Genesis - ఆదికాండము 24 | View All

1. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.

“ఆశీస్సులు కుమ్మరించాడు”– ఆదికాండము 12:2 ఆదికాండము 13:2 ఆదికాండము 24:35.

2. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము;

“తొడ”– గంబీరమైన శపథానికి గుర్తుగా ఆ పురాతన కాలంలోనివారు అనుసరించిన ఆచారం (ఆదికాండము 47:29).

3. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక

ద్వితీయోపదేశకాండము 7:3 ఎజ్రా 9:1-4 1 కోరింథీయులకు 7:39 2 కోరింథీయులకు 6:14-17. అబ్రాహాము ఏకైక నిజ దేవుణ్ణి ఆత్మలో సత్యంలో ఆరాధించాడు (యోహాను 4:24). కనానువాళ్ళు అనేకమంది దేవుళ్ళనూ విగ్రహాలనూ పూజించేవారు. ఇలాంటి విషయాలనుంచి తన కొడుకును దూరంగా ఉంచాలని అబ్రాహాము ఉద్దేశం. కనానుజాతికి చెందిన కోడలు తన కొడుకును విగ్రహ పూజకు మళ్ళిస్తుందేమో అని అతడు అనుకున్నాడు (ద్వితీయోపదేశకాండము 7:3-4) 1 రాజులు 11:1-6 ఎజ్రా 9:1-4 1 కోరింథీయులకు 7:39 2 కోరింథీయులకు 6:14-18).

4. నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.

5. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొనిపోవలెనా అని అడుగగా

6. అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.

7. నా తండ్రి యింట నుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.
అపో. కార్యములు 7:5, గలతియులకు 3:16

“దేశాన్ని”– ఆదికాండము 12:7 ఆదికాండము 13:5 ఆదికాండము 15:18. “తన దూతను”– ఆదికాండము 16:7 నోట్. ఈ వివాహం పరలోకంలోనే ఖాయం అయింది.

8. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.

9. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.

10. అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి

దేవుణ్ణి సేవించాలనుకునే వారందరికీ ఈ సేవకుడు ఆదర్శంగా ఉన్నాడు. ఇతడు విధేయుడు, ప్రార్థనాపరుడు, కార్యం నిర్వహించే నేర్పుగలవాడు, నమ్మకస్థుడు, దేవుడు దారి చూపేవరకు ఎదురు చూచేవాడు, తన యజమానికి ప్రతిష్ఠ కలిగేలా నడుచుకునేవాడు.

11. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను

12. నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము.

13. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.

14. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.

సూచనల కోసం దేవుణ్ణి అడగడం గూర్చి ఆదికాండము 15:8 నోట్, రిఫరెన్సులు చూడండి.

15. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.

యెషయా 65:24 చూడండి.

16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కిరాగా

17. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.

18. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.

19. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి

20. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.

21. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను.

22. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి

23. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను.

24. అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.

25. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్నవనగా

26. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి

27. అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను .

“వచ్చేలా”– కీర్తనల గ్రంథము 25:9 కీర్తనల గ్రంథము 32:8 కీర్తనల గ్రంథము 48:14 కీర్తనల గ్రంథము 73:24 సామెతలు 3:5-6 పోల్చి చూడండి.

28. అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.

29. రిబ్కాకు లాబానను నొక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.

30. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా

31. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.

32. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి

33. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.

34. అంతట అతడిట్లనెను. నేను అబ్రాహాము దాసుడను,

35. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.

ఆ కాలంలో సంపదలు దేవుని దీవెనలకు గుర్తు. ఇప్పుడలా కాదు. దైవభక్తి గలిగినవారు అనేకమంది పేదరికంలో ఉన్నారు. దేవుడంటే లెక్కలేనివారు చాలామంది ధనికులుగా ఉన్నారు (లూకా 6:20-26 లూకా 16:19-31).

36. నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు;

37. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.

38. అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను.

39. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు

40. అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు.

ఆదికాండము 17:1

41. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యని యెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.

42. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన యెడల

43. నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్న దానితో నేనునీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు

44. నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవి చేసికొంటిని.

45. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావి లోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా

46. ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.

47. అప్పుడు నేను - నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె - మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతుల కడియములను పెట్టి

48. నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను.

49. కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనుపరచిన యెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా

50. లాబానును బెతూయేలును ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము;

51. ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి.

52. అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.

53. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.

“వస్తువులు”– ఆదికాండము 29:18 నిర్గమకాండము 22:16-17 ద్వితీయోపదేశకాండము 22:28-29.

54. అతడును అతనితో కూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా

55. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి.

56. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పినప్పుడు

57. వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని

58. రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.

59. కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు

60. వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా

ఆదికాండము 22:17.

61. రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.

62. ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.

63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,

64. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి

65. మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.

66. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.

67. ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.

పాత ఒడంబడికలోని కథలు తరుచుగా క్రొత్త ఒడంబడిక గ్రంథంలో తరువాత కనిపించే ఆధ్యాత్మిక సత్యాలకు సాదృశ్యాలు. తన కుమారుడి వివాహం జరిగించిన రాజును గురించి యేసు చెప్పిన ఉదాహరణకు (మత్తయి 22:2) ఈ అధ్యాయం దృష్టాంత రూపకంగా ఉన్నదని కొందరి అభిప్రాయం (ఇలాగని ఖచ్చితంగా చెప్పలేము). ఇది నిజమైతే గనుక అబ్రాహాము తన కుమారుడి పెళ్ళి నిర్ణయించిన తండ్రియైన దేవునికి గుర్తుగా ఉన్నాడు. వధువును వెతికి సిద్ధపరచి ఆమెకు క్రీస్తును వెల్లడించే సేవకుడుగా పవిత్రాత్మ కనిపిస్తున్నాడు (యోహాను 16:13-14). రిబ్కా క్రీస్తు వధువుకు అంటే ఆయన సంఘానికి గుర్తుగా ఉంది (2 కోరింథీయులకు 11:2 ఎఫెసీయులకు 5:25-32 ప్రకటన గ్రంథం 19:7-8). ఎదురు వెళ్ళి ఆమెకు కలుసుకున్న ఇస్సాకు యేసుప్రభువుకు గుర్తుగా ఉన్నాడు (యోహాను 14:3 1 థెస్సలొనీకయులకు 4:16-17)



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇస్సాకు వివాహానికి అబ్రహం శ్రద్ధ. (1-9) 
ఒక కుటుంబం మంచి మాదిరిని ఉంచి, చక్కగా బోధిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తే, వారి సేవకులు కూడా మంచివారుగా, నమ్మకస్థులుగా, జ్ఞానవంతులుగా మరియు శ్రద్ధగలవారుగా ఉంటారు. అలాంటి కుటుంబాలు మరియు సేవకులు దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదాలు కాబట్టి వారిని అభినందించడం మరియు కృతజ్ఞతలు చెప్పడం ముఖ్యం. వివాహం చేసుకోవడం చాలా ముఖ్యం, కాబట్టి ఇది జాగ్రత్తగా మరియు దేవుని మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదం కోసం ప్రార్థనతో చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవిత భాగస్వామిని కనుగొనడంలో సహాయపడేటప్పుడు వారి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఏది ఉత్తమమో పరిగణించాలి. అబ్రాహాము తన కుమారునికి భార్యను కనుగొనేటప్పుడు తన నమ్మకమైన సేవకుడికి జాగ్రత్తగా సూచనలను ఇచ్చాడు మరియు దేవుడు వారిని చక్కగా నడిపిస్తాడని అతను విశ్వసించాడు. మనం దేవుణ్ణి గౌరవించాలని చూస్తున్నంత కాలం, ఆయన మన జీవితాల్లోకి మంచి విషయాలు తెస్తాడు.


మెసొపొటేమియాకు అబ్రహం సేవకుడి ప్రయాణం, రెబెకాతో అతని సమావేశం. (10-28) 
అబ్రాహాము సేవకుడు దేవుణ్ణి విశ్వసించాడు మరియు తన యజమానికి మంచి భార్యను కనుగొనడంలో సహాయం చేయమని అడిగాడు. ఆమె దయగా, కష్టపడి పని చేసేదిగా, సంతోషంగా, సహాయకారిగా మరియు ఆతిథ్యమివ్వాలని అతను కోరుకున్నాడు. ఇల్లు మరియు పిల్లలను చూసుకునే భార్య మరియు తల్లికి ఇవి ముఖ్యమైన లక్షణాలు. సేవకుడు చెడు పనులు చేసే ప్రదేశాలలో భార్య కోసం వెతకలేదు, కానీ ఒక బావి వద్దకు వెళ్లి అక్కడ సరైన పని చేసే వ్యక్తిని కనుగొంటాడని ఆశించాడు. ఒక ముఖ్యమైన విషయం గురించి తాను ఏమి చేయాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడు. సంఘటనలు జరిగే సమయాలను కూడా యేసు (దేవుడు) నియంత్రిస్తున్నాడని అతనికి తెలుసు. తను కోరుకున్న విధంగా పనులు జరగకపోతే నమ్మకం కోల్పోవద్దనుకోవడం వల్ల ఎక్కువ అడగకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ దేవుడు అతనికి సరైన మార్గాన్ని చూపించాడు. అతను తన యజమాని కోసం భార్యలో వెతుకుతున్న అన్ని లక్షణాలను కలిగి ఉన్న స్త్రీని కలుసుకున్నాడు. ఆమె అతని ఒంటెలను చూస్తూ సమయం వృధా చేసుకోలేదు, కానీ ఆమె తన స్వంత పనిపై దృష్టి పెట్టింది. అతను తనతో మాట్లాడినప్పుడు ఆమె వినయంగా మరియు మర్యాదగా ఉంది. ఆమెకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చి ఆమె కుటుంబం గురించి అడిగాడు. ఆమె తన యజమానికి సంబంధించినదని తెలుసుకున్నప్పుడు, అతను కృతజ్ఞతతో మరియు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. అతను దేవునితో మాట్లాడుతున్నప్పటికీ, అతను ఎవరో మరియు అతను ఎక్కడ నుండి వచ్చాడో ఆమె చెప్పగలదు.

రెబెకా మరియు ఆమె బంధువులు ఆమె వివాహానికి సమ్మతించారు. (29-53) 
ఇస్సాకు మరియు రెబెకా వివాహం ఎలా జరిగిందనేది ఈ కథ. దైనందిన జీవితంలో దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో గమనించాలి మరియు మనం తెలివిగా మరియు దయతో ఉండాలి. లాబాన్ అనే వ్యక్తి పెళ్లికి సహకరించిన సేవకుడిని తన ఇంటికి ఆహ్వానించాడు. లాబాను తనకు ప్రతిఫలం లభిస్తుందని భావించి ఇలా చేశాడు. సేవకుడు తన పని మీద దృష్టి పెట్టాడు మరియు అతను వివాహం గురించి లాబానుకు చెప్పే వరకు భోజనం కూడా చేయలేదు. మనం ఎల్లప్పుడూ మన పనిని చేయడం మరియు తినడం కంటే మన వాగ్దానాలను నిలబెట్టుకోవడం ప్రాధాన్యతనివ్వాలి. యేసు కూడా చేసింది ఇదే. యోహాను 4:34 ఒక వ్యక్తి తన యజమాని తనకు ఇచ్చిన పని గురించి మరియు అది ఎందుకు ముఖ్యమైనది అని కొంతమందికి చెప్పాడు. అతను యాదృచ్ఛికంగా జరిగిన దాని గురించి కూడా వారికి చెప్పాడు, కానీ అది నిజంగా దేవుడు చేసిన పని అని అతను నమ్మాడు. దీనర్థం మనం పనులు చేయడానికి ప్రయత్నించకూడదని కాదు, కానీ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని మనం ఇప్పటికీ విశ్వసించాలి. ఇది దేవుని నుండి వచ్చిందని తెలిసినందున ప్రజలు ఆ వ్యక్తి యొక్క ప్రతిపాదనను అంగీకరించడానికి సంతోషించారు. ఆ వ్యక్తి తన విజయానికి కృతజ్ఞతతో ఉన్నాడు మరియు జీవితంలో తన స్థానాన్ని అంగీకరించడానికి గర్వపడలేదు. మన దైనందిన జీవితంలో దేవుడిని చేర్చుకుంటే, మన సాధారణ కార్యకలాపాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి.

ఇస్సాకు మరియు రెబెకా సంతోషకరమైన సమావేశం మరియు వివాహం. (54-67)
అబ్రహం యొక్క సహాయకుడు త్వరగా ఇంటికి వెళ్లాలని కోరుకున్నాడు, ఎందుకంటే అతను ఆనందించడం కంటే తన పనిని చేయడమే ముఖ్యమని భావించాడు. పిల్లలు పెళ్లి చేసుకునే ముందు వారి తల్లిదండ్రుల నుండి అనుమతి పొందడం మరియు తల్లిదండ్రులు తమ పిల్లల ఎంపికను వారు ఆమోదించారని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. రెబెకా వెంటనే సహాయకుడితో వెళ్లడానికి అంగీకరించింది, ఇది ఆమె మంచి వ్యక్తి అని చూపిస్తుంది. ఆమె చాలా మతపరమైన మరియు మంచి కుటుంబంతో ఉండటానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు వీడ్కోలు పలికారు మరియు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మన కుటుంబం మరియు స్నేహితులు పెళ్లి చేసుకోవడం వంటి ఏదైనా కొత్తదాన్ని ప్రారంభించినప్పుడు వారి కోసం మనం ప్రార్థించాలి. ఇస్సాకు రిబ్కాను కలిసినప్పుడు, అతను ఏదో ముఖ్యమైన పని చేస్తున్నాడు. అతను దేవునితో మాట్లాడటానికి మరియు తన స్వంత భావాలను గురించి ఆలోచించే నిశ్శబ్ద ప్రదేశంలో ఒంటరిగా ఉండటానికి బయటికి వెళ్ళాడు. మంచి వ్యక్తులు ఆలోచించడానికి మరియు ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు మరియు అతను ఒంటరిగా ఉన్నప్పటికీ, అతను ఒంటరిగా భావించలేదు. ఇస్సాకు చాలా ప్రేమగల కొడుకు, అతను మూడు సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లిని కోల్పోయాడు. అతను కూడా చాలా ప్రేమగల భర్త. మంచి కొడుకులుగా ఉన్నవారు మంచి భర్తలుగా కూడా ఉంటారు. ఎవరైనా తమ మొదటి ఉద్యోగంలో బాగా చేస్తే, వారు బహుశా వారి భవిష్యత్ ఉద్యోగాల్లో కూడా బాగా చేస్తారు.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |