Hebrews - హెబ్రీయులకు 13 | View All

1. సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి

యోహాను 13:34; రోమీయులకు 12:10; రోమీయులకు 13:8.

2. ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
ఆదికాండము 18:1-8, ఆదికాండము 19:1-3

రోమీయులకు 12:13; 1 పేతురు 4:9; 3 యోహాను 1:5-8. “దేవదూతలకు”– ఆదికాండము 18:2, ఆదికాండము 18:22; ఆదికాండము 19:1-3. దేవదూతలు కొన్ని సార్లు మానవ రూపంలో కనిపిస్తారు. మనం కొత్తవారికి అతిధి మర్యాదలు చేసినప్పుడే బహుశా దేవదూతల్లో ఎవరినైనా మన ఇంటికి రప్పించుకునే అవకాశం కలుగుతుందేమో.

3. మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.

లూకా 6:31; రోమీయులకు 12:15; మత్తయి 25:34-40. మనల్ని మనం ఇతరుల స్థానంలో అనుభవంలో ఊహించుకుని దయ చూపడానికి మనకు సహాయం చేసేది ప్రేమే.

4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

“మాననీయం”– క్రైస్తవులు వివాహాన్ని గౌరవించాలి. ఎందుకంటే దాన్ని నియమించినది దేవుడే (మత్తయి 19:4-6). “తీర్పు”– ప్రకటన గ్రంథం 21:8; కొలొస్సయులకు 3:5-6; ఎఫెసీయులకు 5:3-6; 1 కోరింథీయులకు 6:9-10.

5. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
ఆదికాండము 28:15, ద్వితీయోపదేశకాండము 31:6, ద్వితీయోపదేశకాండము 31:8, యెహోషువ 1:5

“డబ్బు మీది వ్యామోహం”– ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. 1 తిమోతికి 6:9-10; మత్తయి 6:19-20, మత్తయి 6:24; లూకా 12:15-21; లూకా 16:14; యోహాను 12:4-6. “తృప్తిపడుతూ”– లూకా 3:14; ఫిలిప్పీయులకు 4:12; 1 తిమోతికి 6:6-8. “చెయ్యి విడువను”– ద్వితీయోపదేశకాండము 1:6; మత్తయి 28:20; యోహాను 14:16. లోకంలోని సిరిసంపదలన్నిటి కంటే మనతో దేవుడు ఉండడమే ఎంతో మేలు. ఆయన మనతో ఉంటే మనకు అవసరమైనవాటన్నిటినీ ఇస్తాడు (మత్తయి 6:25-34; ఫిలిప్పీయులకు 4:19). ఆయన మనలో ఉండడం ద్వారా అన్ని విషయాల్లోనూ తృప్తిగా ఉండడం మనం నేర్చుకోగలుగుతాం. మరి విశ్వాసులు పాపం చేస్తే దేవుడు వారిని విడచిపెట్టడా? ఎన్నడూ వదిలిపెట్టనని ఆయన అన్నాడంటే ఎన్నడూ వదిలిపెట్టడన్నమాటే. అలాగని వారు పాపం చేసినా ఫర్వా లేదన్నట్టు కాదు. అందుకు వ్యతిరేకంగా వారు పవిత్రులుగా ఉండేందుకు వారికి స్వేచ్ఛ ఉంది (రోమీయులకు 6:1-2; రోమీయులకు 8:2). అయితే విశ్వాసులు ఆయన్ను పూర్తిగా వదిలి పెట్టలేరా? అలా వదిలిపెట్టరు (హెబ్రీయులకు 10:39; యోహాను 10:27). వారు అందుకు ప్రయత్నించినా (అసలు ప్రయత్నించరు) అది దాదాపు అసాధ్యం అనిపిస్తున్నది (కీర్తనల గ్రంథము 139:7-12).

6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
కీర్తనల గ్రంథము 118:6

కీర్తనల గ్రంథము 118:6-7; రోమీయులకు 8:31; మత్తయి 10:28-31; కీర్తనల గ్రంథము 27:1-3. మనుషులు ఇంతవరకు వారికి చాలా హాని చేశారు (హెబ్రీయులకు 10:32-34). అయితే మనుషులంటే భయానికి వారి బ్రతుకులో తావు ఉండకూడదు. మనుషులు చేయగలిగినదేదైనా క్షణికమే. దేవుడు గనుక వారితో ఉంటే ధన్యకరమైన అనంత యుగాలు వారికోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. 2 కోరింథీయులకు 4:17-18 పోల్చి చూడండి.

7. మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.

“నాయకులు”– దేవుని వాక్కు చెప్పి అంటే భూతకాలంలో మాట్లాడుతూ, ఆ నాయకులు ఇప్పుడు వారిలో లేరన్నట్టు సూచిస్తున్నాడు రచయిత. మొదటగా వారికి శుభవార్త ప్రకటించినవారిని ఉద్దేశించి ఈ మాటలు రాశాడన్నమాట. “అనుసరించండి”– 1 కోరింథీయులకు 4:16; 1 కోరింథీయులకు 11:1; ఫిలిప్పీయులకు 3:17; 1 థెస్సలొనీకయులకు 1:6; 2 థెస్సలొనీకయులకు 3:7, 2 థెస్సలొనీకయులకు 3:9.

8. యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
యెషయా 43:13

నాయకులుగా ఉన్న మనుషులు ఉంటారు, పోతారు. క్రీస్తు మాత్రం ఎప్పుడూ ఒకటే (హెబ్రీయులకు 1:12). ఆయన పరిచర్య ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది (హెబ్రీయులకు 7:24-25). ఆయన స్వభావంలో గానీ తన ప్రజలపట్ల ఆయనకున్న శ్రద్ధలో గానీ ఏ మార్పూ కలగదు.

9. నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.

“విపరీత ఉపదేశాలు”– ఎఫెసీయులకు 4:14; రోమీయులకు 16:17; అపో. కార్యములు 20:20; మత్తయి 7:15. మత సంస్కారాల్లో ఆహారాలకు కొంత ఆధ్యాత్మిక విలువ ఉందని చెప్పే యూద మత సంబంధమైన ఉపదేశాలు ఆ రోజుల్లో ఉన్నాయి. బహుశా వాటి గురించి రచయిత రాస్తున్నట్టుంది (రోమీయులకు 14:2, రోమీయులకు 14:14, రోమీయులకు 4:21; 1 కోరింథీయులకు 8:8; కొలొస్సయులకు 2:8; కొలొస్సయులకు 2:16-23. లేవీయకాండము 11:2-23 నోట్స్ చూడండి). ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచగలిగేది దేవుని కృప మాత్రమే.

10. మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.

“బలిపీఠం”– క్రీస్తు విశ్వాసులకు కంటికి కనిపించే బలిపీఠం ఈ లోకంలో లేదు. క్రీస్తు సిలువపై చేసిన బలి అర్పణ గురించి రచయిత మాట్లాడుతున్నాడు. నమ్మకం మూలంగా క్రీస్తును స్వీకరించినవారికి ఉన్నది ఆధ్యాత్మిక ఆహారమే, మత సంస్కారాలకు సంబంధించిన ఆహారం కాదు (యోహాను 6:53-58, యోహాను 6:63). పాత యూద మత వ్యవస్థను సేవిస్తూ క్రీస్తునూ కొత్త ఒడంబడికనూ తిరస్కరించేవారికి ఈ “బలిపీఠం”లో వంతు లేదు.

11. వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
లేవీయకాండము 16:27

ప్రాయశ్చిత్త దినం గురించి రచయిత మాట్లాడుతున్నాడు – హెబ్రీయులకు 9:7. లేవీయకాండము 16:27 చూడండి. ఆ రోజు అర్పించబడిన జంతువుల మాంసాన్ని ఎవరూ తినకూడదు. మన కోసం అర్పించబడిన క్రీస్తు మాంసాన్ని ఎవరూ తినలేరని వేరే చెప్పనవసరం లేదు గదా.

12. కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.

“పవిత్రపరచడానికి”– హెబ్రీయులకు 10:10 క్రీస్తు రక్తం విశ్వాసులను ప్రత్యేకపరచి, దేవుని ప్రజలుగా వారిని ప్రతిష్ఠిస్తుంది. “ద్వారం వెలుపల”– సిలువ వేసే స్థలం (గొల్గొతా, లేక కల్వరి) జెరుసలం నగరం బయట ఉంది (మత్తయి 27:32-33).

13. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.
లేవీయకాండము 16:27

“నింద భరిస్తూ”– హెబ్రీయులకు 12:2; గలతియులకు 5:11. నేరం రుజువైన వారిని సిలువ వేసేవారు. మన స్థానంలో క్రీస్తు మరణించాడని సమ్మతిస్తూ ఆయన దగ్గరికి వెళ్తే, మనం చావుకు తగిన పాపాత్ములమని ఒప్పుకుంటున్నామన్నమాట. విశ్వాసులు సిలువ వేయబడిన రక్షకుడికి చెందిన సిలువ వేయబడిన ప్రజలు (గలతియులకు 6:14). అలా చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. “శిబిరం బయటికి”– అంటే యూద మతం వెలుపల, పాత ఒడంబడిక వ్యవస్థతో సంబంధం లేకుండా అని రచయిత ఉద్దేశం.

14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము.

“నగరం”– హెబ్రీయులకు 11:10, హెబ్రీయులకు 11:16; హెబ్రీయులకు 12:22.

15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
లేవీయకాండము 7:12, 2 దినవృత్తాంతములు 29:31, కీర్తనల గ్రంథము 50:14, కీర్తనల గ్రంథము 50:23, యెషయా 57:19, హోషేయ 14:2

బలులు, అర్పణలు చేసే యాజులు పాత ఒడంబడికలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు విశ్వాసులంతా క్రొత్త ఒడంబడికకు యాజులని రచయిత సూచిస్తున్నాడు. 1 పేతురు 2:5, 1 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 1:6 చూడండి. వారి అర్పణలు బలిపీఠం కోసమైన జంతువులు గానీ ఇతర పదార్థాలు గానీ కాదు. అంతకన్నా శ్రేష్ఠమైనవే. “స్తుతి”– కీర్తనల గ్రంథము 33:1-3 దగ్గర నోట్స్, రిఫరెన్సులు.

16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.

“ఉపకారాలు”– క్రొత్త ఒడంబడిక యాజుల పరిచర్యలో అది చాలా ప్రాముఖ్యమైన భాగం. మత్తయి 5:16; మత్తయి 25:34-40; లూకా 6:27, లూకా 6:35; రోమీయులకు 12:21; 2 కోరింథీయులకు 9:8; గలతియులకు 6:10; కొలొస్సయులకు 1:10; 2 థెస్సలొనీకయులకు 2:17; యాకోబు 1:27; 1 పేతురు 2:12. “దానధర్మాలు”– మత్తయి 5:42; రోమీయులకు 12:13; గలతియులకు 6:6; 1 తిమోతికి 6:18; 1 యోహాను 3:17. ఇలాంటి అర్పణలంటే దేవునికి ఇష్టం. హెబ్రీయులకు 10:6 పోల్చి చూడండి.

17. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
యెషయా 62:6, యెహెఙ్కేలు 3:17

“వారికి లోబడండి”– సంఘాలకు నాయకులుండాలి. వారికి అధికారం ఉండాలి. వారిని నియమించే దేవునినుంచే ఆ అధికారం కలిగింది. ఈ హీబ్రూవారి నాయకులు మంచివారని రచయితకు నమ్మకం కుదిరింది. నాయకులంతా మంచివారు కాదు. దేవుడు వెల్లడించిన సత్యం ప్రకారం విశ్వాసులను నడిపించని నాయకులకు లోబడకూడదు (అపో. కార్యములు 4:19; అపో. కార్యములు 5:29 చూడండి). మంచి నాయకులు తమ సంఘ సభ్యులకు కాపరులుగా ఉండాలి – అపో. కార్యములు 20:28; 1 పేతురు 5:1-4. “లెక్క”– సంఘ నాయకులు తమ వ్యక్తిగత జీవితాల గురించి మాత్రమే గాక దేవుని ప్రజలపై తమ నాయకత్వం గురించి కూడా దేవునికి లెక్క చెప్పాలి.

18. మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.

“అంతర్వాణి”– 2 కోరింథీయులకు 1:12; 2 కోరింథీయులకు 4:2.

19. మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.

రోమీయులకు 15:30-32; ఫిలేమోనుకు 1:22 పోల్చి చూడండి.

20. గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
యెషయా 63:11, యిర్మియా 32:40, యెహెఙ్కేలు 37:26, జెకర్యా 9:11

“రక్తం”– హెబ్రీయులకు 9:12; హెబ్రీయులకు 10:29; మత్తయి 26:28. ఇక్కడ క్రొత్త ఒడంబడికను శాశ్వతమైనది అని పిలుస్తున్నాడు రచయిత. దాని స్థానంలో వేరొకటి రావలసిన అవసరం ఎన్నడూ ఉండదు. తన ప్రజల విషయంలో దేవుని ఉద్దేశాన్ని అది శాశ్వతంగా నెరవేర్చేది. “గొప్ప కాపరి”– యోహాను 10వ అధ్యాయం. “చనిపోయిన”– మత్తయి 28:6. క్రీస్తు మరణం నుంచి సజీవంగా తిరిగి లేవడం గురించి ఈ లేఖలో రచయిత చెప్పినది ఇక్కడ ఒక్క చోటే. కానీ కొన్ని చోట్ల చూచాయగా దీన్ని సూచించాడు – హెబ్రీయులకు 1:3; హెబ్రీయులకు 2:9; హెబ్రీయులకు 10:12-13. “శాంతిప్రదాత దేవుడు”– హెబ్రీయులకు 7:2; రోమీయులకు 15:33; రోమీయులకు 16:20; 2 థెస్సలొనీకయులకు 3:16.

21. యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

ప్రతి విశ్వాసి కోసమూ దేవుడిది చేయగలడు. ఏ విశ్వాసీ తనకోసం తాను చేసుకోలేడు. దేవుడు మనల్ని సంసిద్ధులంగా చెయ్యకపోతే, మనలో పని చేయకపోతే, మన కార్యకలాపాలేవీ ఆయన్ను సంతోషపెట్టవు. 2 కోరింథీయులకు 3:5; ఫిలిప్పీయులకు 2:13; కొలొస్సయులకు 1:29. ప్రతి విశ్వాసి లక్ష్యమూ సరిగ్గా యేసుప్రభు లక్ష్యం వంటిది కావాలి (మత్తయి 26:39; యోహాను 4:34; యోహాను 6:38; యోహాను 8:29) – దేవుని సంకల్పం నెరవేర్చడం, అంతకన్నా ఎక్కువ గానీ తక్కువ గానీ దానికి భిన్నమైనది గానీ కాకూడదు. విశ్వాసుల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు దీన్ని చేస్తాడు. దేవుని కృప, ప్రభావాలు క్రీస్తు ద్వారా తప్ప మరి ఏ మార్గంలోనూ మనకు అందవు.

22. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.

“ప్రోత్సాహ వాక్కు”– సిద్ధాంతాలతో, సత్యాలతో పాటు మధ్య మధ్య హెచ్చరికలు కూడా కలిపి రచయిత ఈ లేఖ రాశాడు. తరచుగా “అందుచేత”, “చేద్దాం” వంటి పదాలు ఉపయోగించాడు (వ 13,15; హెబ్రీయులకు 2:1; హెబ్రీయులకు 4:1, హెబ్రీయులకు 4:11, హెబ్రీయులకు 4:16; హెబ్రీయులకు 6:1; హెబ్రీయులకు 10:19, హెబ్రీయులకు 10:22-24; హెబ్రీయులకు 12:1, హెబ్రీయులకు 12:28). ఈ లేఖ వారి ప్రవర్తన సరి చేసేందుకు తోడ్పడాలన్న ఉద్దేశంతోనే రాశాడు. వారికి లోతైన ఆధ్యాత్మిక జీవితం కలగాలని లోతైన సత్యాలు వివరించాడు.

23. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.

తిమోతి – అపో. కార్యములు 16:1. తిమోతి అంతకుముందు చెరసాలలో ఉన్నట్టున్నాడు.

24. మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.

25. కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్‌.

“కృప”– యోహాను 2:14, యోహాను 2:16; రోమీయులకు 1:2; 2 కోరింథీయులకు 8:9; మొ।। చోట్ల నోట్స్ చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Hebrews - హెబ్రీయులకు 13 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

వివిధ విధులకు ఉపదేశాలు మరియు ప్రొవిడెన్స్ కేటాయించిన దానితో సంతృప్తి చెందడం. (1-6) 
క్రీస్తు మన కోసం తనను తాను త్యాగం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, సద్గుణాల కోసం అంకితభావంతో ప్రత్యేకమైన సమాజాన్ని పొందడం. నిజమైన మతపరమైన నిబద్ధత స్నేహానికి అత్యంత బలమైన పునాదిగా పనిచేస్తుంది. ఈ ప్రకరణము వివిధ క్రైస్తవ బాధ్యతల కొరకు హృదయపూర్వకమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది, ప్రత్యేకించి సంతృప్తి యొక్క ధర్మాన్ని నొక్కి చెబుతుంది. ఈ ధర్మం మరియు బాధ్యతకు విరుద్ధం అత్యాశ - ప్రాపంచిక సంపదల పట్ల కనికరంలేని కోరిక మరియు ఎక్కువ కలిగి ఉన్నవారి పట్ల అసూయ. స్వర్గంలో సంపదను కలిగి ఉండటం ద్వారా, నిరాడంబరమైన భూసంబంధమైన ఆస్తులలో మనం సంతృప్తిని పొందవచ్చు. అసంతృప్తంగా ఉన్నవారు దేవుడు తమ పరిస్థితులను ఉన్నతీకరించినప్పటికీ సంతృప్తిని పొందలేరు. స్వర్గంలో ఉన్నప్పటికీ, ఆడమ్ అసంతృప్తిగా ఉన్నాడు; పరలోకంలోని కొందరు దేవదూతలు అసంతృప్తి చెందారు. ఏది ఏమైనప్పటికీ, అపొస్తలుడైన పౌలు అవమానాన్ని మరియు లోపాన్ని అనుభవించినప్పటికీ, ప్రతి పరిస్థితిలో సంతృప్తిని పొందే కళలో ప్రావీణ్యం సంపాదించాడు. క్రైస్తవులు తమ ప్రస్తుత పరిస్థితుల్లో సంతృప్తిని పొందేందుకు అనేక కారణాలున్నాయి. వాగ్దానం అన్ని వాగ్దానాల సారాంశాన్ని సంగ్రహిస్తుంది: "నేను ఎప్పటికీ, లేదు, ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను, లేదు, నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను." ఈ వాగ్దానాన్ని ధృవీకరించడానికి అసలు వచనం ఐదు ప్రతికూలతలను ఉపయోగిస్తుంది, నిజమైన విశ్వాసులు జీవితాంతం, మరణంలో మరియు శాశ్వతంగా దేవుని దయగల ఉనికిని అనుభవిస్తారని హామీ ఇచ్చారు. మానవ చర్యలు దేవునికి వ్యతిరేకంగా శక్తిలేనివి, మరియు దేవుడు హాని కోసం ఉద్దేశించిన ప్రతిదాన్ని తన ప్రజలకు మంచిగా మార్చగలడు.

విశ్వాసపాత్రులైన పాస్టర్ల సూచనలను గౌరవించడం, వింత సిద్ధాంతాల ద్వారా దూరంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం. (7-15) 
ప్రాణాలతో బయటపడినవారు తమ సాక్ష్యాన్ని గౌరవంగా మరియు ఓదార్పుతో ముగించిన మంత్రుల మార్గదర్శకత్వం మరియు ఉదాహరణలను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఈ మంత్రులలో కొందరు మరణించినప్పటికీ, మరికొందరు మరణ అంచున ఉన్నప్పటికీ, చర్చి యొక్క గొప్ప అధిపతి మరియు ప్రధాన పూజారి, వారి ఆత్మల బిషప్, సజీవంగా మరియు మారకుండా ఉన్నారు. క్రీస్తు పాత నిబంధన మరియు సువార్త రోజులలో స్థిరంగా ఉంటాడు మరియు అతని ప్రజలకు ఎప్పటికీ అలానే ఉంటాడు-సమానంగా దయగలవాడు, శక్తివంతుడు మరియు అన్నింటికి సరిపోతాడు. అతను ఆకలితో ఉన్నవారిని సంతృప్తి పరచడం, వణుకుతున్న వారికి భరోసా ఇవ్వడం మరియు పశ్చాత్తాపపడిన పాపులను స్వాగతించడం కొనసాగిస్తున్నాడు. అతను ఇప్పటికీ గర్వంగా మరియు స్వీయ-నీతిమంతులను తిరస్కరించాడు, కేవలం వృత్తిని తృణీకరిస్తాడు మరియు అతను రక్షించే వారికి ధర్మాన్ని స్వీకరించమని మరియు అధర్మాన్ని అసహ్యించుకోవాలని సూచించాడు. విశ్వాసులు తమ హృదయాలను స్వేచ్ఛా కృపపై సాధారణ ఆధారపడటం, పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతం చేయడం, భ్రమకు వ్యతిరేకంగా ఓదార్పు మరియు రక్షణ కల్పించడం కోసం ప్రయత్నించాలి.
క్రీస్తు మన బలిపీఠం మరియు త్యాగం రెండింటినీ సేవిస్తాడు, సమర్పణను పవిత్రం చేస్తాడు. ప్రభువు భోజనం సువార్త పాస్ ఓవర్ విందును సూచిస్తుంది. లేవీయ ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండటం దాని స్వంత ప్రమాణాల ప్రకారం, క్రైస్తవ బలిపీఠం దగ్గరకు రాకుండా ప్రజలను నిరోధించగలదని ప్రదర్శించిన తర్వాత, అపొస్తలుడు, "మనం శిబిరం లేకుండా అతని వద్దకు వెళ్దాం." ఇది ఆచార నియమాల నుండి, పాపం నుండి, ప్రపంచం నుండి మరియు స్వీయ నుండి నిష్క్రమణను సూచిస్తుంది. క్రీస్తులో విశ్వాసంతో జీవించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా దేవునికి అంకితం చేయబడి, విశ్వాసులు ఈ పాపభరిత ప్రపంచం నుండి తమను తాము ఇష్టపూర్వకంగా వేరు చేస్తారు. పాపం, పాపులు మరియు మరణం మనం నిరవధికంగా ఇక్కడ ఉండనివ్వవు కాబట్టి, మనం ఇప్పుడు విశ్వాసంతో ముందుకు వెళ్లి, ఈ ప్రపంచం అందించలేని విశ్రాంతి మరియు శాంతిని క్రీస్తులో వెతుకుదాం. మన బలులను ఈ బలిపీఠానికి మరియు మన ప్రధాన యాజకునికి సమర్పించి, ఆయన ద్వారా అర్పిద్దాం. ఆరాధన, ప్రార్థన మరియు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతించే త్యాగం నిరంతరం సమర్పించబడాలి.

దేవునికి, మన పొరుగువారికి మరియు ప్రభువులో మనపై ఉంచిన వారికి సంబంధించిన విధులకు మరిన్ని ఉపదేశాలు. (16-21) 
ప్రజల ఆత్మలు మరియు శరీరాలు రెండింటి అవసరాలను తీర్చడానికి మా సామర్థ్యం మేరకు మేము బాధ్యత వహిస్తాము. దేవుడు ఈ అర్పణలను సంతోషముతో స్వీకరిస్తాడు మరియు క్రీస్తు ద్వారా ఇచ్చేవారిని ఆశీర్వదిస్తాడు. అపొస్తలుడు సజీవ పరిచారకుల పట్ల కర్తవ్యాన్ని వివరిస్తాడు: అతని మాటలో వెల్లడైన దేవుని మనస్సు మరియు చిత్తానికి అనుగుణంగా వారికి కట్టుబడి మరియు సమర్పించడం. క్రైస్తవులు తమను తాము చాలా తెలివైనవారిగా, చాలా సద్గుణవంతులుగా లేదా నేర్చుకోవడం కొనసాగించడానికి చాలా ముఖ్యమైన వారిగా భావించకూడదు. ప్రజలు లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించమని ప్రోత్సహిస్తారు మరియు పరిచారకులు ఆ ప్రమాణానికి అనుగుణంగా బోధించినంత కాలం, వారు తమ సూచనలను దేవుని వాక్యంగా అంగీకరించాలి, ఇది నమ్మేవారిలో ప్రభావవంతంగా ఉంటుంది. శ్రోతలు దుఃఖంతో కాకుండా సంతోషంతో వారి గురించి నివేదించడం శ్రోతలకు మేలు చేస్తుంది. నమ్మకమైన పరిచారకులు తమను తాము రక్షించుకుంటారు, కానీ ఉత్పాదకత లేని మరియు విశ్వాసం లేని సమాజాన్ని నాశనం చేయడం వారి తలపైనే ఉంటుంది. ప్రజలు తమ పరిచారకుల కోసం ఎంత శ్రద్ధగా ప్రార్థిస్తారో, వారు తమ పరిచర్య నుండి ఎంత ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఎదురుచూడవచ్చు. మంచి మనస్సాక్షి దేవుని ఆజ్ఞలు మరియు విధులన్నింటికి విధేయతను కలిగి ఉంటుంది. మంచి మనస్సాక్షి ఉన్నవారికి కూడా ఇతరుల ప్రార్థనలు అవసరం. ఒక కమ్యూనిటీకి వచ్చిన మంత్రులు ఎక్కువ సంతృప్తిని పొందాలని, ప్రజలకు విజయాన్ని అందించాలని ప్రార్థించారు. మన ఆశీర్వాదాలన్నీ ప్రార్థన ద్వారా పొందాలి. దేవుడు, శాంతి దేవుడు, విశ్వాసులతో పూర్తిగా రాజీపడి ఉన్నాడు. అతను దేవుని కుమారుని రక్తంలో దాని పునాదితో ఒడంబడికను స్థాపించాడు. సాధువుల కోరిక ఏమిటంటే, ప్రతి మంచి పనిలో పరిపూర్ణత సాధించడం, స్వర్గం యొక్క కోరికలు మరియు ఆనందాల కోసం వారిని సిద్ధం చేయడం. మనలోని ప్రతి మంచి విషయం దేవుని పని, మరియు క్రీస్తు ద్వారా తప్ప, ఆయన నిమిత్తము మరియు అతని ఆత్మ ద్వారా తప్ప మనలోని దేవుని ద్వారా ఏ మంచి పని జరగదు.

ఈ లేఖను తీవ్రంగా పరిగణించాలి. (22-25)
విశ్వాసులతో సహా పురుషులు తమ స్వాభావిక అవినీతి ప్రభావాలకు ఎంతగానో ఆకర్షితులవుతారు, వారి ప్రయోజనం కోసం వారికి అత్యంత కీలకమైన మరియు సాంత్వన కలిగించే సిద్ధాంతాలు అందించబడినా మరియు బలవంతపు సాక్ష్యాధారాల ద్వారా మద్దతు ఇవ్వబడినా కూడా, గంభీరమైన వేడుకోలు మరియు ప్రబోధం అవసరం. వివాదాలు, నిర్లక్ష్యం లేదా తిరస్కరణ లేకుండా వారు దానిని స్వీకరించడాన్ని ఇది నిర్ధారిస్తుంది. పవిత్ర ప్రేమ మరియు దయ యొక్క చట్టం క్రైస్తవుల హృదయాలలో ఒకరి పట్ల మరొకరు చెక్కబడి ఉండటం ప్రయోజనకరం. నిజమైన మతం నిజమైన సభ్యత మరియు మంచి మర్యాదలను అందిస్తుంది; ఇది కోపం లేదా అసభ్యతతో గుర్తించబడలేదు. దేవుని అనుగ్రహం మీపై ఉండుగాక, మరియు ఆయన కృప నిరంతరంగా మీలోపల మరియు మీతో పాటు పనిచేస్తూ, వేచివున్న మహిమకు నాందిగా పవిత్రత యొక్క ఫలాలను ఉత్పత్తి చేస్తుంది.



Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |