Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడదిగగా
షిత్తీం యొర్దాను నదికి తూర్పు దిక్కున మోయాబు మైదాన ప్రాంతాల్లో ఉంది. యెరికో యొర్దానుకు పశ్చిమాన 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాలా ప్రాచీనమైన పట్టణం. అది కనానులోకి ఇస్రాయేల్వారు ప్రవేశించే మార్గానికి అడ్డంగా ఉంది. పటిష్టమైన కోటగోడ, భద్రత గల పట్టణం అది. కనానులోని అన్ని జాతులలాగానే యెరికో ప్రజలు కూడా పూర్తిగా భ్రష్టమైపోయినవారు (లేవీయకాండము 18:24-26 లేవీయకాండము 20:23 ద్వితీయోపదేశకాండము 18:9-12). వారిని శిక్షించే సాధనంగా దేవుడు ఇస్రాయేల్ను వాడుకున్నాడు. అయితే వాళ్ళలో పశ్చాత్తాపంతో నమ్మకంతో యెహోవావైపు తిరిగినవాళ్ళ పట్ల ఆయన కరుణ చూపాడు. పాపాత్మురాలైన రాహాబు ఇందుకు చక్కని ఉదాహరణ (యెహోషువ 6:17 హెబ్రీయులకు 11:31 యాకోబు 2:25). ఆమె రాజైన దావీదుకు పూర్వీకురాలు (రూతు 4:21 మత్తయి 1:5-6). దావీదు వంశంలోనే మన ప్రభువైన యేసు క్రీస్తు పుట్టాడు. ఇది దేవుని కృపలో గల మహత్తును తెలియజేస్తున్నది. ఆయనలో నమ్మకం ఉంచిన వ్యక్తిని ఆయన ఎలా వాడుకోగలడో తెలియజేస్తున్నది. గూఢచారులు రాహాబు ఇంటికి ఎందుకు వెళ్ళారో రాసి లేదు. బహుశా ఆమె మొదట వారిని చూచి తన ప్రాణం దక్కించు కొనేలా వారితో ఒప్పందం చేసుకునేందుకు వారిని ఆహ్వానించి ఉండవచ్చు. పురాతన కాలాలలో యూదా పండితులు రాహాబు పూటకూళ్ళ ఇల్లు నడిపేదని అభిప్రాయపడ్డారు. ఇది నిజమైతే గూఢచారులు ఆమె ఇంటికి పోవడం విషయంలో సమస్య లేదు.
2. దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.
3. అతడు నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా
4. ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే,యాకోబు 2:25
5. వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడు చుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు
గూఢచారులను రక్షించేందుకు రాహాబు కావాలని అబద్ధం ఆడింది. ఏకైక నిజ దేవుని బల ప్రభావాల్లో ఆమెకు నమ్మకం కుదిరింది (యెహోషువ 2:9-11). క్రొత్త ఒడంబడిక గ్రంథం ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుంటూ ఉంది (హెబ్రీయులకు 11:31 యాకోబు 2:25) గాని ఆమె అబద్ధాన్ని కాదు. తన కార్యాలు నెరవేర్చు కోవడానికి దేవునికి మనుషుల అబద్ధాల సహాయం అక్కరలేదు. అబద్ధమాడడం యోగ్యమని బైబిలు ఎక్కడా చెప్పదు గాని దానిని ఖండిస్తుంది (నిర్గమకాండము 20:16 కీర్తనల గ్రంథము 5:6 సామెతలు 6:16-17 మత్తయి 5:37 ఎఫెసీయులకు 4:25 ప్రకటన గ్రంథం 21:8 ప్రకటన గ్రంథం 22:15). అయితే దేవుని దృష్టిలో ఆయనపై నమ్మకం బహు ప్రభావం గలది.
6. అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.
7. ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను.
8. ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.
రాహాబు మాటలవల్ల యెరికో నగరవాసులు, మొత్తంగా కనానువారంతా ఇస్రాయేల్వారి గురించి ఏమి అనుకొంటున్నారో గూఢచారులకు అర్థం అయింది. ఈ సమాచారం యెహోషువను ప్రోత్సహించింది (వ 24).
9. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
10. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
నిర్గమకాండము 14:21 సంఖ్యాకాండము 21:23-24 సంఖ్యాకాండము 21:33-35.
11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.హెబ్రీయులకు 11:31
ద్వితీయోపదేశకాండము 4:39 యెషయా 42:8.
12. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి
13. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.
14. అందుకు ఆ మనుష్యులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.
15. ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.యాకోబు 2:25
యెరికో గోడ బహుశా 30 అడుగుల ఎత్తు ఉండి ఉండవచ్చు. అనేక అడుగుల మందం ఉండవచ్చు. రాహాబు ఇల్లు ఈ గోడ, మరొక లోపలి గోడ మధ్య ఉండి ఉండవచ్చు.
16. ఆమె మిమ్మును తరుమబోయినవారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయిన వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా
17. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి యిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు
18. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారి నందరిని నీయింట చేర్చుకొనుము.
యెరికోలో రాహాబు ఇల్లు ఒక్కటే సురక్షిత ప్రదేశ స్థలం. ఎర్రని దారం, అంటే రక్తం రంగు దారం, బలి అర్పణ మూలంగా కలిగిన భద్రతను సూచించవచ్చు (నిర్గమకాండము 12:7 నిర్గమకాండము 12:13 హెబ్రీయులకు 9:19-20). మన పాపంవల్ల వచ్చే శిక్షనుండి మన ప్రభువైన యేసు క్రీస్తు బలి అర్పణమూలంగా మనం తప్పించుకొన్నాం (హెబ్రీయులకు 9:28). విశ్వాసులను శాశ్వత నాశనంనుంచి ఆయన రక్తం రక్షిస్తూవున్నది. రాహాబు నమ్మకం ఆమె కుటుంబ సభ్యులందరికీ రక్షణ సాధనంగా ఉండగలిగిన విషయం గమనించండి (యెహోషువ 6:25).
19. నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.
20. నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.
21. అందుకు ఆమె మీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్లనంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను.
22. వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడు దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు.
23. ఆ యిద్దరు మనుష్యులు తిరిగి కొండలనుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువయొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి.
24. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడియున్నదని యెహోషువతో ననిరి.