూడా చూడండి. మనుషులకు పాపవిముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరచి అభివృద్ధి చేసే దేవుని సాధనం సత్యం. మనుషులను నాశనం చేసేందుకు సైతాను ప్రయోగించే సాధనం అబద్ధాలు (యోహాను 8:44). క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు సైతాను కపట బోధకులను ఉపయోగిస్తాడు. వారి ఉపదేశాల ఫలితాలను బట్టి మనం అలాంటివారిని గుర్తించవచ్చు (మత్తయి 7:20). ఫలితాల్లో ఒకటి “భేదాలు”. సత్యాన్ని అనుసరించడానికి అడ్డంకులు కలగడం మరో ఫలితం. ఆ భేదాలూ అడ్డంకులూ దేవుడు వెల్లడించిన సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఎవరైనా అబద్ధ ఉపదేశాలను క్రైస్తవ సంఘంలోకి తేవడానికి ప్రయత్నిస్తే విశ్వాసులు చేయవలసినది ఒకటే “వారికి దూరంగా ఉండాలి”. అలాంటివారిని స్వీకరించకూడదు, వారితో సహవాసం చెయ్యకూడదు, ఉపదేశించడానికి వారికి అనుమతి ఇవ్వకూడదు.

18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

దేవుని వాక్కుకు విరుద్ధమైన ఉపదేశం గనుక వారు చేస్తూ ఉంటే వారు క్రీస్తుకు చెందిన నిజమైన సేవకులు కారని స్పష్టంగా ఉంది. వారు తమ సొంత కోరికలను తీర్చుకుంటున్నారన్నమాట (వారి వెనుక ఉండి వారిని ప్రేరేపించే సైతానుకు సేవ చేస్తున్నారన్నమాట – 2 కోరింథీయులకు 11:14-15). ఫిలిప్పీ రోమీయులకు 3:18-19; యూదా 1:13-14 వచనాలు చూడండి. లోలోపల వారు పిశాచాలలాంటివారు. బయటికి మాత్రం తియ్యని మాటలు, పొగడ్తలు పలుకుతుంటారు.

19. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.

రోమీయులకు 1:8; రోమీయులకు 6:17; రోమీయులకు 15:14.

20. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
ఆదికాండము 3:15

“శాంతి ప్రదాత”– రోమీయులకు 15:33. సైతాను గురించి నోట్స్ 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-10; యోహాను 8:44. ఇక్కడ వాడి గురించిన మాటను బట్టి చూస్తే 17,18లోని కపట ఉపదేశకుల వెనుక ఉండి ప్రేరేపించేది వాడే అని అర్థమౌతున్నది.

21. నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు.

22. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.

“అభివందనాలు”– రోమీయులకు 1:7; రోమీయులకు 3:24; రోమీయులకు 5:2, రోమీయులకు 5:21. పౌలు ఈ లేఖను చెప్తుండగా తెర్తియు రాసిపెట్టాడు.

23. నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

“గాయస్”– 1 కోరింథీయులకు 1:14.

24. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడియిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,

“నేను ప్రకటించే శుభవార్త”– ఈ లేఖలోని గొప్ప మూలాంశం (రోమీయులకు 1:16). “రహస్య సత్యం” అంటే మనుషులకు గనుక తెలియాలంటే దేవుడు మాత్రమే బయట పెట్టవలసిన సత్యం. మరి ఏ విధంగానూ వారు దాన్ని తెలుసుకోలేరు. శుభవార్త అనే రహస్య సత్యంలోని ప్రతి అంశం పాత ఒడంబడిక రోజుల్లో వెల్లడి కాలేదు (ఎఫెసీయులకు 3:5).

26. యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

“ప్రవక్తల లేఖనాల”అంటే బహుశా క్రీస్తు రాయబారులు రాసినవని పౌలు ఉద్దేశం కావచ్చు. వారు పాత ఒడంబడిక ప్రవక్తల్లాంటి వారే గానీ దేవుని సత్యం మరింత సంపూర్ణంగా తెలిసినవారు. 1 కోరింథీయులకు 2:6-13 పోల్చి చూడండి. లేక పాత ఒడంబడిక లేఖనాలను ఇప్పుడు క్రీస్తు రాయబారులు స్పష్టం చేశారని బహుశా పౌలు భావం కావచ్చు (ఆ లేఖనాలలో అంతటా శుభవార్తను గురించిన భవిష్యద్వాక్కులు, సాదృశ్యాలు ఉన్నాయి గదా. రోమీయులకు 3:21; లూకా 24:25-27, లూకా 24:45-47; 1 పేతురు 1:10-12). ఎలా చూసుకున్నా దేవుని ఉద్దేశం ఒకటే. అన్ని జాతుల ప్రజలూ తనలో నమ్మకం ఉంచి విధేయత చూపాలని కోరుతున్నాడు – రోమీయులకు 1:5; రోమీయులకు 11:32; రోమీయులకు 15:9-12.

27. అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

ఏకైక నిజ దేవుడొక్కడే అమిత జ్ఞానమున్నవాడు. తెలుసుకోగలిగినదంతా ఆయనొక్కనికే తెలుసు. మనుషులకు ఏమి తెలియజేయాలో ఎప్పుడు తెలియజేయాలో ఆయనకు తెలుసు. ఆయనొక్కడే మహిమకు అర్హుడు (రోమీయులకు 11:33-36; ప్రకటన గ్రంథం 4:1; యెషయా 48:11). “యేసు క్రీస్తు ద్వారా” మహిమ అంతా ఆయనకే చెందాలి – 1 పేతురు 4:11; యూదా 1:25. దేవుని పూర్వ నిర్ణయం గురించి నోట్ “ముందుగా తనకు తెలిసినవారిని” దేవుడు “ముందుగానే నిర్ణయించాడు” (రోమీయులకు 8:29) అనే మాటల గురించి కొందరు పండితులు ఇలా చెప్పారు – దేవుడు ప్రపంచాన్ని సృష్టించకముందే ఎవరిని పాపవిముక్తికోసం తాను ఎన్నుకోబోతున్నాడో ఆయనకు తెలుసు. వారు చివరకు తన కుమారునిలాగా కావాలని ఆయన నిర్ణయించాడు. వారిని ఎన్నుకున్నది వారు క్రీస్తులో నమ్మకం ఉంచుతారని గానీ తన సంకల్పానికి లోబడతారని గానీ తన భవిష్యత్ జ్ఞానం వల్ల ముందుగానే చూచి కాదు. తన కృప, జ్ఞానం ప్రకారం కొందరిని ఎన్నుకొన్నాడు, కొందరిని తిరస్కరించాడు. ఎవరిలోనైనా ఫలానా యోగ్యత లేక మంచితనం ఉందని ముందుగానే ఎరిగి వారిని ఎన్నుకోలేదు. ఎందుకంటే వారెవరిలోనూ అలాంటివి లేవు. తాను ఎన్నుకొన్న వారికంటే కొందరు చెడ్డవారుగా ఉంటారని ముందుగానే ఎరిగి వారిని ఎన్నుకోకుండా విడిచిపెట్టడం జరగలేదు. ఇదంతా ఆయన కృప, సర్వాధిపత్యాలకు సంబంధించిన విషయమేనని ఆ పండితుల వర్ణన. ఈ వివరణ మూలంగా తలెత్తే ఒక సమస్య ఇది – మనుషులంతా పాపవిముక్తి పొందాలనే తన కోరికలను దేవుడు ప్రకటించాడు (రోమీయులకు 11:32; 1 తిమోతికి 2:3-6; 1 తిమోతికి 4:10; 2 పేతురు 3:9; యెహెఙ్కేలు 18:30-32). ఆయన తత్వమే ప్రేమ (1 యోహాను 4:8, 1 యోహాను 4:16). లోకమంతటినీ ప్రేమిస్తున్నానని ఆయన చెప్పాడు (యోహాను 3:16). తన సృష్టి అంతటిమీదా తన వాత్సల్యం ఉన్నదని చెప్పాడు (కీర్తనల గ్రంథము 145:9). మనుషులందరినీ ఆయన ప్రేమిస్తూ ఉంటే, అందరూ పాపవిముక్తి పొందాలని కోరుతూ ఉంటే, వారిని ఎన్నుకోవడం ద్వారా వారికి పాపవిముక్తి ఇవ్వగలిగి ఉంటే సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది – “మరి అందరినీ ఆయన ఎందుకు ఎన్నుకోలేదు?” నిరంకుశ పాలకుడుగా కొందరిని ఎన్నుకొని, మరి కొందరిని వదిలిపెట్టడం ఆయన సర్వాధిపత్యం చక్కగా ప్రదర్శించినట్టు అవుతుంది గానీ ఆయన ప్రేమ, అందరూ పాపవిముక్తి పొందాలన్న ఆయన అభిలాష ఏమవుతాయి? జవాబులు చెప్పరాని ఇలాంటి ప్రశ్నలకు తావిస్తున్నది పైన చెప్పిన వివరణ. కాబట్టి కొందరు పండితులు దీన్ని త్రోసిపుచ్చారు. దేవుని పూర్వ జ్ఞానం, పూర్వ నిర్ణయం అంటే అర్థం ఇది అని వారి అభిప్రాయం – మనిషిని సృష్టించకమునుపు మనుషుల్లో ఎవరెవరు పవిత్రాత్మ ప్రభావానికి లొంగి తన కుమారునిలో నమ్మక ముంచుతారో దేవునికి తెలుసు. అలాంటివారు పాపవిముక్తి పొంది చివరికి క్రీస్తువంటి వారు కావాలని దేవుడు నిర్ణయించాడు. కొందరు మనుషులకు ఇతరులకన్నా మంచి స్వభావం ఉంటుందని ముందుగా తెలిసి వారిని ఎన్నుకోవడం కాదు. లేక కొందరు కొంత పుణ్యం, యోగ్యత సంపాదించుకొని ముక్తికి అర్హులవుతారని కాదు. ఏమాత్రమూ కాదు – రోమీయులకు 3:9-20, రోమీయులకు 3:24, రోమీయులకు 3:27; రోమీయులకు 4:5; ఎఫెసీయులకు 2:1-16; తీతుకు 3:3-7. పవిత్రాత్మ మనుషులకు సమర్థత ఇవ్వకపోతే వారు క్రీస్తులో నమ్మకం ఉంచడమనేది కూడా సాధ్యం కాదు (యోహాను 6:29, యోహాను 6:44; అపో. కార్యములు 13:48; ఫిలిప్పీయులకు 1:29). కానీ దేవుని ఆత్మ మనుషుల హృదయాల్లో పని చేసినప్పుడు నమ్మకం విషయంలో వారు నిర్ణయించుకునేశక్తి ఇస్తాడు. వారి సంకల్పాలు దేవుని సంకల్పానికి ఎదురౌతాయి. దేవునితో “అవును” అని గానీ “కాదు” అని గానీ చెప్పడానికి పవిత్రాత్మ ద్వారా సామర్థ్యం పొందుతారు. అలాంటప్పుడు కొందరు దేవునితో “అవును” అంటారు, కొందరు అలా చెయ్యరు. దేవుని ఆత్మ సహాయం లేకుండా నమ్మడం కూడా సాధ్యం కానప్పుడు “అవును” అని చెప్పడం యోగ్యత క్రిందికి రాదు, యోగ్యత అయివున్నట్టు దేవుడు వారికి పాపవిముక్తిని ప్రతిఫలంగా ఇస్తాడు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఉచితంగా ఇచ్చేదాన్ని తీసుకోవడం యోగ్యత ఎలా అవుతుంది? పైగా దాన్ని తీసుకొనే సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తున్నప్పుడు అలా చెప్పగల అవకాశం అసలే లేదు. ఇచ్చినదాన్ని ఎవరైనా తీసుకున్నా అది ఇచ్చినదే గదా. తనను ఎవరు ఎన్నుకుంటారో, తాను ఉచితంగా ఇచ్చేదాన్ని ఎవరు తీసుకుంటారో దేవునికి ముందుగా తెలుసు. వారు క్రీస్తు పోలికలోకి మారాలని పూర్వ నిర్ణయం చేశాడు. ఈ రెండో వివరణను బైబిలు సహాయంలో పూర్తిగా నిరూపించడం గానీ కాదని రుజువు చేయడం గానీ జరిగిందని ఈ నోట్స్ రచయిత భావించడం లేదు. ఇది ఇంకా సందేహాస్పదమైన విషయం కావచ్చు. అయితే బైబిల్లో వెల్లడి అయిన ప్రేమమూర్తి దేవుని వ్యక్తిత్వానికి ఇది మొదటి వివరణ కంటే ఎక్కువ అనుగుణంగా ఉన్నట్టుంది, కాబట్టి ఈ రచయిత ఈ వివరణ పక్షంగా ఉన్నాడు. చివరికి నాశనానికి వెళ్ళిపోయేవారు దేవుడు పాపవిముక్తి కోసం వారిని ఎన్నుకోలేదు కాబట్టే అలా నశించిపోయారని తలంచడం, సరిపెట్టుకోవడం కష్టం. తన ఆధిపత్యాన్ని మాత్రమే అనుసరించి వారిని పక్కకు నెట్టి వారిలాగానే పాపులైన మరికొందరిని ఆయన ఎన్నుకున్నాడని అనుకోవడం కష్టమైన సంగతి. కానీ దేవుని సంకల్పం, మానవ సంకల్పం తీరు తెన్నులు నిగూఢమైన విషయం. దాన్ని అర్థం చేసుకోవడం చాలా దుర్లభం. ఈ అంశం గురించి మన అభిప్రాయాలను బల్ల గుద్ది పిడివాదంగా చెప్పడం జ్ఞానం కాదనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మనం చెప్పవలసినది రోమీయులకు 11:33-36 లో పౌలు రాసినది: “దేవుని బుద్ధిజ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది! ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించ లేనివి! ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి! ప్రభు మనసు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చినవాడెవడు? సమస్తమూ ఆయననుంచి, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Romans - రోమీయులకు 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

రోమ్‌లోని చర్చికి అపొస్తలుడు ఫేబ్‌ని సిఫార్సు చేస్తాడు మరియు అక్కడున్న అనేకమంది స్నేహితులను పలకరించాడు. (1-16) 
పాల్ రోమ్‌లోని క్రైస్తవులకు ఫెబ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించాడు. క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ముఖ్యం, ముఖ్యంగా అపరిచితులు, మనకు ఎప్పుడు సహాయం అవసరమో మనం ఊహించలేము. అనేకమందికి మద్దతుగా ఉన్న వ్యక్తికి సహాయం కోసం పాల్ విజ్ఞప్తి చేశాడు, మద్దతు ఇచ్చే వారు కూడా తిరిగి అందుకుంటారు అనే సూత్రాన్ని నొక్కి చెప్పారు. అన్ని చర్చిలను పర్యవేక్షించే రోజువారీ బాధ్యతలు ఉన్నప్పటికీ, పాల్ వారి శ్రేయస్సు పట్ల నిజమైన శ్రద్ధను వ్యక్తం చేస్తూ, వివిధ వ్యక్తుల కోసం నిర్దిష్ట ప్రశంసలతో వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేయడానికి మరియు తెలియజేయడానికి నిర్వహించేవాడు. ఎవరినీ పట్టించుకోలేదని భావించకుండా ఉండేందుకు, పేరు ద్వారా ప్రస్తావించకపోయినప్పటికీ, మిగిలిన వ్యక్తులకు సహోదరులు మరియు పరిశుద్ధులుగా పాల్ తన గౌరవాన్ని తెలియజేస్తాడు. ముగింపులో, అతను క్రీస్తు చర్చిల తరపున అందరికీ సాధారణ శుభాకాంక్షలు అందజేస్తాడు.

చేసిన విభజనల గురించి చర్చిని హెచ్చరిస్తుంది. (17-20) 
ఈ ప్రోత్సాహకాలు ఎంత నిజాయితీగా మరియు ఆప్యాయతతో ఉన్నాయి! లేఖనాల్లో కనిపించే ధ్వని సిద్ధాంతం నుండి ఏదైనా విచలనం విభజనలు మరియు నేరాలకు అవకాశాలను సృష్టిస్తుంది. సత్యాన్ని విడిచిపెట్టినట్లయితే, ఐక్యత మరియు శాంతి క్షణికమవుతుంది. చాలా మంది క్రీస్తును తమ యజమాని మరియు ప్రభువుగా చెప్పుకోవచ్చు, అయినప్పటికీ వారి చర్యలు చాలా భిన్నమైన విధేయతను వెల్లడిస్తాయి, ఎందుకంటే వారు తమ శరీరానికి సంబంధించిన, ఇంద్రియాలకు మరియు ప్రాపంచిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆప్యాయతలతో తమను తాము అల్లుకొని తీర్పులను తారుమారు చేస్తూ, హృదయాన్ని మోసం చేస్తూ మనసును వక్రీకరిస్తారు.
అత్యంత శ్రద్ధతో మన హృదయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. సమ్మోహనపరులు సాధారణంగా నేరారోపణల ద్వారా మృదువుగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటారు, వంగే స్వభావాన్ని ఉపయోగించుకుంటారు. సరైన మార్గదర్శకత్వంలో వశ్యత ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, తప్పుదారి పట్టించినప్పుడు అది సులభంగా దారి తీయవచ్చు. మోసపోకుండా తెలివిగా ఉండండి, అయినప్పటికీ మోసగాళ్లుగా మారకుండా ఉండటానికి సరళతను కొనసాగించండి.
అపొస్తలుడు దేవుని నుండి కోరుకునే ఆశీర్వాదం సాతానుపై విజయం, ఆత్మలను అపవిత్రం చేయడానికి, కలవరపెట్టడానికి మరియు నాశనం చేయడానికి సాతాను యొక్క అన్ని పథకాలను చుట్టుముట్టింది. మన ప్రస్తుత శాంతిని మరియు భవిష్యత్తులోని పరలోక వారసత్వాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు ఇందులో ఉన్నాయి. సాతాను ప్రబలంగా కనిపించినప్పుడు మరియు నిరాశకు లోనైనప్పుడు, శాంతి దేవుడు మన తరపున జోక్యం చేసుకుంటాడు. కావున, విశ్వాసము మరియు సహనంతో మరికొంత కాలం పాటు పట్టుదలతో ఉండండి. మనతో ఉన్న క్రీస్తు దయతో, చివరికి మనలను ఎవరు జయించగలరు?

క్రైస్తవ నమస్కారాలు. (21-24) 
అపొస్తలుడు తనతో పాటు వచ్చిన వ్యక్తుల నుండి, రోమన్ క్రైస్తవులచే గుర్తించబడిన వ్యక్తుల నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు కలిగి ఉన్నాడు. మన బంధువుల పవిత్రత మరియు ప్రభావానికి సాక్ష్యమివ్వడం గొప్ప ఓదార్పునిస్తుంది. చాలా మంది శక్తివంతులు లేదా గొప్పవారు ఎంపిక చేయబడనప్పటికీ, కొందరు ఉన్నారు. విశ్వాసులు పౌర కార్యాలయాలను నిర్వహించడం అనుమతించబడుతుంది మరియు క్రైస్తవ రాష్ట్రాలు మరియు చర్చిలోని అన్ని స్థానాలను తెలివైన మరియు దృఢమైన క్రైస్తవులకు అప్పగించడం మంచిది.

దేవునికి మహిమను ఆపాదించడంతో లేఖనం ముగుస్తుంది. (25-27)
ఆత్మలను బలపరిచే పునాది యేసుక్రీస్తు యొక్క సూటిగా ప్రకటించడం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన విమోచనం మరియు రక్షణ నిస్సందేహంగా దైవభక్తి యొక్క లోతైన రహస్యాలు. అదృష్టవశాత్తూ, దేవునికి కృతజ్ఞతలు, ఈ రహస్యం యొక్క తగినంత భాగం విశదీకరించబడింది, అటువంటి అద్భుతమైన మోక్షాన్ని మనం ఉద్దేశపూర్వకంగా విస్మరించకపోతే స్వర్గానికి నడిపించడానికి సరిపోతుంది. సువార్త జీవితాన్ని మరియు అమరత్వాన్ని ప్రకాశిస్తుంది మరియు నీతి సూర్యుడు ప్రపంచంపై ఉదయించాడు.
లేఖనాలలోని ప్రవక్తల రచనలు తమను తాము స్పష్టం చేయడమే కాకుండా అన్ని దేశాలకు ఈ రహస్యాన్ని బహిర్గతం చేస్తాయి. క్రీస్తు అన్ని దేశాలకు మోక్షం, మరియు సువార్త కేవలం చర్చ మరియు చర్చ కోసం బహిర్గతం చేయబడదు కానీ సమర్పణ కోసం. విశ్వాసం యొక్క విధేయత అనేది విశ్వాసం యొక్క పదానికి ఇవ్వబడిన విధేయత, మరియు అది విశ్వాసం యొక్క దయ ద్వారా ఉద్భవిస్తుంది.
పడిపోయిన మానవత్వం నుండి దేవునికి వెళ్ళే ఏ మహిమ అయినా, ఆయన ఆమోదం కోసం, ప్రభువైన యేసు ద్వారా వెళ్ళాలి. ఆయనలో మాత్రమే మన వ్యక్తిత్వం మరియు చర్యలు దేవునికి ఇష్టమైనవి. మన ప్రార్థనలకు మాత్రమే కాదు, శాశ్వతంగా, మన ప్రశంసలకు కూడా ఆయన ఏకైక మధ్యవర్తి కాబట్టి మనం ఆయన నీతిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. విశ్వాసం యొక్క విధేయతకు మన పిలుపుని మనం గుర్తుచేసుకున్నప్పుడు మరియు జ్ఞానం యొక్క ప్రతి ఔన్స్ ఏకైక తెలివైన దేవుని నుండి ఉద్భవించిందని గుర్తించినప్పుడు, మనం, మాటలు మరియు చర్యల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మహిమను సమర్పిద్దాం. అలా చేస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు శాశ్వతంగా ఉంటుంది.



Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |