Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
నేడు ఈ భూమిపై ఉన్న అన్ని జనాలూ జాతులూ నోవహు సంతానం.
2. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.
భూమిపై ఒక నూతన క్రమాన్ని సూచించే రెండు మార్పులు ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. మాంసం తినవచ్చని దేవుడిప్పుడు మనుషులకు చెప్పాడు (ఆదికాండము 1:29). ఆ సమయంలో ఆహారం అయ్యేందుకు శుద్ధ, అశుద్ధ జంతువులని అంతరం ఏమీ లేని సంగతి గమనించండి. మనిషి తాను కోరుకున్నదేన్నైనా తినవచ్చు. లేవీ 11 అధ్యాయం చూడండి.
3. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.రోమీయులకు 14:2, 1 తిమోతికి 4:3
4. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.అపో. కార్యములు 15:20-29
లేవీయకాండము 7:26-27 లేవీయకాండము 17:10-16 లేవీయకాండము 19:26 ద్వితీయోపదేశకాండము 12:16 ద్వితీయోపదేశకాండము 12:23 ద్వితీయోపదేశకాండము 15:23 అపో. కార్యములు 15:20 అపో. కార్యములు 15:29.
5. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
నిర్గమకాండము 21:12 నిర్గమకాండము 21:28-29
6. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.మత్తయి 26:52, 1 కోరింథీయులకు 11:7
లేవీయకాండము 24:17 సంఖ్యాకాండము 35:33. ఘోరంగా పతనమైపోయినప్పటికీ మానవుడు ఇంకా కొన్ని విషయాల్లో దేవుని పోలిక కలిగి ఉన్నాడు (యాకోబు 3:9).
7. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
8. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో
9. ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను,
10వ వచనాన్ని బట్టి దేవుడు నోవహుతో చేసిన ఈ ఒడంబడిక కేవలం ఒక వాగ్దానం లాంటిది. ఒప్పందం కాదు. జంతువులు దేవునితో ఒప్పందం కుదుర్చుకోలేవు గదా.
10. పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.
11. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.
12. మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
ఈ విల్లును సాధారణంగా ఇంద్రధనుస్సు అంటారు గాని హిందూ పురాణాల్లోని ఇంద్రుడికీ దీనికి ఏ సంబంధం లేదు. ఈ అనువాదంలో దీనిని రంగులవిల్లు అన్నాం. తన ఒడంబడిక పట్ల దేవుని విశ్వసనీయతకు ఈ రంగులవిల్లు సూచన. యెహెఙ్కేలు 1:28 ప్రకటన గ్రంథం 4:3 లో రంగులవిల్లు దేవుని సన్నిధికి సంబంధించి కనిపిస్తున్నది.
13. మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.
14. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
15. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు.
16. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.
17. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
18. ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
19. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
ఆదికాండము 10:32
20. నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
21. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
దేవుని ప్రజల పొరపాట్లనూ పాపాలనూ కప్పిపుచ్చే ప్రయత్నాన్ని బైబిలు చెయ్యదు. ఉన్నవాటిని ఉన్నట్టుగా అది వెల్లడి చేస్తుంది. ఇక్కడి సందర్భంలో నోవహు ద్రాక్షమద్యాన్ని ఇంతకుముందు తాగాడో లేదో, తాగితే అది తనకు ఏమి చెయ్యగలదో తెలుసో తెలియదో చెప్పలేము. అయితే అది తనపై దుష్ప్రభావం చూపుతున్నట్టు గ్రహించగానే అతడు వెంటనే మానివేసి ఉండవలసింది (సామెతలు 20:1 సామెతలు 23:29-35). బైబిలు తాగుబోతుతనాన్ని ఖండించడమూ, తాగడం వల్ల కలిగే ఫలితాలు విషాదకరమైనవని వివరించడమూ కనిపిస్తున్నది (ఆదికాండము 19:30 యెషయా 5:11 యెషయా 5:22 రోమీయులకు 13:3 1 కోరింథీయులకు 5:11 1 కోరింథీయులకు 6:10 గలతియులకు 5:21 ఎఫెసీయులకు 5:18).
22. అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
హాము తన తండ్రి సిగ్గును కప్పవలసినది పోయి దాని గురించి ఇతరులకు చెప్పాడు. తన తండ్రి పట్ల తగిన ప్రేమమాన్యతలను చూపలేదు నిర్గమకాండము 20:12 1 పేతురు 4:8). అతనికి వక్రబుద్ధి ఉన్నట్టుంది.
23. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.
24. అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని -
25. కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
ఇక్కడ మూడు భవిష్యద్వాక్కులున్నాయి (ఆదికాండము 49:1 ద్వితీయోపదేశకాండము 33:1). హామును గురించి (వ 25): కొడుకుకు తగిన సవ్యమైన ప్రవర్తన అతడు కనబరచలేదు కాబట్టి అతని కొడుకుల్లో ఒకడిమీదికి తీర్పు వస్తుంది. పై సంఘటన జరిగినప్పుడు బహుశా కనాను తన తండ్రితో ఉన్నాడేమో. కనానుదేశంలో కనానువారిని ఇస్రాయేల్వారు కొన్ని శతాబ్దాల తరువాత అణచివేయడంతో ఈ సూచన వాక్కు కొంతవరకైనా నెరవేరింది (యెహోషువ 9:23 1 రాజులు 9:20-21). షేమును గురించి (వ 26): ఇప్పటికే యెహోవా షేముకు దేవుడు. ఇది షేము నమ్మకాన్నీ దేవుని ఎన్నికనూ తెలియజేస్తున్నది. అబ్రాహాము, ఇస్రాయేల్ జాతి, తన మానవావతారంలో యేసుక్రీస్తు షేము సంతానమే. యాపెతు గురించి (వ 27): ఇది బహుశా యూదేతర ప్రజల అసంఖ్యాకంగా క్రైస్తవులౌతారన్న భవిష్యద్వాక్కు కావచ్చు (ఎఫెసు 3:6). “గుడారాల్లో కాపురముంటాడు” అనే మాట బహుశా షేము ఆశీర్వాదాల్లో భాగం పంచుకుంటాడని అర్థం కావచ్చు. షేము సంతతిద్వారా దేవుడు లోకానికి రక్షణ, పాపవిముక్తి తెచ్చాడు (ఆదికాండము 11:10 యోహాను 4:22).
26. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
27. దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
28. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.
29. నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.