Genesis - ఆదికాండము 16 | View All

1. అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
అపో. కార్యములు 7:5

1. Abram's wife Sarai had borne him no children. She had, however, an Egyptian maidservant named Hagar.

2. కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.

2. Sarai said to Abram: 'The LORD has kept me from bearing children. Have intercourse, then, with my maid; perhaps I shall have sons through her.' Abram heeded Sarai's request.

3. కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.

3. Thus, after Abram had lived ten years in the land of Canaan, his wife Sarai took her maid, Hagar the Egyptian, and gave her to her husband Abram to be his concubine.

4. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను.

4. He had intercourse with her, and she became pregnant. When she became aware of her pregnancy, she looked on her mistress with disdain.

5. అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను.
గలతియులకు 4:22

5. So Sarai said to Abram: 'You are responsible for this outrage against me. I myself gave my maid to your embrace; but ever since she became aware of her pregnancy, she has been looking on me with disdain. May the LORD decide between you and me!'

6. అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా

6. Abram told Sarai: 'Your maid is in your power. Do to her whatever you please.' Sarai then abused her so much that Hagar ran away from her.

7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని

7. The LORD'S messenger found her by a spring in the wilderness, the spring on the road to Shur,

8. శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.

8. and he asked, 'Hagar, maid of Sarai, where have you come from and where are you going?' She answered, 'I am running away from my mistress, Sarai.'

9. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను.

9. But the LORD'S messenger told her: 'Go back to your mistress and submit to her abusive treatment.

10. మరియయెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.

10. I will make your descendants so numerous,' added the LORD'S messenger, 'that they will be too many to count.

11. మరియయెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;
లూకా 1:31

11. Besides,' the LORD'S messenger said to her: 'You are now pregnant and shall bear a son; you shall name him Ishmael, For the LORD has heard you, God has answered you.

12. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా

12. He shall be a wild ass of a man, his hand against everyone, and everyone's hand against him; In opposition to all his kin shall he encamp.'

13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

13. To the LORD who spoke to her she gave a name, saying, 'You are the God of Vision'; she meant, 'Have I really seen God and remained alive after my vision?'

14. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.

14. That is why the well is called Beer-lahai-roi. It is between Kadesh and Bered.

15. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.

15. Hagar bore Abram a son, and Abram named the son whom Hagar bore him Ishmael.

16. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.

16. Abram was eighty-six years old when Hagar bore him Ishmael.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 16 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
శారయి అబ్రాముకు హాగరును ఇస్తుంది. (1-3) 
శారాయి తనకు పిల్లలను కనలేని మరో భార్యను తీసుకోవాలని అబ్రాము‌కు సూచించింది. ఆమె తన స్వంత బానిసను భార్యగా ఎంచుకుంది, ఇది మంచి నిర్ణయం కాదు ఎందుకంటే వారు మొదట దేవుణ్ణి అడగలేదు మరియు అతని శక్తిపై నమ్మకం లేదు. జీవితంలో కొన్నిసార్లు మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ మనం ఓపికగా దేవుని సమయం కోసం వేచి ఉండాలి మరియు అతని మార్గదర్శకత్వాన్ని అనుసరించాలి. మంచిగా అనిపించే ఎంపికలు చేయడానికి మనం శోదించబడవచ్చు, కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థన ద్వారా మరియు బైబిల్ చదవడం ద్వారా దేవుని సలహాను వెతకడం ముఖ్యం.

శారాయ్ పట్ల హాగర్ యొక్క అసభ్య ప్రవర్తన. (4-6) 
అబ్రాము అనే వ్యక్తి అక్కడ శారయి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు, కానీ వారు కలిసి సంతోషంగా లేరు. అబ్రాము హాగర్ అనే మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఇది చాలా సమస్యలను కలిగించింది. మనం చేయవలసిన పనిని మనం చేయనప్పుడు, మనకు మరియు ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు. శారయి హాగరును అబ్రాముకు ఇచ్చింది, కానీ దాని కోసం అతనితో కలత చెందింది. మన తప్పులు మరియు చెడు నిర్ణయాలకు ఇతరులను నిందించడం మంచిది కాదు. శారాయిని అగౌరవపరచడం ద్వారా హాగర్ కూడా తప్పులు చేసింది. మనం తప్పులు చేసినప్పుడు, పర్యవసానాలను అంగీకరించాలి మరియు ఓపికగా ఉండటానికి ప్రయత్నించాలి. 1 పేతురు 2:20 

దేవదూత హాగర్‌ను తిరిగి రమ్మని ఆజ్ఞాపించాడు, ఆమె ఇష్మాయేల్ పుట్టుకకు వాగ్దానం చేసింది. (7-16)
హాగర్ సరైన పని చేయడం లేదు మరియు ఒక దేవదూత ఆమెను కనుగొన్నప్పుడు చెడు మార్గంలో వెళుతోంది. మనం తప్పుడు పనులు చేయకుండా ఆపడం మంచి విషయమే. ఏంజెల్ ఆమెను ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు మరియు ఆమె తన బాధ్యతల నుండి మరియు అబ్రాము కుటుంబంతో ఉన్న మంచి విషయాల నుండి పారిపోతున్నట్లు ఆమెకు గుర్తు చేసింది. మనం ఎవరో మరియు మనం ఏమి చేయాలో గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇలాగే కొనసాగితే ప్రమాదంలో పడుతుందని, చెడు అలవాట్లకు లోనవుతుందని ఏంజెల్ హెచ్చరించింది. హాగర్ తన తప్పును గ్రహించి తన విధులకు తిరిగి వచ్చాడు. ఏంజెల్ సహాయానికి ఆమె కృతజ్ఞతతో ఉంది మరియు అది ఆమెను మెరుగ్గా ప్రవర్తించేలా చేసింది. దేవుడు మనల్ని గమనిస్తున్నాడని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |