Deuteronomy - ద్వితీయోపదేశకాండము 24 | View All
Study Bible (Beta)

1. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.
మత్తయి 5:31, మత్తయి 19:7, మార్కు 10:4

1. When a man hath taken a wyfe and maried her, yf she finde no fauoure in his eyes, because he hath spied some vnclennesse in her. Then let him write her a bylle of devorcement and put it in hir hande and sende her out of his housse.

2. ఆమె అతని యింటనుండి వెళ్లినతరు వాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.

2. Yf when she is departed out of his housse, she goo and be another mans wife

3. ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడల నేమి
మత్తయి 5:31, మత్తయి 19:7, మార్కు 10:4

3. and the seconde husbonde hate her and write her a letter of deuorcement and put it in hir hande and sende her out of his housse, or yf the seconde man dye whiche toke her to wyfe.

4. ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు.

4. Hir first man whiche sent hir awaye maye not take her agayne to be his wyfe, in as moche as she is defiled. For that is abhominacyon in the syght of the Lorde: that thou defile not the lode with synne, which the Lorde thy God geueth the to enherett.

5. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోప కూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.

5. When a man taketh a newe wyfe, he shall not goo a warrefare nether shalbe charged wyth any busynesse: but shalbe fre at home one yere and reioyse with his wife whiche he hath taken.

6. తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్ట కూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే.

6. No ma shall take the nether or the vpper milstone to pledge, for then he taketh a mans lyfe to pledge.

7. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావ వలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.
1 కోరింథీయులకు 5:13

7. Yf any man be founde stealynge any of his brethern the childern of Israel, ad maketh cheuesaunce of him or selleth him, the thefe shall dye. And thou shalt put euell awaye from the.

8. కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారి కాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి.

8. Take hede to thy selfe as concernynge the plage of leprosye, that thou obserue diligently to doo acordinge to all that the preastes the leuites shall theach the, as I commaunded them so ye shall obserue to doo.

9. మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి.

9. Remembre what the Lorde thy God dyd vnto Mir Iam by the waye, after that ye were come out off Egipte.

10. నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు

10. Yf thou lende thy brother any maner soker, thou shalt not goo in to his housse to fetche a pledge:

11. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.

11. but shalt stonde without and the man to whom thou lendest, shall brynge the the pledge out at the dore.

12. ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.

12. Forthermore yf it be a pore body, goo not to slepe with his pledge:

13. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.

13. but delyuer hym the pledge agayne by that the sonne goo doune, and let him slepe in his owne rayment and blesse the. And it shalbe rightuousnes vnto the, before the Lorde thy God.

14. నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.
మార్కు 10:19

14. Thou shalt not defraude an hyred servaunte that is nedye and poore, whether he be off thy brethern or a straunger that is in thy lond within thy cities.

15. సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్య వలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టు కొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.
మత్తయి 20:8, యాకోబు 5:4

15. Geue him his hyre the same daye, and let not the sonne goo doune thereon. For he is nedye ad therewith susteyneth his life, lest he crye agenst the vnto the Lorde ad it be synne vnto the.

16. కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును.

16. The fathers shal not dye for the childern nor the childern for the fathers: but euery ma shall dye for his awne synne.

17. పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.

17. Hynder not the right of the straunger nor of the fatherlesse, nor take wedowes rayment to pledge.

18. నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించె నని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.

18. But remembre that thou wast a servaunte in Egipte, ad how the Lord thy God delyuered the thece. Wherfore I comaude the to doo this thinge.

19. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొల ములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండ వలెను.

19. When thou cuttest doune thyne herueste in the felde and hast forgotte a shefe in the felde thou shalt not goo agayne and fett it: But it shalbe for the straunger, the fatherlesse and the wedowe, that the Lorde thy God maye blesse the in all the workes of thyne hande.

20. నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను.

20. When thou beatest doune thyne olyue, trees thou shalt not make cleane riddaunce after the: but it shalbe for the straunger, the fatherlesse and the wedowe.

21. నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారి కిని విధవరాండ్రకును ఉండవలెను.

21. And when thou gatherest thy vyneyarde, thou shalt not gather cleane after the: but it shalbe for the straunger, the fatherlesse and the wedowe.

22. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటి వని జ్ఞాపకముచేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

22. And remembre that thou wast a seruaunte in the lond of Egipte: wherfore I comaunde the to doo this thinge.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Deuteronomy - ద్వితీయోపదేశకాండము 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

విడాకుల. (1-4) 
ఒక క్రైస్తవుడికి సహాయం చేయని వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇస్తే, వారు ఏదైనా తప్పు చేయడం మరియు పరిస్థితిని మరింత దిగజార్చడం కంటే కష్టాన్ని ఎదుర్కోవటానికి ఎంచుకుంటారు. దేవుని సహాయం దానిని నిర్వహించడం సులభతరం చేస్తుంది మరియు కాలక్రమేణా తక్కువ నొప్పిని కలిగించే విధంగా ఎలా ప్రవర్తించాలో వారు నేర్చుకుంటారు.

కొత్తగా పెళ్లయిన వారి, మనిషి దొంగల, వాగ్దానాలు. (5-13) 
భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడం మరియు శ్రద్ధ వహించడం మరియు ఒకరినొకరు ఇష్టపడని పనులు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ప్రజలను దొంగిలించడం నిజంగా చెడ్డ నేరం మరియు తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడం ద్వారా పరిష్కరించబడదు. ఎవరికైనా లెప్రసీ అనే వ్యాధి ఉంటే పాటించాల్సిన నియమాలున్నాయి. ఎవరైనా తాము చేసిన దాని గురించి చెడుగా భావించినట్లయితే, వారు దానిని దాచకూడదు లేదా విస్మరించకూడదు. బదులుగా, వారు క్షమించండి మరియు విషయాలను సరిదిద్దడానికి ప్రయత్నించాలి. ఎవరైనా డబ్బు తీసుకున్నప్పుడు, అనుసరించాల్సిన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు మన అవసరాలే కాకుండా ఇతరుల అవసరాల గురించి ఆలోచించాలని మనకు గుర్తు చేస్తాయి. ఎవరైనా డబ్బు బాకీ ఉండి, చాలా లేకుంటే, వారి స్వంత దుస్తులను ఉంచుకోవడం మరియు మనం వారికి అందించే ఏ సహాయంకైనా కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం. డబ్బు బాకీ ఉన్న వ్యక్తులు తమకు బాకీ ఉన్న వ్యక్తి తమకు వ్యతిరేకంగా అన్ని నిబంధనలను ఉపయోగించనప్పుడు అభినందించాలి మరియు దయతో ఉండటం బలహీనమని మనం అనుకోకూడదు. 

న్యాయం మరియు దాతృత్వం. (14-22)
మంచిగా, న్యాయంగా మరియు దయగా ఉండటమే దేవుడు ఇష్టపడతాడు మరియు మనం ఏమి చేయాలి అని చూపించడం చాలా సులభం. కానీ ప్రతిరోజూ దీన్ని గుర్తుంచుకోవడం కష్టం.



Shortcut Links
ద్వితీయోపదేశకాండము - Deuteronomy : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |