Samuel II - 2 సమూయేలు 15 | View All
Study Bible (Beta)

1. ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱ ములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.

1. இதற்குப்பின்பு, அப்சலோம் இரதங்களையும் குதிரைகளையும், தனக்கு முன் ஓட ஐம்பது சேவகரையும் சம்பாதித்தான்.

2. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచినీవు ఏ ఊరివాడవని యడుగుచుండెనునీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా

2. மேலும் அப்சலோம் காலைதோறும் எழுந்திருந்து, பட்டணத்து வாசலுக்குப் போகிற வழி ஓரத்திலே நின்றுகொண்டு, எவனாகிலும் தனக்கு இருக்கிற வழக்கு முகாந்தரமாய் ராஜாவினிடத்தில் நியாயத்திற்காகப் போகும்போது, அவனை அழைத்து, நீ எந்த ஊரான் என்று கேட்பான்; அவன் உமது அடியான் இஸ்ரவேல் கோத்திரங்களில் ஒன்றுக்கடுத்த இன்ன ஊரான் என்றால்,

3. అబ్షాలోమునీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించు టకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి

3. அப்பொழுது அப்சலோம் அவனை நோக்கி: இதோ, உன் காரியம் நேர்மையும் நியாயமுமாயிருக்கிறது; ஆனாலும் ராஜாவினிடத்திலே உன் காரியத்தை விசாரிப்பார் ஒருவரும் இல்லை என்பான்.

4. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.

4. பின்னும் அப்சலோம்: வழக்கு வியாஜ்யமுள்ளவர்கள் எல்லாரும் என்னிடத்தில் வந்து, நான் அவர்களுக்கு நியாயஞ்செய்யும்படிக்கு, என்னை தேசத்திலே நியாயாதிபதியாக வைத்தால் நலமாயிருக்கும் என்பான்.

5. మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.

5. எவனாகிலும் ஒருவன் அவனை வணங்கவரும்போது, அவன் தன் கையை நீட்டி அவனைத் தழுவி, முத்தஞ்செய்வான்.

6. తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల కందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను.

6. இந்தப்பிரகாரமாக அப்சலோம் ராஜாவினிடத்தில் நியாயத்திற்காக வரும் இஸ்ரவேலருக்கெல்லாம் செய்து, இஸ்ரவேல் மனுஷருடைய இருதயத்தைக் கவர்ந்துகொண்டான்.

7. నాలుగు సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చినీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగాయెహోవా నన్ను యెరూష లేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక,

7. நாற்பது வருஷம் சென்றபின்பு, அப்சலோம் ராஜாவை நோக்கி: நான் கர்த்தருக்குப் பண்ணின என் பொருத்தனையை எப்ரோனில் செலுத்தும்படிக்கு நான் போக உத்தரவுகொடும்.

8. నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా

8. கர்த்தர் என்னை எருசலேமுக்குத் திரும்பி வரப்பண்ணினால், கர்த்தருக்கு ஆராதனை செய்வேன் என்று உமது அடியானாகிய நான் சீரியா தேசத்தில் கேசூரிலே குடியிருக்கும்போது, பொருத்தனை பண்ணினேன் என்றான்.

9. రాజుసుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను.
మార్కు 5:34

9. அதற்கு ராஜா, சமாதானத்தோடே போ என்றான்; அப்பொழுது அவன் எழுந்து எப்ரோனுக்கு போனான்.

10. అబ్షాలోముమీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీ యుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.

10. அப்சலோம் இஸ்ரவேல் கோத்திரங்களுக்கெல்லாம் வேவுகாரரை அனுப்பி, நீங்கள் எக்காளத்தொனியைக் கேட்கும்போது, அப்சலோம் எப்ரோனிலே ராஜாவானான் என்று சொல்லுங்கள் என்று சொல்லச்சொல்லி வைத்திருந்தான்.

11. విందునకు పిలువబడియుండి రెండువందల మంది యెరూషలేములోనుండి అబ్షాలోముతో కూడ బయలుదేరి యుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి.

11. எருசலேமிலிருந்து வரவழைக்கப்பட்ட இருநூறுபேர் அப்சலோமோடே கூடப்போனார்கள்; அவர்கள் வஞ்சகமின்றி அறியாமையினால் போனார்கள்.

12. మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతో పెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బలమాయెను.

12. அப்சலோம் பலிகளைச் செலுத்தும் போது, தாவீதின் ஆலோசனைக்காரனாகிய அகித்தோப்பேல் என்னும் கீலோனியனையும் அவன் ஊராகிய கீலோவிலிருந்து வரவழைப்பித்தான்; அப்படியே கட்டுப்பாடு பலத்து, ஜனங்கள் அப்சலோமினிடத்தில் திரளாய் வந்து கூடினார்கள்.

13. ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా

13. அதை அறிவிக்கிற ஒருவன் தாவீதினிடத்தில் வந்து, இஸ்ரவேலில் ஒவ்வொருவருடைய இருதயமும் அப்சலோமைப் பற்றிப்போகிறது என்றான்.

14. దావీదు యెరూషలేము నందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.

14. அப்பொழுது தாவீது எருசலேமிலே தன்னிடத்திலுள்ள தன்னுடைய எல்லா ஊழியக்காரரையும் நோக்கி: எழுந்து ஓடிப்போவோம், இல்லாவிட்டால் நாம் அப்சலோமுக்குத் தப்ப இடமில்லை; அவன் தீவிரித்து நம்மிடத்தில் வந்து, நம்மைப் பிடித்து, நம்மேல் பொல்லாப்பு வரப்பண்ணி, நகரத்தைப் பட்டயக்கருக்கினால் சங்காரம்பண்ணாதபடிக்குத் தீவிரமாய்ப் புறப்படுங்கள் என்றான்.

15. అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరిచిత్తగించుము; నీ దాసుల మైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెల విచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.

15. ராஜாவின் ஊழியக்காரர் ராஜாவைப் பார்த்து: இதோ, ராஜாவாகிய எங்கள் ஆண்டவன் கட்டளையிடும் காரியத்தையெல்லாம் செய்ய உமது அடியாராகிய நாங்கள் ஆயத்தமாயிருக்கிறோம் என்றார்கள்.

16. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.

16. அப்படியே ராஜாவும் அவனுடைய வீட்டார் எல்லாரும் கால்நடையாய்ப் புறப்பட்டார்கள்; வீட்டைக்காக்க ராஜா மறுமனையாட்டிகளாகிய பத்து ஸ்திரீகளைப் பின்வைத்தான்.

17. రాజును అతని యింటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.

17. ராஜாவும் சமஸ்த ஜனங்களும் கால்நடையாய்ப் புறப்பட்டு, சற்றுத்தூரம் போய், ஒரு இடத்திலே தரித்து நின்றார்கள்.

18. అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.

18. அவனுடைய ஊழியக்காரர் எல்லாரும், கிரேத்தியர் யாவரும், பிலேத்தியர் யாவரும் அவன் பக்கத்திலே நடந்து போனார்கள்; காத்தூரிலிருந்து கால்நடையாய் வந்திருந்த அறுநூறுபேராகிய கித்தியர் எல்லாரும் ராஜாவுக்கு முன்பாக நடந்தார்கள்.

19. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొనినీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతో కూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము.

19. அப்பொழுது ராஜா கித்தியனாகிய ஈத்தாயைப் பார்த்து: நீ எங்களுடனே கூட வருவானேன்? நீ திரும்பிப்போய், ராஜாவுடனேகூட இரு; நீ அந்நிய தேசத்தான்; நீ உன் இடத்திற்குத் திரும்பிப் போகலாம்.

20. నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగులాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా

20. நீ நேற்றுதானே வந்தாய்; இன்று நான் உன்னை எங்களோடே நடந்துவரும்படிக்கு அழைத்துக்கொண்டு போகலாமா நான் போகக்கூடிய இடத்திற்குப் போகிறேன்; நீ உன் சகோதரரையும் அழைத்துகொண்டு திரும்பிப்போ; கிருபையும் உண்மையும் உன்னோடே இருப்பதாக என்றான்.

21. ఇత్తయినేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలిన వాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.

21. ஆனாலும் ஈத்தாய் ராஜாவுக்குப் பிரதியுத்தரமாக: ராஜாவாகிய என் ஆண்டவன் எங்கேயிருப்பாரோ, அங்கே உமது அடியானும், செத்தாலும் பிழைத்தாலும், இருப்பான் என்று கர்த்தருடைய ஜீவனையும் ராஜாவாகிய என் ஆண்டவனுடைய ஜீவனையும் கொண்டு சொல்லுகிறேன் என்றான்.

22. అందుకు దావీదుఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి.

22. அப்பொழுது தாவீது ஈத்தாயை நோக்கி: நடந்துவா என்றான்; அப்படியே கித்தியனாகிய ஈத்தாயும் அவனுடைய எல்லா மனுஷரும் அவனோடிருக்கிற எல்லாப் பிள்ளைகளும் நடந்துபோனார்கள்.

23. వారు సాగిపోవు చుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి.

23. சகல ஜனங்களும் நடந்துபோகிறபோது, தேசத்தார் எல்லாரும் மகா சத்தமாய் அழுதார்கள்; ராஜா கீதரோன் ஆற்றைக் கடந்தான்; ஜனங்கள் எல்லாரும் வனாந்தரத்திற்குப் போகிற வழியே நடந்துபோனார்கள்.

24. సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవు వరకు నిలిచెను.

24. சாதோக்கும் தேவனுடைய உடன்படிக்கைப் பெட்டியை அவனோடேகூட இருந்து சுமக்கிற சகல லேவியரும் வந்து, தேவனுடைய பெட்டியை அங்கே வைத்தார்கள்; ஜனங்கள் எல்லாரும் நகரத்திலிருந்து கடந்து தீருமட்டும், அபியத்தார் திரும்பிப்போயிருந்தான்.

25. అప్పుడు రాజు సాదోకును పిలిచిదేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి

25. ராஜா சாதோக்கை நோக்கி: தேவனுடைய பெட்டியை நகரத்திற்குத் திரும்பக் கொண்டுபோ; கர்த்தருடைய கண்களில் எனக்குக் கிருபை கிடைத்ததானால், நான் அதையும் அவர் வாசஸ்தலத்தையும் பார்க்கிறதற்கு, என்னைத் திரும்ப வரப்பண்ணுவார்.

26. దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

26. அவர்: உன்மேல் எனக்குப் பிரியமில்லை என்பாராகில், இதோ, இங்கே இருக்கிறேன்; அவர் தம்முடைய பார்வைக்கு நலமானபடி எனக்குச் செய்வாராக என்றான்.

27. యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.

27. பின்னும் ராஜா ஆசாரியனாகிய சாதோக்கை நோக்கி: நீ ஞானதிருஷ்டிக்காரன் அல்லவோ? நீ சமாதானத்தோடே நகரத்திற்குத் திரும்பு; உன் மகன் அகிமாசும் அபியத்தாரின் மகன் யோனத்தானுமாகிய உங்கள் குமாரர் இரண்டுபேரும் உங்களோடேகூடத் திரும்பிப் போகட்டும்.

28. ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.

28. எனக்கு அறிவிக்கிறதற்கு உங்களிடத்திலிருந்து செய்தி வருமட்டும், நான் வனாந்தரத்தின் வெளிகளிலே தரித்திருப்பேன் என்றான்.

29. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.

29. அப்படியே சாதோக்கும் அபியத்தாரும் தேவனுடைய பெட்டியை எருசலேமுக்குத் திரும்பக் கொண்டுபோய், அங்கே இருந்தார்கள்.

30. అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.

30. தாவீது தன் முகத்தை மூடி, வெறுங்காலால் நடந்து அழுதுகொண்டு, ஒலிவமலையின்மேல் ஏறிப்போனான்; அவனோடிருந்த சகல ஜனங்களும் முகத்தை மூடி அழுதுகொண்டு ஏறினார்கள்.

31. అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.

31. அப்சலோமோடே கட்டுப்பாடு பண்ணினவர்களுடன் அகித்தோப்பேலும் சேர்ந்திருக்கிறான் என்று தாவீதுக்கு அறிவிக்கப்பட்டபோது, தாவீது: கர்த்தாவே, அகித்தோப்பேலின் ஆலோசனையைப் பயித்தியமாக்கிவிடுவீராக என்றான்.

32. దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.

32. தாவீது மலையின் உச்சிமட்டும் வந்து, அங்கே தேவனைப் பணிந்துகொண்டபோது, இதோ, அற்கியனாகிய ஊசாய் தன் வஸ்திரத்தைக் கிழித்துக் கொண்டு, தலையின்மேல் புழுதியைப் போட்டுக்கொண்டவனாய் அவனுக்கு எதிர்ப்பட்டான்.

33. రాజునీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;

33. தாவீது அவனைப் பார்த்து: நீ என்னோடேகூட நடந்துவந்தால் எனக்குப் பாரமாயிருப்பாய்.

34. నీవు పట్టణమునకు తిరిగి పోయిరాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.

34. நீ நகரத்திற்குத் திரும்பிப்போய், அப்சலோமை நோக்கி: ராஜாவே, உம்முடைய ஊழியக்காரனாயிருப்பேன்; முன் நான் உம்முடைய தகப்பனுக்கு ஊழியக்காரனாயிருந்தேன்; இப்போது நான் உமக்கு ஊழியக்காரன் என்றாயேயாகில், எனக்காக அகித்தோப்பேலின் ஆலோசனையை அபத்தமாக்குவாய்.

35. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.
మార్కు 2:26

35. உன்னோடே அங்கே சாதோக் அபியத்தார் என்னும் ஆசாரியர்கள் இருக்கிறார்கள் அல்லவா? ராஜாவின் வீட்டிலே பிறக்கிற ஏதேது செய்தி உண்டோ, என்னென்ன கேள்விப்படுகிறாயோ, அதையெல்லாம் சாதோக் அபியத்தார் என்னும் ஆசாரியர்களுக்கு அறிவிப்பாய்.

36. సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.

36. அங்கே அவர்களோடே சாதோக்கின் மகன் அகிமாசும், அபியத்தாரின் மகன் யோனத்தானும், அவர்கள் இரண்டு குமாரரும் இருக்கிறார்கள்; நீங்கள் கேள்விப்படுகிற செய்தியையெல்லாம் அவர்கள் வசமாய் எனக்கு அனுப்புவீர்களாக என்றான்.

37. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.

37. அப்படியே தாவீதின் சிநேகிதனாகிய ஊசாய் நகரத்திற்கு வந்தான்; அப்சலோமும் எருசலேமுக்கு வந்தான்.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Samuel II - 2 సమూయేలు 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అబ్షాలోము ఆశయం. (1-6) 
అబ్షాలోము అహంకారాన్ని దావీదు ఆమోదించాడు. తమ పిల్లల గర్వంగా ప్రవర్తించే తల్లిదండ్రులు తరచుగా దాని పర్యవసానాలను గ్రహించలేరు మరియు ఇది చాలా మంది యువకుల పతనానికి దారి తీస్తుంది. పైగా, అధికారం చెలాయించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నవారు తరచుగా దానితో వచ్చే బాధ్యతలను కనీసం అర్థం చేసుకోలేరు.

అతని కుట్ర. (7-12) 
తమ పిల్లల గురించి ఉత్తమమైన వాటిని విశ్వసించే విషయంలో తల్లిదండ్రులు ఎంత ఆసక్తిగా మరియు విశ్వసిస్తున్నారో గమనించండి. దురదృష్టవశాత్తు, పిల్లలు తమ తల్లిదండ్రుల మంచితనాన్ని దోచుకోవడం మరియు మతం ఉన్నట్లు నటిస్తూ వారిని మోసం చేయడం అప్రయత్నం మరియు నైతికంగా తప్పు. అబ్షాలోము విందు, జెరూసలేంలోని ప్రముఖులు హాజరవుతారు, మతతత్వం యొక్క బాహ్య ప్రదర్శనలను చూసేందుకు భక్తిపరులైన వ్యక్తులు కూడా ఎలా సంతోషిస్తారో, మోసానికి అవకాశం కల్పిస్తుంది. దుష్ట వ్యక్తులు, సాతాను యొక్క కుయుక్తి ద్వారా మార్గనిర్దేశం చేస్తారు, సద్గురువులను వారి దుర్మార్గపు పథకాలకు మద్దతుగా మార్చడానికి దీనిని ఒక వ్యూహంగా ఉపయోగిస్తారు.

దావీదు యెరూషలేమును విడిచిపెట్టాడు. (13-23) 
దావీదు యెరూషలేమును విడిచిపెట్టాలని దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు, అది దైవిక క్రమశిక్షణను అంగీకరించే పశ్చాత్తాపంగా అంగీకరించాడు. అన్యాయమైన అబ్షాలోము ముందు తనను తాను రక్షించుకోగలిగినప్పటికీ, అతను నీతిమంతుడైన దేవుని ముందు వినయంగా తనను తాను ఖండించుకుంటాడు, అతని తీర్పులకు లొంగిపోతాడు. దావీదు తన పాపాల పర్యవసానాలను ఇష్టపూర్వకంగా అంగీకరిస్తాడు. అంతేకాక, అతను ఇతరుల గురించి లోతుగా శ్రద్ధ వహిస్తాడు మరియు అతను బాధపడినప్పుడు వారు తనతో పాటు బాధపడాలని కోరుకోరు.
అతను తనతో ఉండమని ఎవరినీ బలవంతం చేయడు; ఎవరి హృదయాలు అబ్షాలోముతో ఉంటాయో వారు స్వేచ్ఛగా వెళ్లి తమ స్వంత విధిని ఎదుర్కొంటారు. అదేవిధంగా, క్రీస్తు తనను అనుసరించడానికి ఇష్టపూర్వకంగా ఎంచుకున్న వారిని మాత్రమే ఆహ్వానిస్తాడు. దావీదు విదేశీయుడు మరియు ఇటీవల మతం మారిన ఇత్తై పట్ల నిజమైన శ్రద్ధ చూపుతాడు మరియు అతను కష్టాలను అనుభవించాలని అతను కోరుకోడు. ఇత్తై దావీదు పట్ల ఉన్న విధేయత, దావీదు జ్ఞానం మరియు మంచితనం పట్ల అతనికి ఉన్న అభిమానానికి నిదర్శనం. మంచి మరియు సవాలు సమయాల్లో మందంగా మరియు సన్నగా మనకు అండగా నిలిచేవారే నిజమైన స్నేహితులు.
అదేవిధంగా, మనం అచంచలమైన దృఢ నిశ్చయంతో దావీదు కుమారునికి అంకితభావంతో ఉంటాము మరియు ఏదీ - జీవితం లేదా మరణం కూడా - అతని ప్రేమ నుండి మనల్ని వేరు చేయదు.

దావీదు మందసమును వెనక్కి పంపాడు. (24-30) 
దావీదు మందసము యొక్క భద్రతను నిర్ధారించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సంపద, కీర్తి, సౌకర్యం మరియు భద్రత వంటి వ్యక్తిగత ఆందోళనల కంటే చర్చి యొక్క శ్రేయస్సు మరియు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకున్నాడు. దావీదు యొక్క వైఖరి వ్యక్తిగత ప్రయోజనాల కంటే సువార్త యొక్క విజయాన్ని అంచనా వేయడానికి సరైన విధానాన్ని ఉదాహరణగా చూపుతుంది.
ముఖ్యంగా, దావీదు దేవుని ప్రొవిడెన్స్ గురించి సంతృప్తి మరియు సమర్పణతో మాట్లాడాడు. మనకు ఎదురయ్యే పరిస్థితులతో సంబంధం లేకుండా, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా అంగీకరించడం మరియు స్వీకరించడం మన శ్రేయస్సు మరియు మన నైతిక బాధ్యత రెండూ. తెలియని భయాన్ని పోగొట్టడానికి, అన్ని సంఘటనలలో దేవుని మార్గదర్శక హస్తాన్ని మనం గుర్తించాలి.
దావీదు తన గత పాపం గురించి నిరంతరం అవగాహన చేసుకోవడం, మన స్వంత లోపాలను మనం గుర్తుంచుకోవాలని మరియు మన జీవితాల్లో దేవుని క్షమాపణ మరియు మార్గదర్శకత్వాన్ని వెతకాలని రిమైండర్‌గా పనిచేస్తుంది. కీర్తనల గ్రంథము 38:4

అతను అహీతోఫెల్ సలహాకు వ్యతిరేకంగా ప్రార్థించాడు. (31-37)
తన ప్రార్థనలో, దావీదు అహీతోఫెల్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదు కానీ అతని హానికరమైన సలహాను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు అన్ని హృదయాలను మరియు నాలుకలపై నియంత్రణ కలిగి ఉంటాడని దావీదు దృఢంగా విశ్వసించాడు. అయితే, ప్రార్థన మాత్రమే సరిపోదని అతను అర్థం చేసుకున్నాడు; అతను కూడా చర్య తీసుకుంటాడు, ఎందుకంటే ప్రయత్నం లేకుండా కేవలం ప్రార్థనపై మాత్రమే ఆధారపడడం దేవుణ్ణి ప్రలోభపెట్టడం.
మన మానవ స్వభావంలో, జ్ఞానం మరియు సరళత తరచుగా సంపూర్ణ సామరస్యంతో కలిసి ఉండవు, క్షమాపణ కోసం పిలుపునిచ్చే లోపాలను మనల్ని వదిలివేస్తాయి. అయినప్పటికీ, మనం దావీదు కుమారుడిని చూసినప్పుడు, ద్రోహం మరియు క్రూరత్వాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా జ్ఞానం, సాత్వికం, నిజాయితీ మరియు సహనం యొక్క అసాధారణ ప్రదర్శనను మనం చూస్తాము. కాబట్టి మనం జీవితంలోనూ, మరణంలోనూ ఆయనను అనుసరించి, అంటిపెట్టుకుని, సేవిద్దాం.



Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |