Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు1 పేతురు 3:20
2. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
“దైవకుమారులు”– ఈ మాటకు రెండు వివరణలు చెప్తారు. వీరు పతనమైన దేవదూతలని కొందరి అభిప్రాయం (2 పేతురు 2:4 యూదా 6:7). వీరు దైవభక్తిగల షేతు సంతానంలోని పురుషులనీ, కయీను సంతతి స్త్రీలను పెళ్ళిచేసుకున్నారనీ మరి కొందరంటారు. పాత ఒడంబడికలో “దైవకుమారులు” అనే మాటకు ఉన్న సామాన్య అర్థం “దేవదూతలు” (యోబు 1:6 యోబు 2:1 యోబు 38:7 దానియేలు 3:25 మొ।।)
3. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.
“మధ్యలో ఉండడు”– ఇక్కడి అస్పష్టమైన హీబ్రూ మాటకు “మధ్యలో ఉండడు” అనీ ప్రయాసపడడు లేక వాదించడు అనీ కూడా అర్థం వస్తుంది. దేవుడు మనుషుల పాపాలకు వ్యతిరేకంగా పోరాడతాడు. వాటన్నిటికీ ఆయన పూర్తిగా విముఖుడు. చివరికి వాటికన్నిటికీ శిక్ష విధించక మానడు. ఆయన సహనం, దీర్ఘశాంతం గలవాడే గానీ దోషులను శిక్షించకుండా శాశ్వతంగా ఓపికతో ఉండడు. నిర్గమకాండము 30:6-7 గలతియులకు 5:16-17 1 పేతురు 3:20 కీర్తనల గ్రంథము 103:14 సామెతలు 29:1. సామెతలు 1:22-32 పోల్చిచూడండి. “నూట ఇరవై ఏళ్ళు”– జలప్రళయం ద్వారా తీర్పు పంపించేందుకు మరో 120 ఏళ్ళు మనుషులకు సమయం ఇస్తున్నాడని దీని అర్థం కావచ్చు. అయితే దీని అర్థం ఇదే అని చెప్పలేము. జలప్రళయం తరువాత మానవ ఆయుష్కాలం 120 ఏళ్ళుగా అయిపోతుందని దీని భావమని కొందరి అభిప్రాయం ఆదికాండము 47:9 ఆదికాండము 50:26 ద్వితీయోపదేశకాండము 34:7).
4. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.
5. నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచిరోమీయులకు 7:18, లూకా 17:26
ఆదికాండము 5:3 ఆదికాండము 8:21 మార్కు 7:21-23 యిర్మియా 17:9. ఆదాము చేసిన ఆ ఒక్క పాపం ఫలితాలను ఇక్కడ చూస్తున్నాం. పాపం అంతరంగంలో ఆరంభం కావడం గమనించండి. ఇది హృదయంలోని చెడుతనం. ఇక మనిషిని అతడి చెడు స్వభావానికే వదిలి వేస్తే దేవునికి మంచి అనిపించే ఒక్క తలంపు కూడా ఉండకపోవడం గమనించండి. జలప్రళయానికి ముందు జీవించినవారి కంటే స్వభావరీత్యా మనం మంచివాళ్ళమని వ్యర్థంగా భావించడం తగదు. రోమీయులకు 3:9 రోమీయులకు 3:19 రోమీయులకు 3:23.
6. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.
మనుషుల పతనమైన, దుష్టమైన, పశ్చాత్తాపరహితమైన స్థితిని గురించి దేవుడు ఎంతో దుఃఖపడతాడు (కీర్తనల గ్రంథము 78:40 యోనా 18:31-32యోనా 33:11 హోషేయ 11:8 మత్తయి 23:37 లూకా 19:41-42 ఎఫెసీయులకు 4:30)
7. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను
దేవుడు ప్రేమస్వరూపి (1 యోహాను 4:8). అలాగని ఆయన పవిత్రతను, న్యాయాన్ని విస్మరించి దోషులనూ పశ్చాత్తాపం లేనివారినీ శిక్షించకుండా వదిలిపెట్టడు (నిర్గమకాండము 34:6-7 ద్వితీయోపదేశకాండము 7:9-10 రోమీయులకు 2:4-5). దేవుడు సకల విశ్వానికీ పవిత్రుడైన, న్యాయవంతుడైన తీర్పరీ, పాలకుడూ – ఆదికాండము 18:25 1 సమూయేలు 2:10 కీర్తనల గ్రంథము 47:3 కీర్తనల గ్రంథము 75:7 కీర్తనల గ్రంథము 94:2 కీర్తనల గ్రంథము 96:13 యెహెఙ్కేలు 7:3 అపో. కార్యములు 17:31 2 తిమోతికి 4:1 ప్రకటన గ్రంథం 19:11. నోవహు కాలంలో భూమి అంతటిమీదా దేవునికి విధేయత చూపేవాడు ఒక్కడే మిగిలాడు. పాపం ఎంత విపరీత పరిమాణానికి పెరిగి పోయిందంటే వక్రమార్గం పట్టి తిరుగుబాటు చేసి పశ్చాత్తాపం పొందని అవిశ్వాసులనందరినీ న్యాయమూర్తి అయిన దేవుడు నాశనం చేయడం ద్వారా ఆ పాపాన్ని శిక్షించవలసి వచ్చింది. ఆ కాలం తరువాత కూడా దేవుడు జనాలనూ, మొత్తం నాగరికతలనే వారి పాపాల కారణంగా రూపు మాపాడు. ఆదికాండము 15:16 లేవీయకాండము 18:24 ద్వితీయోపదేశకాండము 13:12-18 ద్వితీయోపదేశకాండము 28:18-19. దేవుడెప్పుడైనా తీర్పు తీర్చి శిక్ష విధించాడూ అంటే మిగిలి ఉన్న ప్రజల క్షేమం కోసమూ, మొత్తంగా మానవజాతి తదనంతర మేలుకోసమే. అలాంటి శిక్ష సమయాల్లో కూడా దేవుని కరుణను ఆశించి ఆయనవైపు చూచినవాడికి అది లభిస్తుంది (యెషయా 55:6-7). ఈ యుగాంతంలో మానవకోటి పరిస్థితి నోవహు రోజుల్లో లాగే ఉంటుందని యేసు ప్రభువు చెప్పాడు (మత్తయి 24:37-38).
8. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
1 పేతురు 3:20
9. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.మత్తయి 24:37
ఆదికాండము 5:24 కీర్తనల గ్రంథము 37:37-40. నోవహు నీతిన్యాయాలను ప్రకటించినవాడు (2 పేతురు 2:5). అతడు ఆ తరంవారికి దేవుని సత్యాన్ని బోధించాడు.
10. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.
లూకా 17:26 ద్వితీయోపదేశకాండము 31:29 రోమీయులకు 3:15-18
12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
భక్తిగల షేతు వంశంవారు (ఆదికాండము 4:26) కూడా ఇప్పుడు పూర్తిగా చెడిపోయారు. ఒక్క నోవహు మాత్రం న్యాయవంతుడుగా మిగిలాడు. కీర్తనల గ్రంథము 53:2-3.
13. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.హెబ్రీయులకు 11:7, మత్తయి 24:38-39
14. చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.
“కీలు”– ఈ పదార్థమేమిటో ఖచ్చితంగా చెప్పలేము.
15. నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.
ఒక మూర 18 అంగుళాలు.
16. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.
17. ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశముక్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును;
2 పేతురు 2:5
18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.
ఈ వచనంలో “ఒడంబడిక” అనే పదం మొట్టమొదటిసారిగా కనిపిస్తున్నది. బైబిల్లో ఇది సుమారు 200 సార్లు కనిపిస్తున్నది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ హీబ్రూ పదానికి అర్థం ఇద్దరు వ్యక్తులు లేక రెండు బృందాల మధ్య ఒప్పందం (ఆదికాండము 21:27 ఆదికాండము 26:28 2 సమూయేలు 3:12-13), లేదా, ఒకరు మరొకరికి చేసిన ప్రమాణం (ఆదికాండము 9:8-11). కొన్ని సందర్భాల్లో వీటికి కొన్ని షరతులు పెట్టడం జరిగింది. కొన్ని సార్లు షరతులేవీ లేకపోయాయి. కొన్నిసార్లు ఒక ఒడంబడికను స్థిరపరిచేందుకు ఏదన్నా సూచన ఉంచడం గానీ బలి అర్పించడం గానీ జరిగింది. అనేక సందర్భాల్లో దేవుడు మనుషులతో ఒడంబడికలు చేశాడు – నోవహుతోనూ సకల మానవాళితోనూ (ఆదికాండము 9:8-17); అబ్రాహాముతోనూ అతని వంశస్థులతోనూ (ఆదికాండము 15:18-21); ఇస్రాయేల్ జాతితో (నిర్గమకాండము 19:5); దావీదుతోనూ అతని సంతానంతోనూ (2 సమూయేలు 7:16); చివరిగా తనమీద నమ్మకం ఉంచిన వారందరితోను చేసిన కొత్త ఒడంబడిక (మత్తయి 26:27-29). పైన చెప్పిన చోట్ల నోట్స్ చూడండి. బైబిలు మొదటి భాగాన్ని పాత ఒడంబడిక (లేక నిబంధన) అని పేరు. ఎందుకంటే అది చాలా ఎక్కువ భాగం దేవుడు సీనాయి పర్వతం దగ్గర ఇస్రాయేల్తో చేసిన ఒడంబడిక సంబంధమైనది (నిర్గమకాండము 19:5). బైబిలు రెండో భాగం కొత్త ఒడంబడిక (లేక కొత్త నిబంధన). ఎందుకంటే క్రీస్తు తన సిలువ మరణానికి ముందు తన శిష్యులతో చేసిన ఒడంబడికకు సంబంధించిన భాగమిది.
19. మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.
20. నీవు వాటిని బ్రది కించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల లోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.
21. మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.
22. నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
నోవహు దేవునిపై నమ్మకం ఉంచాడు కాబట్టే ఆయన చెప్పినట్టు చేశాడు – హెబ్రీయులకు 11:7. నిజమైన నమ్మకం ఎల్లప్పుడూ విధేయతను కల్గించి క్రియ జరిగేలా చేస్తుంది (యాకోబు 2:14 యాకోబు 2:20 యాకోబు 2:26). నోవహు ఇలా చేసి కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగాడు.