Deuteronomy - ద్వితీయోపదేశకాండము 16 | View All
Study Bible (Beta)

1. ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.
లూకా 2:41

1. Observe the month Abib and keep the Passover to the LORD your God, for in that month he brought you out of Egypt by night.

2. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱె మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను.

2. You must sacrifice the Passover animal (from the flock or the herd) to the LORD your God in the place where he chooses to locate his name.

3. పస్కా పండు గలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశ ములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాప కము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
1 కోరింథీయులకు 5:8

3. You must not eat any yeast with it; for seven days you must eat bread made without yeast, symbolic of affliction, for you came out of Egypt hurriedly. You must do this so you will remember for the rest of your life the day you came out of the land of Egypt.

4. నీ ప్రాంతము లన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండ కూడదు.

4. There must not be a scrap of yeast within your land for seven days, nor can any of the meat you sacrifice on the evening of the first day remain until the next morning.

5. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింప కూడదు.

5. You may not sacrifice the Passover in just any of your villages that the LORD your God is giving you,

6. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి

6. but you must sacrifice it in the evening in the place where he chooses to locate his name, at sunset, the time of day you came out of Egypt.

7. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తిన వలెను.

7. You must cook and eat it in the place the LORD your God chooses; you may return the next morning to your tents.

8. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధియైన యేపనియు చేయ కూడదు.

8. You must eat bread made without yeast for six days. The seventh day you are to hold an assembly for the LORD your God; you must not do any work on that day.

9. ఏడు వారములను నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని యేడు వార ములను లెక్కించి
అపో. కార్యములు 2:1, 1 కోరింథీయులకు 16:8

9. You must count seven weeks; you must begin to count them from the time you begin to harvest the standing grain.

10. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను.

10. Then you are to celebrate the Festival of Weeks before the LORD your God with the voluntary offering that you will bring, in proportion to how he has blessed you.

11. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.

11. You shall rejoice before him you, your son, your daughter, your male and female slaves, the Levites in your villages, the resident foreigners, the orphans, and the widows among you in the place where the LORD chooses to locate his name.

12. నీవు ఐగు ప్తులో దాసుడవై యుండిన సంగతిని జ్ఞాపకముచేసికొని, యీ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను.

12. Furthermore, remember that you were a slave in Egypt, and so be careful to observe these statutes.

13. నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.

13. You must celebrate the Festival of Temporary Shelters for seven days, at the time of the grain and grape harvest.

14. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశు లును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.

14. You are to rejoice in your festival, you, your son, your daughter, your male and female slaves, the Levites, the resident foreigners, the orphans, and the widows who are in your villages.

15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.

15. You are to celebrate the festival seven days before the LORD your God in the place he chooses, for he will bless you in all your productivity and in whatever you do; so you will indeed rejoice!

16. ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.

16. Three times a year all your males must appear before the LORD your God in the place he chooses for the Festival of Unleavened Bread, the Festival of Weeks, and the Festival of Temporary Shelters; and they must not appear before him empty-handed.

17. వారు వట్టిచేతు లతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తికొలది యియ్యవలెను.

17. Every one of you must give as you are able, according to the blessing of the LORD your God that he has given you.

18. నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామము లన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయ కులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పుతీర్చవలెను.

18. You must appoint judges and civil servants for each tribe in all your villages that the LORD your God is giving you, and they must judge the people fairly.

19. నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.

19. You must not pervert justice or show favor. Do not take a bribe, for bribes blind the eyes of the wise and distort the words of the righteous.

20. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొను నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొన వలెను.

20. You must pursue justice alone so that you may live and inherit the land the LORD your God is giving you.

21. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీ పమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు.

21. You must not plant any kind of tree as a sacred Asherah pole near the altar of the LORD your God which you build for yourself.

22. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభము నైన నిలువబెట్టకూడదు.

22. You must not erect a sacred pillar, a thing the LORD your God detests.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
వార్షిక విందులు. (1-17) 
ఇది ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక సమయాల గురించి మాట్లాడుతోంది, ఇక్కడ ప్రజలు తమ చరిత్రలో జరిగిన ముఖ్యమైన విషయాలను జరుపుకుంటారు మరియు గుర్తుంచుకోవాలి. చెడు విషయాల నుండి వారు ఎలా రక్షించబడ్డారు మరియు రక్షించడానికి ఎంత ఖర్చవుతుంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడం ముఖ్యం. వారు తమ వద్ద ఉన్నవాటికి మరియు ఇతరులకు మంచి పనులు చేయగలిగేందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. విషయాలు కష్టంగా ఉన్నప్పటికీ, వారు దీన్ని గుర్తుంచుకోవాలి మరియు ఓపికగా మరియు ఆశాజనకంగా ఉండాలి. మనం చేయాల్సిన పనిలో ఆనందాన్ని పొందాలి మరియు ఆనందించాలి. ఇంతకు ముందు నియమాలను అనుసరించే వ్యక్తులు సంతోషంగా ఉంటే, సువార్త యొక్క శుభవార్తతో మనకు ఎక్కువ స్వేచ్ఛ ఉన్నందున మనం మరింత సంతోషంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి మరియు దేవునిలో ఆనందాన్ని పొందాలి. మరియు మనం దేవునిలో సంతోషంగా ఉన్నప్పుడు, విచారంగా ఉన్న వ్యక్తులను ఓదార్చడం ద్వారా మరియు అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా ఇతరులకు కూడా సంతోషంగా ఉండేందుకు మనం ప్రయత్నించాలి. దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు కాబట్టి దేవునిలో ఆనందాన్ని పొందే ఎవరైనా ఆశాజనకంగా ఉండవచ్చు. 

న్యాయమూర్తులు, తోటలు మరియు చిత్రాలు నిషేధించబడ్డాయి. (18-22)
వ్యక్తిగత భావాలను పక్కనపెట్టి, ప్రతి ఒక్కరికీ సరైనది చేయడం మరియు న్యాయంగా ఉండటం ముఖ్యం. శక్తివంతమైన మరియు ఆధ్యాత్మిక శక్తి అయిన దేవునికి బదులుగా విగ్రహాలను పూజించడం వంటి ఇతర సంస్కృతుల యొక్క అనారోగ్యకరమైన పద్ధతులను మనం అనుసరించకుండా ఉండాలి. మనకు మంచి వ్యవస్థ ఉన్నప్పటికీ, మన హృదయాలలో దేవుని ముందు ఇతర విషయాలను ఉంచడానికి మనం శోదించబడే సందర్భాలు ఇంకా ఉన్నాయి.



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |