Joshua - యెహోషువ 21 | View All

1. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులయొద్దకును వచ్చి

1. Then the chefe fathers amonge the Leuites came forth vnto Eleasar the prest and to Iosua the sonne of Nun, and to ye awncient fathers amoge the trybes of the children of Israel,

2. మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా

2. and spake vnto them at Silo in the londe of Canaan, and sayde: The LORDE commaunded by Moses, that we shulde haue cities geuen vs to dwell in, and the suburbes of the same for oure catell.

3. ఇశ్రాయేలీయులు యెహోవా మాటచొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.

3. Then the children of Israel gaue of their enheritaunce these cities and the suburbes therof, vnto the Leuites, acordynge to the commaundement of the LORDE.

4. వంతుచీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికులనుండియు, షిమ్యోను గోత్రికులనుండియు, బెన్యామీను గోత్రికులనుండియు చీట్లవలన వచ్చినవి పదమూడు పట్టణములు.

4. And the lot fell vpon the kynred of the Kahathites, and the children of Aaron the prest amonge the Leuites, had by the lott thyrtene cities of the trybe of Iuda, of the trybe of Simeon, and of the trybe of Ben Iamin.

5. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు, దాను గోత్రికుల నుండియు, మనష్షే అర్ధ గోత్రపువారినుండియు వంతుచీట్లవలన వచ్చినవి పది పట్ట ణములు.

5. The other childre of Kahath of the same kynred, had by the lot ten cities, of the trybe of Ephraim, of the trybe of Dan, and of the halfe trybe of Manasse.

6. ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికుల నుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.

6. But the children of Gerson of the same kynred had by the lot thyrtene cities, of the trybe of Isachar, of the trybe of Asser, of ye trybe of Nepthali, and of the halfe trybe of Manasse at Basan.

7. రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుండియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయులకు కలిగినవిపండ్రెండు పట్టణములు.

7. The children of Merari of their kynred had twolue cities, of the trybe of Ruben, of the trybe of Gad, and of the trybe of Zabulon.

8. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయుల కిచ్చిరి.

8. So the children of Israel gaue these cities and their suburbes vnto the Leuites by lott, as the LORDE commaunded by Moses.

9. వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణములను ఇచ్చిరి.

9. Of the trybe of the children of Iuda, and of the trybe of the children of Simeon, they gaue these cities (which they named by name)

10. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది.

10. vnto the children of Aaron of the kynred of the Kahathites amonge the children of Leui: for the first lot was theyrs.

11. యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.

11. So they gaue them Kiriatharba, which was the fathers of Enak, that is Hebron vpon the mount Iuda, and the suburbes therof rounde aboute.

12. అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి.

12. But the felde of the cite and the vyllages therof, gaue they vnto Caleb the sonne of Iephune for his possession.

13. యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును

13. Thus gaue they vnto the children of Aaron the prest, the fre cite of the deed sleyers, Hebron and the suburbes therof, Libna and the suburbes therof,

14. దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును

14. Iathir and the suburbes therof, Esthuma and the suburbes therof,

15. దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,

15. Holon and the suburbes therof, Debir and the suburbes therof,

16. అనగా ఆ రెండు గోత్రముల వారినుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి.

16. Ain and the suburbes therof, Iuta and the suburbes therof, Beth Semes and the suburbes therof, euen nyne cities of these two trybes.

17. బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును

17. But of the trybe of Ben Iamin they gaue foure cities, Gibeon and ye suburbes therof, Gaba, and the suburbes therof,

18. అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.

18. Anathot and the suburbes therof, Almon and the suburbes therof:

19. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు.

19. so that all the cities of the children of Aaron the prest were thirtene with their suburbes.

20. కహాతీయుల వంశపువారైన లేవీయులకు, అనగా కహాతు సంబంధులలో మిగిలినవారికి వంతుచీట్లవలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రమునుండి వారికియ్యబడెను.

20. The kynreds of the other children of Kahath the Leuites, had by their lott foure cities, of the trybe of Ephraim,

21. నాలుగు పట్టణములను, అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమైన షెకెమును దాని పొలమును గెజెరును దాని పొలమును

21. and they gaue the the fre cite of the deedsleiers, Seche and the suburbes therof vpon mount Ephraim Gaser and the suburbes therof,

22. కిబ్సాయిమును దాని పొలమును బేత్‌హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.

22. Kibzaim and the suburbes therof, Bethron and the suburbes therof.

23. దాను గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా ఎత్తెకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును

23. Of the trybe of Dan foure cities, Eltheke and ye suburbes therof, Gibthon and the suburbes therof,

24. అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి.

24. Aialon and the suburbes therof, Gath Rimon and the suburbes therof.

25. రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి.

25. Of the halfe trybe of Manasses two cities, Thaenach and the suburbes therof, Gath Rimon and the suburbes therof:

26. వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.

26. so that all the cities of the other children of ye kynred of Kahath, were ten with their suburbes.

27. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి.

27. But vnto the children of Gerson amonge the kynreds of the Leuites were geuen, Of the halfe trybe of Manasse two cities, the fre cite for the deedslayer, Gola in Basan and the suburbes therof, Beasthra, and the suburbes therof.

28. ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును

28. Of the trybe of Isachar foure cities, Kision and the suburbes therof, Dabrach and the suburbes therof,

29. ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.

29. Iarmuth and the suburbes therof, Engannim and the suburbes therof.

30. ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును

30. Of the trybe of Asser foure cities, Miseal, Abdon,

31. హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి.

31. Helkath and Rehob with the suburbes therof.

32. నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.

32. Of the trybe of Nephtali thre cities, the fre cite Kedes (for the deedsleyer) in Galile, Hamoth, Dor, and Karthan with the suburbes therof:

33. వారి వంశములచొప్పున గెర్షోనీయుల పట్టణములన్నియు వాటి పొలములుగాక పదమూడు పట్టణములు.

33. so that all the cities of the kynred of the Gersonites were thirtene wt their suburbes.

34. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును

34. Vnto the kynreds of Merari the other Leuites were geuen, Of the trybe of Zabulon foure cities, Iakneam, Kartha,

35. కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.

35. Dimna and Nahalal wt ye suburbes therof.

36. రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహసును దాని పొలమును

36. Of the trybe of Ruben foure cities, Bezer, Iahza,

37. కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.

37. Kedemoth and Mephaat with their suburbes.

38. గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును

38. Of the trybe of Gad foure cities, the fre cite for the deedsleyer, Ramoth in Gilead, Mahanaim,

39. హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.

39. Hesbon and Iaeser with their suburbes:

40. వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు.

40. so that all the cities of the children of Merari amonge their kynreds of ye other Leuites, were twolue.

41. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక లేవీయుల పట్టణములన్నియు నలువది యెనిమిది.

41. Thus all the cities of the Leuites amonge ye possession of the children of Israel, were eight and fortye with their suburbes.

42. ఆ పట్టణములన్నిటికి పొలములుండెను. ఆ పట్టణములన్నియు అట్లేయుండెను.

42. And these cities were so dealte out, that euery one had their suburbes rounde aboute, the one as the other.

43. యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి.

43. Thus the LORDE gaue the children of Israel all the londe, which he had sworne vnto their fathers to geue: & they toke possession of it, and dwelt therin.

44. యెహోవా వారి పితరులతో ప్రమాణముచేసిన వాటన్నిటి ప్రకారము అన్నిదిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరిని వారి చేతి కప్పగించియుండెను గనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయులయెదుట నిలువ లేకపోయెను.

44. And the LORDE gaue the rest before all those yt were aboute them like as he sware vnto their fathers, & none of their enemies stode agaynst the, but all their enmies delyuered he in to their hande.

45. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.

45. And their myssed nothinge of all the good that the LORDE had promysed vnto the house of Israel, it came euery whyt.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

లేవీయులు తమ వాదనను జాషువాకు సమర్పించే ముందు ఇతర తెగల కోసం వేచి ఉండటం ద్వారా సహనం మరియు నిస్వార్థతను ప్రదర్శించారు. వారి దావా బలమైన పునాదిలో స్థిరంగా పాతుకుపోయింది - వారి స్వంత మెరిట్‌లు లేదా సేవల ఆధారంగా కాదు, కానీ దైవిక సూత్రం మీద. మంత్రులకు మరియు మతాధికారులకు మద్దతు ఇవ్వడం మరియు అందించడం అనేది ప్రజల విచక్షణకు మాత్రమే వదిలివేయబడిన విషయం కాదు, ఇది సువార్త బోధించే వారి అవసరాలను విస్మరించడానికి వీలు కల్పిస్తుంది. బదులుగా, సువార్తను ప్రకటించేవారు దాని ప్రకారం జీవించగలగాలి మరియు సహేతుకమైన జీవన ప్రమాణాన్ని ఆస్వాదించాలనేది ఒక సూత్రం. (1-8)

ఇతర తెగల మధ్య లేవీయుల యొక్క వ్యూహాత్మక ఏకీకరణ ఇజ్రాయెల్ యొక్క దృష్టి అంతా వారిపైనే ఉందని నిరంతరం గుర్తుచేస్తుంది. తమ పవిత్ర పరిచర్యకు కళంకం రాని విధంగా ప్రవర్తించడం వారి బాధ్యత. ప్రతి తెగ లేవీయుల పట్టణాలలో దాని భాగాన్ని పొందింది, ఇది దైవిక ఏర్పాటు, ఇది దేశమంతటా మతాన్ని ఆచరించడం మరియు వాక్యానికి విస్తృతమైన ప్రాప్యతను నిర్ధారించింది. ఈ రోజు, సువార్త మన మధ్య మరింత విస్తృతంగా వ్యాపించి, మన సమాజాల అంతటా సుదూర ప్రాంతాలకు చేరినందుకు మనం దేవునికి ఎనలేని కృతజ్ఞులం. (9-42)

దేవుడు అబ్రాహాము వంశస్థులకు వాగ్దానం చేసాడు, కనాను దేశం వారసత్వంగా వారికి చెందుతుందని వారికి హామీ ఇచ్చాడు. ఆయన మాటను బట్టి వారు ఇప్పుడు భూమిని స్వాధీనం చేసుకుని నివసించారు. అదేవిధంగా, స్వర్గపు కనాను వాగ్దానం దేవుని ఆత్మీయ ఇశ్రాయేలు అందరికీ అంతే ఖచ్చితంగా ఉంది, అది పూర్తిగా నమ్మకమైన మరియు మోసం చేయలేని వ్యక్తి నుండి వస్తుంది. ఇశ్రాయేలీయులు దేశంలోకి ప్రవేశించినప్పుడు, మానవ శత్రువులు ఎవరూ వారికి వ్యతిరేకంగా నిలబడలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ, కనానీయుల యొక్క తదుపరి ప్రాబల్యం ఇజ్రాయెల్ యొక్క స్వంత నిర్లక్ష్యం మరియు విగ్రహారాధన పట్ల వారి పాపపు ధోరణులకు మరియు వారు సహజీవనం చేసిన అన్యజనుల అసహ్యకరమైన పద్ధతులను అనుసరించినందుకు శిక్ష ఫలితంగా ఉంది. యెహోవా ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన ఏ ఒక్క మంచి విషయం కూడా ఫలించలేదు. నిర్ణీత సమయంలో, అతని వాగ్దానాలన్నీ నెరవేరుతాయి మరియు ప్రభువు వారి గొప్ప అంచనాలను కూడా అధిగమించాడని అతని ప్రజలు అంగీకరిస్తారు. అతను వారిని గణించలేని విధంగా విజయం సాధించేలా చేస్తాడు, వారు కోరుకున్న విశ్రాంతి మరియు అంతిమ నెరవేర్పుకు వారిని నడిపిస్తాడు. (43-45)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |