Joshua - యెహోషువ 7 | View All

1. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి. ఎట్లనగా యూదాగోత్రములో జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమా రుడునైన ఆకాను శపితము చేయబడినదానిలో కొంత తీసికొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయులమీద కోపించెను.

“అపరాధం చేశారు”– ఒకేవ్యక్తి పాపం చేశాడు. అయితే దేవుడు ఆ జాతినంతటికి దోషమున్నట్లు ఎంచాడు. దేవుడు తన ప్రజలనందరినీ ఒకటిగా పరిగణిస్తాడు. ఒక్క వ్యక్తి పాపం అందరిపైనా ప్రభావం చూపుతుంది. అందరూ దాని విషయం బాధ్యులే (వ 11,20,22; లేవీయకాండము 4:13-21 2 సమూయేలు 21:1-2). వారిలో ఏ ఒక్క వ్యక్తీ తనకు తానుగా జీవించడం సాధ్యం కాదు. మన చర్యలు ఎప్పుడూ ఇతరులపై మంచి, లేదా చెడు ప్రభావాన్ని చూపుతాయి (రోమీయులకు 14:7 రోమీయులకు 14:13 1 కోరింథీయులకు 5:1-2 1 కోరింథీయులకు 5:6 1 కోరింథీయులకు 12:26-27). “కోపాగ్ని”– సంఖ్యాకాండము 25:3 కీర్తనల గ్రంథము 90:11 రోమీయులకు 1:18 నోట్స్.

2. యెహోషువ మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి

ఆకాను పాపం ఫలితంగా ఆ జాతి అంతటికీ అవమానకరమైన అపజయం కలిగింది. “హాయీ”– యెరికోకు 25 కిలోమీటర్ల దూరాన యొర్దానులోయ కెదురుగా ఉన్న కొండలపైన ఉన్న ఊరు.

3. హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిజనులందరిని వెళ్లనీయ కుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి.

వీరి ఆత్మవిశ్వాసం కాస్త మోతాదు మించిందా? ఈ విషయం యెహోషువ యెహోవా దగ్గర విచారణ చేశాడా? యెహోషువ 8:1 యెహోషువ 8:3 చూడండి.

4. కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి.

5. అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.

6. యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు

బట్టలు చింపుకోవడం, తలలు నేలకు ఆనేలా సాష్టాంగ పడడం, దుమ్మెత్తి పోసుకోవడం – ఇవన్నీ నివ్వెరపాటు, దుఃఖం, నిరుత్సాహాలకు సూచనలు.

7. అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు.

నిర్గమకాండము 5:22 నిర్గమకాండము 14:11-12 నిర్గమకాండము 16:3 నిర్గమకాండము 17:3 పోల్చి చూడండి. ఈ మాటల్లో నమ్మకం, విధేయత ధ్వనించడం లేదు. కలవరం, తత్తరపాటు ఉన్నాయి. ఇస్రాయేల్ ఓటమికి కారణా లేమిటో తెలుసుకోవలసినది పోయి యెహోషువ దేవుడు తమను నడిపించిన విధానాన్ని ప్రశ్నిస్తున్నాడు.

8. ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువుల యెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?

9. కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా

“పేరు”– సంఖ్యాకాండము 14:13-16 ద్వితీయోపదేశకాండము 9:28-29. మనం ఎప్పుడూ దేవుని నామానికి నింద వస్తుందేమోనని జాగ్రత్తగా ఉండాలే గాని మనకేమవుతుందో అని చింతించ కూడదు.

10. యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?

దేవుడు యెహోషువను అతని తలంపుల తీరును బట్టి గద్దిస్తూ ఉన్నాడు. అది ప్రార్థన సమయం కాదు, విధేయత చూపవలసిన సమయం (నిర్గమకాండము 14:15). పాపానికి శిక్ష పడాలి. గుర్తుంచుకోండి – విధేయత చూపడానికి బదులుగా ప్రార్థన చేస్తే చెల్లదు.

11. ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.

పాపం చేసినది ఒకడే – ఆకాను. అయితే దేవుని మాటలు చూడండి – “ఇస్రాయేల్‌ప్రజ పాపం చేశారు”. “ఒడంబడిక”– యెహోషువ 6:17-19. (నిర్గమకాండము 20:15 నిర్గమకాండము 20:17 కూడా చూడండి). “వస్తువులు”– ఆకాను దేవుని దగ్గర దొంగిలించాడన్న మాట. “కపటంగా ప్రవర్తించి”– ఇతర పాపాలను కప్పిపుచ్చు కునేందుకు మోసం అనే పాపం మనుషులు చేస్తారు. ప్రజలు చేస్తున్నదేమిటో దేవునికి తెలుసు అన్న విషయాన్ని కూడా గమనించండి (హెబ్రీయులకు 4:13). ఆకాను మనుషులకు కనపడకుండా అంతా దాచిపెట్టగలిగాడు గాని దేవునికి కనిపించ కుండా దాచలేకపోయాడు. ఇక్కడ రెండు ముఖ్యమైన గుణపాఠాలున్నాయి. పాపాన్ని గుర్తించి దాన్ని విడిచిపెట్టలేకపోతే అది మన హానికి దారి తీస్తుంది. అంటే దానిని బట్టి దేవుడు మనల్ని శిక్షకు వదిలిపెట్టవచ్చు. రెండోది, దేవుడు మనలో పని చేసేందుకు పాపం అడ్డు వస్తుంది.

12. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల యెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.

13. నీవు లేచి జనులను పరిశుద్ధపఱచి వారితో ఈలాగు చెప్పుము రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు; మీరు దానిని మీ మధ్య నుండకుండ నిర్మూలము చేయువరకు మీ శత్రువుల యెదుట మీరు నిలువలేరు.

పాపాన్ని ఒప్పుకోకుండా విసర్జించకుండా మన జీవితాల్లో, సంఘాల్లో అలానే ఉండిపోనిచ్చామంటే సైతానుతో విజయవంతంగా పోరాడలేము, క్రీస్తులో మన వారసత్వాన్ని సరిగా అనుభవించలేము.

14. ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను.

“ఎన్నుకొనే”– నిర్ణయానికి రావడానికి వారు చీట్లు వేసి ఉంటారు. న్యాయాధిపతులు 20:9 1 సమూయేలు 14:41-42 1 దినవృత్తాంతములు 24:5 పోల్చిచూడండి.

15. అప్పుడు శపితమైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను.

“చెడ్డ పని”– ద్వితీయోపదేశకాండము 22:21 న్యాయాధిపతులు 19:23-24 న్యాయాధిపతులు 20:6 న్యాయాధిపతులు 20:10 2 సమూయేలు 13:12.

16. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.

17. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టుబడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.

18. అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.

19. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా
యోహాను 9:24, ప్రకటన గ్రంథం 11:13

ఆశాభావం కలగాలంటే ఆకానుకూ ఇస్రాయేల్ అంతటికీ మార్గం ఒకటే. అది పాపాన్ని ఒప్పుకుని, పశ్చాత్తాప పడడమే.

20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.

ఎందరో తమ లోభం వల్లా ఆస్తి పట్ల మక్కువవల్లా తమ జీవితాలను పాడు చేసుకొని తమ ఆత్మలను నరకాగ్నికి లోను చేసుకొన్నారు (మార్కు 10:22-23 1 తిమోతికి 6:9-10).

21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.

22. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.

23. కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.

24. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.

మన పాపం ఇతరులపై చూపిన ప్రభావానికి దేవుడు మనల్నే బాధ్యులుగా ఎంచుతాడు (యెహోషువ 6:18 లూకా 17:1-2). ఆకోరు అంటే “బాధ”. అయ్యో, పాపం దేవుని ప్రజలను ఎంత బాధిస్తుంది! వారు ఆకాను భార్య బిడ్డలను కూడా చంపేశారు. ఆకాను చేసినది వారికి తెలిసి కూడా వారు నోరెత్తక అపరాధులయ్యారన్న మాట.

25. అప్పుడు యెహోషువ నీవేల మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;

“రాళ్ళు రువ్వి”– ఆ కాలంలో దేవుని ఆజ్ఞలను మీరితే శిక్ష రాళ్ళతో కొట్టి చంపడమే (లేవీయకాండము 20:2 లేవీయకాండము 24:23 సంఖ్యాకాండము 15:36).

26. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.

మనం పశ్చాత్తాపపడి మన పాపాలకు ఆయన విధించిన శిక్షను స్వీకరిస్తే దేవుడు తన కోపాన్ని చాలించు కుంటాడు (సంఖ్యాకాండము 25:4 ద్వితీయోపదేశకాండము 13:17 మొ।।). ఆకోరు నుండి ఇస్రాయేల్‌వారు హాయీలోను, ఆ తరువాత అన్ని చోట్లా విజయ పరంపరల్లో సాగారు. ఒకరి అపజయం వల్ల కనాను కోసం జరిపే పోరాటమంతట్లో ఓటమి వచ్చినట్టు కాదు. అలానే మన క్రైస్తవ జీవితంలో ఒకసారి మనం ఓడిపోయినంత మాత్రాన జయించేవారం కాలేమని అనుకోనక్కర్లేదు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 7 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆకాను యెరికో నుండి కొల్లగొట్టిన కొన్ని వస్తువులను తీసుకున్నాడు, ఇది ప్రాపంచిక కోరికలచే ప్రలోభపెట్టబడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికగా ఉపయోగపడుతుంది. ప్రాపంచిక ఆస్తుల ప్రేమ లోతుగా పాతుకుపోయిన మరియు చేదు మూలంగా మారుతుంది, ఇది అధిగమించడానికి గొప్ప సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఇతరులను తప్పుదారి పట్టించవచ్చు లేదా వారి శాంతికి భంగం కలిగించవచ్చు కాబట్టి మనమే పాపంలో పడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి (హెబ్రీయులకు 12:15). అంతేగాక, పాపుల తప్పులో మనం చిక్కుకుపోకుండా మరియు వారి అపరాధంలో పాలుపంచుకోకుండా ఉండేలా మనం వారితో చాలా సన్నిహితంగా సహవసించడం మానుకోవాలి. ఇతరుల పాపాలు మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేయగలవు కాబట్టి, పాపం పట్టుకోకుండా ఉండటానికి మనం ఒకరి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఒకరినొకరు చూసుకోవడం చాలా అవసరం. జెరిఖోలో ఇశ్రాయేలీయుల సులువైన విజయం అహంకారానికి మరియు ఆత్మసంతృప్తికి దారితీసింది, సరైన ప్రయత్నాలు చేయకుండానే దేవుడు ప్రతిదీ చేయాలని ఆశించాడు. సోమరితనం మరియు స్వయం తృప్తి కోసం సాకులుగా కొందరు దైవ కృప మరియు దేవుని వాగ్దానాలను ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారో ఇది హైలైట్ చేస్తుంది. దేవుడు నిజంగా మనలో పని చేస్తున్నప్పుడు, మన రక్షణను చురుకుగా పని చేయడానికి కూడా మనం పిలువబడతాము. జెరిఖోను జయించడం గణనీయమైన పరిణామాలను కలిగి ఉంది: ఇజ్రాయెల్ మేల్కొలుపు, సంస్కరణ మరియు వారి దేవునితో సయోధ్యను అనుభవించింది, అయితే కనానీయులు కఠినంగా మరియు వారి నాశనాన్ని ఎదుర్కొన్నారు. మన ఎంపికలు మనపై మరియు ఇతరులపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలుసుకుని, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో నమ్మకంగా మరియు దృఢంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఇది గుర్తు చేస్తుంది. (1-5)

దేవుని గౌరవాన్ని నిలబెట్టడం పట్ల జాషువా యొక్క లోతైన శ్రద్ధ, ఇజ్రాయెల్ యొక్క విధి పట్ల అతనికి ఉన్న శ్రద్ధను కూడా అధిగమించింది, అతనిలోని దత్తత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. అతను దేవుని జ్ఞానం, శక్తి, మంచితనం మరియు విశ్వసనీయతకు ప్రతిబింబంగా కనిపిస్తాడేమోనని భయపడి, వారి ఓటమిపై దుఃఖిస్తూ అతను హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నాడు. "ప్రభూ, నీ గొప్ప పేరు కోసం నువ్వు ఏమి చేస్తావు?" అని అడగడం కంటే మంచి విన్నపం లేదు. దేవుని మహిమ అన్ని విషయాలలో ప్రధానమైనదిగా ఉండనివ్వండి మరియు ఆయన చిత్తాన్ని మనస్పూర్తిగా స్వాగతిద్దాం. (6-9)

శపించబడిన విషయం తొలగించబడిన తర్వాత అంతా బాగుపడుతుందని హామీ ఇవ్వడం ద్వారా సమాధానాలు వెతకడానికి దేవుడు జాషువాను ప్రేరేపించాడు. ప్రమాదం మరియు ఇబ్బందుల సమయాలు ప్రతిబింబించేలా మరియు సంస్కరించేలా మనల్ని ప్రేరేపించాలి. మనం మన దృష్టిని లోపలికి మళ్లించాలి, మన హృదయాలను మరియు ఇళ్లను శ్రద్ధగా పరిశీలిస్తూ, దేవుడు అసహ్యంగా భావించే దేనినైనా శోధించాలి - అది దాచిన కోరికలు, అక్రమ సంపాదన లేదా దేవుడు మరియు ఇతరుల పట్ల స్వార్థం. మన హృదయాలు, గృహాలు మరియు జీవితాల నుండి ఈ శాపగ్రస్త అంశాలను నిర్మూలించి, వాటిని పూర్తిగా విడిచిపెట్టే వరకు నిజమైన శ్రేయస్సు మనకు దూరంగా ఉంటుంది. పాపం యొక్క పర్యవసానాలు తప్పు చేసేవారిపైకి వచ్చినప్పుడు, అది దేవుని పాత్రను గుర్తించే సమయం. నీతిమంతుడైన దేవుడు నిర్దోషి మరియు అపరాధుల మధ్య తేడాను స్పష్టంగా చూపుతూ నిర్దిష్టమైన మరియు తప్పుపట్టలేని తీర్పును అమలు చేస్తాడు. నీతిమంతులు తెగ, కుటుంబం లేదా ఇంటి పరంగా దుష్టులతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, వారు ఎప్పటికీ దుర్మార్గుల వలె పరిగణించబడరు. (10-15)

తమ పాపాలను దాచిపెట్టగలమని నమ్మేవారి మూర్ఖత్వాన్ని పరిగణించండి. నీతిమంతుడైన దేవుడు చీకటిలో దాగివున్న కార్యాలను బహిర్గతం చేయడానికి వివిధ మార్గాలను కలిగి ఉన్నాడు. దేవుడు మనతో పోరాడుతున్నప్పుడు, మన కష్టాలకు కారణాన్ని గుర్తించడం చాలా అవసరం. మనం కూడా పవిత్ర యోబులా ప్రార్థించాలి, ప్రభువు మనతో ఉన్న వివాదాల గురించి ఆయన నుండి అర్థం చేసుకోవాలని కోరుతూ. నిషేధించబడిన పండుతో హవ్వ ఎలా ప్రలోభపెట్టిందో ఆచాన్ పాపం అతని దృష్టిలో ఉద్భవించింది. ఇది మన హృదయాలను మన కళ్ళతో నడిపించే ప్రమాదాన్ని వివరిస్తుంది. అది మన కళ్లతో ఒడంబడిక చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది, తద్వారా వారు సంచరిస్తే, మనం పశ్చాత్తాపపడి దాని కోసం ఏడుస్తాము. ఆకాన్ యొక్క పాపపు కోరిక అతని పతనానికి దారితీసింది, ముఖ్యంగా ప్రాపంచిక సంపద కోసం అతని కోరిక. అతను ఈ వస్తువులను విశ్వాస నేత్రాలతో చూసినట్లయితే, అతను వాటిని శాపగ్రస్తమైనవిగా గుర్తించి వాటికి భయపడి ఉండేవాడు. అయినప్పటికీ, అతను వారిని ప్రాపంచిక దృక్కోణం నుండి మాత్రమే చూశాడు, వారి అందం మరియు అభిరుచి కోసం వారిని కోరుకున్నాడు. అయినప్పటికీ, అతను వాటిని పొందినప్పుడు, అవి అతను భయం లేకుండా ఉపయోగించలేని భారీ భారంగా మారాయి. పాపం యొక్క మోసపూరితం స్పష్టంగా కనిపిస్తుంది - చర్యలో ఆనందంగా అనిపించేది ప్రతిబింబించిన తర్వాత చేదుగా మారుతుంది. దేవుణ్ణి దోచుకునే వారు చివరికి మోసపోతారు మరియు వారికే కాకుండా వారి చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బందికరమైన పరిణామాలను ఎదుర్కొంటారు. దేవుడు తన ప్రజలను ఇబ్బంది పెట్టేవారికి ప్రతిక్రియను చెల్లిస్తాడు. ఆకాన్ చేసిన పాపం అతనికే కాదు అతని కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది. అతని కుమారులు మరియు కుమార్తెలు అతనితో పాటు మరణశిక్ష విధించబడ్డారు, ఎందుకంటే వారు దొంగిలించబడిన వస్తువులను దాచడంలో పాలుపంచుకున్నారు మరియు తద్వారా అపరాధంలో పాలుపంచుకున్నారు. ఒక పాపి యొక్క చర్యల ప్రభావం చాలా ముఖ్యమైనది, చాలా మంచిని నాశనం చేస్తుంది. ఇది రాబోయే కోపాన్ని మరియు పాపాత్ముని స్నేహితుడైన క్రీస్తు యేసులో ఆశ్రయం పొందవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఆచాన్ యొక్క ఒప్పుకోలు పాపం యొక్క పురోగతిని వెల్లడిస్తుంది, ఇది హృదయంలో దాని ప్రారంభం నుండి దాని కమీషన్ వరకు - ఇది దేవుని చట్టానికి వ్యతిరేకంగా చాలా నేరాలలో కనిపిస్తుంది మరియు యేసుక్రీస్తు త్యాగం ద్వారా అందించబడిన విమోచనం. (16-26)






Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |