Kings I - 1 రాజులు 6 | View All
Study Bible (Beta)

1. అయితే ఇశ్రాయేలీయులు ఇగుప్తుదేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగువందల ఎనుబదియవ సంవత్సర మందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్‌ అను రెండవ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప నారంభించెను.
అపో. కార్యములు 7:47

1. It was in midspring, in the month of Ziv, during the fourth year of Solomon's reign, that he began to construct the Temple of the LORD. This was 480 years after the people of Israel were rescued from their slavery in the land of Egypt.

2. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
అపో. కార్యములు 7:47

2. The Temple that King Solomon built for the LORD was 90 feet long, 30 feet wide, and 45 feet high.

3. పరిశుద్ధస్థలము ఎదుట నున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు, మందిరము ముందర అది పది మూరల వెడల్పు.

3. The entry room at the front of the Temple was 30 feet wide, running across the entire width of the Temple. It projected outward 15 feet from the front of the Temple.

4. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను.

4. Solomon also made narrow recessed windows throughout the Temple.

5. మరియు మందిరపు గోడచుట్టు గదులు కట్టించెను; మంది రపు గోడలకును పరిశుద్ధస్థలమునకును గర్భాలయమునకును చుట్టు నలుదిశల అతడు గదులు కట్టించెను.

5. He built a complex of rooms against the outer walls of the Temple, all the way around the sides and rear of the building.

6. క్రింది అంతస్తుగది అయిదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది ఆరు మూరల వెడల్పు, మూడవ అంతస్తుగది యేడు మూరల వెడల్పు; ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండ మందిరపు గోడచుట్టు బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను.

6. The complex was three stories high, the bottom floor being 7-1/2 feet wide, the second floor 9 feet wide, and the top floor 10-1/2 feet wide. The rooms were connected to the walls of the Temple by beams resting on ledges built out from the wall. So the beams were not inserted into the walls themselves.

7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.

7. The stones used in the construction of the Temple were finished at the quarry, so there was no sound of hammer, ax, or any other iron tool at the building site.

8. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్యమున ఉండెను, మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలోనుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కి పోవుటకు చుట్టును మెట్ల చట్రముండెను.

8. The entrance to the bottom floor was on the south side of the Temple. There were winding stairs going up to the second floor, and another flight of stairs between the second and third floors.

9. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.

9. After completing the Temple structure, Solomon put in a ceiling made of cedar beams and planks.

10. మరియు మందిరమునకు చుట్టు గదులను కట్టించెను; ఇవి అయిదు మూరల యెత్తుగలవై దేవదారు దూలములచేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను.

10. As already stated, he built a complex of rooms on three sides of the building, attached to the Temple walls by cedar timbers. Each story of the complex was 7-1/2 feet high.

11. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

11. Then the LORD gave this message to Solomon:

12. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;

12. 'Concerning this Temple you are building, if you keep all my decrees and regulations and obey all my commands, I will fulfill through you the promise I made to your father, David.

13. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.

13. I will live among the Israelites and will never abandon my people Israel.'

14. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
అపో. కార్యములు 7:47

14. So Solomon finished building the Temple.

15. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.

15. The entire inside, from floor to ceiling, was paneled with wood. He paneled the walls and ceilings with cedar, and he used planks of cypress for the floors.

16. మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.

16. He partitioned off an inner sanctuary-- the Most Holy Place-- at the far end of the Temple. It was 30 feet deep and was paneled with cedar from floor to ceiling.

17. అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.

17. The main room of the Temple, outside the Most Holy Place, was 60 feet long.

18. మందిరములోపలనున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.

18. Cedar paneling completely covered the stone walls throughout the Temple, and the paneling was decorated with carvings of gourds and open flowers.

19. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపర చెను.

19. He prepared the inner sanctuary at the far end of the Temple, where the Ark of the LORD's Covenant would be placed.

20. గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొది గించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననెపొదిగించెను.

20. This inner sanctuary was 30 feet long, 30 feet wide, and 30 feet high. He overlaid the inside with solid gold. He also overlaid the altar made of cedar.

21. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగార ముతో దాని పొదిగించెను.

21. Then Solomon overlaid the rest of the Temple's interior with solid gold, and he made gold chains to protect the entrance to the Most Holy Place.

22. ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొది గించెను.

22. So he finished overlaying the entire Temple with gold, including the altar that belonged to the Most Holy Place.

23. మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;

23. He made two cherubim of wild olive wood, each 15 feet tall, and placed them in the inner sanctuary.

24. ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.

24. The wingspan of each of the cherubim was 15 feet, each wing being 7-1/2 feet long.

25. రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.

25. The two cherubim were identical in shape and size;

26. ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.

26. each was 15 feet tall.

27. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.

27. He placed them side by side in the inner sanctuary of the Temple. Their outspread wings reached from wall to wall, while their inner wings touched at the center of the room.

28. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.

28. He overlaid the two cherubim with gold.

29. మరియు మందిరపు గోడ లన్నిటిమీదను లోపల నేమి వెలుపల నేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కిం చెను.

29. He decorated all the walls of the inner sanctuary and the main room with carvings of cherubim, palm trees, and open flowers.

30. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను.

30. He overlaid the floor in both rooms with gold.

31. గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను.

31. For the entrance to the inner sanctuary, he made double doors of wild olive wood with five-sided doorposts.

32. రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.

32. These double doors were decorated with carvings of cherubim, palm trees, and open flowers. The doors, including the decorations of cherubim and palm trees, were overlaid with gold.

33. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.

33. Then he made four-sided doorposts of wild olive wood for the entrance to the Temple.

34. రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.

34. There were two folding doors of cypress wood, and each door was hinged to fold back upon itself.

35. వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.

35. These doors were decorated with carvings of cherubim, palm trees, and open flowers-- all overlaid evenly with gold.

36. మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.

36. The walls of the inner courtyard were built so that there was one layer of cedar beams between every three layers of finished stone.

37. నాలుగవ సంవత్సరము జీప్‌ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను;

37. The foundation of the LORD's Temple was laid in midspring, in the month of Ziv, during the fourth year of Solomon's reign.

38. పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాస మున దాని యేర్పాటుచొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.

38. The entire building was completed in every detail by midautumn, in the month of Bul, during the eleventh year of his reign. So it took seven years to build the Temple.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సోలమన్ ఆలయ భవనం. (1-10) 
ఈ ఆలయానికి "లార్డ్ ఆఫ్ ది లార్డ్" అనే పేరు ఉంది, ఎందుకంటే ఇది అతనిచే మార్గనిర్దేశం చేయబడింది మరియు రూపొందించబడింది, అతని దైవిక సేవ కోసం ఉద్దేశించబడింది. ఈ లక్షణం అన్ని ఇతర సౌందర్య రూపాలను అధిగమించి, పవిత్రత యొక్క సున్నితమైన నాణ్యతతో నిండిపోయింది. ప్రశాంతత యొక్క దేవుని అభయారణ్యంగా నియమించబడినది, ఇనుప పనిముట్ల శబ్దం లేకుండా ఉండటం చాలా అవసరం; ప్రశాంతత మరియు హుష్ ఆధ్యాత్మిక అభ్యాసాలతో సామరస్యపూర్వకంగా మరియు మద్దతుగా ఉన్నాయి. దేవుని హస్తకళను అమలు చేయడం కకోఫోనీ కంటే సూక్ష్మంగా గుర్తించబడాలి. వైరుధ్యం మరియు దూకుడు తరచుగా దైవిక ప్రయత్నాన్ని ముందుగానే కాకుండా అడ్డుకుంటుంది. అదే విధంగా, మార్కు 5:27లో చూసినట్లుగా, మానవ హృదయంలో దేవుని ఆధిపత్యం యొక్క రాజ్యం నిశ్శబ్దంగా వర్ధిల్లుతుంది.

ఆలయానికి సంబంధించి ఇచ్చిన వాగ్దానం. (11-14) 
దేవుని శ్రద్ద లేకుండా ఎవ్వరూ తమను తాము దేవుని సేవకు అంకితం చేసుకోరు. ఆలయాన్ని నిర్మించడంలో పెట్టుబడి పెట్టిన గణనీయమైన వనరులు దేవుని చట్టాన్ని అనుసరించే బాధ్యత నుండి ఎవరినీ మినహాయించవని, లేదా అవిధేయత జరిగినప్పుడు అతని తీర్పుల నుండి రక్షణను అందించదని దేవుడు సొలొమోనుకు స్పష్టం చేశాడు.

ఆలయానికి సంబంధించిన విశేషాలు. (15-38)
ఈ ఆలయం ద్వారా తెలియజేయబడిన ప్రతీకాత్మక ప్రాతినిధ్యాన్ని గమనించండి:
1. క్రీస్తు ప్రామాణిక దేవాలయంగా నిలుస్తాడు. అతనిలో పరమాత్మ యొక్క పూర్తి సారాంశం నివసిస్తుంది; అతను దేవుని ఆధ్యాత్మిక ఇజ్రాయెల్ మొత్తాన్ని ఏకం చేస్తాడు మరియు అతని ద్వారా, మనం దేవునికి అస్థిరమైన ప్రాప్తిని పొందుతాము.
   2. ప్రతి విశ్వాసి 1 కోరింథీయులకు 3:16లో పేర్కొన్నట్లుగా, దేవుని ఆత్మ నివాసం ఉండే సజీవమైన పవిత్ర స్థలంగా ఉద్భవిస్తుంది. ఈ సజీవ అభయారణ్యం దాని మూలస్తంభంగా క్రీస్తు యొక్క పునాదిపై రూపుదిద్దుకుంటుంది మరియు కాలక్రమేణా, అది పరిపూర్ణమైన పరిపూర్ణతను పొందుతుంది.
3. సువార్త సమాజం ఒక ఆధ్యాత్మిక అభయారణ్యంగా మారుతుంది. దేవునిలో పవిత్రత యొక్క స్థితికి పురోగమిస్తుంది, అది ఆత్మ యొక్క దానం మరియు సద్గుణాలచే సుసంపన్నం మరియు అలంకరించబడుతుంది. ఈ అభయారణ్యం రాక్ మీద కదలకుండా స్థాపించబడింది.
4. శాశ్వతత్వం ఖగోళ అభయారణ్యం ఆవిష్కరిస్తుంది. ఇక్కడే సంఘం తన శాశ్వతమైన యాంకరింగ్‌ను కనుగొంటుంది. ఈ భవనంలో అంతర్భాగంగా ఉండాలనుకునే వారు, వారి సన్నాహక ఉనికి సమయంలో, ఖచ్చితంగా ఆకృతిని కలిగి ఉండాలి మరియు సిద్ధంగా ఉండాలి.
పాపులు యేసును ప్రాముఖ్యమైన పునాదిగా చేరుకోనివ్వండి, తద్వారా ఈ ఆధ్యాత్మిక నివాసం యొక్క అంతర్భాగాలుగా మారారు, దేవుని మహిమ యొక్క ఔన్నత్యం కోసం శరీరం మరియు ఆత్మ రెండింటినీ పవిత్రం చేస్తారు.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |