Samuel II - 2 సమూయేలు 14 | View All

1. రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

1. Now, Joab son of Zeruiah observed that the king was favourably inclined to Absalom.

2. తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

2. Joab therefore sent to Tekoa for a wise woman. 'Pretend to be in mourning,' he said. 'Dress yourself in mourning, do not perfume yourself; act like a woman who has long been mourning for the dead.

3. నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.

3. Then go to the king and say this to him.' And Joab put the words into her mouth which she was to say.

4. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసిరాజా రక్షించు మనగా

4. So the woman of Tekoa went to the king and, falling on her face to the ground, prostrated herself. 'Help, my lord king!' she said.

5. రాజునీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమెనేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;

5. The king said, 'What is the matter?' 'As you see,' she replied, 'I am a widow; my husband is dead.

6. నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.

6. Your servant had two sons and out in the fields, where there was no one to intervene, they had a quarrel. And one of them struck the other one and killed him.

7. కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచితన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైనను లేకుండ మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోవు చున్నారని రాజుతో చెప్పగా

7. And now the whole clan has risen against your servant. 'Give up the man who killed his brother,' they say, 'so that we can put him to death, to atone for the life of the brother whom he has murdered; and thus we shall destroy the heir as well.' By this means, they will extinguish the ember still left to me, leaving my husband neither name nor survivor on the face of the earth.'

8. రాజునీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.

8. Then the king said to the woman, 'Go home; I myself shall give orders about your case.'

9. అందుకు తెకోవ ఊరి స్త్రీనా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహా సనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా

9. The woman of Tekoa said to the king, 'My lord king! May the guilt be on me and on my family; the king and his throne are innocent of it.'

10. రాజుఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.

10. 'Bring me the man who threatened you,' the king replied, 'and he shall never hurt you again.'

11. అప్పుడు ఆమెరాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజుయెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
అపో. కార్యములు 27:34

11. She then said, 'Let the king be pleased to pronounce the name of Yahweh your God, so that the avenger of blood may not do greater harm and destroy my son.' 'As Yahweh lives,' he said, 'not one of your son's hairs shall fall to the ground!'

12. అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజుచెప్పుమనెను.

12. Then the woman said, 'Permit your servant to say something else to my lord the king.' 'Go on,' he said.

13. అందుకు ఆ స్త్రీదేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెల విచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.

13. The woman said, 'Why then has the king, who by giving this verdict has condemned himself, conceived the idea, against God's people's interests, of not bringing home the son whom he has banished?

14. మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.

14. We are all mortal; we are like water spilt on the ground, which cannot be gathered up again, nor does God raise up a corpse; let the king therefore make plans for his banished son not to remain far away from him in exile.

15. జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేనురాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయు నేమో

15. 'Now, the reason why I came to speak about this to my lord the king is that I was being intimidated, and your servant thought, 'I shall speak to the king; perhaps the king will do what his servant asks.

16. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని.

16. Surely the king will consent to save his servant from the clutches of the man who is trying to cut both me and my son off from God's heritage.

17. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకర మగునని అనుకొంటిననెను.

17. Let a word from my lord the king, restore the peace!' your servant thought, 'for my lord the king is like the Angel of God in understanding good and evil.' May Yahweh your God be with you!'

18. రాజునేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమెనా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.

18. Replying to the woman, the king said, 'Now do not evade the question which I am going to ask you.' The woman said, 'Let my lord the king ask his question.'

19. అంతట రాజుయోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెనునా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలిన వాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను

19. 'Is not Joab's hand behind you in all this?' the king asked. The woman replied, 'As you live, my lord king, I cannot escape what my lord the king says, either to right or to left. Yes, it was your servant Joab who gave me my orders; he put all these words into your servant's mouth.

20. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవ దూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.

20. Your servant Joab did this to approach the matter indirectly, but my lord has the wisdom of the Angel of God; he knows everything that happens on earth!'

21. అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పు కొనుచున్నాను.

21. The king then said to Joab, 'Very well, the suit is granted. Go and bring the young man Absalom back.'

22. తరువాత¸యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి

22. Joab fell on his face to the ground, prostrated himself and blessed the king. 'My lord king,' Joab said, 'today your servant knows that he has won your favour, since the king has done what his servant asked.'

23. అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.

23. Joab then set off, went to Geshur, and brought Absalom back to Jerusalem.

24. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.

24. The king, however, said, 'Let him retire to his own house; he is not to appear in my presence.' So Absalom retired to his own house and was not received by the king.

25. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.

25. In all Israel there was no one more praised for his beauty than Absalom; from the sole of his foot to the crown of his head, he could not be faulted.

26. తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.

26. When he cut his hair -- he shaved it once a year because his hair got too heavy -- he would weigh the hair: two hundred shekels, king's weight.

27. అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి.

27. To Absalom were born three sons and one daughter called Tamar; she was a beautiful woman.

28. అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలే ములోనుండియు రాజదర్శనము చేయక యుండగా

28. Absalom lived in Jerusalem for two years without being received by the king.

29. యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువ నంపినప్పుడు అతడు రానొల్లక పోగా

29. Absalom then summoned Joab, intending to send him to the king, but Joab would not come to him. He sent for him a second time, but still he would not come.

30. అబ్షాలోము తన పనివారిని పిలిచియోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా

30. At this, Absalom said to his retainers, 'Look, Joab's field is next to mine and he has barley in it; go and set it on fire.' Absalom's retainers set fire to the field.

31. యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చినీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా

31. Joab then stirred himself, went to Absalom in his house and asked, 'Why have your retainers set my field on fire?'

32. అబ్షాలోము యోవాబుతో ఇట్లనెనుగెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.

32. Absalom replied to Joab, 'Look, I sent word to you: Come here, so that I can send you to the king to say, 'Why come back from Geshur? Better for me to have been there still!' Now I want to be received by the king, and if I am guilty, let him put me to death!'

33. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.

33. Joab went to the king and told him this. He then summoned Absalom, who prostrated himself with his face to the ground before the king. And the king kissed Absalom.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యోవాబు అబ్షాలోమును గుర్తుచేసుకున్నాడు. (1-20) 
ఈ దృశ్యాన్ని గమనిస్తే, పాపంలో పడిపోయిన వారి పట్ల దేవుని దయ మరియు కరుణ కోసం విధవరాలు హృదయపూర్వకంగా వేడుకోవడం మనం చూడవచ్చు. పాపులు దేవునికి దూరమై, తమ అతిక్రమణల కారణంగా ప్రవాస స్థితిలో జీవిస్తారు. అయినప్పటికీ, దేవుడు తన చట్టాన్ని మరియు న్యాయాన్ని అణగదొక్కే క్షమాపణలను ఇవ్వడు లేదా పశ్చాత్తాపపడని వారిని క్షమించడు. అతని దయ ఇతరులపై తప్పు చేయడం లేదా హాని కలిగించడం కోసం మద్దతుగా ఉపయోగపడదు.

అబ్షాలోము గుర్తుచేసుకున్నాడు. (21-24) 
డేవిడ్ యొక్క మొగ్గు అబ్షాలోము పట్ల అభిమానం చూపడం, కానీ న్యాయాన్ని సమర్థించాల్సిన అవసరం కారణంగా అతను తనను తాను నిగ్రహించుకున్నాడు, ఇది దైవిక కృప యొక్క పనితీరుపై ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. అదేవిధంగా, దేవుని కనికరం పాపుల పట్ల విస్తరిస్తుంది, ఎవరూ నశించకూడదని కోరుకుంటారు, అయినప్పటికీ వారి తరపున మధ్యవర్తిత్వం వహించే మధ్యవర్తి ద్వారా మాత్రమే సయోధ్య సాధించబడుతుంది. క్రీస్తులో, దేవుడు అంతరాన్ని తగ్గించాడు, ప్రపంచాన్ని తనతో సమన్వయం చేసుకున్నాడు మరియు మనలను తిరిగి దేవుని వైపు నడిపించడానికి క్రీస్తు మన ఈ విదేశీ భూమికి వచ్చాడు.

అతని వ్యక్తిగత సౌందర్యం. (25-27) 
అబ్షాలోము జ్ఞానం మరియు భక్తి గురించి అస్సలు ప్రస్తావించబడలేదు. అతని గురించి హైలైట్ చేసిన ఏకైక అంశం అతని అసాధారణమైన అందం. ఏదేమైనప్పటికీ, ఇతర విలువైన లక్షణాలు లేని వ్యక్తి తన అందచందాలపై మాత్రమే ఆధారపడటం ప్రశంసించదగినది కాదు. మిడిమిడి అందం మోసపూరితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ప్రతిబింబించదు. అపవిత్రమైన మరియు నిష్కపటమైన ఆత్మలు కలిగిన చాలా మంది వ్యక్తులు బాహ్యంగా ఆకర్షణీయమైన శరీరాలను కలిగి ఉంటారు.
అబ్షాలోము తన శారీరక ఆకర్షణతో పాటు, అతని అద్భుతమైన తల వెంట్రుకలకు ప్రసిద్ధి చెందాడు. అది భారంగా మారినప్పటికీ, బరువు భరించలేనంత వరకు దానిని కత్తిరించకూడదని అతను ఎంచుకున్నాడు. అహంకారం మరియు వానిటీ వంటి కొన్ని విషయాలు అసౌకర్యానికి కారణమైనప్పటికీ, అవి పోషించబడతాయని మరియు సంతృప్తి చెందుతాయని ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది. పవిత్రత మరియు మరింత శాశ్వతమైన మరియు నిజమైన సద్గుణాలైన సాత్వికమైన మరియు వినయపూర్వకమైన ఆత్మను పెంపొందించడం ద్వారా మనం అందాన్ని వెతకడం చాలా ముఖ్యం.
దేవునికి భయపడి, నీతిమంతమైన జీవితాన్ని గడిపేవారిలో నిజమైన ఆనందం లభిస్తుంది. భౌతిక రూపాలు మసకబారవచ్చు, కానీ మంచితనానికి మరియు భక్తికి అంకితమైన హృదయ సౌందర్యం నిలిచి ఉంటుంది. నిజమైన అందాన్ని మరియు దేవుణ్ణి గౌరవించే ఆత్మ యొక్క ఆనందాన్ని వెతకడానికి ప్రభువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.


అతను తన తండ్రి సమక్షంలో చేరాడు. (28-33)
యోవాబు పట్ల అబ్షాలోము యొక్క అహంకార ప్రవర్తన, అతని తరపున మధ్యవర్తిత్వం వహించమని యోవాబును బలవంతం చేసింది. ఇంకా, రాజుకు అతని అవమానకరమైన సందేశం అతని కోరికలను సాధించేలా చేసింది. తల్లిదండ్రులు మరియు పాలకులు వ్యక్తులలో ఇటువంటి ప్రవర్తనను సహించినప్పుడు, వారు వినాశకరమైన పరిణామాలను అనుభవించే అవకాశం ఉంది.
అయితే, ఒక తండ్రి కనికరం పశ్చాత్తాపం చెందని కొడుకుతో రాజీపడేలా చేయగలిగితే, పశ్చాత్తాపపడే పాపులు అన్ని దయలకు తండ్రి అయిన అతని కరుణపై ఎంత ఎక్కువ నమ్మకం ఉంచగలరు?



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |