Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.
మధ్యధరా సముద్ర తీరాన ఫిలిష్తీయవాళ్ళ భూమిలో గెరారు ఉంది.
2. అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.
అబ్రాహాము ఇంతకుముందు చేసిన పాపమే మళ్ళీ చేస్తున్నాడు (ఆదికాండము 12:13). సైతానుకు మన బలహీనత తెలిస్తే మనల్ని అదే విషమ పరీక్షకు పదేపదే గురి చేస్తాడని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది.
3. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.
శారాను కాపాడ్డం కోసం మళ్ళీ దేవుడే జోక్యం చేసుకోవలసి వచ్చింది. బైబిల్లో మొట్టమొదటి సారి “కల” అనే మాట కనిపిస్తున్నది. కానీ ఆదికాండము 15:12-13 చూడండి.
4. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?
5. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.
6. అందుకు దేవుడు అవును, యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.
“నాకు విరోధంగా”– కీర్తనల గ్రంథము 51:4. “పాపం చేయకుండా”– 1 సమూయేలు 25:26 1 సమూయేలు 2534:1 యూదా 1:24.
7. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
“ప్రవక్త”– హీబ్రూలో ప్రవక్త అంటే అర్థం వాగ్దాటి గలవాడనీ, పండితుడనీ కాదు (అయినా బైబిల్లోని ప్రవక్తలలో కొందరు వాగ్దాటిగలవారే, పండితులే). హీబ్రూ భాషలో ప్రకటించడం, చాటించడం లేక పారవశ్యం, ఆవేశం మూలంగా మాట్లాడ్డం అనే అర్థానిచ్చే పదం నుంచి ప్రవక్త అనే పదం వచ్చింది. బైబిల్లో ప్రవక్త అంటే ప్రేరితుడై, ఒక ఆత్మవశుడై పలికేవాడు. నిజమైన ప్రవక్త దేవుని ఆత్మ ప్రేరణవల్ల దైవ సందేశాలు వినిపించేవాడు. సంఖ్యాకాండము 11:25 కూడా చూడండి. అబద్ధ ప్రవక్తలు దేవుని మూలంగా కాక వేరే ఆత్మ మూలంగా లేదా, తమ సొంత ఆవేశం మూలంగా ప్రకటించేవారు. వారు ఇచ్చే సందేశాలు అబద్ధమైనవి. నిజ ప్రవక్తల గురించి ద్వితీయోపదేశకాండము 18:18 1 సమూయేలు 3:19-21 1 రాజులు 17:1-2 1 రాజులు 17:8 యిర్మియా 1:4-10 మీకా 1:1 మీకా 3:8 మొదలైనవి చూడండి. అబద్ధ ప్రవక్తల గురించి ద్వితీయోపదేశకాండము 18:20-22 1 రాజులు 18:19-29 యిర్మియా 14:14 యిర్మియా 23:32 యెహెఙ్కేలు 13:1 వ అధ్యాయం; మత్తయి 7:15-20 మత్తయి 24:11 మత్తయి 24:24 లూకా 6:26 2 పేతురు 2:1 యోహాను 4:1 ప్రకటన గ్రంథం 16:13 ప్రకటన గ్రంథం 19:20 చూడండి. బైబిలంతటినీ తన ప్రవక్తల మూలంగా దేవుడు ఇచ్చాడు. అందులో చాలా భాగం నెరవేరింది. మిగిలినది నెరవేరుతుంది.
8. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతులన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి.
9. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.
దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను వారి తప్పిదాలకు పరాయివారు వచ్చి మందలించవలసి వచ్చే దినం దుర్దినం.
10. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా
11. అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.
“దైవభయం”– అనే మాట బైబిల్లో మొదటిసారి కన్పిస్తున్నది. దేవుణ్ణి సమీపించడానికీ ప్రార్థించడానికీ భయం కాదిది. ఒక నేరస్థుడికి జైలు అంటే, పోలీసులంటే ఉండే భయం వంటిది కాదిది. ఇది దేవుని పట్ల సవ్యమైన భక్తితో కూడిన గౌరవం; పాపం చేసి ఆయనకు కోపం తెప్పిస్తామేమోనన్న భయం. మనుషులకు దైవభయం ఉండడం చాలా ప్రధానమైన సంగతి. ఇది చెడు కార్యాలు చెయ్యనీయకుండా అడ్డగిస్తుంది (నిర్గమ 20:20; సామెత 16:6). దేవుని మాట వినడానికి ఇది ప్రేరకం (ద్వితీయోపదేశకాండము 5:29 ద్వితీయోపదేశకాండము 6:2). ఇది జ్ఞానానికి ఆరంభం (కీర్తనల గ్రంథము 111:10 సామెతలు 1:7 సామెతలు 9:10 సామెతలు 15:33). దీనికి ఫలితం దేవుని అమోఘమైన ఆశీర్వాదాలు (ద్వితీయోపదేశకాండము 6:24 కీర్తనల గ్రంథము 25:14 కీర్తనల గ్రంథము 33:18-19 కీర్తనల గ్రంథము 34:7-9 కీర్తనల గ్రంథము 85:9 Psa103 11:1 కీర్తనల గ్రంథము 103:13 కీర్తనల గ్రంథము 103:17 కీర్తనల గ్రంథము 115:13 సామెతలు 14:27 సామెతలు 19:23 యెషయా 33:6). మానవ జాతి అంతటికీ ఇది విధి (కీర్తన 33:8). ఇది లేకుండా మనుషులు గొప్ప కీడులో పడతారు (రోమీయులకు 3:18 అంతకు ముందు వచనాలు). మనందరం దీనికోసం ప్రార్థించాలి (కీర్తనల గ్రంథము 86:11). దీన్ని కలిగి ఉండాలా, అక్కర్లేదా అని మనం నిర్ణయించుకోగల సంగతి ఇది (సామెతలు 1:29). యోబు 28:28 కీర్తనల గ్రంథము 34:11-14 కీర్తనల గ్రంథము 111:10 సామెతలు 1:29 నోట్స్ చూడండి.
12. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.
13. దేవుడు నన్ను నా తండ్రి యిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.
14. అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.
15. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.
16. మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.
17. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.
“గొడ్రాళ్ళుగా”– 1 సమూయేలు 1:5.
18. ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.
“విన్నపం”– ప్రార్థన గురించిన రిఫరెన్సులు ఆదికాండము 18:32 దగ్గర.