Kings II - 2 రాజులు 15 | View All
Study Bible (Beta)

1. ఇశ్రాయేలురాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజర్యాయేలనారంభించెను.

1. The twenty seventh year of Jeroboam king of Israel, Azariah son of Amaziah king of Juda began to reign.

2. అతడు పదునా రేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.

2. Sixteen year old was he when he was made king, and he reigned forty two year in Jerusalem, his mother's name was Jecheliah, and was of Jerusalem.

3. ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.

3. And he did that pleased the LORD in all things as did his father Amaziah:

4. ఉన్నత స్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నత స్థలముల యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.

4. save that they put not the hill altars away: for the people offered and burned fat still in the hill altars.

5. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేక ముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.

5. And the LORD smote the king, that he was a leper unto the day of his death, and dwelt in an house at liberty, and Jotham the king's son governed the house and judged the people of the land.

6. అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంత టినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడి యున్నది.

6. The rest of the deeds of Azariah and all he did, are written in the chronicles of the kings of Juda.

7. అజర్యా తన పితరు లతోకూడ నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను.

7. And Azariah laid him to sleep with his fathers, and they buried him with his fathers in the city of David, and Jotham his son reigned in his stead.

8. యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పది యెనిమిదవ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఆరునెలలు ఏలెను.

8. In the thirty eighth year of Azariah king of Juda, was Zachariah the son of Jeroboam made king upon Israel in Samaria, and reigned six months,

9. ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

9. and did that displeased the LORD, as did his fathers, and turned not from the sins of Jeroboam the son of Nabat which made Israel sin.

10. యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.

10. And Selum the son of Jabes conspired against him, and smote him before the people, and killed him, and reigned in his stead.

11. జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

11. The rest of the deeds of Zachariah are written in the chronicles of the kings of Israel.

12. నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులై యుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.

12. This is the saying that the LORD spake unto Jehu, saying: thy sons shall sit on the seat of Israel in the fourth generation. And it came to pass.

13. యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను.

13. Selum the son of Jabes began to reign the thirty ninth year of Azariah king of Juda, and he reigned a month in Samaria.

14. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.

14. For Manahem the son of Gadi came up from Therzah and went to Samaria and smote Selum the son of Jabes in Samaria, and slew him, and reigned in his stead.

15. షల్లూము చేసిన యితర కార్య ములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

15. The rest of the deeds of Selum and the treason, which he conspired are written in the chronicles of the kings of Israel.

16. మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినంద రిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను.

16. The same time Manahem destroyed Thaphsah, and all that were therein, and the coasts thereof from Therzah (because they opened not to him) he smote and rent all the women with child.

17. యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మి దవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను.

17. The thirty ninth year of Azariah king of Juda, began Manahem the son of Gadi to reign upon Israel, and continued ten years in Samaria.

18. ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

18. And he did evil in the sight of the LORD, and turned not all his days from the sin of Jeroboam the son of Nabat which made Israel sin.

19. అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండు వేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.

19. And Phul king of Assiria came upon the land. And Manahem gave Phul a thousand talents of silver, to help him to stablish his kingdom.

20. మెనహేము ఇశ్రా యేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్య మును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశ మును విడిచి వెళ్లిపోయెను.

20. And Manahem raised the money in Israel, upon all men of substance, for to give the king of Assiria fifty sicles of silver apiece. And the king of Assiria turned back again and tarried not there in the land.

21. మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

21. The rest of the deeds of Manahem and all he did, are written in the chronicles of the kings of Israel.

22. మెనహేము తన పితరులతో కూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.

22. And when Manahem was laid to rest with his fathers Phakeiah his son reigned in his stead.

23. యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.

23. The fiftieth year of Azariah king of Juda, began Phakeiah the son of Manahem to reign over Israel in Samaria, and continued two year,

24. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

24. and wrought wickedly in the sight of the LORD and left not off from the sins of Jeroboam son of Nabat which made Israel sin.

25. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబది మందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.

25. And Phakeh the son of Romeliah a lord of his conspired against him and slew him in the palace of the king's house, with Argob and Ariah and fifty men with him that were Gileadites: and when he had killed him, reigned in his room.

26. పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంత టినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

26. The rest of the acts of Phakeiah and all he did are written in the chronicles of the kings of Israel.

27. యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రో నులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సర ములు ఏలెను.

27. And the fifty second year of Azariah king of Juda, began Phakeh the son of Romeliah to reign over Israel in Samaria and continued twenty year,

28. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

28. and did evil in the sight of the LORD, and turned not from the sins of Jeroboam the son of Nabat that made Israel sin.

29. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.

29. In the days of Phakeh king of Israel, came Teglath Phalasar king of Assiria, and took Aion, Abel, Beth, Maach, Janoah, Kades, Hazor, Gilead, Galile, and all the land of Nephthali, and carried them away to Assiria.

30. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.

30. And Hosea the son of Elah conspired treason against Phakeh the son of Romeliah and smote him and slew him and reigned in his stead, the twentieth year of Jotham the son of Oziah.

31. పెకహు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

31. The rest of the acts of Phakeh, and all he did, are written in the stories of the kings of Israel.

32. ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.

32. The second year of Phakeh son of Romeliah king of Israel, began Jotham the son of Oziah king of Juda to reign.

33. అతడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.

33. Five and twenty year old was he when he began to reign, and he reigned sixteen year in Jerusalem. His mother's name was Jerusa the daughter of Zadok.

34. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.

34. And he did that was right in the sight of the LORD: even in all things as did his father Oziah, did he.

35. అయినను ఉన్నత స్థల ములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలుల నర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వార మును కట్టించెను.

35. But they put not away the hill altars: for the people offered and burnt incense still in the hill altars, he built the highest door in the house of the LORD.

36. యోతాము చేసిన యితర కార్యము లనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

36. The rest of the deeds of Jotham and all he did, are written in the Chronicles of the kings of Juda.

37. ఆ దినములో యెహోవా సిరియారాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశముమీదికి పంపనారంభించెను.

37. In those days the LORD began to send against Juda, Razin the king of Siria and Phakeh the son of Romeliah.

38. యోతాము తన పిత రులతో కూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను.

38. And Jotham rested with his fathers and was buried with his fathers in the city of David his father, and Ahaz his son reigned in his stead.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Kings II - 2 రాజులు 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

యూదా రాజు అజర్యా లేదా ఉజ్జియా పాలన. (1-7) 
ఉజ్జియా ఎక్కువగా ధర్మబద్ధమైన దానిని అనుసరించాడు, తన సుదీర్ఘమైన ధర్మబద్ధమైన పాలన ద్వారా రాజ్యం యొక్క అదృష్టానికి తోడ్పడ్డాడు.

ఇజ్రాయెల్ యొక్క తరువాతి రాజులు. (8-31) 
ఈ చారిత్రక కథనం ఇజ్రాయెల్‌లో గందరగోళ స్థితిని చిత్రీకరిస్తుంది. యూదా దాని స్వంత సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఇజ్రాయెల్ యొక్క గందరగోళ పరిస్థితితో పోల్చితే అది ఇంకా మెరుగ్గా ఉంది. విశ్వాసం యొక్క నిజమైన అనుచరుల లోపాలు దైవభక్తిని తిరస్కరించే వారి అనుమతించదగిన తప్పులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మానవ స్వభావం మరియు మన స్వాభావిక అభిరుచులు వెల్లడి చేయబడ్డాయి - తనిఖీ చేయకుండా వదిలేస్తే, అవి కొలతకు మించి మోసపూరితమైనవి మరియు తీవ్ర అవినీతికి గురవుతాయి. ప్రలోభాల నుండి మనలను రక్షించే పరిమితుల రూపంలో కృతజ్ఞత కోసం మేము ఒక కారణాన్ని కలిగి ఉన్నాము, దేవుని నుండి పునరుజ్జీవింపబడిన మరియు నీతివంతమైన సారాంశాన్ని ప్రార్థించమని ప్రేరేపిస్తుంది.

జోతామ్, యూదా రాజు. (32-38)
జోతం ఆలయం పట్ల ప్రగాఢమైన భక్తిని ప్రదర్శించాడు. అధికారులు తమను తాము పూర్తిగా దుష్ప్రవర్తనను మరియు అసమానతను పూర్తిగా నిర్మూలించలేనప్పుడు, వారు మంచితనం మరియు ధర్మాన్ని నిలబెట్టడంలో మరియు ప్రోత్సహించడంలో తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలి.



Shortcut Links
2 రాజులు - 2 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |