Ephesians - ఎఫెసీయులకు 2 | View All
Study Bible (Beta)

1. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

ఎఫెసీయులకు 1:19 లో ఆరంభించిన అంశాన్నే ఈ వచనాల్లో కూడా పౌలు కొనసాగించాడు – మనపట్ల దేవుని “బలప్రభావాల అపరిమితమైన ఆధిక్యం”. ఎఫెసీయులకు 1:20-23 లో ఈ బలప్రభావాలు క్రీస్తులో ఎలా పని చేశాయో చూపించాడు. ఇప్పుడు విశ్వాసులమైన మనలో ఎలా పని చేస్తాయో చూపిస్తున్నాడు. దేవుడు క్రీస్తును మరణం నుంచి సజీవంగా లేపి పరలోకంలో ఆయన్ను ఘనపరిచాడు. (వ 1). ఆత్మ సంబంధమైన మరణం నుంచి విశ్వాసులను ఆయన బ్రతికించి వారిని కూడా అలా ఘనపరిచాడు (వ 5,6). దేవుని మహా బలప్రభావాలు క్రీస్తును సంఘానికి శిరస్సుగా చేశాయి (ఎఫెసీయులకు 1:22). అదే మహా బలప్రభావాలు విశ్వాసులను కొత్త సృష్టిగా చేసి క్రీస్తుతో ఏకం చేశాయి (వ 10). “చచ్చినవారై”– క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారెవరికీ నిజమైన ఆధ్యాత్మిక జీవం లేదు. ఎందుకంటే అందరూ పాపులు (రోమీయులకు 3:23; రోమీయులకు 5:12). గనుక ప్రతి ఒక్కరూ వారికి క్రీస్తు కొత్త జీవం ఇచ్చేంతవరకు ఆత్మ సంబంధంగా చచ్చినవారే. ఈ మరణమంటే దేవుని జీవం నుంచీ సహవాసం నుంచీ దూరమై ఉండడమన్నమాట – ఎఫెసీయులకు 4:18; యెషయా 59:1-2. ఆదికాండము 2:17; యోహాను 5:24; రోమీయులకు 7:5; రోమీయులకు 8:6; కొలొస్సయులకు 2:13; 1 తిమోతికి 5:6; యాకోబు 1:15; 1 యోహాను 3:14. పాపవిముక్తి, రక్షణ కలగాలంటే కొత్త జన్మ అవసరం అనేందుకు కారణం ఇదే. యోహాను 1:12-13; యోహాను 3:3-8.

2. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.

“లోకం పోకడ”– 1 యోహాను 2:16; యోహాను 1:10; యోహాను 7:7; యోహాను 14:17; యోహాను 16:8; రోమీయులకు 12:2; 1 కోరింథీయులకు 1:21; యాకోబు 4:4; 2 పేతురు 1:4. లోకం పోకడలు ఆత్మ సంబంధమైన మరణం నుంచి పుట్టి శాశ్వత మరణానికి దారితీస్తాయి. “వాయుమండల రాజ్యాధికారి”– అంటే సైతాను. పరమ స్థలాల్లోని దిగువ భాగాల్లో వాడు సంచరిస్తూ ఉంటాడు (ఎఫెసీయులకు 6:12). వాణ్ణి ఈ యుగ “దేవుడు”, “పాలకుడు” అన్నారు – యోహాను 12:31; 2 కోరింథీయులకు 4:4. సైతాను ఆత్మ. వాడి సింహాసనం భూగోళం చుట్టూ ఉన్న వాతావరణంలో అదృశ్య రూపంలో ఉంది. ప్రభువైన యేసు క్రీస్తుకు అవిధేయులుగా ఉన్నవారందరిలో వాడు పని చేస్తున్నాడు. యోహాను 8:44; అపో. కార్యములు 5:3; 2 తిమోతికి 2:26 పోల్చి చూడండి.

3. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

“మనమందరమూ”– రోమీయులకు 3:9, రోమీయులకు 3:19; తీతుకు 3:3. “స్వభావ కోరికల”– అంటే పుట్టుక సమయంలో మన తల్లిదండ్రుల నుంచి మనం పొందిన స్వభావం అని అర్థం. ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; కీర్తనల గ్రంథము 58:3; రోమీయులకు 3:9-19. “కోపానికి”– పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం బైబిలంతటా కనిపిస్తూ ఉంది. సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18 నోట్స్ చూడండి.

4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.

“కరుణా సంపన్నుడు”– కీర్తనల గ్రంథము 5:7; కీర్తనల గ్రంథము 51:1; మీకా 7:18; రోమీయులకు 2:4; రోమీయులకు 10:12; తీతుకు 3:5; యాకోబు 5:11; 1 పేతురు 1:3. పాపులుగా మనందరం దేవుని కోపానికీ శిక్షకూ తగినవారం. కరుణ మాత్రమే మనల్ని శిక్షించకుండా క్షమించి రక్షించగలదు. మరి దేనిలోనూ ఆశాభావానికి ఎలాంటి ఆధారమూ లేదు. “ప్రేమించాడు”– యోహాను 3:16; రోమీయులకు 5:8; 1 యోహాను 3:16; 1 యోహాను 4:8-9.

5. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.

దేవుడు విశ్వాసులకు ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి క్రీస్తుతో ఐక్యతలోకీ సహవాసంలోకీ తెచ్చాడు – యోహాను 1:12-13; యోహాను 5:21, యోహాను 5:24; రోమీయులకు 5:17; రోమీయులకు 6:4, రోమీయులకు 6:8; కొలొస్సయులకు 2:13; 1 పేతురు 1:3, 1 పేతురు 1:23; 1 యోహాను 3:9; 1 యోహాను 5:1, 1 యోహాను 5:18. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చినదే – వ 9; రోమీయులకు 6:23.

6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,

“మనలను పైకెత్తి”– రోమీయులకు 6:3-5 చూడండి. విశ్వాసులందరి ప్రతినిధి క్రీస్తు. వారు ఆయనలో ఉన్నారు (ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:3) కాబట్టి, ఆయనతో ఏకంగా ఉన్నారు కాబట్టి ఆయనకు జరిగినది వారికి కూడా జరిగినట్టు దేవుడు ఎంచుతాడు. ఆయన దృష్టిలో భూమిపై ఉన్న విశ్వాసులు ఇప్పటికే మరణం నుంచి సజీవులుగా లేచి పరలోకంలో ఘనతలో కూర్చుని ఉన్నట్టే. కొలొస్సయులకు 3:1-4 పోల్చి చూడండి.

7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.

మన విషయంలో దేవునికున్న ఘనమైన సంకల్పం ఇదే. ఇది మనకు ఏమేమి తెస్తుందో ఎవరైనా కనీసం ఊహించనైనా ఊహించలేరు. ఆయన ఆలోచించగలిగిన అతి శ్రేష్ఠమైన దీవెనలూ వరాలూ బహుమతులూ మనపై వర్షంలా కురిపించడం ద్వారా మన పట్ల తనకున్న ప్రేమను సంతృప్తి పరచుకుంటాడు. శాశ్వత యుగాలు ఆయన అలా చేస్తూనే ఉంటాడు.

8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

ఆదినుంచి అంతం వరకు పాపవిముక్తి రక్షణ అనేవి ఏ యోగ్యతా లేనివారికి దేవుడు ఉచితంగా ఇచ్చేవే. దీనికి మంచి పనులతో పుణ్యంతో సంబంధమేమీ లేదు – అపో. కార్యములు 15:11; రోమీయులకు 3:24; రోమీయులకు 4:4; రోమీయులకు 5:15; రోమీయులకు 6:23; రోమీయులకు 11:6; తీతుకు 3:4-7. “విశ్వాసం ద్వారానే”– యోహాను 1:12-13; యోహాను 3:14-16, యోహాను 3:36; యోహాను 5:24; యోహాను 6:47; అపో. కార్యములు 13:38; అపో. కార్యములు 16:31; రోమీయులకు 1:16; రోమీయులకు 3:25, రోమీయులకు 3:28; రోమీయులకు 4:16; రోమీయులకు 5:1; రోమీయులకు 10:9-13; గలతియులకు 2:16, గలతియులకు 2:21; గలతియులకు 3:26. “దేవుడు...ఇచ్చినదే”– విశ్వాసమూ, దానిమూలంగా కలిగిన పాపవిముక్తీ రక్షణా కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినవే. మనకు ఉన్న విశ్వాసం కూడా దేవుని ఉచిత కృపావరమే కాబట్టి మిగతా వాటన్నిటి విషయంలో లాగానే దాని విషయంలో కూడా మనం అతిశయంగా మాట్లాడలేము (ఫిలిప్పీయులకు 1:30). ఒక వ్యక్తి మనసులో, హృదయంలో దేవుని కార్యం జరగక పోతే ఎవరూ క్రీస్తులో నమ్మకం పెట్టుకోరు, పెట్టుకోలేరు. దేవుని విముక్తి విధానంలో మనిషి అతిశయంగా మాట్లాడ్డం అనేదానికి తావే లేదు. రోమీయులకు 3:27; 1 కోరింథీయులకు 1:29-31. తనకు తన యోగ్యతను బట్టి, లేక తాను చేసిన దాన్ని బట్టి, లేక తనలో ఉన్న ఏదో మంచిని బట్టి, లేక తనకు ఫలానా మతంతో లేక అలాంటి మరి దేనితోనో సంబంధం ఉండబట్టి పాపవిముక్తి లభించిందని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటే అతడు (లేక ఆమె) నిజ పాపవిముక్తి విధానాన్ని అసలు అర్థం చేసుకోలేదన్నమాటే. ఏ క్రియలైనా సరే పాపవిముక్తికీ రక్షణకూ నడిపించగలిగే అవకాశమే లేదు. పాపి చేసే ఏ పని అయినా (అందరూ పాపులే – రోమీయులకు 3:23) పాపం రంగు కలిసినది. దేవుని దృష్టిలో అది మంచిది అనీ యోగ్యత అనీ అనిపించుకోదు (యెషయా 64:6). అతడు ఎన్ని పనులు చేసినా ఎంత కాలం చేసినా పాపవిముక్తినీ రక్షణనూ వాటి సహాయంతో సంపాదించుకోలేడు.

9. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

విశ్వాసుల నూతన ఆధ్యాత్మిక జన్మ వారు సంపాదించుకొనేది కాదు. ఈ భూమిపై తల్లి గర్భాన పుట్టడంలో ఒకడు చేసే ప్రయత్నం ఎలా ఉండదో ఇదీ అంతే. అది వారిలో దేవుడు మాత్రమే జరిగించగలిగేది. అది సృష్టి కార్యం – 2 కోరింథీయులకు 5:17; యాకోబు 1:18; యోహాను 1:13. దేవుడు మనలో నూతన జీవాన్ని ఎందుచేత సృష్టించాడో ఇక్కడొక కారణం ఉంది గమనించండి. మనకు మంచి పనుల వల్ల విముక్తి, రక్షణ కలగలేదు గానీ మనం మంచి పనులు చేసేందుకు దేవుడు మనకు పాపవిముక్తి ఇచ్చాడు – తీతుకు 2:14; మత్తయి 5:16. దేవుడు మంచి పనులను మన కోసం, మనలను మంచి పనుల కోసం సిద్ధం చేశాడు. మనందరి ఎదుట మంచి పనులు చేసేందుకు అవకాశాలను ఉంచుతాడు. మంచి పనులు పాపవిముక్తి వల్ల కలిగే ఒక ఫలం. మనం మంచి పనులు చేయకపోతే మనం దేవుని చేతుల్లో తయారైనవారం కాదని చూపించుకుంటున్నాం అన్నమాట (మత్తయి 7:16-20; మొ।।). మంచి చెట్టుకు మంచి కాయలు కాయడం ఎంత ఖాయమో, మనలోని నూతన జీవం మంచి పనులనే ఫలాలను చూపించడం అంతే ఖాయం. విశ్వాసులు దేవుని చేతి పని కాబట్టి ఆయన ఈ పనిని మధ్యలో ఎక్కడో ఆపివెయ్యకుండా ముగింపు వరకూ తెస్తాడని అనుమానం లేకుండా నమ్మవచ్చు – ఫిలిప్పీయులకు 1:6.

11. కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు

పాత ఒడంబడిక కాలంలో ఇస్రాయేల్ జాతి దేవుని ప్రత్యేక ప్రజ. దేవుడు వారికి తన వాక్కును, తన ధర్మశాస్త్రాన్ని, తన ఒడంబడికలు మొదలైనవాటిని ఇచ్చాడు – రోమీయులకు 9:4-5. ప్రపంచంలోని ఇతర ప్రజలకు దానంతటిలో వంతు లేదు – వ 12. వారు చాలా దూరంలో ఉన్నారు – వ 13. ఇస్రాయేల్‌ ప్రజకూ, ఇతర ప్రజలకూ అక్షరాలా శత్రుత్వమనే అడ్డుగోడ ఉంది – వ 14. ఇప్పుడు దేవుడు అదంతా మార్చేశాడని పౌలు అంటున్నాడు. క్రీస్తులో ఇకపై ఇతరులకూ, యూదులకూ ఎలాంటి దూరమూ లేదు – వ 14-22. విశ్వాసులంతా క్రీస్తులో ఒక్కటే. 1 కోరింథీయులకు 12:12-13; గలతియులకు 3:28 పోల్చి చూడండి. “ఇతర ప్రజలు”– అంటే యూదులు కాని వారంతా. యూదులు (“సున్నతి ఉన్నవారు”) వారిని “సున్నతి లేని వారు” అని పిలిచారు. ఇది చులకన చేసి పలికిన మాట. న్యాయాధిపతులు 14:3; న్యాయాధిపతులు 15:18; 1 సమూయేలు 14:6; 1 సమూయేలు 17:26; 2 సమూయేలు 1:20. సున్నతి గురించి ఆదికాండము 17:9-14; గలతియులకు 5:6 నోట్స్ చూడండి.

12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

క్రీస్తుకు దూరంగా ఉన్న మనుషులందరి విచారకరమైన పరిస్థితి ఇప్పటికీ ఇదే. నిజ దేవుడు వారికి లేడు. పాపవిముక్తి గురించిన ఆశాభావానికి నిజమైన ఆధారం లేదు (1 యోహాను 2:23; 1 యోహాను 5:11-12; గలతియులకు 4:8).

13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
యెషయా 52:7, యెషయా 57:19

“మీరు”అంటే ఇతర ప్రజలైన మీరు అని అర్థం. వారి పాపం, అపనమ్మకాల మూలంగా వారు దేవునికి దూరంగా ఉన్నారు. అయితే క్రీస్తులో ఉండడం ద్వారా దేవునికి దగ్గరయ్యారు. విశ్వాసులందరికీ దేవుని సన్నిధికి మార్గం తెరవబడింది – హెబ్రీయులకు 10:19-22.

14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
యెషయా 9:6

“మనకు సమాధానం”– విశ్వాసులైన యూదులకూ విశ్వాసులైన ఇతర ప్రజలకూ మద్య సమాధానం యేసుప్రభువే. ఆయనలో జాతిపరమైన అడ్డుగోడలన్నీ నాశనమైపోయాయి, ఐక్యత నెలకొంది. “తన శరీరంలో”– సిలువపై దైవమానవుడుగా క్రీస్తు యూదులకూ ఇతరులకూ మధ్య ఉన్న వైరాన్ని నాశనం చేశాడు – వ 16. విరోధాన్నీ చీలికనూ సృష్టించినదాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన దీన్ని చేశాడు – అంటే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన రద్దుచేశాడు (రోమీయులకు 7:4; రోమీయులకు 10:4). ఈ వైరం క్రీస్తులో మాత్రమే నాశనం అయింది. క్రీస్తులో లేనివారిలో తరచుగా ఇది ఇంకా కనిపిస్తూనే ఉంది.

15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,
దానియేలు 12:3

“ఒక కొత్త మానవుణ్ణి”– అంటే యూదుల్లో, ఇతరుల్లో ఉన్న విశ్వాసులందరినీ ఒక్క శరీరంలో కలిపి క్రీస్తు తానే శిరస్సుగా ఉండడం. ఇలాంటిది ఇంతకుముందు ఎన్నడూ లేదు గనుక, అది కొత్త ఆధ్యాత్మిక జీవితంతో కూడిన కొత్త సృష్టి గనుక అది కొత్తది.

16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

“సఖ్యపరిచాడు”– రోమీయులకు 5:10; 2 కోరింథీయులకు 5:18-19 నోట్స్.

17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
జెకర్యా 9:10, యెషయా 57:19

“ఆయన”– అంటే యేసుప్రభువు. మనుషులకు శాంతిని తేవాలనీ, మనుషులకూ దేవునికీ మద్య, మనుషులకూ మనుషులకూ మద్య శాంతిని స్థాపించాలని వచ్చిన శాంతిరాజు ఆయన – యెషయా 9:6; లూకా 1:79; యోహాను 14:27; యోహాను 16:33; అపో. కార్యములు 10:36; 2 కోరింథీయులకు 5:20. తాను స్వయంగానూ, తన రాయబారుల ద్వారానూ ఆయన శాంతిని ప్రకటించాడు. అన్ని చోట్లా తన సేవకుల ద్వారా ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉన్నాడు. “దూరంగా ఉన్న”– అంటే ఇతర ప్రజలు (వ 13). “చేరువగా ఉన్న”– అంటే యూదులు.

18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.

ఎఫెసీయులకు 3:12; రోమీయులకు 5:2; హెబ్రీయులకు 10:19-22. ఇప్పుడైతే యూదుడైనా, యూదేతరుడైనా క్రీస్తుద్వారా నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు. ఇక్కడ త్రిత్వాన్ని గమనించండి. దేవుని కుమారునిద్వారా, పవిత్రాత్మద్వారా తండ్రి అయిన దేవుని సన్నిధికి మనకు ప్రవేశం కలిగింది.

19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

వ 12కు సరిగ్గా వ్యతిరేకం. “సాటి పౌరులు”– ఇది ఒక నగరానికి లేక దేశానికి చెందడం గురించిన మాట. గలతియులకు 4:26; ఫిలిప్పీయులకు 3:20; హెబ్రీయులకు 11:16; హెబ్రీయులకు 12:22 చూడండి. “ఇంటివారిలో”– దేవునికో కుటుంబం ఉంది. అందులో మనుషులంతా లేరు. ఆయన ఆత్మమూలంగా పుట్టినవారే ఆ కుటుంబంలో ఉన్నారు – వ 5. ఆధ్యాత్మికంగా చూస్తే క్రీస్తులో విశ్వాసులంతా దేవుడు తమ తండ్రిగాగల తోబుట్టువులే – 2 కోరింథీయులకు 6:17-18; హెబ్రీయులకు 2:11-12.

20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
యెషయా 28:16

క్రీస్తు విశ్వాసులు దేవుని ఇల్లు, దేవుని ఆలయం కూడా. 1 కోరింథీయులకు 3:16; 1 కోరింథీయులకు 6:19; 1 పేతురు 2:4-5 పోల్చి చూడండి. విశ్వాసులకు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలిపేందుకు పౌలు ఈ లేఖలో ఎన్ని రకాల మాటలను వాడుతున్నాడో చూడండి. వారు దేవుని సంతానం – ఎఫెసీయులకు 1:5; దేవుని వారసత్వం – ఎఫెసీయులకు 1:18; దేవుని కుమారుని శరీరం – ఎఫెసీయులకు 1:23; దేవుడు చేసినవారు – ఎఫెసీయులకు 2:10; దేవుని ప్రజలు, దేవుని పరలోక పౌరులు, దేవుని ఇల్లు – ఎఫెసీయులకు 2:19; దేవుని ఆలయం. ఆరాధన, దేవునికి అర్పణలు జరిగే స్థలం దేవాలయం. ఆయన ప్రజలతో కూడిన దేవుని సజీవ ఆలయం కూడా అంతే – రోమీయులకు 12:1; హెబ్రీయులకు 13:15-16. “క్రీస్తురాయబారులు”– ఎఫెసీయులకు 1:1; మత్తయి 10:2. “ప్రవక్తలు”– ఈ మాట పాత ఒడంబడిక ప్రవక్తలను గానీ కొత్త ఒడంబడిక ప్రవక్తలను గానీ తెలియజేసేది కావచ్చు (ఎఫెసీయులకు 3:5; ఎఫెసీయులకు 4:11; 1 కోరింథీయులకు 12:28), లేక ఇద్దరినీ సూచించవచ్చు. “మూలరాయి”– 1 పేతురు 2:6; యెషయా 28:16. ఇళ్ళు కట్టేవారు మూలరాయిని ముందు చెక్కేవారు. ఇది ఆ కట్టడమంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి. అది దానినుంచి కట్టబడే గోడలను నిటారుగా చక్కగా ఉంచుతుంది. ఈ విధంగా కట్టడం అంతటికీ స్థిరత్వం, సౌందర్యం ఇస్తుంది.

21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది.

“రూపొందుతూ”– దేవుని కట్టడం పూర్తి కాలేదు. అనుదినం కొత్త విశ్వాసులను ఆయన చేరుస్తూ ఉంటే అదింకా పెరుగుతూ ఉంది. క్రీస్తులోనే ఆ కట్టడం ఒకటిగా నిలబడి ఉంది, ఆయనలోనే పెరుగుతూ ఉంది.

22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.

“నివాసం”– నిర్గమకాండము 25:8; ప్రకటన గ్రంథం 21:3 నోట్స్ చూడండి. ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయం యేసు క్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయమే. మనుషులు కట్టిన ఎలాంటి దేవాలయంలోనూ నిజ దేవుడు లేడు – అపో. కార్యములు 17:24-25. “మిమ్ములను కూడా”– అంటే యూదేతర ప్రజల్లో విశ్వాసులు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ephesians - ఎఫెసీయులకు 2 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మనుష్యుల పట్ల దేవుని దయ యొక్క ఐశ్వర్యం, వారి దయనీయ స్థితి నుండి ప్రకృతి ద్వారా చూపబడింది మరియు దైవిక దయ వారిలో సంతోషకరమైన మార్పు. (1-10) 
పాపం ఆత్మ యొక్క మరణాన్ని సూచిస్తుంది. అతిక్రమణల కారణంగా ఆధ్యాత్మికంగా నిర్జీవంగా ఉన్న వ్యక్తికి దైవిక ఆనందాల పట్ల ఎలాంటి మొగ్గు ఉండదు. నిర్జీవమైన శరీరాన్ని గమనించినప్పుడు, భయం యొక్క లోతైన భావం పుడుతుంది. ఎప్పటికీ చనిపోని ఆత్మ వెళ్లిపోయింది, ఒక వ్యక్తి యొక్క శిధిలాలను మాత్రమే వదిలివేసింది. అయినప్పటికీ, మనం విషయాలను ఖచ్చితంగా గ్రహించినట్లయితే, మరణించిన ఆత్మ, పడిపోయిన, కోల్పోయిన ఆత్మ అనే భావన మరింత గొప్ప ప్రభావాన్ని రేకెత్తిస్తుంది. పాపం యొక్క స్థితి ఈ ప్రపంచానికి అనుగుణంగా ఉంటుంది. దుష్టులు తమను తాము సాతానుకు బానిసలుగా కనుగొంటారు, భక్తిహీనులలో ఉన్న అహంకార మరియు శరీరానికి సంబంధించిన ప్రవృత్తిని ప్రేరేపిస్తారు. సాతాను వ్యక్తుల హృదయాలను పరిపాలిస్తాడు. గ్రంథం ప్రకారం, ప్రజలు ఇంద్రియ లేదా ఆధ్యాత్మిక దుష్టత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపినప్పటికీ, అవిధేయత యొక్క సహజ పిల్లలుగా, వ్యక్తులందరూ కూడా స్వభావంతో కోపానికి గురవుతారని స్పష్టమవుతుంది.
కాబట్టి, పాపులు తమను ఉగ్ర పిల్లల నుండి దేవుని పిల్లలుగా మరియు మహిమకు వారసులుగా మార్చే కృపను తీవ్రంగా వెదకడానికి ప్రతి కారణం ఉంది. దేవుడు తన జీవుల పట్ల చూపే శాశ్వతమైన ప్రేమ లేదా దయాదాక్షిణ్యాల నుండి ఆయన దయలు మనకు ప్రవహిస్తాయి. ఈ దైవిక ప్రేమ విశాలమైనది, ఆయన దయ పుష్కలంగా ఉంది. మార్చబడిన ప్రతి పాపి పాపం మరియు కోపం నుండి విముక్తి పొందిన వ్యక్తిగా రక్షింపబడతాడు. రక్షణ కృప అనేది దేవుని యొక్క ఉచిత, అనర్హమైన దయ మరియు అనుగ్రహం, ఇది చట్టానికి కట్టుబడి ఉండటం ద్వారా కాదు, క్రీస్తు యేసుపై విశ్వాసం ద్వారా సాధించబడుతుంది.
ఆత్మలోని దయ లోపల కొత్త జీవితానికి సమానం. పునరుత్పత్తి చేయబడిన పాపి సజీవ ఆత్మగా మారతాడు, పవిత్రమైన జీవితాన్ని గడుపుతాడు, దేవుని నుండి జన్మించాడు. అటువంటి వ్యక్తి క్షమాపణ మరియు దయను సమర్థించడం ద్వారా పాపపు అపరాధం నుండి విముక్తి పొందాడు. పాపులు దుమ్ములో కొట్టుమిట్టాడుతుండగా, పవిత్రమైన ఆత్మలు స్వర్గపు ప్రదేశాలలో కూర్చొని, క్రీస్తు దయతో ఈ ప్రపంచం కంటే ఉన్నతంగా ఉంటాయి.
గతంలో పాపులను మార్చడంలో మరియు రక్షించడంలో దేవుని మంచితనం భవిష్యత్తులో అతని దయ మరియు దయపై ఆశలు పెట్టుకోవడానికి ఇతరులకు ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. మన విశ్వాసం, మార్పిడి మరియు శాశ్వతమైన మోక్షం మన స్వంత ప్రయత్నాల ఫలితం కాదు, ప్రగల్భాలు పలికేందుకు ఎటువంటి ఆధారాన్ని తొలగిస్తాయి. ప్రతిదీ దేవుని నుండి ఉచిత బహుమతి, అతని శక్తి ద్వారా వేగవంతం చేయబడిన ఫలితం. ఆయన మనలను సిద్ధపరచిన అతని ఉద్దేశ్యం, ఆయన చిత్తం గురించిన జ్ఞానాన్ని మరియు పరిశుద్ధాత్మ మనలో మార్పును ప్రభావవంతంగా ఆశీర్వదించడంతో కూడుకున్నది, తద్వారా మనం మన సద్గుణ ప్రవర్తన మరియు పవిత్రతలో పట్టుదల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాము.
స్క్రిప్చర్ ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని వక్రీకరించే లేదా విమర్శించే వారికి అలా చేయడానికి సరైన ఆధారాలు లేవు మరియు ఎటువంటి కారణం లేదు.

ఎఫెసియన్లు తమ అన్యమత స్థితిని ప్రతిబింబించమని పిలుపునిచ్చారు. (11-13) 
క్రైస్తవుని యొక్క అన్ని అంచనాలకు మూలస్తంభం క్రీస్తు మరియు అతని ఒడంబడికలో ఉంది. ఇక్కడ అందించిన వర్ణన నిస్సత్తువగా మరియు బాధ కలిగించేదిగా ఉంది, ఈ ప్రశ్నను లేవనెత్తుతుంది: అటువంటి విధి నుండి తమను ఎవరు తప్పించుకోగలరు? క్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్న అనేకమందికి ఈ వర్ణన నిజం కావడం విచారకరం. దేవుని సంఘం నుండి శాశ్వతంగా వేరు చేయబడిన, క్రీస్తు శరీరం నుండి వేరు చేయబడిన, వాగ్దానాల ఒడంబడిక నుండి విడదీయబడిన, నిరీక్షణ లేని మరియు రక్షకుని, ప్రతీకారం తీర్చుకునే దేవుడు తప్ప మరే దేవుడు లేని వ్యక్తి యొక్క దుస్థితి గురించి ఆలోచించడం ఒక చిలిపిగా ఉంటుంది. క్రీస్తులో భాగస్వామ్యం లేదనే ఆలోచన ఏ నిజమైన క్రైస్తవుని హృదయంలోనైనా భయానకతను రేకెత్తిస్తుంది. దుష్టులకు మోక్షం దూరంగా ఉన్నప్పటికీ, దేవుడు తన ప్రజలకు సిద్ధంగా ఉన్న సహాయంగా నిలుస్తాడు, ఇది క్రీస్తు బాధలు మరియు మరణం ద్వారా సాధ్యమైంది.

మరియు సువార్త యొక్క అధికారాలు మరియు ఆశీర్వాదాలు. (14-22)
14-18
యేసుక్రీస్తు తనను తాను సమర్పించుకోవడం ద్వారా శాంతిని స్థాపించాడు. ప్రతి అంశంలో, క్రీస్తు శాంతి యొక్క స్వరూపులుగా పనిచేశాడు, దేవునితో సయోధ్యకు మూలంగా, కేంద్ర బిందువుగా మరియు సారాంశంగా పనిచేశాడు. యూదులు మరియు అన్యులను ఒకే చర్చిలో విశ్వాసులను ఏకం చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. క్రీస్తు వ్యక్తిత్వం, త్యాగం చేసే చర్య మరియు మధ్యవర్తిత్వం ద్వారా, పాపులు దేవుణ్ణి తండ్రిగా సంప్రదించే ప్రత్యేకతను కనుగొంటారు. వారు ఆయన సన్నిధిలోకి స్వాగతించబడ్డారు, మరియు, పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడి, తండ్రి మరియు కుమారునితో ఐక్యంగా ఆరాధన మరియు సేవలో పాల్గొంటారు. మనము దేవునికి చేరువ కావడానికి క్రీస్తు అనుమతిని పొందాడు, అయితే ఆత్మ కోరికను, సామర్ధ్యాన్ని మరియు దేవుణ్ణి ఆహ్లాదకరమైన రీతిలో సేవించాలనే దయను కలుగజేస్తుంది.

19-22
చర్చి ఒక నగరంతో పోల్చబడింది, మరియు మార్చబడిన ప్రతి పాపి దానిలో స్వేచ్ఛను పొందుతాడు. ఇది ఒక ఇల్లుతో కూడా పోల్చబడుతుంది, అక్కడ మతం మార్చబడిన ప్రతి పాపి కుటుంబంలో ఒక భాగం అవుతాడు-దేవుని ఇంటిలో సేవకుడు మరియు బిడ్డ ఇద్దరూ. అదనంగా, చర్చి ఒక భవనంగా చిత్రీకరించబడింది, ఇది పాత నిబంధన యొక్క ప్రవక్తలు మరియు క్రొత్త అపొస్తలులచే తెలియజేయబడిన క్రీస్తు బోధనలపై స్థాపించబడింది.
ప్రస్తుతం, దేవుడు విశ్వాసులందరిలో నివసిస్తున్నాడు, ఆశీర్వదించబడిన ఆత్మ యొక్క పని ద్వారా వారిని దేవుని ఆలయాలుగా చేస్తాడు. క్రీస్తు బోధల సూత్రాలకు అనుగుణంగా మన ఆశలు ఆయనలో ఉన్నాయో లేదో పరిశీలించడం చాలా అవసరం. ఆయన ద్వారా మనల్ని మనం దేవునికి పవిత్ర దేవాలయాలుగా సమర్పించుకున్నామా? మనం, ఆత్మ ద్వారా, దేవుని నివాస స్థలాలుగా, ఆధ్యాత్మిక మనస్తత్వాన్ని కలిగి ఉండి, ఆత్మ ఫలాలను పొందుతున్నామా?
పవిత్ర ఆదరణకర్తను దుఃఖించకుండా జాగ్రత్తపడదాం. బదులుగా, ఆయన దయతో కూడిన ఉనికి మరియు ఆయన మన హృదయాలపై కలిగించే ప్రభావం కోసం మనం ఆరాటపడదాం. దేవుని మహిమ కొరకు మనకు అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చుటకు మనము మనస్ఫూర్తిగా కృషి చేద్దాము.



Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |