Judah - యూదా 1 | View All

1. యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

“పిలుపు”– రోమీయులకు 1:3, రోమీయులకు 1:7; రోమీయులకు 8:28, రోమీయులకు 8:30; రోమీయులకు 9:24; 1 కోరింథీయులకు 1:9; గలతియులకు 1:6, గలతియులకు 1:15; ఎఫెసీయులకు 1:18; ఫిలిప్పీయులకు 3:14; 2 థెస్సలొనీకయులకు 2:14; 2 తిమోతికి 1:9; 1 పేతురు 2:9; 1 పేతురు 3:9; 1 పేతురు 5:10; 2 పేతురు 1:10. యూదా అంటే “స్తుతి నొందిన” అని అర్థం. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో యూదా అనే పేరు గలవారు చాలామంది ఉన్నారు. ఈ లేఖ రాసిన యూదా యేసుప్రభువు తరువాత ఆయన తల్లి మరియకు పుట్టినవాడేనన్నది దాదాపు ఖాయమే (మత్తయి 13:55; యోహాను 7:3). యేసుప్రభు మరణం, పునర్జీవితాలకు ముందు యూదా ఆయనలో నమ్మకం ఉంచలేదు. కానీ తరువాతి కాలంలో అపో. కార్యములు 1:14; 1 కోరింథీయులకు 9:5 లో విశ్వాసుల్లో ఒకడుగా అతడు ఉన్నాడు. “పవిత్రులై”– అపో. కార్యములు 20:32; అపో. కార్యములు 26:18; రోమీయులకు 15:16; 1 కోరింథీయులకు 1:2; 1 కోరింథీయులకు 6:11; హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14. “కాపాడబడుతూ”– యోహాను 6:37-40; యోహాను 10:27-28; యోహాను 17:11-12; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:28-30, రోమీయులకు 8:35-39; 1 కోరింథీయులకు 1:8-9; 1 పేతురు 1:5. “దాసుడు”– రోమీయులకు 1:3. “యాకోబు”– యాకోబు 1:1.

2. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.

“కరుణ”– రోమీయులకు 915-16:1; రోమీయులకు 11:32; రోమీయులకు 12:1; రోమీయులకు 15:9; ఎఫెసీయులకు 2:4; తీతుకు 3:5. విశ్వాసులు అంతకు ముందు తమ పాపాల్లో నిస్సహాయులై, అజ్ఞానంలో, దౌర్బల్యంలో ఉన్నప్పుడు దేవుడు తన కరుణ చొప్పున వారిని క్షమించాడు, రక్షించాడు. ఇదంతా అర్హతలు లేని వారి పట్ల దేవుని దయ, కృప. ఆయన కరుణ మనకు ఇప్పటికీ అస్తమానం అందుబాటులోనే ఉంది. దేవుని కరుణే మన శాంతికి పునాది. “శాంతి”– రోమీయులకు 1:2. దేవునితో సరైన సంబంధం, విశ్వాసుల మధ్య ఐకమత్యం వల్ల కలిగే మనశ్శాంతి, హృదయశాంతి అని ఇక్కడ దీని అర్థం. “ప్రేమ”– దివ్య ప్రేమ (ఆగాపే – యోహాను 13:34; రోమీయులకు 5:5; 1 కోరింథీయులకు 13:1; ఎఫెసీయులకు 3:17 చూడండి). మనం దేవుని కరుణను శాంతిని పొందాం కాబట్టి ఇది వస్తుంది. ఇది ఉనికిలో ఉన్న గుణాలన్నిటిలోకీ గొప్పది (1 కోరింథీయులకు 13:13). ప్రేమ స్వరూపి అయిన దేవుడే దీనికి మూలాధారం (1 యోహాను 4:7-8).

3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.

“రక్షణ, పాపవిముక్తి”– రోమీయులకు 1:16 దగ్గర నోట్. యూదా ఒక అతి శ్రేష్ఠమైన, మహిమతో కూడిన విషయం గురించి రాయదలచుకున్నాడు. అయితే అంత ఆహ్లాదకరం కాని మరో సంగతి గురించి రాయాలని అతనికి తోచింది. “పవిత్రులకు”– రోమీయులకు 1:1. “ఒక్క సారే అప్పగించబడ్డ”– దేవుడు క్రీస్తు ద్వారా, ఆయన శిష్యుల ద్వారా వెల్లడించిన విశ్వాస సత్యం సంపూర్ణమైనది. దానికి ఏమీ కలపకూడదు, దానినుండి ఏమీ తీసివేయకూడదు. ద్వితీయోపదేశకాండము 4:2; సామెతలు 30:6; ప్రకటన గ్రంథం 22:18-19 పోల్చి చూడండి. దేవుడు వేరెవరిద్వారా, మరెక్కడా మరి కొంత సత్యాన్ని ఇక వెల్లడించడు. కొత్త సిద్ధాంతాలేవైనా సరే తప్పక తప్పుడు సిద్ధాంతాలే. విశ్వాసులు తమకు అందిన విశ్వాస సత్యాలను అనుసరిస్తూ, ఆచరిస్తూ, వాటికేదైనా ముప్పు వాటిల్లితే వాటి పక్షంగా వాదించాలనే దేవుడు వాటిని వారికిచ్చాడు. 1 కోరింథీయులకు 4:1; 1 థెస్సలొనీకయులకు 2:4; 1 తిమోతికి 1:11; 1 తిమోతికి 6:20; 2 తిమోతికి 1:14. “విశ్వాస సత్యాలు”– అంటే క్రీస్తు ద్వారా దేవుడిచ్చిన సత్యాలన్నిటినీ కలిపి ఇలా అంటున్నాడు. మనమేది నమ్మాలో, ఏ విధంగా జీవించాలో క్రీస్తు, ఆయన రాయబారులు మనకు నేర్పించారు. ఇదే “విశ్వాస సత్యాలు”. సరైన సిద్ధాంతాలకు అంటి పెట్టుకుని ఉండడం మాత్రమే చాలదు (అది ప్రాముఖ్యమే). ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి (ఎఫెసీయులకు 4:1; కొలొస్సయులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:12). ఈ లేఖలో యూదా గట్టిగా చెప్పదలచుకున్నది సిద్ధాంతాల గురించి మాత్రమే కాదు. సరైన సిద్ధాంతం, సరైన ప్రవర్తన కలసి ఉండాలన్నదే. అతడు ఇస్తున్న హెచ్చరిక తప్పుడు సిద్ధాంతాల మూలంగా కలిగే అపవిత్ర జీవితం గురించి. “పోరాడాలని”– ఇలా అనువదించిన గ్రీకు పదం యుద్ధ రంగంలోని పోరును తెలియజేసే పదం. ఎఫెసీయులకు 6:11-18; 1 తిమోతికి 6:12 పోల్చి చూడండి. ఈ భూమిపై సాధారణంగా, క్రైస్తవ లోకంలో కూడా దేవుడు వెల్లడించిన సత్యం విషయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. “అవసరమని”– సంఘానికి అప్పటికి ఉన్న అవసరత అటువంటిది. క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప ప్రమాదం ఆసన్నమైంది. యూదాలో దేవుని ఆత్మ పని చేస్తూ అతణ్ణి బలవంతం చేస్తూ ఉంది.

4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.

యూదాకు కనిపించిన ప్రమాదం ఇది. క్రైస్తవుల్లోకి భయంకరమైన తప్పు సిద్ధాంతం ఒకటి ప్రవేశించింది. అదేమిటంటే పాపవిముక్తి, రక్షణ కేవలం దేవుని కృప మూలంగానే గనుక, ఏ విధంగానూ మంచి పనులపై అది ఆధారపడదు గనుక క్రైస్తవులు తమ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. వారెలా జీవించినా, ఏమి చేసినా కృప వారిని క్షమిస్తుంది. రోమీయులకు 6:1 పోల్చి చూడండి. ఈ తప్పు సిద్ధాంతం ఇప్పటికీ ఉంది. “దొంగచాటుగా”– 2 పేతురు 2:1. తప్పు సిద్ధాంతాలు ఉపదేశించేవారు సాధారణంగా అందరికీ కనిపించేలా, ముక్కు సూటిగా రారు. దొంగల్లాగా నక్కుతూ వస్తారు. తమ తప్పుడు బోధలను సత్యంతో కలిపి మరింత మోసకరంగా తయారు చేస్తారు. “భక్తిలేని”– తాము క్రైస్తవులమనీ, క్రీస్తును అనుసరించేవారమనీ చెప్పుకుంటారు. కానీ వారు నిజ క్రైస్తవులు కారని వారి ప్రవర్తన రుజువు చేస్తుంది. “పోకిరీ పనులకు సాధనంగా”– కొరింతు సంఘంలో కొందరు క్రైస్తవులకు కూడా ఇదే అభిప్రాయం ఉన్నట్టుంది (1 కోరింథీయులకు 5:1-2; 1 కోరింథీయులకు 6:9, 1 కోరింథీయులకు 6:12). తీతుకు 2:11-14 లో దేవుని కృప నిజంగా ఏమి నేర్పుతున్నదో చూడండి. ఎఫెసీయులకు 4:19-24 కూడా చూడండి. “ఏకైక యజమాని”– ఇలా అనువదించిన గ్రీకు పదం పూర్తి అధికారం, హక్కు ఉన్నవాణ్ణి తెలిపేది. లూకా 2:28-29 లోను అపో. కార్యములు 4:24 లోను ఇది దేవునికి ఇవ్వబడిన బిరుదు. క్రీస్తు మన “ఏకైక” యజమాని కాబట్టి క్రీస్తు దేవుడని స్పష్టమే. “నిరాకరించేవారు”– 2 పేతురు 2:1. నిరాకరించడం చేతల ద్వారా గానీ మాటల ద్వారా గానీ కావచ్చు. ఈ మనుషులు తమపై క్రీస్తు ప్రభుత్వాన్ని నిరాకరించారు. కానీ ఆయన ప్రభువని తాము నమ్ముతున్నట్టుగా వారు చెప్పుకుంటూ ఉండవచ్చు. “వారిని గురించి రాసి ఉంది”– పోకిరీవారు, అవిశ్వాసులు దేవుని శిక్షావిధికి గురి అయిన ఉదాహరణలు అనేకం పాత ఒడంబడికలో ఉన్నాయి. యూదా వ 5-7లో మూడు ఉదాహరణలిస్తున్నాడు.

5. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.
నిర్గమకాండము 12:51, సంఖ్యాకాండము 14:29-30, సంఖ్యాకాండము 14:35

“జ్ఞాపకం చేయాలని”– 2 పేతురు 1:12-15. “ప్రభువు”– క్రొత్త ఒడంబడిక గ్రంథమంతటా యేసుకు ఇవ్వబడిన బిరుదు ఇది (గ్రీకు – కురియొస్‌) – లూకా 2:11 నోట్ చూడండి. యూదా ఇంతకుముందు వచనంలో ఆయన్ను ప్రభువు అన్నాడు. ఈ వచనంలో ఆయన తన ప్రజలను ఈజిప్ట్‌నుంచి రక్షించాడంటున్నాడు. చరిత్రను బట్టి చూస్తే ఆ ప్రజలను ఈజిప్ట్‌నుంచి రక్షించింది యెహోవా. నిర్గమకాండము 3:7-12; నిర్గమకాండము 18:10; నిర్గమకాండము 19:2. అంటే యూదా యేసునే యెహోవా అంటున్నాడు. “నాశనం చేశాడు”– హెబ్రీయులకు 3:16-19; 1 కోరింథీయులకు 10:1-6; సంఖ్యాకాండము 14:11, సంఖ్యాకాండము 14:22-23; కీర్తనల గ్రంథము 78:22, కీర్తనల గ్రంథము 78:32-33; కీర్తనల గ్రంథము 106:15, కీర్తనల గ్రంథము 106:18, కీర్తనల గ్రంథము 106:24-26, కీర్తనల గ్రంథము 106:29.

6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.

2 పేతురు 2:4. “అధికార స్థానం”– ఎఫెసీయులకు 1:21; కొలొస్సయులకు 2:10. “నివాస స్థలం”– పరలోకం.

7. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
ఆదికాండము 19:4-25

“వారిలాగే”– ఆ దేవదూతల పాపం సొదొమ ప్రజల పాపం వంటిదని దీన్ని బట్టి అనుకోవచ్చు – అంటే లైంగిక అవినీతి. ఆదికాండము 6:1-4 పోల్చి చూడండి. “అసహజంగా”– ఆది 19వ అధ్యాయం. “అగ్ని”– 2 పేతురు 2:6; మలాకీ 4:1; మత్తయి 3:10, మత్తయి 3:12; మత్తయి 25:41.

8. అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.

“కలలు కంటూ”– వారు వాస్తవానికి దూరమైపోయి, కామ వాంఛలతో మత్తెక్కిపోయిన వారిలాగా ప్రవర్తించారు. కలలు కనేవారు అనే మాట దేవునినుంచి తమకు స్వప్న దర్శనాలు వస్తున్నాయని చెప్పుకునేవారిని కూడా ఉద్దేశించి చెప్పి ఉండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 13:1-3; యిర్మియా 23:25-26). “శరీరాన్ని”– రోమీయులకు 1:24; 1 కోరింథీయులకు 6:18. “ప్రభుత్వాన్ని...మహనీయులను”– 2 పేతురు 2:10.

9. అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపకప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.
దానియేలు 10:13, దానియేలు 10:21, దానియేలు 12:1, జెకర్యా 3:2-3

“మిఖాయేల్”– దానియేలు 10:13, దానియేలు 10:21; దానియేలు 12:1; ప్రకటన గ్రంథం 12:7, “అపనింద పిశాచం”– మత్తయి 4:1 నోట్. “మోషే”– బైబిల్లో ఈ సంఘటన రాసి లేదు. ఈ వాదన ఏమిటో మనకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరమూ లేదు – ద్వితీయోపదేశకాండము 29:29. “ప్రభువే...గాక”– సైతానుతో మాట్లాడేటప్పుడు సైతం మిఖాయేలు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో చూడండి. ఇతరుల తీర్పు, శిక్ష దేవునికే వదిలి పెట్టాడు. మనమూ అలానే చెయ్యాలి.

10. వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.

“దూషిస్తారు”– 2 పేతురు 2:12. ఇది వారి అహంభావాన్నీ, దుర్మార్గతనూ తెలియజేస్తున్నది. “ప్రకృతి సిద్ధంగా”– ఆధ్యాత్మిక విషయాల గురించి వారికేమీ తెలియదు. శారీరక విషయాలు మాత్రమే తెలుసు.

11. అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.
ఆదికాండము 4:3-8, సంఖ్యాకాండము 16:19-35, సంఖ్యాకాండము 22:7, సంఖ్యాకాండము 31:16

“వారికి బాధ”– యెషయా 3:11; మత్తయి 18:7. “కయీను”– ఆదికాండము 4:1-12 చూడండి. కయీను నడిచిన దారి అంటే బలి అర్పణల గురించి దేవుడిచ్చిన సూచనలను లెక్క చెయ్యకపోవడం, దేవుడు మెచ్చుకున్నవారిని ద్వేషించడం. హెబ్రీయులకు 11:4; 1 యోహాను 3:12 కూడా చూడండి. “బిలాము నడించిన త్రోవ”– 2 పేతురు 2:15 చూడండి. “కోరహు తిరుగుబాటు”– సంఖ్యా 16వ అధ్యాయం. దేవుడంటే భయభక్తులు లేని ఈ మనుషులు కోరహులాగా దేవునిపై తిరుగుబాటు చేసి తమపైకి తామే నాశనం తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ మనుషుల హృదయాల్లో మూడు సంగతులున్నట్టు ఈ వచనంలో గమనిస్తున్నాం – సత్యం పట్లా దాన్ని అనుసరించే వారిపట్లా ద్వేషం, తమకు కావాలనుకున్న దాని విషయంలో అత్యాశ, దేవునికి విరోధంగా తిరుగుబాటు.

12. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను,
యెహెఙ్కేలు 34:8

“నిర్భయంగా”– వారి అంతర్వాణి వారినేమీ కదిలించదు. దేవుని హెచ్చరికలు వారికి చీమ కుట్టినట్టయినా లేవు. 1 తిమోతికి 4:2 పోల్చి చూడండి. “తమను తామే”– వారు చేసేదానంతటి వెనుకా ఉన్నది అత్యాశే. యెహెఙ్కేలు 34:1-10; యిర్మియా 10:21; యిర్మియా 12:10; యిర్మియా 23:1. “పోషించుకొంటూ”– అంటే వారు సంఘాన్ని పోషించాలన్నమాట. దీన్ని బట్టి వీరు క్రైస్తవులకు నాయకులనీ, ఉపదేశకులనీ అర్థం చేసుకోవచ్చు. “ప్రేమ విందులు”– 1 కోరింథీయులకు 11:20-22. 2 పేతురు 2:13 కూడా చూడండి. “కొట్టుకుపోతున్న”– 2 పేతురు 2:17. “వాన లేని మబ్బులు”– వారు వాన ఇస్తున్నట్టు కనిపించి ఏమీ ఇవ్వని మేఘాల్లాంటివారు (సామెతలు 25:14). “పండ్లు లేక”– మంచి పండ్లు ఉండవు. చెడ్డ ఫలాలు పుష్కలంగా ఉంటాయి. మత్తయి 21:18-19; లూకా 13:6-7. “వేళ్ళతో పెళ్ళగించబడి”– మత్తయి 15:13. వీరిని దేవుడు నాటలేదు. మంచి కాయలు కాసేందుకు అవసరమైనదానితో వీరికి ఏ సంబంధమూ లేదు. విశ్వాసులు ఎలా ఉండాలో కొంతవరకు ఎలా ఉంటారో దానంతటికీ వీరు వ్యతిరేకం (ఎఫెసీయులకు 3:17;కొలొస్సయులకు 2:7). “రెండు సార్లు చచ్చిన”– అపరాధాల్లో పాపాల్లో చచ్చినవారు (ఎఫెసీయులకు 2:1). వారి జీవితమెలాంటిదో దానివల్ల వారు చచ్చినవారని రుజువైంది (1 తిమోతికి 5:6). వారు రెండో చావు వైపుకు వెళ్తున్నారు (ప్రకటన గ్రంథం 20:14). వారు ఉన్నారన్నది ఎంత ఖాయమో, దీనంతటినీ వారు తమపైకి తెచ్చి పెట్టుకున్నారన్నదీ అంతే ఖాయం. వారి అహంకారం, అపనమ్మకం, తిరుగుబాటుల మూలంగా క్రీస్తులో శాశ్వత జీవం కలిగే అవకాశం నుంచి తమను తాము దూరం చేసుకున్నారు. వారు దేవుడు నాటని చెట్లవంటివారు. అందువల్ల ఆధ్యాత్మిక జీవం వారిలో లేదు. ఆధ్యాత్మిక జీవం కలుగుతుందన్న ఆశాభావానికి అవకాశం ఎన్నటికీ లేకుండా వారు పెళ్ళగించబడ్డారు.

13. తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.
యెషయా 57:20

“ప్రచండమైన అలలు”– నెమ్మది లేదు. చెలరేగే కోరికల్లో వారు కొట్టుమిట్టాడుతుంటారు. యెషయా 57:20-21 పోల్చి చూడండి. “అవమానాన్ని నురుగులాగా”– వారి హృదయాల్లోని అసహ్యం, వారి అసహ్యమైన చర్యల్లో బయట పడుతూ ఉంటుంది. “దారి తప్పి తిరుగుతున్న చుక్కలు”– వారికి స్థిరమైన మార్గాలు లేవు. క్రైస్తవుల ఎదుట ఉన్న గమ్యం వైపుకు వారు వెళ్ళడం లేదు (ఫిలిప్పీయులకు 3:14). “చీకటి”– 2 పేతురు 2:17; ఫిలిప్పీయులకు 2:15; దానియేలు 12:3 పోల్చి చూడండి.

14. ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు,
ద్వితీయోపదేశకాండము 33:2, జెకర్యా 14:5

ఆదికాండము 5:18, ఆదికాండము 5:21-24. ఈ మాటలు బైబిల్లో లేవు. వేల కొద్దీ సంవత్సరాల క్రింతం హనోకు పలికిన మాటలను పవిత్రాత్మ యూదాకు ఇచ్చి అతని చేత రాయించాడు. (“హనోకు గ్రంథం” అనే పుస్తకమొకటి ఉంది గాని అది దైవావేశంవల్ల కలిగినది కాదు. దాన్లో హాస్యాస్పదమైన పుక్కిటి పురాణాలు కొన్ని ఉన్నాయి. యూదా ఆ పుస్తకాన్ని ఇక్కడ ఉపయోగించాడని ఎవరు నిరూపించలేరు). ఇక్కడ యూదా లేఖలో ఉన్నదాన్ని బట్టి మాత్రమే హనోకు ఒక ప్రవక్త అని మనకు తెలుస్తున్నది. హనోకు దినాల్లో కూడా భక్తిహీనత విచ్చలవిడిగా ఉండేది అని అతని మాటలను బట్టి తెలుస్తున్నది. “వీరిని గురించి”– హనోకు భవిష్యద్వాక్కు ఈ యుగంలోని మనుషుల గురించినది.

15. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.

“తీర్పు”– అపో. కార్యములు 17:31.

16. వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.

ఈ భక్తిలేని మనుషుల లక్షణాలు ఐదు ఇక్కడ కనిపిస్తున్నాయి. వారు తమ “లాభం కోసం ఇతరులను పొగడుతారు”. దేనిలోనూ ముక్కుసూటిగా, నిజాయితీగా ఉండరు. ఇతరులు ఏమి వినాలని కోరుతారని తమకు అనిపిస్తుందో అదే చెప్తారు. వారి ఉద్దేశమల్లా కొంత ప్రయోజనం లేక లాభం కలగాలనే. ఈ రోజుల్లో ఇలాంటివారు చాలామంది మనకు కనబడడం లేదా? ముఖస్తుతి గురించి యోబు 32:21-22; కీర్తనల గ్రంథము 12:2-3; సామెతలు 26:28; సామెతలు 28:23; సామెతలు 29:5; రోమీయులకు 16:18; 1 థెస్సలొనీకయులకు 2:5.

17. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని

“జ్ఞాపకం చేసుకోండి”– వ 5; 2 పేతురు 1:12-15.

18. మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.

2 పేతురు 3:3. ఒకటి కంటే ఎక్కువమంది క్రీస్తురాయబారులు దీన్ని గురించి హెచ్చరించారన్నమాట.

19. అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.

“దేవుని ఆత్మలేని”– క్రైస్తవులమని చెప్పుకునే ఆ మనుషులు నిజంగా క్రైస్తవులు కారని మరో సారి యూదా మనకు చెప్తున్నాడు. రోమీయులకు 8:9 చూడండి. క్రైస్తవ సంఘ సభ్యుల్లో సహా ప్రతి ఒక్కరూ దేవాత్మ గలవారని మనం భావించకూడదు. యోహాను 14:17; రోమీయులకు 8:9, రోమీయులకు 8:16; ఎఫెసీయులకు 4:18 చూడండి. “భేదాలు కలిగించేవారు”– రోమీయులకు 16:17.

20. ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు,

విశ్వాసులు ఇలాంటి భ్రష్టత్వం నుంచి, భ్రష్టుల నుంచి దూరంగా క్షేమంగా ఎలా ఉండగలరో యూదా ఇక్కడ చూపిస్తున్నాడు. “అభివృద్ధి – అపో. కార్యములు 20:32; రోమీయులకు 15:2; ఎఫెసీయులకు 4:12-13; 1 థెస్సలొనీకయులకు 5:11. మనం అభివృద్ధి పొందగలిగే మార్గం దేవుని వాక్కును తెలుసుకోవడం ద్వారా, ఆ సత్యాలను ఆచరణలో పెట్టడం ద్వారానే. ఇలా చేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి పైనా ఉంది. “ప్రార్థన”– ఎఫెసీయులకు 6:18.

21. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.

“శాశ్వత జీవం”– అంటే ఇక్కడి అర్థం చివరగా శాశ్వత జీవంలోకి ప్రవేశించడం (తీతుకు 1:2; తీతుకు 3:7; 1 పేతురు 1:5). క్రీస్తు తన విశ్వాసులను రక్షణ స్థితిలో ఉంచుతాడు (వ 1). విశ్వాసులు తమను తాము దేవుని ప్రేమలో ఉంచుకోవాలి. ఆయన వాక్కుకు విధేయత చూపడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం – యోహాను 14:21, యోహాను 14:23; యోహాను 15:9-10. “కరుణ”– మనం ఎంత లోబడినా, మనపట్ల దేవుడు తన ప్రేమను వెల్లడి చేయగలిగే స్థితిలోనే ఎంతగా ఉంచుకొన్నా, మొదటినుంచి చివరివరకు మన రక్షణ కేవలం ఆయన కరుణ మూలంగానే అన్నది సత్యం.

22. సందేహపడువారిమీద కనికరము చూపుడి.

వారి పట్ల కఠినంగా సానుభూతి లేకుండా ఉండకూడదు. వారిని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ నమ్మకం కలిగేలా వారికి సహాయం చెయ్యాలి.

23. అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.
జెకర్యా 3:2-3

“మరి కొందరిని”– మనం మనుషుల స్థితిని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం చేయవలసినది చెయ్యాలి. కొందరు సందేహాలతో కొట్టుమిట్టాడుతూ నమ్మాలని ఇష్టపడుతున్నారు. కొందరు తీవ్రమైన ఆపదలో ఉంటారు. వారిని రక్షించాలంటే చురుకుగా చర్య తీసుకోవాలి. వారు దాదాపు దేవుని తీర్పు అనే అగ్నిలో ఉన్నారు. మరికొందరి విషయంలోనైతే మనం కూడా వారి పాపాల్లోకి ఈడవబడుతామేమోనని జాగ్రత్తగా ఉండాలి (గలతియులకు 6:1). పాపి పట్ల ప్రేమ చూపాలి గానీ అతని పాపాల్ని ద్వేషించాలి.

24. తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,

బైబిలంతటిలోనూ ఉన్న గొప్ప స్తోత్ర పాఠాల్లో ఇది ఒకటి. “తొట్రు పడకుండా”– కీర్తనల గ్రంథము 37:23-24; రోమీయులకు 8:37. ఒక విశ్వాసి పాపం చేస్తే అది అతని తప్పే. దేవునికి పూర్తిగా లోబడితే పూర్తిగా ఆయనలో నమ్మకం ఉంచితే మనం పాపంలో పడకుండా ఆయన కాపాడగలడు. “మహానందం”– అనేక తప్పిదాల మూలంగా విచారం ఉండడానికి బదులు మహానందం ఉండగలదు. “నిలబెట్టడానికి”– ఎఫెసీయులకు 5:26-27. “ఏకైక దేవునికి”– రోమీయులకు 11:36.

25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judah - యూదా 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible


అపొస్తలుడు విశ్వాసంలో స్థిరంగా ఉండమని ఉద్బోధించాడు. (1-4)
క్రైస్తవులు ప్రాపంచిక గోళం నుండి బయటకు పిలువబడ్డారు, దాని దుర్మార్గపు ఆత్మ మరియు స్వభావం నుండి తమను తాము దూరం చేసుకుంటారు. వారు భూసంబంధమైన ఆందోళనలను అధిగమించి, ఉన్నతమైన మరియు సత్ప్రవర్తన కోసం ఆకాంక్షిస్తూ, స్వర్గపు రాజ్యాన్ని కోరుతూ-కనిపించని మరియు శాశ్వతమైన వాటిపై దృష్టి పెడతారు. ఈ దైవిక పిలుపు వారిని పాపం నుండి క్రీస్తు వైపుకు, పనికిమాలినతనం నుండి గంభీరత వైపు, మరియు అపవిత్రత నుండి పవిత్రత వైపు నడిపిస్తుంది. అటువంటి పరివర్తన విస్తృతమైన దైవిక ప్రయోజనం మరియు దయతో సమలేఖనం అవుతుంది. విశ్వాసులు పవిత్రీకరణ మరియు మహిమను సాధించాలంటే, అన్ని గౌరవం మరియు కీర్తి యొక్క క్రెడిట్ పూర్తిగా దేవునికి మాత్రమే ఆపాదించబడాలి.
దేవుడు మానవ ఆత్మలలో దయ యొక్క పనిని ప్రారంభించడమే కాకుండా దానిని కొనసాగించి పరిపూర్ణం చేస్తాడు. ఉపదేశము స్పష్టంగా ఉంది-ఆధారపడడం అనేది తనలో లేదా పోగుచేసిన దయపై ఆధారపడి ఉండకూడదు, కానీ పూర్తిగా దేవునిపై మాత్రమే ఉండాలి. ఒక వ్యక్తి కలిగి ఉన్న లేదా ఊహించిన అన్ని మంచివాటి యొక్క మూలం దేవుని దయలో ఉంది, ఇది బాధలో ఉన్నవారికి మాత్రమే కాకుండా దోషులకు కూడా విస్తరించబడుతుంది. దయను అనుసరించి, శాంతి కలుగుతుంది, దయ పొందినట్లు అవగాహన నుండి పుడుతుంది. ప్రేమ అప్పుడు ఉద్భవిస్తుంది- విశ్వాసుల పట్ల క్రీస్తు ప్రేమ నుండి ఆయన పట్ల మరియు ఒకరి పట్ల వారి పరస్పర ప్రేమ వరకు.
అపొస్తలుడి ప్రార్థన కనీస ఆశీర్వాదాలతో సంతృప్తికి పరిమితం కాదు; బదులుగా, ఇది క్రైస్తవుల ఆత్మలు మరియు సంఘాలు ఈ సద్గుణాలలో పుష్కలంగా ఉండాలనే కోరికను కలిగి ఉంటుంది. సువార్త ఆఫర్‌లు మరియు ఆహ్వానాలు తమను తాము మొండిగా మూసివేసే వారికి తప్ప అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ అప్లికేషన్ విశ్వాసులలో విశ్వవ్యాప్తం, బలహీనులు మరియు బలవంతులు రెండింటినీ కలుపుతుంది. సాధారణ రక్షణ సిద్ధాంతాన్ని స్వీకరించే వారు అపొస్తలుల మాదిరిని అనుసరిస్తూ శత్రుత్వంతో కాకుండా సహనంతో మరియు ధైర్యంతో దాని కోసం తీవ్రంగా పోరాడాలి.
సత్యాన్ని తప్పుగా సూచించడం హానికరం మరియు దాని కోసం తీవ్రంగా వాదించడం మంచిది కాదు. అపొస్తలులు ప్రదర్శించినట్లుగా, విశ్వాసం కోసం నిజమైన వివాదం, ఓపికగా మరియు ధైర్యంగా బాధలను భరించడం ఇమిడి ఉంటుంది-విశ్వాసానికి అవసరమైన ప్రతి భావనను స్వీకరించడంలో విఫలమైనందుకు ఇతరులపై బాధలు విధించకూడదు. క్రైస్తవులు విశ్వాసాన్ని భ్రష్టు పట్టించాలని లేదా వక్రీకరించాలని కోరుకునే వారికి, పాముల్లాగా చొరబడే వారికి వ్యతిరేకంగా గట్టిగా రక్షించాలని కోరారు. భక్తిహీనులలో అత్యంత సమాధి అయినవారు పాపంలో ధైర్యంగా కొనసాగి, దేవుని యొక్క సమృద్ధిగా ఉన్న కృపను తప్పు చేయడానికి లైసెన్స్‌గా తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు మానవాళిని పాపం నుండి విముక్తి చేయడానికి మరియు దేవునికి దగ్గరికి తీసుకురావడానికి రూపొందించబడిన సువార్త కృప యొక్క విస్తారత కారణంగా నిర్లక్ష్యానికి గురవుతారు.

 తప్పుడు ఆచార్యుల ద్వారా సోకే ప్రమాదం మరియు వారికి మరియు వారి అనుచరులకు విధించబడే భయంకరమైన శిక్ష. (5-7) 
బాహ్య అధికారాలు, విశ్వాసం యొక్క బహిరంగ ప్రకటనలు మరియు స్పష్టమైన మార్పిడులపై మాత్రమే ఆధారపడే వారు అవిశ్వాసం మరియు అవిధేయతకు గురైతే దైవిక ప్రతీకారం నుండి ఎటువంటి రోగనిరోధక శక్తిని పొందలేరు. అరణ్యంలో అవిశ్వాసులైన ఇశ్రాయేలీయుల భవితవ్యం, వారి ప్రసాదించిన అధికారాల ఆధారంగా ఎవరూ భద్రతను పొందకూడదని పూర్తిగా గుర్తుచేస్తుంది. రోజువారీ సంఘటనగా అద్భుతాలను చూసినప్పటికీ, అవిశ్వాసం కారణంగా వారు కూడా వారి మరణాన్ని ఎదుర్కొన్నారు. అదేవిధంగా, గణనీయమైన సంఖ్యలో దేవదూతలు తమకు కేటాయించిన స్థానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, వారి పతనానికి అహంకారం ప్రధాన కారణం. ఈ పడిపోయిన దేవదూతలు గొప్ప రోజున తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు, ఈ ప్రశ్నను ప్రేరేపిస్తుంది: పడిపోయిన మానవత్వం ఇలాంటి విధిని తప్పించుకోగలదా? ససేమిరా. దీని గురించి సమయానుకూలంగా ఆలోచించండి. సొదొమను తుడిచిపెట్టడం అనేది ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మరియు ఆత్మకు వ్యతిరేకంగా యుద్ధం చేసే శరీర కోరికల నుండి దూరంగా ఉండాలని కోరుతూ ఒక అద్భుతమైన హెచ్చరికగా పనిచేస్తుంది యోబు 15:16.

ఈ సెడ్యూసర్‌ల యొక్క భయంకరమైన వివరణ మరియు వారి దుర్భరమైన ముగింపు. (8-16) 
తప్పుడు ఉపాధ్యాయులు తప్పనిసరిగా కలలు కనేవారు, కలుషితం చేయడం మరియు ఆత్మను తీవ్రంగా గాయపరచడం. ఈ తప్పుదారి పట్టించే బోధకులు రోమీయులకు 13:1లో చెప్పబడినట్లుగా, పాలించే అధికారాల యొక్క దైవిక నియమాన్ని మరచిపోయి, చెదిరిన మనస్సులను మరియు తిరుగుబాటు చేసే ఆత్మలను కలిగి ఉంటారు. మోషే మృతదేహానికి సంబంధించిన వివాదానికి సంబంధించి, సాతాను ఇశ్రాయేలీయులకు శ్మశానవాటికను బహిర్గతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది, అతనిని ఆరాధించమని వారిని ప్రలోభపెట్టాడు. అయితే, ఈ ప్రణాళిక విఫలమైంది, సాతాను దైవదూషణతో తన కోపాన్ని వ్యక్తపరిచేలా చేసింది. ఇది వివాదాలలో నిమగ్నమైన వారికి కఠినమైన ఆరోపణలు చేయకుండా ఉండేందుకు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది మరియు దేవుడు అంగీకరించిన వారిని రక్షించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
సహజ మతం యొక్క సూత్రాలకు విరుద్ధంగా లేని క్రైస్తవ విశ్వాసం యొక్క విరోధులను కనుగొనడం సవాలుగా ఉంది, అయితే అసాధ్యం కాదు, వారి ఉన్నతమైన జ్ఞానం యొక్క వాదనలు ఉన్నప్పటికీ క్రూరమైన మృగాలను పోలి ఉంటాయి. సూటిగా మరియు స్పష్టమైన విషయాలను వారు నిర్ద్వంద్వంగా విస్మరించడంలో వారి అవినీతి స్పష్టంగా కనిపిస్తుంది. లోపం వారి తెలివిలో కాదు, వారి చెడిపోయిన సంకల్పాలలో, క్రమరహితమైన ఆకలి మరియు తప్పుదారి పట్టించే ప్రేమలో ఉంది. దాని అనుచరులు దానిని హృదయపూర్వకంగా మరియు ప్రవర్తనతో వ్యతిరేకించినప్పుడు అది గొప్ప అవమానాన్ని తెస్తుంది, మతాన్ని అన్యాయంగా కళంకం చేస్తుంది. గోధుమలను పచ్చిపురుగులతో పెకిలించే తప్పుదారి పట్టించే విధానాన్ని తిరస్కరిస్తూ ప్రభువు తగిన సమయంలో ఈ సమస్యను పరిష్కరిస్తాడు.
వ్యక్తులు ఆత్మలో ప్రారంభించి శరీరాన్ని ముగించినప్పుడు అది నిరుత్సాహపరుస్తుంది. "రెండుసార్లు చనిపోయారు" అని వర్ణించబడిన వారు మొదట్లో తమ పడిపోయిన స్థితిలో ఆత్మీయంగా మరణించారు మరియు ఇప్పుడు వారి కపటత్వం యొక్క స్పష్టమైన ప్రదర్శన కారణంగా వారు రెండవ మరణాన్ని ఎదుర్కొంటున్నారు. నేలను చిందరవందర చేస్తున్న ఎండిపోయిన చెట్లవలె అవి అగ్నికి ఆహుతి అవుతాయి. ఉవ్వెత్తున ఎగసిపడే అలలు నావికుల్లో భయాన్ని కలిగించినప్పటికీ, ఓడరేవులో ఒక్కసారిగా అలజడి ఆగిపోతుంది. తప్పుడు ఉపాధ్యాయులు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ తీవ్ర పరిణామాలను ఊహించగలరు. అవి శాశ్వతమైన చీకటిలో మునిగిపోయే ముందు ఉల్కలు లేదా పడిపోతున్న నక్షత్రాల వలె క్లుప్తంగా ప్రకాశిస్తాయి.
హనోక్ ప్రవచనం స్క్రిప్చర్‌లో మరెక్కడా ప్రస్తావించబడనప్పటికీ, విశ్వాసాన్ని స్థాపించడానికి ఒక స్పష్టమైన వచనం సరిపోతుంది. క్రీస్తు తీర్పు తీర్చడానికి వస్తాడన్న ప్రవచనం వరదల పూర్వ యుగంలోనే ముందే చెప్పబడిందని ఈ భాగం సూచిస్తుంది. ప్రభువు రాక కోసం ఎదురుచూడడం గొప్ప మహిమ యొక్క క్షణం. "భక్తిహీనుడు" అనే పదం యొక్క పునరావృతం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. దైవభక్తి మరియు భక్తిహీన పదాల పట్ల సమకాలీన విస్మరణకు భిన్నంగా, పరిశుద్ధాత్మ బోధనలు వాటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి.
కఠినమైన తీర్పులు మరియు ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు తీర్పు రోజున నిస్సందేహంగా పరిగణనలోకి తీసుకోబడతాయి. ఈ మోసపూరిత వ్యక్తులు శాశ్వతమైన అసంతృప్తిని కలిగి ఉంటారు, ప్రతిదానిలో తప్పును కనుగొంటారు మరియు వారి స్వంత పరిస్థితులపై అసంతృప్తిగా ఉంటారు. వారి సంకల్పం మరియు కోరిక వారి ఏకైక నియమం మరియు చట్టం. తమ పాపపు కోరికలను తీర్చుకునే వారు అనియంత్రిత కోరికలకు లొంగిపోయే అవకాశం ఉంది. చరిత్ర అంతటా, దేవుని మనుష్యులు అలాంటి వ్యక్తులకు రాబోయే వినాశనాన్ని గురించి ముందుగానే హెచ్చరిస్తున్నారు. వారి మార్గాన్ని విడిచిపెట్టి, క్రీస్తు బోధనలకు అనుగుణంగా ఉన్నవారిని మాత్రమే అనుసరించండి.

విశ్వాసులు తమలో తలెత్తే అలాంటి మోసగాళ్లను చూసి ఆశ్చర్యపోకుండా హెచ్చరిస్తున్నారు. (17-23) 
ఇంద్రియ కోరికలతో నడిచే వ్యక్తులు క్రీస్తు మరియు అతని చర్చి నుండి తమను తాము దూరం చేసుకుంటారు, భక్తిహీనమైన మరియు పాపభరితమైన అభ్యాసాల ద్వారా దెయ్యం, ప్రపంచం మరియు మాంసంతో సరిపెట్టుకుంటారు. సైద్ధాంతిక వ్యత్యాసాలు లేదా బాహ్య పాలన లేదా ఆరాధన పద్ధతుల్లోని వ్యత్యాసాల కారణంగా కనిపించే చర్చి యొక్క నిర్దిష్ట శాఖ నుండి తనను తాను దూరం చేసుకోవడం కంటే ఈ విభజన చాలా బాధాకరమైనది. ఇంద్రియాలకు సంబంధించిన వ్యక్తులు పవిత్రత యొక్క ఆత్మను కలిగి ఉండరు మరియు ఈ ఆత్మ లేని ఎవరైనా నిజంగా క్రీస్తుకు చెందినవారు కాదు.
విశ్వాసం యొక్క పవిత్రత చాలా ముఖ్యమైనది, ప్రేమ ద్వారా దాని పరివర్తన శక్తి, హృదయ శుద్ధి మరియు ప్రాపంచిక ప్రభావాలపై విజయం. ఇది నకిలీ మరియు ప్రాణములేని సంస్కరణ నుండి నిజమైన, శక్తివంతమైన విశ్వాసాన్ని వేరు చేస్తుంది. ప్రభావవంతమైన ప్రార్థనలు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం మరియు ప్రభావంలో అందించబడినప్పుడు, ఆయన మాటతో సరితూగడం మరియు విశ్వాసం, ఆవేశం మరియు శ్రద్ధతో వర్ణించబడినప్పుడు అనుకూలంగా ఉంటాయి. ఇది నిజంగా పరిశుద్ధాత్మలో ప్రార్థన. నిత్యజీవానికి సంబంధించిన దృఢమైన విశ్వాసం పాపం యొక్క ఆపదలకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుంది, మన పాపపు కోరికలను అరికట్టడానికి మనకు శక్తినిస్తుంది.
ఒకరిపై ఒకరు అప్రమత్తత అవసరం. నమ్మకమైన మరియు వివేకవంతమైన మందలింపును అందించడం, మన చుట్టూ ఉన్నవారికి సానుకూల ఉదాహరణలను ఉంచడం మరియు బలహీనులకు మరియు ఉద్దేశపూర్వకంగా మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి కరుణతో అలా చేయడం. కొంతమంది వ్యక్తులకు సున్నితమైన చికిత్స అవసరమవుతుంది, మరికొందరికి ప్రభువు యొక్క పరిణామాల యొక్క తీవ్రతను నొక్కిచెప్పడానికి అత్యవసర భావంతో ఉపదేశించవలసి ఉంటుంది. అన్ని ప్రయత్నాలతోపాటు తప్పును నిస్సందేహంగా తిరస్కరించడం మరియు చీకటి పనులతో సంబంధం ఉన్న లేదా సహవాసానికి దారితీసే దేనినైనా ఉద్దేశపూర్వకంగా నివారించడం. చెడుగా అనిపించే లేదా కనిపించే దేనికైనా మనల్ని మనం దూరం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఉపదేశం ప్రోత్సాహకరమైన డాక్సాలజీ లేదా ప్రశంసల పదాలతో ముగుస్తుంది. (24,25)
దేవుడు, సమర్ధుడు మరియు ఇష్టపడేవాడు, మన పొరపాట్లను నిరోధించే శక్తి కలిగి ఉన్నాడు మరియు అతని మహిమాన్వితమైన సన్నిధిలో తప్పు లేకుండా మనలను సమర్పించగలడు. ఈ ప్రెజెంటేషన్ మన దోషరహిత రికార్డుపై ఆధారపడింది కాదు కానీ దేవుని దయ, విమోచన బాధలు మరియు మన రక్షకుని యోగ్యతలపై ఆధారపడింది. తండ్రి ద్వారా అతనికి ఇవ్వబడిన ప్రతి యథార్థ విశ్వాసి, అతని కీపింగ్‌లో సురక్షితంగా ఉంటాడు; ఏదీ పోలేదు, ఏదీ పోదు. మన తప్పులు భయం, సందేహం మరియు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, విమోచకుడు తన ప్రజల దోషరహిత ప్రదర్శనను నిర్ధారించే బాధ్యతను తీసుకున్నాడు.
మన ప్రస్తుత అసంపూర్ణ స్థితిలో, మేము ఆందోళనలు మరియు బాధలను అనుభవిస్తాము, కానీ వాగ్దానం ప్రకారం మనం దోషరహితంగా ప్రదర్శించబడతాము. పాపం లేని చోట దుఃఖం ఉండదు; మరియు పవిత్రత యొక్క పరిపూర్ణతలో, ఆనందం దాని పూర్తిని కనుగొంటుంది. ఆయన మహిమాన్విత సన్నిధి ముందు మనం నిందారహితంగా నిలబడే వరకు, ఆయన మనలో ప్రారంభించిన పనిని కాపాడుకోగల మరియు ముందుకు తీసుకెళ్లగల వ్యక్తిని నిరంతరం చూస్తాము. ఆ క్షణంలో, మన హృదయాలు భూసంబంధమైన ఆనందాలను మించిన ఆనందాన్ని తెలుసుకుంటాయి మరియు దేవుడు మనపై సంతోషిస్తాడు, మన కరుణామయమైన రక్షకుని ఆనందాన్ని పూర్తి చేస్తాడు.
ఈ ప్రణాళికను క్లిష్టంగా రూపొందించి, విశ్వసనీయంగా మరియు దోషరహితంగా దానిని ఫలవంతం చేసే వ్యక్తికి, ఇప్పుడు మరియు ఎప్పటికీ కీర్తి, ఘనత, ఆధిపత్యం మరియు అధికారం. ఆమెన్.



Shortcut Links
యూదా - Judah : 1 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |