Peter II - 2 పేతురు 3 | View All
Study Bible (Beta)

1. ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను

“జ్ఞాపకం”– 2 పేతురు 1:12-15.

2. పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.

“ప్రవక్తలు”– 2 పేతురు 1:19-21. “ఆజ్ఞ”– 2 పేతురు 2:21. ఇక్కడ మళ్ళీ విశ్వాసుల ఎదుగుదలకు పాత ఒడంబడిక, క్రొత్త ఒడంబడిక రెండు గ్రంథాలూ ప్రాముఖ్యమేనని పేతురు నొక్కి చెప్తున్నాడు.

3. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,

“పరిహాసకులు”– 2 పేతురు 2:12; 2 దినవృత్తాంతములు 36:16; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 73:8; కీర్తనల గ్రంథము 74:22; సామెతలు 14:9; సామెతలు 15:12; సామెతలు 19:29; సామెతలు 21:24; యెషయా 28:14; అపో. కార్యములు 13:41; యూదా 1:18. బలమైన ఆధారాలు గల క్రైస్తవ నమ్మకాల గురించి అజ్ఞానంతో కొందరు ఎగతాళి చేస్తుంటారు. సాక్ష్యాధారాలనూ రుజువులనూ పరిశీలించి తమ చెడు కోరికలను విడిచిపెట్టడం కష్టం, ఎగతాళి చేయడం తేలికే.

4. ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను

“రాకడ”– మత్తయి 24:3, మత్తయి 24:10; యోహాను 14:3. యేసుప్రభువు చాలా కాలంగా తిరిగి రాలేదు కాబట్టి ఎప్పటికీ రాడని ఈ పరిహాసకులు అనుకుంటారు.

5. ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ఆదికాండము 1:6-9

“బుద్ధిపూర్వకంగా మరిచిపోయే”– తమ చెడు కోరికలు తీర్చుకోవడమే వారికి ఇష్టం. దానికి అడ్డు వచ్చే దేనినీ మనసులో పెట్టుకునేందుకు ఇష్టపడరు. వారి నమ్మకాలు వాస్తవాలపై ఆధారపడవు. ఏది నిజమై ఉండాలని వారు ఆశిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటాయి. రోమీయులకు 1:28 పోల్చి చూడండి. వారి అజ్ఞానం, అపనమ్మకం వారు కావాలని బుద్ధి పూర్వకంగా తెచ్చిపెట్టుకున్నవే. “దేవుని వాక్కు వల్లే”– ఆదికాండము 1:1-3, ఆదికాండము 1:6, ఆదికాండము 1:9, ఆదికాండము 1:11, ఆదికాండము 1:14, ఆదికాండము 1:20, ఆదికాండము 1:24, ఆదికాండము 1:26; కీర్తనల గ్రంథము 33:6.

6. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
ఆదికాండము 7:11-21

2 పేతురు 2:5.

7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

“వాక్కు”– హెబ్రీయులకు 11:3. “మంటలు”– వ 12; యెషయా 66:15-16; నహూము 1:6; మలాకీ 4:1; ప్రకటన గ్రంథం 20:9. ఆకాశాలు, భూమి అగ్నివల్ల నాశనం అయిపోయేది ఎప్పుడు? పాపవిముక్తి లేనివారి తీర్పు సమయంలోనే, అంతకన్నా ముందు కాదు (ప్రకటన గ్రంథం 20:11-15). మత్తయి 19:28; అపో. కార్యములు 3:21; రోమీయులకు 8:19-21 పోల్చి చూడండి.

8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
కీర్తనల గ్రంథము 90:4

క్రీస్తు తాను తిరిగి వస్తానని వాగ్దానం చేసిన తరువాత ఎంతో కాలం గడిచిపోయినట్టు మనుషులకు అనిపిస్తుంది. దేవునికైతే అది రెండు రోజుల్లాగా ఉంది. మనకు లాగా కాలం అనేది ఆయన అనుభవంలో లేదు. ఆయన క్రీస్తును తిరిగి పంపించేందుకు మన లెక్క ప్రకారం రెండు వేల సంవత్సరాలు ఆగాడంటే అందులో ఆయనకు సదుద్దేశం ఉంది. మనుషులను పశ్చాత్తాపంలోకి నడుపుతూ ఉన్నాడు, ఇక జాగు చేయనవసరం లేదని ఆయనకు తెలిసేంత వరకూ ఆ పని చేస్తూ ఉంటాడు. ఆదికాండము 6:3 పోల్చి చూడండి.

9. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
హబక్కూకు 2:3-4

“ఎవరూ నశించకూడదని”– యెహెఙ్కేలు 18:32; 1 తిమోతికి 2:4; యోహాను 3:16. పశ్చాత్తాపం గురించి నోట్ మత్తయి 3:2; మొ।।.

10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును

“ప్రభు దినం”– యెషయా 2:12; యెషయా 13:6-13; యోవేలు 2:1-2, యోవేలు 2:30-31; జెఫన్యా 1:14-18; అపో. కార్యములు 2:20; 1 థెస్సలొనీకయులకు 5:2; 2 థెస్సలొనీకయులకు 2:2. “దినం”– అంటే అక్షరాలా 24 గంటల రోజు కానవసరం లేదు. ఆదికాండము 2:4; యోహాను 9:4; యెషయా 34:8; 1 థెస్సలొనీకయులకు 5:5, 1 థెస్సలొనీకయులకు 5:8 చూడండి. ఈ “దినం” కాలం వెయ్యి సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. అంటే క్రీస్తు తిరిగి వచ్చినప్పటినుంచి ప్రకటన గ్రంథం 20:11-15 లో ఉన్న అంతిమ తీర్పు సమయం వరకు ఈ “దినం” ఉండవచ్చు. “దొంగ”– 1 థెస్సలొనీకయులకు 5:1-3; ప్రకటన గ్రంథం 3:3; ప్రకటన గ్రంథం 16:15. “వేడి”– వ 7. పేతురు భవిష్యత్తులో జరిగే వాటి క్రమం, జాబితా ఇవ్వడం లేదు. మనుషుల అంతిమ తీర్పూ, ఆకాశాలూ భూమీ పూర్తిగా నాశనం అయిపోవడమూ జరిగే సమయానికి ముందు క్రీస్తు తిరిగి వచ్చి వెయ్యి సంవత్సరాలు భూమిపై పరిపాలించే అవకాశాన్ని పేతురు ఇక్కడ రాసిన మాటలు త్రోసి పుచ్చడం లేదు (ప్రకటన గ్రంథం 20:1-6). ఆ వెయ్యి సంవత్సరాలకు ముందు, తరువాత కూడా మంటల ద్వారా తీర్పు ఉంటుంది. 2 థెస్సలొనీకయులకు 1:7; యెషయా 24:6-13; యెషయా 29:6; యెషయా 30:30; ప్రకటన గ్రంథం 13:8-9; ప్రకటన గ్రంథం 20:9, ప్రకటన గ్రంథం 20:14-15.

11. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

“పవిత్ర...భక్తి”– తీతుకు 2:11-14; 1 పేతురు 1:15; 1 యోహాను 1:6. “ఎలాంటివారై”– నాశనం కాబోతున్న ఈ లోక విషయాల కోసం బ్రతకడంలో ఏమన్నా అర్థం ఉందా? 1 యోహాను 2:15-17 పోల్చి చూడండి.

12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.
యెషయా 34:4

“దేవుని దినం”– వ 10; 1 కోరింథీయులకు 1:8; 1 కోరింథీయులకు 3:13; 1 కోరింథీయులకు 5:5; 2 కోరింథీయులకు 1:14; ఫిలిప్పీయులకు 1:6. “శీఘ్రతరం చేస్తూ”– ఆ రోజు త్వరగా రావడానికి విశ్వాసులంగా మనం ఏమి చెయ్యగలం? యేసుప్రభువు మనకు చెప్పినదాన్ని చేయడం ద్వారానే ఆ దినాన్ని శీఘ్రతరం చేయవచ్చు. ఆయన రాజ్యం వచ్చేలా ప్రార్థించాలని ఆయన మనకు చెప్పాడు (మత్తయి 6:10), తన శుభవార్తను భూమిపై ప్రజలందరికీ వినిపించాలన్నాడు (మత్తయి 28:19; మార్కు 16:15). ఆయన సంఘం ఈ పనిని పూర్తి చేసినప్పుడు అంతం వస్తుంది (మత్తయి 24:14).

13. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.
యెషయా 60:21, యెషయా 65:17, యెషయా 66:22

“కొత్త”– యెషయా 65:17; ప్రకటన గ్రంథం 21:1. “న్యాయం నివాసం”– ప్రకటన గ్రంథం 21:27; ప్రకటన గ్రంథం 22:14-15; కీర్తనల గ్రంథము 15:1-5; కీర్తనల గ్రంథము 89:14; కీర్తనల గ్రంథము 118:19; యెషయా 11:4-5; 1 కోరింథీయులకు 6:9-10. నీతిన్యాయాలను చిన్నచూపు చూచి వాటిని అనుసరిస్తున్న అలాంటివారిని హింసించే ఈ లోకానికి అది పూర్తిగా వ్యతిరేకం.

14. ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి.

దానియేలు 12:10; 1 కోరింథీయులకు 1:8; ఎఫెసీయులకు 1:4; ఎఫెసీయులకు 5:27; ఫిలిప్పీయులకు 1:10; ఫిలిప్పీయులకు 2:15; 1 థెస్సలొనీకయులకు 5:23. “శాంతితో”– పాపం, అవిధేయత, అపనమ్మకం ఆయనపై పడుతున్న దెబ్బల వంటివి. నీతిన్యాయాలు, శాంతి ఎప్పుడూ కలిసే ఉంటాయి (కీర్తనల గ్రంథము 85:10; యెషయా 27:5; యెషయా 32:17). ఆయన మనకు చెప్పినట్టు గనుక మనం జీవిస్తే ఆయన రాక కోసం ఆనందంతో, ధైర్యంతో ఎదురు చూడవచ్చు.

15. మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు.

“సహనం”– వ 9. “పౌలు”– దేవుని సహనం గురించి పౌలు రోమీయులకు 2:4; రోమీయులకు 3:25-26; రోమీయులకు 9:22-23; రోమీయులకు 10:21 లో రాశాడు. ఇక్కడ పేతురు ఆ లేఖ గురించి చెప్తున్నాడేమో.

16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.

“గ్రహించడానికి కష్టం”– పౌలు ఉత్తరాలు కొన్నింటిలో కనిపించే కొన్ని భాగాల్లో భాష తీరు, అంశాలు కొన్ని కష్టంగా అనిపిస్తుంది (రోమ్‌వారికి రాసిన లేఖ ఇందుకు మంచి ఉదాహరణ). బాగా ధ్యానించకుండా, మరి ముఖ్యంగా దేవుని ఆత్మ ఇచ్చే గ్రహింపు, జ్ఞానం తోడ్పాటు లేకుండా మనం వాటిని అర్థం చేసుకోలేము. “ఉపదేశం పొందనివారు”– దేవుణ్ణి ఎరుగనివారు, ఆయన వాక్కును ఎలా చదవాలి, అర్థం చేసుకోవాలి అన్న సంగతి గురించి తెలియనివారు. “నిలకడ లేనివారు”– 2 పేతురు 2:14; యాకోబు 1:8 – అంటే సత్యంలో స్థిరంగా లేనివారు (కొలొస్సయులకు 1:23; కొలొస్సయులకు 4:12; 1 థెస్సలొనీకయులకు 3:8; 2 థెస్సలొనీకయులకు 2:15; 1 పేతురు 5:9-10). “వక్రం”– అపో. కార్యములు 20:30; 2 కోరింథీయులకు 4:2; గలతియులకు 1:7; యిర్మియా 23:36. “నాశనానికి”– 2 పేతురు 2:1, 2 పేతురు 2:3; 2 థెస్సలొనీకయులకు 2:10. దేవుడు వెల్లడి చేసినదాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఉపదేశాలను గనుక మనం వక్రం చేస్తే, మనకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేము.

17. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.

“నీతి నియమం లేనివారి”– 2 పేతురు 2:7-8; 2 థెస్సలొనీకయులకు 2:3, 2 థెస్సలొనీకయులకు 2:7-9; 1 యోహాను 3:4; Judee 1:4; 1 కోరింథీయులకు 9:21; యాకోబు 2:8. “పడకుండా”– 2 పేతురు 1:10; 1 కోరింథీయులకు 10:12. “జాగ్రత్తగా”– మత్తయి 10:17; మత్తయి 16:6; మార్కు 13:9, మార్కు 13:23, మార్కు 13:33; అపో. కార్యములు 20:31; 1 కోరింథీయులకు 16:13.

18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌.

“కృప”– కృప మనకు నేర్పించేదేమిటో మనం దేనిలో ఎదుగుతూ ఉండాలో తీతుకు 2:11-14 లో కనిపిస్తున్నది. “జ్ఞానం”– ఎఫెసీయులకు 1:17; ఎఫెసీయులకు 3:18-19; ఫిలిప్పీయులకు 3:10; కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 2:2. “పెరుగుతూ”– ఎఫెసీయులకు 4:12-15; 1 పేతురు 2:2. మహిమ క్రీస్తుకే చెందాలని పేతురుకు తెలుసు. దేవుడొక్కడే మహిమకు పాత్రుడు. యెషయా 42:8; రోమీయులకు 11:36; రోమీయులకు 16:27. క్రీస్తు ఆయన అవతారం.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Peter II - 2 పేతురు 3 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇక్కడ డిజైన్ క్రీస్తు యొక్క చివరి తీర్పును గుర్తు చేయడమే. (1-4) 
అంకితభావంతో ఉన్న క్రైస్తవుల మనస్సులు మేల్కొలపబడాలి మరియు ఉత్తేజపరచబడాలి, పవిత్రతను చురుకుగా కొనసాగించేలా వారిని ప్రేరేపిస్తాయి. అంతిమ దినాలలో, ముఖ్యంగా సువార్త ప్రకటించే సమయంలో, అపహాస్యం చేసే వ్యక్తులు ఉంటారు, పాపాన్ని చిన్నచూపు మరియు యేసుక్రీస్తు ద్వారా రక్షణ భావనను అపహాస్యం చేస్తారు. మన విశ్వాసం యొక్క కీలకమైన అంశం వాగ్దానాలపై ఆధారపడి ఉంటుంది మరియు మన ప్రభువు రాక వరకు సంశయవాదులు దానిని సవాలు చేస్తారు. కీర్తనల గ్రంథము 55:19లో పేర్కొన్నట్లుగా, ఆయన రాకడపై వారి అపనమ్మకం, స్పష్టమైన మార్పులు లేకపోవటం వల్ల మూలాధారమై, దేవుని భయాన్ని విస్మరించేలా చేస్తుంది. ఎప్పుడూ చేయనిది, చేయలేడు, చేయలేడు అని ఊహిస్తూ వస్తాడేమోనని అనుమానం.

ప్రకృతి యొక్క ప్రస్తుత చట్రం అగ్ని ద్వారా కరిగిపోయినప్పుడు అతను ఊహించని విధంగా కనిపిస్తాడు. (5-10) 
ఈ అపహాస్యం చేసేవారు దేవుడు ఒకప్పుడు భక్తిహీనుల మొత్తం సమాజాన్ని నిర్మూలించిన వినాశకరమైన ప్రతీకారాన్ని ప్రతిబింబించి ఉంటే, వారు ఖచ్చితంగా సమానమైన భయంకరమైన తీర్పు గురించి ఆయన హెచ్చరికను తేలికగా పరిగణించరు. అదే దైవిక ఆజ్ఞ ద్వారా ఉనికిలోకి తీసుకురాబడిన ప్రస్తుత ఆకాశాలు మరియు భూమి చివరికి అగ్నిచే దహించబడతాయని ప్రకటన చేయబడింది-ఇది దేవుని యొక్క అసాధ్యమైన సత్యం మరియు శక్తి ద్వారా ధృవీకరించబడింది. ఈ సందర్భంలో, క్రైస్తవులు బోధించబడ్డారు మరియు ప్రభువు రాబోయే రాక యొక్క నిశ్చయతలో దృఢంగా స్థిరపడ్డారు.
మానవ గణనలో ఒకే రోజు మరియు వెయ్యి సంవత్సరాల మధ్య కాల వ్యత్యాసాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, అటువంటి అసమానతలు దైవిక దృక్పథంలో ఎటువంటి బరువును కలిగి ఉండవు. అన్ని తాత్కాలిక దశలు-గతం, వర్తమానం మరియు భవిష్యత్తు-దేవుని ముందు ఎప్పుడూ ఉంటాయి, ఒక రోజు లేదా ఒక గంట పాటు విషయాలను వాయిదా వేయాలనే మన మానవ అవగాహనతో పోలిస్తే వెయ్యి సంవత్సరాల ఆలస్యం అసంభవం. దేవుని శాశ్వత స్వభావంపై జ్ఞానం లేదా విశ్వాసం లేనివారు మానవ లక్షణాలను ఆయనపైకి చూపించే అవకాశం ఉంది. శాశ్వతత్వాన్ని సంభావితం చేసే సవాలు చాలా పెద్దది.
ఆలస్యము అని కొందరు వ్యాఖ్యానించవచ్చు, వాస్తవానికి, మనపట్ల దైవిక సహనం. ఇది దేవుని ప్రజలు జ్ఞానం, పవిత్రత, విశ్వాసం మరియు సహనంలో పురోగమించటానికి, మంచి పనులలో పుష్కలంగా ఉండటానికి మరియు దేవుణ్ణి మహిమపరచడానికి ఎక్కువ సమయాన్ని అనుమతిస్తుంది. కాబట్టి, భూసంబంధమైన రాజ్యంలో చేసే మంచి మరియు చెడు రెండింటికీ-అన్ని పనులకు జవాబుదారీగా ఉండాలనే ఖచ్చితత్వాన్ని మీ హృదయాలలో స్థిరపరచడం చాలా కీలకం. దేవునితో వినయపూర్వకమైన మరియు శ్రద్ధగల నడకను పెంపొందించుకోండి, రాబోయే భవిష్యత్తు తీర్పును అంగీకరిస్తూ మిమ్మల్ని మీరు క్రమంగా పరిశీలించుకుంటూ ఉండండి, చాలా మంది తమకు ఎప్పటికీ లెక్క చెప్పనవసరం లేదు.
సురక్షితమైన మరియు దాని గురించి ఎదురుచూడని వారికి లార్డ్ యొక్క రోజు అనుకోకుండా వస్తుంది. ప్రాపంచిక మనస్సు గల వ్యక్తులు తమ సంతోషం కోసం వెతుకుతున్న గొప్ప భవనాలు మరియు అన్ని అపేక్షిత ఆస్తులు మండుతున్న తిరుగుబాటులో దహించబడతాయి. దేవుడు సృష్టించిన ప్రతి జీవి, మానవ చేతులతో పాటుగా, అగ్ని గుండా వెళుతుంది-ప్రపంచంలోకి ప్రవేశించిన పాపాలన్నిటికీ అది ఒక శక్తి, ఇంకా దేవుని చేతి సృష్టికి శుద్ధి చేసే ప్రక్రియ. రాబోయే వినాశనాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ భూమిపై తమ ప్రేమను స్థిరీకరించి, దానిని తమ ఏకైక సాధనగా మార్చుకునే వారి గతి ఏమిటి? కాబట్టి, ఈ కనిపించే ప్రపంచం దాటి మీ ఆనందాన్ని కాపాడుకోండి.

అక్కడి నుండి పవిత్రత మరియు విశ్వాసంలో దృఢత్వం యొక్క ఆవశ్యకత ఊహించబడింది. (11-18)
క్రీస్తు ఆసన్నమైన పునరాగమనం యొక్క బోధన స్వచ్ఛత మరియు దైవభక్తిని స్వీకరించడానికి పిలుపుగా పనిచేస్తుంది, ఇది నిజమైన జ్ఞానం యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆదేశం ఖచ్చితమైన మరియు సార్వత్రిక పవిత్రత కోసం, ఏదైనా పరిమిత కొలతను అధిగమిస్తుంది. ప్రామాణికమైన క్రైస్తవులు కొత్త ఆకాశాలు మరియు కొత్త భూమితో గుర్తించబడిన భవిష్యత్తును ఊహించారు, ప్రస్తుత పరిస్థితుల యొక్క తాత్కాలిక స్వభావం మరియు కాలుష్యం నుండి విముక్తి పొందారు. క్రీస్తు యొక్క నీతితో అలంకరించబడిన మరియు పరిశుద్ధాత్మచే పవిత్రపరచబడిన వారికి మాత్రమే ఈ పవిత్ర రాజ్యంలో నివాసం మంజూరు చేయబడుతుంది. వాగ్దానం చేసినవాడు నమ్మకమైనవాడు.
ఎవరి పాపాలు క్షమించబడి, దేవునితో శాంతిని చేసుకున్నారో, వారు సురక్షితమైన మరియు సంతోషకరమైన సంఘంగా ఉంటారు. కాబట్టి, శాంతి మరియు పవిత్రత రెండింటినీ చురుకుగా కొనసాగించండి. అప్పగించిన పనులను పూర్తి చేయడానికి కేటాయించిన సమయం, వర్తమానంలో మీరు నిర్లక్ష్యంగా మరియు ఉదాసీనంగా ఉంటే దేవుని రోజున శాంతితో నిలబడాలని ఆశించవద్దు. ప్రభువు దినమున సంతోషముగల క్రైస్తవుడు శ్రద్ధగలవాడు. మన ప్రభువు అకస్మాత్తుగా రావచ్చు లేదా త్వరలో మనలను తన వద్దకు పిలుచుకోవచ్చు, మరియు అతను మనల్ని పనిలేకుండా చూస్తాడా? తన రాకడను ఆలస్యం చేసే మన ప్రభువు చూపిన సహనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకో. కొందరు వ్యక్తులు, అహంకారం, దేహాభిమానం మరియు అవినీతితో కళంకితమై, తమ దుష్ట సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని అంశాలను వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు. ఏది ఏమైనప్పటికీ, ఇది సెయింట్ పాల్ యొక్క ఉపదేశాలను లేదా మరేదైనా ఇతర గ్రంథాలను వదిలివేయడానికి హామీ ఇవ్వదు, ఎందుకంటే మానవ తప్పుడు వివరణ దేవుని బహుమతులను తిరస్కరించదు.
సువార్త యొక్క లోతైన సత్యాలను స్వీకరించడానికి, మనం స్వీయ-తిరస్కరణ, స్వీయ-అనుమానం మరియు క్రీస్తు యేసు అధికారానికి లోబడి ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే మనం సత్యాన్ని తిరస్కరించే ప్రమాదం ఉంది. విశ్వాసులు దేవుని చట్టానికి భిన్నంగా ఏదైనా అభిప్రాయాలు లేదా ఆలోచనలను తిరస్కరించారు మరియు అసహ్యించుకుంటారు. పొరపాటున ఊగిసలాడే వారు తమ స్థిరమైన పునాది నుండి తప్పుకుంటారు. అటువంటి ఆపదలను నివారించడానికి, దయ-విశ్వాసం, ధర్మం మరియు జ్ఞానం యొక్క అన్ని అంశాలలో వృద్ధి కోసం కృషి చేయండి. క్రీస్తుని మరింత స్పష్టంగా మరియు సంపూర్ణంగా అర్థం చేసుకునేందుకు కృషి చేయండి, ఆయనను మరింతగా ఇష్టపడి, ఆయనను తీవ్రంగా ప్రేమించాలని లక్ష్యంగా పెట్టుకోండి. అపొస్తలుడైన పౌలు కోరిన ఈ క్రీస్తు జ్ఞానం, ఇప్పుడు మరియు భవిష్యత్తులో కూడా కృతజ్ఞత, ప్రశంసలు మరియు అతని మహిమ యొక్క అంగీకారానికి దారితీస్తుంది.



Shortcut Links
2 పేతురు - 2 Peter : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |