Kings I - 1 రాజులు 9 | View All

1. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత

1. After Solomon finished building the temple of the LORD, the royal palace, and everything else that he had planned,

2. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై

2. the LORD appeared to him a second time, as he had appeared to him in Gibeon.

3. అతనితో ఈలాగు సెలవిచ్చెను - నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.

3. The LORD said to him: 'I have heard the prayer of petition which you offered in my presence. I have consecrated this temple which you have built; I confer my name upon it forever, and my eyes and my heart shall be there always.

4. నీ తండ్రి యైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృద యుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అను సరించిన యెడల

4. As for you, if you live in my presence as your father David lived, sincerely and uprightly, doing just as I have commanded you, keeping my statutes and decrees,

5. నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.

5. I will establish your throne of sovereignty over Israel forever, as I promised your father David when I said, 'You shall always have someone from your line on the throne of Israel.'

6. అయితే మీరేగాని మీ కుమారులే గాని యేమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజిం చినయెడల

6. But if you and your descendants ever withdraw from me, fail to keep the commandments and statutes which I set before you, and proceed to venerate and worship strange gods,

7. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
మత్తయి 23:38

7. I will cut off Israel from the land I gave them and repudiate the temple I have consecrated to my honor. Israel shall become a proverb and a byword among all nations,

8. ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
మత్తయి 23:38

8. and this temple shall become a heap of ruins. Every passerby shall catch his breath in amazement, and ask, 'Why has the LORD done this to the land and to this temple?'

9. జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.

9. Men will answer: 'They forsook the LORD, their God, who brought their fathers out of the land of Egypt; they adopted strange gods which they worshiped and served. That is why the LORD has brought down upon them all this evil.''

10. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికి వచ్చియున్నందున

10. After the twenty years during which Solomon built the two houses, the temple of the LORD and the palace of the king--

11. సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.

11. Hiram, king of Tyre, supplying Solomon with all the cedar wood, fir wood, and gold he wished-- King Solomon gave Hiram twenty cities in the land of Galilee.

12. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక

12. Hiram left Tyre to see the cities Solomon had given him, but was not satisfied with them.

13. నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్‌ అని పేరు.

13. So he said, 'What are these cities you have given me, my brother?' And he called them the land of Cabul, as they are called to this day.

14. హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.

14. Hiram, however, had sent king Solomon one hundred and twenty talents of gold.

15. యహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.

15. This is an account of the forced labor which King Solomon levied in order to build the temple of the LORD, his palace, Millo, the wall of Jerusalem, Hazor, Megiddo, Gezer

16. ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.

16. (Pharaoh, king of Egypt, had come up and taken Gezer and, after destroying it by fire and slaying all the Canaanites living in the city, had given it as dowry to his daughter, Solomon's wife;

17. సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్‌ హోరోనును,

17. Solomon then rebuilt Gezer), Lower Beth-horon,

18. బయతాతును అరణ్యములోనున్న తద్మోరు నును,

18. Baalath, Tamar in the desert of Judah,

19. సొలొమోను భోజనపదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతు లకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను.

19. all his cities for supplies, cities for chariots and for horses, and whatever else Solomon decided should be built in Jerusalem, in Lebanon, and in the entire land under his dominion.

20. అయితే ఇశ్రాయేలీయులుకాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.

20. All the non-Israelite people who remained in the land, descendants of the Amorites, Hittites, Perizzites, Hivites, and Jebusites

21. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వముచేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.

21. whose doom the Israelites had been unable to accomplish, Solomon conscripted as forced laborers, as they are to this day.

22. అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.

22. But Solomon enslaved none of the Israelites, for they were his fighting force, his ministers, commanders, adjutants, chariot officers, and charioteers.

23. సొలొమోను యొక్క పనిమీదనున్న ప్రధానులు ఐదువందల ఏబదిమంది; వీరు పనివాండ్లమీద అధికారులుగా ఉండిరి.

23. The supervisors of Solomon's works who policed the people engaged in the work numbered five hundred and fifty.

24. ఫరో కుమార్తదావీదు పురమునుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను.

24. As soon as Pharaoh's daughter went up from the City of David to her palace, which he had built for her, Solomon built Millo.

25. మరియసొలొమోను తాను కట్టించిన బలిపీఠముమీద ఏడాదిలో మూడు మారులు దహనబలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖ మందున్న పీఠముమీద ధూపద్రవ్యము వేయుచుండెను; పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను.

25. Three times a year Solomon used to offer holocausts and peace offerings on the altar which he had built to the LORD, and to burn incense before the LORD; and he kept the temple in repair.

26. మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.

26. King Solomon also built a fleet at Ezion-geber, which is near Elath on the shore of the Red Sea in the land of Edom.

27. సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.

27. In this fleet Hiram placed his own expert seamen with the servants of Solomon.

28. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

28. They went to Ophir, and brought back four hundred and twenty talents of gold to King Solomon.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings I - 1 రాజులు 9 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సొలొమోనుకు దేవుని సమాధానం. (1-9) 
ఆలయాన్ని పూర్తి చేసి, ప్రతిష్టించిన తర్వాత సొలొమోను దైవిక హెచ్చరికను అందుకున్నాడు. ఆ హెచ్చరిక యొక్క సారాంశం ఏమిటంటే, అతను మరియు అతని ప్రజలు అహంకారానికి దూరంగా ఉండాలి మరియు బదులుగా భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. విస్తృతమైన ఆచారాలు మరియు ఆరాధనలతో సంబంధం లేకుండా, దేవునితో మన సంబంధం మారదు. ఏ చర్య కూడా తప్పులో పాల్గొనడానికి మాకు అనుమతిని ఇవ్వదు, భక్తులైన విశ్వాసులు కోరుకోని ప్రత్యేక హక్కు. పాపంలో మునిగిపోతూ సుఖంగా మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం లభించడం కంటే వారు దైవిక దిద్దుబాటును ఇష్టపడతారు.

సొలొమోను మరియు హీరామ్ బహుమతులు. (10-14) 
సొలొమోను హీరాముకు ఇరవై నగరాలను ఇచ్చాడు, అయినప్పటికీ అవి అతని ఆమోదాన్ని పొందలేకపోయాయి. హిరామును సంతోషపెట్టడానికి, సొలొమోను అతనితో వాణిజ్య భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుని మరింత సమీకృత ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. వ్యక్తుల యొక్క విభిన్న వ్యక్తిత్వాలకు అనుగుణంగా దైవిక ప్రావిడెన్స్ భూమిని మార్చే అద్భుతమైన మార్గాన్ని ఇది హైలైట్ చేస్తుంది మరియు ప్రతిగా, భూమి అందించే అవకాశాలతో ప్రజల అభిరుచులు ఎలా సామరస్యాన్ని పొందుతాయి. ఈ క్లిష్టమైన పరస్పర చర్య అంతిమంగా మొత్తం మానవాళి యొక్క గొప్ప శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది.

సొలొమోను భవనాలు, అతని వ్యాపారం. (15-28)
సొలొమోను గొప్పతనం గురించి మరింత అంతర్దృష్టి వెల్లడి చేయబడింది. అతను తన మొదటి ప్రాధాన్యతగా దేవుని ఆలయాన్ని నిర్మించడం ద్వారా తెలివిగా తన ప్రయత్నాలను ప్రారంభించాడు, తన వ్యక్తిగత పనులను ప్రారంభించే ముందు దానిని పూర్తి చేసేలా చూసుకున్నాడు. ఈ క్రమం ఫలితంగా, దేవుడు అతనిపై ఆశీర్వాదాలను ప్రసాదించాడు, అతని తదుపరి ప్రాజెక్ట్‌లన్నింటిలో విజయాన్ని పెంపొందించాడు. ఈ క్రమం స్వీయ-లాభం కంటే భక్తి యొక్క ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది మరియు తరువాత వరకు వ్యక్తిగత సంతృప్తిని ఆలస్యం చేయాలని వాదిస్తుంది.
భక్తి మరియు పరోపకార ఉద్దేశాలతో మన ప్రయత్నాలను ప్రారంభించడం తరచుగా తదుపరి ప్రయోజనాలకు దారి తీస్తుంది. మన ప్రయత్నాలను దేవుని మహిమ మరియు ఇతరుల అభివృద్ధి కోసం అంకితం చేయడం ద్వారా, ప్రయోజనాలను పొందేందుకు మనల్ని మనం ఉంచుకుంటాము. ముఖ్యంగా, పవిత్రమైన మరియు అసాధారణమైన భూభాగంగా ప్రసిద్ధి చెందిన వాగ్దాన భూమి, దాని పరిధిలో బంగారాన్ని కలిగి లేదు. ఈ లేకపోవడం అత్యంత విలువైన దిగుబడి వర్తమాన జీవితాన్ని నిలబెట్టేది-మన స్వంత మరియు ఇతరులది-అవసరాలను అందించే కెనాన్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అనే భావనను నొక్కి చెబుతుంది.
సొలొమోను తన వాణిజ్య వెంచర్ల ద్వారా గణనీయమైన సంపదను కూడగట్టాడు, అతను ఆర్థికంగా చాలా సవాలుగా ఉన్నవారికి కూడా అందుబాటులో ఉండే మరింత విలువైన లావాదేవీని కూడా ప్రకాశింపజేసాడు. సామెతలు 3:14వెండి వస్తువుల కంటే జ్ఞానం యొక్క గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది మరియు అత్యుత్తమ బంగారంతో పోలిస్తే జ్ఞానం తెచ్చే గొప్ప లాభాన్ని నొక్కి చెబుతుంది.



Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |