Samuel I- 1 సమూయేలు 4 | View All
Study Bible (Beta)

1. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.

“ఫిలిష్తీయవాళ్ళు”– నోట్ ఆదికాండము 10:14. ఇస్రాయేల్‌వారు కనానును వశపరచుకున్నప్పుడు ఫిలిష్తీయవాళ్ళను దేశం నుంచి తరిమివేయలేదు (యెహోషువ 13:1-2). చాలా సంవత్సరాల పాటు వారు ఇస్రాయేల్‌కు పక్కలో బల్లెంగా ఉంటూ వచ్చారు.

2. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువ తక్కువ నాలుగు వేలమంది హతులైరి.

ఇస్రాయేల్ ప్రతి ఓటమికి ఎప్పుడూ ఒకటే కారణం వారి పాపాలు (యెహోషువ 7:4-5 యెహోషువ 7:11 న్యాయాధిపతులు 2:10-15).

3. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసికొని మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్యనుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.

తమ ఓటమికి కారణమేమిటో విచారణ చెయ్యడంలో ఆ పెద్దలు చేసిన పని సరియే. అయితే దేవునినుండి జవాబు కోసం వారు ఎదురు చూడక మూఢ నమ్మకాన్ని పెట్టుకొన్నారు. ఇస్రాయేల్‌వారు ఒడంబడిక పెట్టె పట్ల ఇతరులు తమ విగ్రహాల పట్ల ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించారు. గతంలో అది దేవుని సన్నిధానానికి చిహ్నం. కానీ వారు ఈ సత్యాన్ని వక్రంగా అర్థం చేసుకుని కేవలం దుర్మార్గులైన ఏలీ కొడుకులు హోఫ్ని, ఫీనెహాసుల ఆధ్వర్యంలో ఆ పెట్టె తమ మధ్యన ఉంటే చాలు, తమకు విజయం కలుగుతుంది అనుకున్నారు. అయితే అలా కాలేదు. అది వట్టి భ్రమ. దేవుడు తన ప్రజలతో లేనప్పుడు భూమిమీదున్న దేనివల్లా వారికి విజయం కలగదు. దేవుని సన్నిధానానికి చిహ్నంగా ఉన్నదేదైనా, దేవుని సన్నిధానం మాత్రమే సాధించగలిగిన ఫలితాన్ని ఎన్నటికీ సాధించడం అసాధ్యం. ఒడంబడిక పెట్టె గురించి నోట్ నిర్గమకాండము 25:10-16. కెరూబుల గురించి నోట్ ఆదికాండము 3:24 నిర్గమకాండము 25:18-20.

4. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబులమధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.

5. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతి ధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి.

“కేకలు”– దేవుడు యెరికోలో చేసిన అద్భుతమే (యెహోషువ 6:16 యెహోషువ 6:20) తమ కేకలవల్ల ఇక్కడ జరుగుతుందని వారి ఉద్దేశమా? దేవుడు తన ప్రజలతో లేకపోతే గతంలో పని చేసిన విధానాలేవీ పని చేయవు.

6. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని

ఏకైక నిజ దేవుణ్ణెరుగని ఫిలిష్తీయవారికి ఇలాంటి మూఢ నమ్మకాలు ఉండడం సహజమే. అంతకుముందు ఉండే దేవుడు ఇస్రాయేల్‌వారితో లేకపోతే ఒడంబడిక పెట్టెను తీసుకు రావడం మూలంగా ఆయన వారి మధ్యకు రావడం జరగదని వారికి తెలియదు. ఈ క్రొత్త ఒడంబడిక కాలంలో ఏ మతాచారం, సంస్కారం, కర్మకాండ, ఏ విధమైన స్మారక చిహ్నం, సంకేతం, మనిషి చేసే ఎలాంటి పనీ కూడా దేవుణ్ణి మనిషి దగ్గరికి తీసుకురావడం అసాధ్యమని మనమంతా తెలుసు కోవాలి.

7. జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు,

8. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.
ప్రకటన గ్రంథం 11:6

“ఈజిప్ట్”– ఈజిప్ట్‌లో దేవుడు జరిగించిన మహాద్భుతాలు కొన్ని ఫిలిష్తీయవారికి తెలుసు (1 సమూయేలు 6:6 నిర్గమకాండము 9:16 యెహోషువ 2:8-10).

9. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి.

“మీ వశం అయినట్టు”– న్యాయాధిపతులు 10:7 న్యాయాధిపతులు 13:10.

10. ఫిలిష్తీయులు యుద్దము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.

వ 2; ద్వితీయోపదేశకాండము 28:15 ద్వితీయోపదేశకాండము 28:25.

11. మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.

“దేవుని మందసం”– కీర్తనల గ్రంథము 78:56-64. “చనిపోయారు”– దేవుడు తన మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటాడు.

12. ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.

“దుమ్ము”– యెహోషువ 7:6 2 సమూయేలు 1:2 నెహెమ్యా 9:1 యోబు 1:20 యోబు 2:12.

13. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.

ఏలీ తన కొడుకుల సంగతి కాదు గాని దేవుని ఒడంబడిక పెట్టె విషయమే ఆందోళన పడ్డాడని రాసి ఉంది. తన కొడుకుల చావు గురించి దేవుడు చెప్పిన మాటలను అతడు అంగీకరించాడు. దాన్ని తాను మార్చలేనని అతనికి తెలుసు (1 సమూయేలు 2:34 1 సమూయేలు 3:18), కానీ ఒడంబడిక పెట్టె శత్రువుల చేతుల్లో పడడం అనే వార్త మూలంగా వచ్చిన నివ్వెరపాటు అతణ్ణి చంపింది. 4వ వచనంలో రాసివున్న తెలివితక్కువ విషయానికి ఏలీ అంగీకరించాడని అనుకోవడానికి ఆస్పదం లేదు. 18వ వచనంలో ఇతణ్ణి ఇస్రాయేల్‌వారి నాయకుల్లో ఒకడుగా చెప్పడం కన్పిస్తున్నది.

14. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.

15. ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.

16. ఆ మనుష్యుడు యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.

17. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను

18. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియై యుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను.

19. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను.

20. ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై

21. దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.

“ఈకాబోదు”అంటే “మహిమాప్రకాశం లేదు”, లేక “మహిమాప్రకాశం ఎక్కడుంది?” సన్నిధి గుడారంలో అతి పవిత్రస్థలంలో ఒడంబడిక పెట్టెపై దేవుని సన్నిధి నెలకొని ఉంది – నిర్గమకాండము 25:22 కీర్తనల గ్రంథము 80:1 కీర్తనల గ్రంథము 99:1. తన ఒడంబడిక పెట్టెను వారు ఎత్తుకుపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకొన్నాడంటే ఆయన మహిమాప్రకాశం వెళ్ళిపోతూ ఉందని అర్థం. కీర్తనల గ్రంథము 78:61 పోల్చి చూడండి. ఒడంబడిక పెట్టెను మరెన్నడూ షిలోహుకు తీసుకురావడం జరగలేదు. అయితే దేవుడు తన ప్రజలను వదిలెయ్యలేదు. తరువాత సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుని మహిమాప్రకాశం నిండింది (1 రాజులు 8:10-11).

22. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel I- 1 సమూయేలు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులచే జయించబడ్డారు. (1-9) 
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. వారి పతనం పాపం ఫలితంగా ఉంది, ఇది వారి శిబిరంలోకి ప్రవేశించి, వారి శత్రువులకు గణనీయమైన ప్రయోజనాన్ని అందించింది. వారు తమ కష్టాల్లో దేవుని హస్తాన్ని అంగీకరించినప్పటికీ, వినయంగా లొంగిపోయే బదులు, వారు ఆయనను రెచ్చగొట్టడానికి చేసిన తప్పు గురించి తెలియకుండా కోపంతో ప్రతిస్పందించారు. ఇది మానవుల సాధారణ మూర్ఖత్వం: మన స్వంత తెలివితక్కువ ఎంపికల కారణంగా మనం సరైన మార్గం నుండి తప్పుకున్నప్పుడు, మనం ప్రభువును నిందిస్తాము మరియు పగతో ఉంటాము సామెతలు 19:3
వారి తప్పుడు ఆలోచనలో, మందసాన్ని తమ శిబిరంలోకి తీసుకురావడం వల్ల తమ కోసం పోరాడమని దేవుణ్ణి బలవంతం చేయవచ్చని వారు నమ్మారు. ప్రజలు మతం యొక్క నిజమైన సారాంశం నుండి తప్పుకున్న క్షణాలలో, ఈ బాహ్య చర్యలు మాత్రమే తమను రక్షించగలవని వారు తరచుగా బాహ్య ఆచారాలు మరియు వేడుకలకు అతుక్కుపోతారు. దేవుని సన్నిధికి ప్రతీకగా ఉండే ఓడను తమ మధ్యలో కలిగి ఉండడం, స్వర్గానికి వెళ్లే వారి మార్గానికి హామీ ఇస్తుందని వారు అనుకోవచ్చు. అయినప్పటికీ, దేవునితో నిజమైన సంబంధాన్ని కోల్పోయినందున, ప్రపంచం మరియు శరీర కోరికలు వారి హృదయాలలో పాలించినప్పుడు అలాంటి చర్యలు వ్యర్థం.

మందసము తీసుకోబడింది. (10,11) 
మందసాన్ని స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్‌పై లోతైన తీర్పుగా పనిచేసింది, ఇది దేవుని అసమ్మతిని స్పష్టంగా సూచిస్తుంది. నిజమైన చిత్తశుద్ధి మరియు భక్తి లేకుండా కేవలం బాహ్యంగా తమ విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా దేవుని కోపం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఎవరూ ప్రయత్నించకూడదు.

ఏలీ మరణం. (12-18) 
సైన్యం యొక్క ఓటమి న్యాయమూర్తిగా ఎలీని తీవ్రంగా బాధించింది, కానీ అతని ఇద్దరు కుమారుల మరణ వార్త, ఎవరికి అతను గొప్ప తృప్తి చూపించాడు మరియు అతను పశ్చాత్తాపం చెంది మరణించాడని అతను భయపడ్డాడు, ఒక తండ్రిగా అతనిని మరింత కలచివేసింది. ఏది ఏమైనప్పటికీ, దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దూత నివేదించినప్పుడు అతని హృదయంపై భారం పడింది. అది అతని హృదయాన్ని తాకింది మరియు అతను తక్షణమే మరణించాడు. ఒక వ్యక్తి దయనీయమైన భూసంబంధమైన ముగింపును అనుభవించవచ్చు, కానీ శాశ్వతత్వంలో శాంతిని పొందవచ్చని ఇది మనకు గుర్తుచేస్తుంది. జీవితం విషాదకరంగా మరియు అకాలంగా ముగిసిపోయినప్పటికీ, ఈ ప్రపంచం దాటి శాశ్వతమైన శాంతి కోసం ఆశ ఉంది.

ఈకాబోదు జననం. (19-22)
ఫీనెహాసు భార్య బలమైన దైవభక్తి గల స్త్రీగా కనిపిస్తుంది. ఆమె మరణానికి చేరువవుతున్నప్పుడు, ఆమె ప్రధాన దుఃఖం ఓడను కోల్పోవడం మరియు ఇజ్రాయెల్ నుండి దేవుని మహిమ నిష్క్రమించడం. అటువంటి గంభీరమైన క్షణంలో, భూసంబంధమైన ఆనందాలు ఆమెకు ఎటువంటి విలువను కలిగి ఉండవు. ఆధ్యాత్మిక మరియు దైవిక ఆనందం మాత్రమే అటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తిని నిలబెట్టగలదు; ఏ భూసంబంధమైన ఆనందంతోనైనా ఓదార్చడానికి మరణం చాలా బరువైనది.
ఓడను పోగొట్టుకున్నందుకు దుఃఖిస్తున్న వ్యక్తికి, ప్రాపంచిక సుఖాలు మరియు ఆనందాలు అర్థరహితంగా మారతాయి, ప్రత్యేకించి దేవుని వాక్యం మరియు శాసనాలు లేనప్పుడు. ప్రత్యేకించి ఆయన దయతో కూడిన సన్నిధి యొక్క సౌలభ్యం మరియు అతని ముఖకాంతి లేకుండా, భూసంబంధమైన ఆనందాలు మసకబారిపోతాయి. దేవుడు వెళ్ళిపోయినప్పుడు, అతని మహిమ తొలగిపోతుంది, మరియు అన్ని మంచితనం అదృశ్యమైనట్లు కనిపిస్తుంది. అతను మనలను విడిచిపెట్టాలని ఎంచుకుంటే అది నిజంగా భయంకరమైన పరిస్థితి!
ఏది ఏమైనప్పటికీ, దేవుని మహిమ ఒక పాపభరిత ప్రదేశము నుండి మరొక దాని నుండి వైదొలగవచ్చు, అది ఎప్పటికీ పూర్తిగా తొలగిపోదు. బదులుగా, అది ఒక చోట ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది, మరొక ప్రదేశంలో కప్పబడి ఉంటుంది. దేవుని మహిమ ఆరిపోలేదు; కొన్ని ప్రాంతాలలో తాత్కాలికంగా అస్పష్టంగా ఉన్నప్పటికీ, అది వివిధ ప్రదేశాలలో వ్యక్తమవుతూనే ఉంటుంది.



Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |