1. నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱెగాని త్రోవ తప్పిపోవుట చూచినయెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను.
1. Thou shalt not see thy brother's ox or his sheep go astray, and hide thyself from them: thou shalt in any case bring them again to thy brother.
2. నీ సహోదరుడు నీ దగ్గర లేక పోయినయెడలను, నీవు అతని నెరుగకపోయిన యెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోద రుడు దాని వెదకుచువచ్చువరకు అది నీ యొద్దనుండ వలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను.
2. And if thy brother shall not {be} nigh to thee, or if thou shalt not know him, then thou shalt bring it to thy own house, and it shall be with thee until thy brother shall seek after it, and thou shalt restore it to him again.
3. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు ఆలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టు కొనినది ఏదైనను నీకు దొరకినయెడల అతడు పోగొట్టు కొనిన దానినిగూర్చి ఆలాగుననే చేయవలెను; నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు.
3. In like manner shalt thou do with his ass; and so shalt thou do with his raiment; and with all lost things of thy brother's, which he hath lost, and thou hast found, shalt thou do likewise: thou mayest not hide thyself.
4. నీ సహోదరుని గాడిదగాని యెద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచినయెడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను.
4. Thou shalt not see thy brother's ass or his ox fall down by the way, and hide thyself from them: thou shalt surely help him to lift {them} up again.
5. స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.
5. A woman shall not wear that which pertaineth to a man, neither shall a man put on a woman's garment: for all that do so {are} abomination to the LORD thy God.
6. గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడిన యెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న యెడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును
6. If a bird's nest shall chance to be before thee in the way on any tree, or on the ground, {whether with} young ones, or eggs, and the dam sitting upon the young, or upon the eggs, thou shalt not take the dam with the young:
7. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.
7. {But} thou shalt in any wise let the dam go, and take the young to thee; that it may be well with thee, and {that} thou mayest prolong {thy} days.
8. క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.
8. When thou buildest a new house, then thou shalt make a battlement for thy roof, that thou mayest not bring blood upon thy house, if any man shall fall from thence.
9. నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్టితములు కాకుండునట్లు నీ ద్రాక్షతోటలో వివిధమైనవాటిని విత్తకూడదు.
9. Thou shalt not sow thy vineyard with divers seeds: lest the fruit of thy seed which thou hast sown, and the fruit of thy vineyard, should be defiled.
10. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.
10. Thou shalt not plow with an ox and an ass together.
11. ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొన కూడదు.
11. Thou shalt not wear a garment of divers sorts, {as} of woolen and linen together.
12. నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను.
12. Thou shalt make thee fringes upon the four quarters of thy vesture, with which thou coverest {thyself}.
13. ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరు వాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి
13. If any man shall take a wife, and go in to her, and hate her,
14. ఆమె చెడ్డదని ప్రచురపరచిఈ స్త్రీని నేను పరి గ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల
14. And give occasions of speech against her, and bring an evil name upon her, and say, I took this woman, and when I came to her, I found her not a maid:
15. ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.
15. Then shall the father of the damsel, and her mother, take and bring forth {the tokens of} the damsel's virginity to the elders of the city in the gate:
16. అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమా ర్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా
16. And the damsel's father shall say to the elders, I gave my daughter to this man for a wife, and he hateth her,
17. ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
17. And lo, he hath given occasions of speech {against her}, saying, I found not thy daughter a maid; and yet these {are the tokens of} my daughter's virginity. And they shall spread the cloth before the elders of the city.
18. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మను ష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధ ముగా వానియొద్ద తీసికొని
18. And the elders of that city shall take that man and chastise him;
19. ఆ చిన్నదాని తండ్రికియ్య వలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్య కను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినము లన్నిటను ఆమెను విడువకూడదు.
19. And they shall amerce him in a hundred {shekels} of silver, and give {them} to the father of the damsel, because he hath brought an evil name upon a virgin of Israel: and she shall be his wife; he may not put her away all his days.
20. అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల
20. But if this thing shall be true, {and the tokens of} virginity be not found for the damsel:
21. వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏల యనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రా యేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
1 కోరింథీయులకు 5:13
21. Then they shall bring out the damsel to the door of her father's house, and the men of her city shall stone her with stones that she may die: because she hath wrought folly in Israel, to be guilty of lewdness in her father's house: so shalt thou remove evil from among you.
22. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
యోహాను 8:5
22. If a man shall be found lying with a woman married to a husband, then they shall both of them die, {both} the man that lay with the woman, and the woman: so shalt thou remove evil from Israel.
23. కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల
23. If a damsel {that is} a virgin shall be betrothed to a husband, and a man shall find her in the city, and lie with her;
24. ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.
1 కోరింథీయులకు 5:13
24. Then ye shall bring them both out to the gate of that city, and ye shall stone them with stones that they may die; the damsel, because she cried not, {being} in the city; and the man, because he hath humbled his neighbor's wife: so thou shalt remove evil from among you.
25. ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మను ష్యుడు మాత్రమే చావవలెను.
25. But if a man shall find a betrothed damsel in the field, and the man shall force her, and lie with her; then the man only that lay with her shall die:
26. ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.
26. But to the damsel thou shalt do nothing; {there is} in the damsel no sin {worthy} of death: for as when a man riseth against his neighbor, and slayeth him, even so {is} this matter:
27. అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.
27. For he found her in the field, {and} the betrothed damsel cried, and {there was} none to save her.
28. ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల
28. If a man shall find a damsel {that is} a virgin, who is not betrothed, and lay hold on her, and lie with her, and they be found;
29. ఆమెతో శయనించినవాడు ఆ చిన్న దాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు.
29. Then the man that lay with her shall give to the damsel's father fifty {shekels} of silver, and she shall be his wife; because he hath humbled her, he may not put her away all his days.
30. ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.
1 కోరింథీయులకు 5:1
30. A man shall not take his father's wife, nor discover his father's skirt.
Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 22 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
సోదరుల పట్ల మానవత్వం. (1-4)
మనం ఇతరులతో ఎలా ప్రవర్తించాలనుకుంటున్నామో అలాగే మనం ప్రవర్తిస్తే, మనకు చాలా నియమాలు అవసరం లేదు. మేము ప్రతి ఒక్కరితో దయగా ఉండాలి మరియు వారికి అవసరమైనప్పుడు వారికి సహాయం చేయాలి ఎందుకంటే మనకు కూడా ఎప్పుడు సహాయం అవసరమో మనకు తెలియదు.
వివిధ సూత్రాలు. (5-12)
దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాల గురించి కూడా శ్రద్ధ వహిస్తాడు మరియు మనం ఆయన పట్ల గౌరవం చూపించేలా పాటించాల్సిన నియమాలను మనకు ఇచ్చాడు. ఈ నియమాలు అప్రధానంగా అనిపించవచ్చు, కానీ అవి నిజంగా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి దేవుని చట్టంలో భాగం. మనము దేవునికి చెందినవారమని చూపించుకోవాలంటే, మనం ఆయన నియమాలను పాటించాలి మరియు అందరూ చేసే పనిని చేయకూడదు. మనం దుస్తులు ధరించినప్పుడు లేదా తిని త్రాగేటప్పుడు కూడా, మన హృదయాలను మరియు చర్యలను స్వచ్ఛంగా ఉంచే విధంగా చేయాలి. మనం చేసే ప్రతి పనిలో నిజాయితీగా, నిజాయితీగా మరియు స్థిరంగా ఉండాలి.
అపవిత్రతకు వ్యతిరేకంగా. (13-30)
కొన్నిసార్లు ప్రజలు ఏడవ నియమాన్ని ఉల్లంఘించడం వంటి చెడు పనులు చేయకుండా నిరోధించడానికి నియమాలను రూపొందించాలి. ఈ నియమం మనం మంచి అనుభూతిని కలిగించే పనులు చేయకూడదని చెబుతుంది, కానీ మన హృదయాలను గాయపరచవచ్చు. మేము అన్ని నియమాలను అర్థం చేసుకోవలసిన అవసరం లేదు, వాటిని అనుసరించడం మాత్రమే అవసరం.
Shortcut Links
Explore Parallel Bibles
21st Century KJV |
A Conservative Version |
American King James Version (1999) |
American Standard Version (1901) |
Amplified Bible (1965) |
Apostles' Bible Complete (2004) |
Bengali Bible |
Bible in Basic English (1964) |
Bishop's Bible |
Complementary English Version (1995) |
Coverdale Bible (1535) |
Easy to Read Revised Version (2005) |
English Jubilee 2000 Bible (2000) |
English Lo Parishuddha Grandham |
English Standard Version (2001) |
Geneva Bible (1599) |
Hebrew Names Version |
Hindi Bible |
Holman Christian Standard Bible (2004) |
Holy Bible Revised Version (1885) |
Kannada Bible |
King James Version (1769) |
Literal Translation of Holy Bible (2000) |
Malayalam Bible |
Modern King James Version (1962) |
New American Bible |
New American Standard Bible (1995) |
New Century Version (1991) |
New English Translation (2005) |
New International Reader's Version (1998) |
New International Version (1984) (US) |
New International Version (UK) |
New King James Version (1982) |
New Life Version (1969) |
New Living Translation (1996) |
New Revised Standard Version (1989) |
Restored Name KJV |
Revised Standard Version (1952) |
Revised Version (1881-1885) |
Revised Webster Update (1995) |
Rotherhams Emphasized Bible (1902) |
Tamil Bible |
Telugu Bible (BSI) |
Telugu Bible (WBTC) |
The Complete Jewish Bible (1998) |
The Darby Bible (1890) |
The Douay-Rheims American Bible (1899) |
The Message Bible (2002) |
The New Jerusalem Bible |
The Webster Bible (1833) |
Third Millennium Bible (1998) |
Today's English Version (Good News Bible) (1992) |
Today's New International Version (2005) |
Tyndale Bible (1534) |
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) |
Updated Bible (2006) |
Voice In Wilderness (2006) |
World English Bible |
Wycliffe Bible (1395) |
Young's Literal Translation (1898) |
Telugu Bible Verse by Verse Explanation |
పరిశుద్ధ గ్రంథ వివరణ |
Telugu Bible Commentary |
Telugu Reference Bible |