Hebrews - హెబ్రీయులకు 6 | View All
Study Bible (Beta)

1. కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందు టయు,

“ప్రాథమికమైన పాఠాలు”– ఈ “పునాది” ఉందని చెప్పాడు (వ 2) గానీ ఈ పునాది ఏమిటో అంత స్పష్టంగా వివరించలేదు రచయిత. క్రైస్తవులుగా మారిన యూదులకు అతడీ లేఖ రాస్తున్నాడు. బహుశా యూదులుగా వారికి పాత ఒడంబడికవల్ల కలిగిన పునాది అని రచయిత ఉద్దేశం కావచ్చు. లేక ఈ కొత్త ఒడంబడిక యుగంకోసం క్రీస్తు రాయబారులు వేసిన పునాది కావచ్చు. అతని భావం సందేహంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ రచయిత చెప్పిన ఆరు విషయాల్లో ఒక్కటి కూడా ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసానికి మాత్రమే చెందినదని అనుకోవడానికి వీలులేదు. ఇవన్నీ కూడా పాత ఒడంబడికలో వేయబడిన పునాదిలో భాగం అయ్యేందుకు అవకాశం లేకపోలేదు. “సంపూర్ణత”– హెబ్రీయులకు 5:14; ఎఫెసీయులకు 4:13-15. “పశ్చాత్తాపపడడమూ దేవునిమీద నమ్మకం ఉంచడమూ”– రచయిత క్రీస్తుమీద నమ్మకం ఉంచడమూ అనకపోవడం గమనించండి. క్రైస్తవ జీవితం పునాది గురించి ఇతడు రాస్తున్నట్టయితే ఇలా అనకపోవడం వింతైన విషయం గదా. పశ్చాత్తాపం గురించి నోట్ మత్తయి 3:7.

2. దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము.

“బాప్తిసాలను”– బహువచనాన్ని గమనించండి. క్రైస్తవ బాప్తిసం గురించి గనుక రచయిత మాట్లాడుతూ ఉంటే బహుశా ఏకవచనం వాడేవాడు గదా. ఎఫెసీయులకు 4:5 చూడండి. “నీటి సంస్కారాలనూ” అని కూడా గ్రీకు మాటను తర్జుమా చేయవచ్చు. పాత ఒడంబడికలో వేరువేరు నీటి సంస్కారాలున్నాయి – నిర్గమకాండము 29:4; నిర్గమకాండము 30:19-21; లేవీయకాండము 11:25; లేవీయకాండము 13:6; లేవీయకాండము 14:8; లేవీయకాండము 16:26; లేవీయకాండము 17:16; సంఖ్యాకాండము 8:7; సంఖ్యాకాండము 19:8; మొ।।. “చేతులుంచడం”– ఇది కూడా పాత ఒడంబడిక గ్రంథంలో కనిపిస్తున్నది (సంఖ్యాకాండము 8:10; సంఖ్యాకాండము 27:18; నిర్గమకాండము 29:10; లేవీయకాండము 1:4). “చనిపోయినవారు లేవడమూ”– దానియేలు 12:2; యెషయా 26:19; కీర్తనల గ్రంథము 16:10. “తీర్పు”– కీర్తనల గ్రంథము 9:8; కీర్తనల గ్రంథము 82:8; కీర్తనల గ్రంథము 94:2; కీర్తనల గ్రంథము 96:13; దానియేలు 7:9-10; యోవేలు 3:12. అయితే కొందరు పండితులు ఈ పునాది విషయాన్ని వేరొక దృష్టితో చూశారు. “దేవునిమీద నమ్మకం” అంటే రచయిత మనసులో క్రీస్తుపై నమ్మకం అనే ఆలోచన కూడా ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. బాప్తిసాలు అంటే యోహాను బాప్తిసం, క్రైస్తవ బాప్తిసం, పవిత్రాత్మ బాప్తిసం అని అర్థం కావచ్చుననీ, చేతులుంచడమంటే ఆరంభ క్రైస్తవుల్లో ఉన్న ఆచారం కావచ్చుననీ (అపో. కార్యములు 6:6; అపో. కార్యములు 8:16-18; అపో. కార్యములు 13:3; మొ।।) అన్నారు. అయినప్పటికీ క్రైస్తవ జీవితానికున్న పునాదిని వర్ణించడానికి ఇలాంటి జాబితాను ఇవ్వడం వింతగానే అనిపిస్తున్నది. ఇందులో క్రీస్తు అనే పేరే కనిపించదు. ఆయన అవతారం, పాపాలకోసం ఆయన చేసిన బలి, పవిత్రాత్మను ఇవ్వడం, క్రీస్తు సంఘం గురించిన ఉపదేశం, క్రీస్తుద్వారా శాశ్వత జీవం, మొదలైన వాటిని చెప్పలేదు రచయిత. ఏది ఏమైనా ఈ వచనాల అర్థం విషయంలో అనుమానాలు ఉన్నాయి. దీన్ని అంత ఖచ్చితంగా తేల్చి చెప్పడానికి ప్రయత్నించడం జ్ఞానం కాదు అనిపిస్తుంది.

3. దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.

“బాప్తిసాలను”– బహువచనాన్ని గమనించండి. క్రైస్తవ బాప్తిసం గురించి గనుక రచయిత మాట్లాడుతూ ఉంటే బహుశా ఏకవచనం వాడేవాడు గదా. ఎఫెసీయులకు 4:5 చూడండి. “నీటి సంస్కారాలనూ” అని కూడా గ్రీకు మాటను తర్జుమా చేయవచ్చు. పాత ఒడంబడికలో వేరువేరు నీటి సంస్కారాలున్నాయి – నిర్గమకాండము 29:4; నిర్గమకాండము 30:19-21; లేవీయకాండము 11:25; లేవీయకాండము 13:6; లేవీయకాండము 14:8; లేవీయకాండము 16:26; లేవీయకాండము 17:16; సంఖ్యాకాండము 8:7; సంఖ్యాకాండము 19:8; మొ।।. “చేతులుంచడం”– ఇది కూడా పాత ఒడంబడిక గ్రంథంలో కనిపిస్తున్నది (సంఖ్యాకాండము 8:10; సంఖ్యాకాండము 27:18; నిర్గమకాండము 29:10; లేవీయకాండము 1:4). “చనిపోయినవారు లేవడమూ”– దానియేలు 12:2; యెషయా 26:19; కీర్తనల గ్రంథము 16:10. “తీర్పు”– కీర్తనల గ్రంథము 9:8; కీర్తనల గ్రంథము 82:8; కీర్తనల గ్రంథము 94:2; కీర్తనల గ్రంథము 96:13; దానియేలు 7:9-10; యోవేలు 3:12. అయితే కొందరు పండితులు ఈ పునాది విషయాన్ని వేరొక దృష్టితో చూశారు. “దేవునిమీద నమ్మకం” అంటే రచయిత మనసులో క్రీస్తుపై నమ్మకం అనే ఆలోచన కూడా ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. బాప్తిసాలు అంటే యోహాను బాప్తిసం, క్రైస్తవ బాప్తిసం, పవిత్రాత్మ బాప్తిసం అని అర్థం కావచ్చుననీ, చేతులుంచడమంటే ఆరంభ క్రైస్తవుల్లో ఉన్న ఆచారం కావచ్చుననీ (అపో. కార్యములు 6:6; అపో. కార్యములు 8:16-18; అపో. కార్యములు 13:3; మొ।।) అన్నారు. అయినప్పటికీ క్రైస్తవ జీవితానికున్న పునాదిని వర్ణించడానికి ఇలాంటి జాబితాను ఇవ్వడం వింతగానే అనిపిస్తున్నది. ఇందులో క్రీస్తు అనే పేరే కనిపించదు. ఆయన అవతారం, పాపాలకోసం ఆయన చేసిన బలి, పవిత్రాత్మను ఇవ్వడం, క్రీస్తు సంఘం గురించిన ఉపదేశం, క్రీస్తుద్వారా శాశ్వత జీవం, మొదలైన వాటిని చెప్పలేదు రచయిత. ఏది ఏమైనా ఈ వచనాల అర్థం విషయంలో అనుమానాలు ఉన్నాయి. దీన్ని అంత ఖచ్చితంగా తేల్చి చెప్పడానికి ప్రయత్నించడం జ్ఞానం కాదు అనిపిస్తుంది.

4. ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై

ఈ వచనాలను కూడా అర్థం చేసుకోవడం కష్టమే. దీన్ని గురించి బైబిలు పండితుల మధ్య పెద్ద అభిప్రాయ భేదాలున్నాయి. ఈ వచనాలకు ముఖ్యంగా నాలుగు రకాలైన వివరణలు ఉన్నాయి. మొదటిది – క్రీస్తులోని నిజ విశ్వాసులను ఈ వచనాలు వర్ణిస్తున్నాయి; వారు క్రీస్తునుంచి పెడదారి పట్టి తమ రక్షణను పోగొట్టుకుని నాశనం అయ్యే అవకాశం ఉంది. రెండోది – ఇవి విశ్వాసులను వర్ణిస్తున్నాయి గానీ వారు గనుక పెడదారి పడితే తమ రక్షణను పోగొట్టుకోరు; నమ్మకమైన సేవకు లభించవలసిన బహుమానాలను మాత్రమే కోల్పోతారు. మూడోది – ఈ వచనాలు నిజ విశ్వాసులను వర్ణిస్తున్నాయి. వారు పెడదారి పట్టే ప్రమాదం వాస్తవంగా ఉంది కాబట్టి దాన్ని గురించి ఇది వారికి హెచ్చరిక; కానీ ఆ ప్రమాదం ఉన్నా నిజానికి వారు పెడదారి పట్టరు. నాలుగోది – ఈ వచనాలు అసలు నిజ విశ్వాసుల గురించి రాసినది కాదు. ఇక్కడ రాసిన విషయాలు విశ్వాసుల విషయంలో వాస్తవాలే కానీ నిజంగా విశ్వాసులు కానివారిలో కూడా ఇవి కనిపించవచ్చు. ఈ నోట్స్ రచయిత మొదటి రెండు వివరణలను నిరాకరిస్తున్నాడు. క్రీస్తులో నిజ విశ్వాసులు ఎప్పుడూ పెడదారి పట్టరనీ భ్రష్టత్వంతో సంబంధం ఉన్న ఇతర పాపాలు (హెబ్రీయులకు 2:1-4 నోట్‌) చేయరనీ బైబిలు స్పష్టంగా నేర్పిస్తున్నదని ఈ రచయిత గట్టి నమ్మకం. హెబ్రీయులకు 10:39; యోహాను 10:27; 1 యోహాను 3:9; 1 యోహాను 5:18 చూడండి. యోహాను 5:24; యోహాను 6:37-40; యోహాను 10:27-29; యోహాను 17:11-12; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:28-39; ఫిలిప్పీయులకు 1:6; 1 పేతురు 1:5 కూడా పోల్చి చూడండి. అర్థం స్పష్టంగా లేని కష్టమైన వచనాలను బట్టి (ఇక్కడున్న వచనాల్లాంటివన్నమాట) స్పష్టంగా ఉన్న వేరే వచనాలను ఎప్పుడూ త్రోసిపుచ్చకూడదు. హీబ్రూ లేఖలోని ఈ వచనాలు క్రీస్తులో నిజ విశ్వాసులు పెడదారి పట్టి పాపవిముక్తిని, రక్షణను పోగొట్టుకుంటారని స్పష్టంగా చెప్పడం లేదు. నిజానికి ఈ వచనాల్లో క్రీస్తుపట్ల నమ్మకం అనే మాటలు అసలు కనిపించడం లేదు. పైన ఇచ్చిన మూడో వివరణ కొత్త ఒడంబడిక ఉపదేశాలతో ఎక్కువగా ఏకీభవిస్తున్నట్టుంది. విశ్వాసులను దారి తప్పించాలని సైతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి ప్రమాదం వారికోసం వాస్తవంగా పొంచి ఉంది. కానీ అలాంటి ప్రమాదం పొంచి ఉండడమంటే నిజంగా అలా దారి తప్పుతారని అర్థం కాదు. దేవుని వాక్కు లేకపోతే, వారిని కాపాడే దేవుని ప్రభావం లేకపోతే, వారికోసం క్రీస్తు ప్రార్థనలు లేకపోతే (లూకా 22:31-32; యోహాను 17:11-12 పోల్చి చూడండి), ఒకవేళ వారు దారి తప్పిపోతారేమో. కానీ ఇవన్నీ ఉన్నాయి గనుక వారు విశ్వాస విషయమైన భ్రష్టత్వంలో పడకుండా ఉంటారు. భ్రష్టత్వం గురించిన హెచ్చరికలే అలాంటి ప్రమాదం దాపురించినప్పుడు విశ్వాసులు జాగ్రత్తగా ఉండేందుకు మరో సహాయం. అయితే పైన ఇచ్చిన నాలుగో వివరణ బహుశా సత్యమైనది కావచ్చు. వ 4-6 బహుశా సత్యం తెలిసి, దాని ప్రభావానికి లోనై, దేవుని రాజ్యానికి అతి సమీపంగా వచ్చి కూడా అక్షరాలా అందులోకి ప్రవేశించనివారిని వర్ణిస్తూ ఉండవచ్చు. దేవుని సంతానం కాకుండా కేవలం అలా చెప్పుకునేవారు కొంత కాలం నిజంగా దేవుని సంతానంగానే కనిపించవచ్చు (మత్తయి 13:18-23, మత్తయి 13:24-30; మత్తయి 25:1-12; 2 కోరింథీయులకు 11:14-15). వ 4-6లో చెప్పిన విషయాలన్నీ కూడా విశ్వాసుల విషయంలో వాస్తవమే. అయితే విశ్వాసులు కాకుండా అలా కనిపించేవారి విషయంలో కూడా అవి వాస్తవం కావచ్చు. “మనోనేత్రాలు వెలుగొంది”– సత్యం తెలిసిన వారి వర్ణన ఇది. హెబ్రీయులకు 10:26 పోల్చి చూడండి. క్రీస్తు వెలుగు వారిపై ప్రసరించింది. అంతమాత్రాన వారు ఆయనపై నమ్మకం పెట్టుకొని “వెలుగు సంతానం” (యోహాను 12:35-36) అయ్యారని అనుకోనవసరం లేదు. పశ్చాత్తాపపడకుండా, రక్షణ కోసం క్రీస్తును నమ్మకుండా మనుషులు ఊరికే సత్యాన్ని తెలుసుకొని ఉండడం సాధ్యమే. “పరలోక వరాన్ని రుచి చూచి”– వారు పరలోక వరాన్ని పొందారు అనే అర్థాన్ని ఈ మాటలు ఇవ్వనవసరం లేదు. వారు దాన్ని తినలేదు అని చెప్పేందుకు రచయిత “రుచి చూచి” అనే మాటలు వాడి ఉండవచ్చు (యోహాను 6:57). సంఖ్యాకాండము 13:23, సంఖ్యాకాండము 13:26 పోల్చి చూడండి. అపనమ్మకం చేత కనానులో ప్రవేశించలేకపోయిన ఇస్రాయేల్‌వారు కనానులో పండిన పండ్లు కొన్నిటిని రుచి చూడగలిగారు. “పవిత్రాత్మలో పాల్గొని”– “పవిత్రాత్మ పొంది” అని రాయలేదు రచయిత. పాల్గొని అనే పదానికి పొందడమనే అర్థం రావచ్చు, రాకపోవచ్చు. పవిత్రాత్మలో పాల్గొనే వివిధ విధానాలు ఉన్నాయి. భ్రష్టుడైన బిలాము పాల్గొన్నాడు (సంఖ్యాకాండము 24:2), భ్రష్టుడైన ఇస్కరియోతు యూదా పాల్గొన్నట్టు ఉన్నాడు (మత్తయి 10:1; యోహాను 6:70-71). అపో. కార్యములు 8:9-24 లోని సీమోను దీనికి ఒక ఉదాహరణ కావచ్చు. ఇక్కడ “పాల్గొనడం” అంటే బహుశా పవిత్రాత్మ ప్రభావంతో పనులు జరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో ఉండడం, పవిత్రాత్మ ద్వారా ఒప్పించబడడం (యోహాను 16:8-11), ఆయన మూలంగా పశ్చాత్తాపం దరిదాపులకూ, దేవుని రాజ్య అంచుల వరకూ రావడం అని అర్థం కావచ్చు.

5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు,

“హితవాక్కునూ...రుచి”– మత్తయి 13:20-21 పోల్చి చూడండి. “వచ్చే యుగ ప్రభావాలనూ...రుచి”– మత్తయి 7:22-23 పోల్చి చూడండి. రచయిత వీరి గురించి రాస్తూ వారు క్రీస్తులో నమ్మకం ఉంచినవారని గానీ శాశ్వత జీవం పొందారని గానీ రక్షించబడ్డారని గానీ చెప్పకపోవడంలో ఏదైనా అంతరార్థం ఉండవచ్చు. ఉండకపోవచ్చు. రచయిత ఇలా చెప్పకుండా ఉంటే మనం ఇలా చెప్పడం తెలివైన పనేనా?

6. తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

“దారి ప్రక్కన పతనం”– 4,5 వచనాల్లో అతడు వర్ణించిన మనుషులు నిజంగా పెడదారి పట్టుతారు అని ఈ మాటలు చెప్పడం లేదు. వారు గనుక అలా పెడదారి పడితే ఏమి జరుగుతుందో అదే ఇక్కడ చెప్పబడింది. అయితే అలాంటి ప్రమాదం గురించి మాత్రం రచయిత స్పష్టంగా హెచ్చరిస్తున్నట్టున్నాడు. పెడదారి పట్టడం అంటే పాపంలో పడిపోవడం కన్నా చాలా ఘోరం. పేతురు పడిపోయాడు గాని పశ్చాత్తాపపడి తిరిగి దారిలోకి వచ్చాడు (మత్తయి 26:69-75). మనం పాపంలో పడితే క్షమాపణ ఉంది (1 యోహాను 1:9; 1 యోహాను 2:1; మత్తయి 6:12; మత్తయి 12:31-32. సామెతలు 24:16). పెడదారి పట్టడమంటే విశ్వాస విషయమైన భ్రష్టత్వం అనే అర్థం. అది సత్యాన్ని పూర్తిగా విడిచిపెట్టడం (హెబ్రీయులకు 2:1-4 నోట్ చూడండి). “పశ్చాత్తాపపడేలా”– ఇక్కడ తాను వర్ణించినవారికి నమ్మకం ఉంటే, “తిరిగి వారిని నమ్మకంలోకి నడిపించేలా” అని రచయిత ఎందుకు అనలేదు? పశ్చాత్తాపం అంటే మనసు మారిపోవడం. ఈ హీబ్రూవారు మొదట్లో క్రీస్తు తమ అభిషిక్తుడు కాదనుకున్నారు. మనసు మార్చుకుని ఆయనే అనుకున్నారు. వ 4,5లోనిదంతా వారి గురించి చెప్పిన తరువాత ఆయననుంచి వారు పూర్తిగా తిరిగిపోతే మరో సారి వారి మనసు మారేలా వారిని తిప్పడం ఎలా? “మళ్ళీ సిలువ వేసి”– ఇలాంటివారికి ఇక పశ్చాత్తాపం ఉండకపోవడానికి కారణం ఇదే. వారు క్రీస్తును తృణీకరించి యూదాలాగా ఆయన్ను హత్య చేసిన వారి పక్షం చేరుతారు. ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోవడం కన్న మరింత ఘోరమైనదాని గురించే రచయిత మాట్లాడుతున్నాడు. దిగజారిపోయిన వారిని పశ్చాత్తాపంలోకీ విశ్వాసంలోకీ తిరిగి నడిపించడం సాధ్యమే 2 కోరింథీయులకు 2:5-11; గలతియులకు 6:1; యాకోబు 4:8-10; కీర్తనల గ్రంథము 32:3-5; కీర్తనల గ్రంథము 51:1-12; యిర్మియా 3:12; యెహెఙ్కేలు 18:30-32; హోషేయ 14:1-4. “బట్టబయలుగా అవమానానికి”– హీబ్రూవారు క్రీస్తునుంచి తొలిగిపోయి యూద మతం వైపు తిరిగినట్టయితే అది అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరైనా క్రీస్తును వదిలి మరో మతానికి పోయినా చాలామందికి తెలుస్తుంది గదా. ఇది క్రీస్తుకూ ఆయన శుభవార్తకూ బహిరంగంగా అవమానం తెచ్చిపెడుతుంది. అందువల్ల నిజ దేవునిపట్ల మనుషులు అగౌరవం చూపుతారు.

7. ఎట్లనగా, భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.

తన అర్థాన్ని స్పష్టం చేసేందుకు రచయిత ఈ ఉదాహరణ ఇస్తున్నాడు. పంట ఇచ్చే భూమి విశ్వాసులకు గుర్తు (మత్తయి 13:23 చూడండి). పంట ఇవ్వని భూమి అవిశ్వాసులకు, లేక భ్రష్టులకు గుర్తు. వారు దేవుని కోసం ఏ పంటనూ ఇవ్వరు (మత్తయి 13:19-20; లూకా 1:6-9; మొ।।). రెండు రకాల నేలలమీదా వాన కురుస్తుంది. ఇక్కడ వాన దేవుని సత్యానికీ, పవిత్రాత్మ ప్రభావానికీ గుర్తు. అయితే దేవుని పంట ఇచ్చేది ఒకటే. ఒక వ్యక్తిలో క్రీస్తు ఉన్నాడా లేదా అన్నదాన్ని ఆ జీవితంలో కనిపించే పంటే తెలియజేస్తుంది. భ్రష్టత్వం అనే ముళ్ళ తుప్పలూ, గచ్చతీగెలూ అలాంటివారిలో క్రీస్తు ఎన్నడూ లేడన్నదానికి సూచన. 1 యోహాను 2:19 పోల్చి చూడండి. మత్తయి 3:8; మత్తయి 7:16-20; మొ।। చూడండి.

8. అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును.
ఆదికాండము 3:17-18

9. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.

తన మాటలు వారిలో ఏదైనా భయాన్ని కలిగిస్తే దాన్ని తొలగించాలని రచయిత అనుకున్నట్టున్నాడు (హెబ్రీయులకు 4:1; రోమీయులకు 8:15 పోల్చి చూడండి). వారు పెడదారి పట్టరనీ, శాపానికి గురి కారనీ వారిని కాల్చివేయడం జరగదనీ అతనికి ధైర్యం ఉన్న కారణమేమిటంటే వారి జీవితాల్లో ఆధ్యాత్మిక ఫలాలు కనిపించాయి. వారు దేవుణ్ణి ప్రేమించారు, ఆయనకోసం పని చేశారు. దేవుని ప్రజలకు సహాయం చేశారు (హెబ్రీయులకు 10:32-34 చూడండి). ఒక క్రైస్తవుడి జీవితంలో ఇలాంటివి కనిపించకపోతే అతడు విశ్వాసి అని రుజువేది? వ 4,5 మొత్తం అతని విషయంలో సత్యం అయినప్పటికీ, అతని జీవితంలో దేవుని కోసం ఎలాంటి ఫలమూ కనిపించకపోతే అదంతా వ్యర్థమే. ముళ్ళూ గచ్చపొదలూ ఉన్న నేలలాంటివాడే అతడు.

10. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.

11. మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును

వ 4-8లో రచయిత ఇచ్చిన హెచ్చరిక నుంచి వారు నేర్చుకోవలసిన పాఠం ఇది. క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలన్న యథార్థమైన కోరిక వారిలో లేకపోతే పైన చెప్పినదాని అర్థమేమిటో నని ఊహాగానాలు చేయడం వారికి ఎలాంటి మేలూ చేయదు. మన సంగతి కూడా అంతే. ఈ లోకంలో మన జీవితాంతం వరకు క్రీస్తులో నమ్మకం ఉంచుతూ, ఆయనకు సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయం. మనం ఇది చేస్తే భ్రష్టులమైపోము, అలా అవుతామేమోనని భయపడవలసిన అవసరం లేదు. “పూర్తి నిశ్చయత”– 2 కోరింథీయులకు 13:5; 2 పేతురు 1:10. “చివరిదాకా”– హెబ్రీయులకు 3:6, హెబ్రీయులకు 3:14; హెబ్రీయులకు 10:36.

12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.

“మందబుద్ధులు కాక”– మత్తయి 25:26; సామెతలు 18:9; సామెతలు 24:30-34. ఆధ్యాత్మిక విషయాల్లో బద్దకం, మరి ఏ ఇతర పనిలో లాగానే చాలా హానికరం. “ఓర్పు”– హెబ్రీయులకు 10:36; రోమీయులకు 8:25; యాకోబు 1:4.

13. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక
ఆదికాండము 22:16-17, ఆదికాండము 22:17

హెబ్రీయులకు 5:11 తో ఆరంభించిన ఈ హెచ్చరిక భాగాన్ని ముగించి క్రీస్తు ప్రముఖ యాజి అనే అంశానికి మనల్ని మళ్ళీ తెస్తున్నాడు రచయిత (వ 20). వ 11,12లో శ్రద్ధాసక్తులు, నమ్మకం, ఓర్పు గురించి అతడు మాట్లాడాడు. వీటిని గతంలో అభ్యసించిన ఒక మనిషిని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులందరికీ కూడా ఇది వర్తిస్తుందని చూపుతున్నాడు. హీబ్రూవారందరికీ అబ్రాహాము పూర్వీకుడు. నమ్మేవారందరికీ కూడా అతడు ఆధ్యాత్మిక తండ్రి (రోమీయులకు 4:11, రోమీయులకు 4:16). రచయిత అబ్రాహాము నమ్మకాన్ని హెబ్రీయులకు 11:18-19 లో వర్ణించాడు. నమ్మకం, ఓర్పులకు అతడు చక్కని ఉదాహరణ. “వాగ్దానం”– ఆదికాండము 22:16-18.

14. తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
ఆదికాండము 22:16-17, ఆదికాండము 22:17

15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.

16. మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.
నిర్గమకాండము 22:11

సత్యం పలుకుతానని మనుషులు శపథం చేస్తే అంతకన్నా ఇంకేమి అడగగలం? నిజంగా అలా శపథం చేసినది దేవుడే అయితే మనుషులు ఇంకేమి అడగగలరు? మనుషులైతే అలా శపథం చేసి కూడా అబద్ధమాడవచ్చు. గానీ దేవుడు మాత్రం అలా చెయ్యడు (తీతుకు 1:2). ఒకటి చేస్తానని ఆయన శపథం చేస్తే తప్పకుండా చేస్తాడని గట్టిగా నమ్మవచ్చు. మార్పు చెందనివి రెండు (వ 18). అవేమిటంటే దేవుని వాగ్దానం, ఆయన శపథం. విశ్వాసులను గట్టి ప్రోత్సాహం ఉండాలనే ఆ రెంటినీ దేవుడు ఇచ్చాడు. అంటే నమ్మకం ఉంచి చివరి వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ప్రోత్సాహం వారికి కలగాలని ఇచ్చాడు. విశ్వాసులు శరణాగతులు. అంటే పాపం నుంచి, దానిమీద దేవుని తీర్పు నుంచి పారిపోయి దేవుని శరణు జొచ్చినవారు. పాపానికి వ్యతిరేకంగా ఉన్న దేవుని కోపం నుంచీ పతిత లోకం నుంచీ పాపవిముక్తినీ రక్షణనూ పొందకుండా తమను దూరంగా ఉంచే వాటన్నిటినుంచీ పారిపోయారు (సంఖ్యాకాండము 35:9-29 పోల్చి చూడండి). శాశ్వత రక్షణను దయ చేస్తానన్న దేవుని వాగ్దానాన్ని ఆశ్రయించారు.

17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి,

18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
సంఖ్యాకాండము 23:19, 1 సమూయేలు 15:29

19. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
లేవీయకాండము 16:2, లేవీయకాండము 16:12, లేవీయకాండము 16:15

బైబిలు నేర్పే ఆశాభావం బలహీనంగా, ఊగిసలాడుతూ ఉండేది కాదు. అది స్థిరమైన, దృఢమైన లంగరు వంటిది. అది ఎన్నటికీ విఫలం కాదు (రోమీయులకు 5:2-5 పోల్చి చూడండి). లంగరు ఒక ఓడను ఒకే చోట ఉంచుతుంది. ఆశాభావం విశ్వాసులను ఒకే చోట స్థిరంగా ఉంచుతుంది. ఆ చోటు “తెరలోపల” ఉండేది (అంటే యేసు ఉన్న పరలోకం). వారు ఎలాంటి భ్రష్టత్వం తుఫాను వల్లా కూడా నమ్మకం విషయంలో పగిలిన ఓడలు కాబోరు. “తెర”– హెబ్రీయులకు 10:19-20; మత్తయి 27:51. సన్నిధి గుడారంలో, ఆలయంలో కూడా తెర పవిత్ర స్థలాన్నీ అతి పవిత్ర స్థలాన్నీ వేరు చేస్తుంది. అతి పవిత్ర స్థలం పరలోకాన్ని సూచిస్తూ ఉంది. విశ్వాసులింకా అందులో ప్రవేశించలేదు గాని యేసు ప్రవేశించాడు. నమ్మకం, ఆశాభావాల ద్వారా వారు ఆయనకు శాశ్వతంగా కట్టివేయబడి ఉన్నారు. ఆయన వారి “కోసం”, వారికి “ముందుగా” అక్కడ ఉన్నాడు – హెబ్రీయులకు 4:14; హెబ్రీయులకు 9:24; ఎఫెసీయులకు 2:6; కొలొస్సయులకు 3:1-4. ఆయన అక్కడ ఉన్నాడు. వారు అక్కడికి చేరేలా చూస్తాడు (యోహాను 17:24).

20. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.
కీర్తనల గ్రంథము 110:4



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Hebrews - హెబ్రీయులకు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

హీబ్రూలు క్రీస్తు సిద్ధాంతంలో ముందుకు సాగాలని కోరారు మరియు మతభ్రష్టత్వం లేదా వెనుకకు తిరగడం యొక్క పరిణామాలు వివరించబడ్డాయి. (1-8) 
దేవుని సత్యం మరియు దైవిక సంకల్పం యొక్క అన్ని అంశాలు సువార్తను ప్రకటించే వారందరికీ అందజేయాలి, వారి హృదయాలపై మరియు మనస్సాక్షిపై ముద్రించబడతాయి. బాహ్య విషయాలను పరిష్కరించడానికి దాని సమయం మరియు స్థలం ఉన్నప్పటికీ, వాటిని మన దృష్టిని ఆధిపత్యం చేయనివ్వకూడదు మరియు బాగా ఉపయోగించగల విలువైన సమయాన్ని వినియోగించకూడదు. పశ్చాత్తాపపడిన పాపాత్ముడు, అపరాధాన్ని అంగీకరించి, దయ కోసం వేడుకుంటున్నాడు, వారి మనస్సాక్షి యొక్క ఆరోపణలతో సంబంధం లేకుండా, ఈ భాగాన్ని చూసి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. క్రీస్తులో రూపాంతరం చెందిన వ్యక్తి అనివార్యంగా శాశ్వత మతభ్రష్టుడు అవుతాడని అది సూచించదు. అపొస్తలుడు సువార్త ద్వారా ఎన్నడూ నిజంగా ప్రభావితం కానటువంటి కేవలం ప్రకటించుకునే వ్యక్తుల పతనాన్ని సూచించడం లేదు. అలాంటి వ్యక్తులకు ఖాళీ పేరు లేదా కపట ముఖభాగం తప్ప ఏమీ ఉండదు.
ప్రకరణం పాక్షిక క్షీణతలను లేదా వెనుకకు జారుకోవడం గురించి ప్రస్తావించదు, లేదా ప్రలోభాల బలం లేదా ప్రాపంచిక లేదా శారీరక కోరికల ప్రభావం కారణంగా క్రైస్తవులు పొరపాట్లు చేయగలిగే పాపాలను కలిగి ఉండదు. ప్రస్తావించబడిన పడిపోవడం అనేది క్రీస్తును కఠోరమైన మరియు అంగీకరించిన తిరస్కరణను కలిగి ఉంటుంది, ఇది అతని పట్ల, అతని కారణం మరియు అతని ప్రజల పట్ల లోతైన శత్రుత్వం నుండి ఉద్భవించింది. వ్యక్తులు సత్యం గురించిన జ్ఞానాన్ని పొంది, దానిలోని కొన్ని సుఖాలను అనుభవించిన తర్వాత కూడా ఈ తిరస్కరణ జరుగుతుంది. అటువంటి వ్యక్తుల తీర్పు ఏమిటంటే, వారిని పశ్చాత్తాపానికి పునరుద్ధరించడం అసాధ్యం - క్రీస్తు రక్తానికి ఈ పాపాన్ని క్షమించే శక్తి లేనందున కాదు, కానీ ఈ పాపం యొక్క స్వభావం పశ్చాత్తాపాన్ని మరియు దాని యొక్క అన్ని అవసరాలను వ్యతిరేకిస్తుంది.
ఈ ప్రకరణం లేదా వారి స్వంత పరిస్థితి గురించి అపోహల కారణంగా, వారి పట్ల దయ లేకపోవడంతో భయపడేవారు ఈ పాపం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇది క్రీస్తు మరియు అతని కారణాన్ని ఉద్దేశపూర్వకంగా మరియు పూర్తిగా త్యజించడం, అతని శత్రువులతో తనను తాను సమం చేసుకోవడం. ఈ అవగాహన నిరాధారమైన భయాలను దూరం చేస్తుంది. మతభ్రష్టత్వపు ప్రమాదానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తూనే, మనం దేవుని వాక్యానికి దగ్గరగా కట్టుబడి ఉండాలి, బలహీనులను గాయపరచకుండా మరియు భయపెట్టకుండా లేదా పడిపోయిన కానీ పశ్చాత్తాపపడుతున్న వారిని నిరుత్సాహపరచకుండా జాగ్రత్త వహించాలి.
విశ్వాసులు దేవుని వాక్యాన్ని ఉపరితలంగా ఎదుర్కోవడమే కాకుండా దానిలో పూర్తిగా మునిగిపోతారు. ఫలవంతమైన పొలం లేదా ఉద్యానవనం ఆశీర్వాదాన్ని పొందుతుంది, కృప ప్రభావంతో ఉత్పాదకత లేని నామమాత్రపు క్రైస్తవుడితో విభేదిస్తుంది, మోసం మరియు స్వార్థం తప్ప మరేమీ ఉత్పత్తి చేయదు. అటువంటి వ్యక్తి వర్ణించబడిన భయంకరమైన స్థితి యొక్క అంచున నిలబడి, శాశ్వతమైన దుఃఖం కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి, మన స్వంత జీవితాలను పర్యవేక్షించడంలో మనం అప్రమత్తంగా వినయం మరియు ప్రార్థన చేద్దాం.

వారిలో ఎక్కువమంది గురించి అపొస్తలుడు సంతృప్తిని వ్యక్తం చేశాడు. (9,10) 
కొన్ని అంశాలు మోక్షం నుండి విడదీయరానివి, ఒక వ్యక్తి యొక్క రక్షించబడిన స్థితికి సూచికలుగా పనిచేస్తాయి మరియు చివరికి శాశ్వతమైన మోక్షానికి దారితీస్తాయి. మోక్షానికి సంబంధించిన ఈ కారకాలు నిజాయితీ లేని వ్యక్తులు లేదా మతభ్రష్టుల అనుభవాలను అధిగమిస్తాయి. క్రీస్తు మహిమ కొరకు లేదా ఆయన పరిశుద్ధుల కొరకు నిర్వహించబడే ప్రేమ క్రియలు, దేవుని మార్గదర్శకత్వం ప్రకారం ఏర్పడే అవకాశాలు ఒకరి మోక్షానికి స్పష్టమైన సూచికలుగా పనిచేస్తాయి. జ్ఞానోదయం మరియు రుచి గురించి గతంలో పేర్కొన్న అనుభవాల కంటే ఈ వ్యక్తీకరణలు ప్రసాదించిన పొదుపు దయకు మరింత నమ్మదగిన సాక్ష్యం. నిజమైన ప్రేమ కేవలం అంగీకరించబడదు కానీ చర్య ద్వారా ప్రదర్శించబడుతుంది మరియు క్రీస్తు పట్ల ప్రేమలో పాతుకుపోయిన పనులు మాత్రమే నీతివంతమైన పనులుగా పరిగణించబడతాయి.

మరియు విశ్వాసం మరియు పవిత్రతలో పట్టుదలతో ఉండమని వారిని ప్రోత్సహిస్తుంది. (11-20)
ఇక్కడ ప్రస్తావించబడిన నిరీక్షణ, ప్రేమ, కోరిక మరియు ఈ వాగ్దానాల పట్ల లోతైన కృతజ్ఞతతో నడిచే దేవుడు వాగ్దానం చేసిన మంచి విషయాల గురించి నమ్మకంగా ఎదురుచూడడం. విశ్వాసం వంటి ఆశ కూడా వివిధ స్థాయిలలో ఉంటుంది. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన ఆశీర్వాదం యొక్క ప్రతిజ్ఞ తండ్రి, కుమారుడు మరియు ఆత్మ యొక్క శాశ్వతమైన సహవాసంలో స్థాపించబడిన అతని శాశ్వతమైన ఉద్దేశ్యం నుండి ఉద్భవించింది. దేవుని నుండి వచ్చిన ఈ వాగ్దానాలు పూర్తిగా నమ్మదగినవి, రెండు మార్పులేని కారకాలపై ఆధారపడి ఉన్నాయి: తిరుగులేని సలహా మరియు దేవుని ప్రమాణం. దేవుడు అబద్ధం చెప్పడం అసాధ్యం; అటువంటి చర్య అతని స్వభావానికి మరియు సంకల్పానికి విరుద్ధంగా ఉంటుంది. పర్యవసానంగా, అవిశ్వాసుల విధి మరియు విశ్వాసుల మోక్షం సమానంగా ఖచ్చితంగా ఉన్నాయి.
ఆనందం యొక్క పూర్తి హామీని మంజూరు చేసిన వారు ఈ వాగ్దానాలకు ఒక శీర్షికను వారసత్వంగా పొందడం గమనార్హం. దేవుడు అందించిన సాంత్వనలు అతని ప్రజలను వారి అత్యంత భయంకరమైన పరీక్షల ద్వారా నిలబెట్టడానికి తగినంత బలంగా ఉన్నాయి. ఈ సందర్భంలో, పాపులు విశ్వాసం యొక్క అన్ని ఇతర వనరులను పక్కనపెట్టి, కృప యొక్క ఒడంబడికకు అనుగుణంగా, క్రీస్తు యొక్క విమోచన ద్వారా దేవుని దయను వెతకడం ద్వారా ఆశ్రయం పొందుతారు. అల్లకల్లోలమైన జీవన సముద్రంలో, మనం విసిరివేయబడిన ఓడల వలె మరియు దూరంగా విసిరివేయబడే ప్రమాదంలో ఉన్నాము, మన స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఒక యాంకర్ అవసరం. సువార్త నిరీక్షణ ఈ ప్రపంచంలోని తుఫానుల మధ్య అస్థిరంగా మరియు దృఢంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది దేవుని ఉచిత దయ, క్రీస్తు యొక్క యోగ్యతలు మరియు మధ్యవర్తిత్వం మరియు అతని ఆత్మ యొక్క శక్తివంతమైన ప్రభావంపై ఆధారపడుతుంది.
క్రీస్తు విశ్వాసి యొక్క నిరీక్షణకు వస్తువుగా మరియు పునాదిగా నిలిచాడు. పర్యవసానంగా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం నిస్సందేహంగా ఆయన మహిమలో పాలుపంచుకుంటామని తెలుసుకుని, పరలోక విషయాలపై మన ప్రేమను ఉంచడం మరియు ఆయన తిరిగి వచ్చే వరకు ఓపికగా ఎదురుచూడడం మనకు తగినది.



Shortcut Links
హెబ్రీయులకు - Hebrews : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |