Chronicles I - 1 దినవృత్తాంతములు 25 | View All

1. మరియదావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా

1. దావీదు, సైన్యాధికారులు కలిసి ఆసాపు కుమారులను ప్రత్యేక సేవల కొరకు కేటాయించారు. ఆసాపు కుమారులు హేమాను, యెదూతూను అనేవారు. ప్రవచనాలు చెప్పటం, తంబుర, సితారులను, తాళాలను వాయిస్తూ దేవుని వాక్యం ప్రకటించటం వారి విశేష సేవా కార్యక్రమం. ఈ విధమైన అసాధారణ సేవలో వున్న వారి పేర్లు ఏవనగా:

2. ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.

2. ఆసాపు కుటుంబం నుండి జక్కూరు, యోసేపు, నెతన్యా మరియు అషర్యేలా. రాజైన దావీదు ప్రవచించటానికి ఆసాపును ఎంపికచేశాడు. ఆసాపు తన కుమారులకు నాయకత్వం వహించాడు.

3. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.

3. యెదూతూను కుటుంబం నుండి గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అనువారు ఆరుగురు. యెదూతూను తన కుమారులకు నాయకత్వం వహించాడు. యెదూతూను ప్రవచించటానికి సితారు వాయించే వాడు. యెహోవాకి వందనాలు చెల్లిస్తూ స్తుతి పాటలు పాడేవాడు.

4. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు.

4. దేవుని సేవలో నిమగ్నమైన హేమాను కుమారులైన బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షూబాయేలు మరియు యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తీయెజెరు, యెష్బెకాషా, మల్లోతి, హోతీరు మరియు మహజీయోతు.

5. వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను.

5. వీరంతా హేమాను కుమారులు. హేమాను దీర్ఘదర్శి (ప్రవక్త) హేమానును బలపరుస్తానని దేవుడు మాటయిచ్చాడు. అందువల్ల హేమాను బహు సంతానవంతుడయ్యాడు. దేవుడు హేమానుకు పధ్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను కలుగజేశాడు.

6. వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.

6. హేమాను తన కుమారులందరినీ ఆలయంలో భక్తి పాట సంకీర్తనలో పాల్గొనేలా చేసాడు. అతని కుమారులంతా తాళాలు, సితారాలు, వీణలు వాయించేవారు. అది వారు ఆలయంలో సేవచేసే పద్ధతి. రాజైన దావీదు వారిని ఎంపిక చేశాడు.

7. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.

7. వారితో పాటు వారి బంధువులైన లేవి వంశీయులు కూడ పాటలు పాడటంలో శిక్షణ పొందారు. అలా దేవునికి స్తుతి పాటలు పాడటం నేర్చుకున్న వారిలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది వున్నారు.

8. తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.

8. ప్రతి ఒక్కడూ ఏ పని చేయాలో నిర్ణయించటానికి వారు చీట్లు వేసారు. ప్రతి ఒక్కడూ సమానంగా చూడబడ్డాడు. చీట్లు వేయటంలో చిన్న, పెద్ద, గురువు, శిష్యుడు అనే తేడా లేకుండా అంతా సమానంగా చూడబడ్డారు.

9. మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.

9. మొదటిగా ఆసాపు (యోసేపు) కుమారులు, బంధువుల నుండి పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. రెండవ చీటి ద్వారా గెదల్యా కుమారులు, బంధువుల నుండి మొత్తం పన్నెండు మంది ఎంపికైనారు.

10. మూడవది జక్కూరు పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

10. మూడవ చీటి జక్కూరు పేరున పడగా అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎన్నుకోబడ్డారు.

11. నాలుగవది యిజ్రీ పేరట పడెను, వీడును వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

11. నాల్గవసారి యిజీ కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.

12. అయిదవది నెతన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

12. ఐదవ చీటీ ద్వారా నెతన్యా కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.

13. ఆరవది బక్కీయాహు పేరటపడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

13. ఆరవ చీటీ ద్వారా బక్కీయాహు కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.

14. ఏడవది యెషర్యేలా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.

14. ఏడవ చీటీ యెషర్యేలా పేరున వచ్చింది. అతని కుమారులు, బంధువులు, పన్నెండుమంది ఎంపికైనారు.

15. ఎనిమిదవది యెషయా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

15. ఎనిమిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ యెషయా కుమారులు, బంధువులు.

16. తొమ్మిదవది మత్తన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

16. తొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మత్తన్యా కుమారులు, బంధువులు.

17. పదియవది షిమీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

17. పదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షిమీ కుమారులు, బంధువులు.

18. పదకొండవది అజరేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

18. పదకొండవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ అజరేలు కుమారులు, బంధువులు.

19. పండ్రెండవది హషబ్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

19. పన్నెండవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ హష్బయ్యా కుమారులు, బంధువులు.

20. పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

20. పదమూడవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షూబాయేలు కుమారులు, బంధువులు.

21. పదునాలుగవది మత్తిత్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

21. పధ్నాల్గవ చీటి మత్తిత్యాకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

22. పదునయిదవది యెరేమోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

22. పదిహేనవ చీటి యెరేమోతుకు వెళ్లింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

23. పదునారవది హనన్యా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

23. పదహారవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు హనన్యా కుమారులు, బంధువులు.

24. పదునేడవది యొష్బెకాషా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

24. పదిహేడవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు యొష్బెకాషా కుమారులు, బంధువులు.

25. పదునెనిమిదవది హనానీపేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

25. పద్దెనిమిదవ చీటీ ద్వారా ఎంపికైనవారు పన్నెండు మంది. వారు హనానీ కుమారులు, బంధువులు.

26. పందొమ్మిదవది మల్లోతి పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెం డుగురు.

26. పందొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మల్లోతి కుమారులు, బంధువులు.

27. ఇరువదియవది ఎలీయ్యాతా పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

27. ఇరవయ్యో చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ ఎలీయ్యాతా కుమారులు, బంధువులు.

28. ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

28. ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

29. ఇరువది రెండవది గిద్దల్తీ పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండు గురు.

29. ఇరవై రెండవ చీటి గిద్దల్తీకి వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

30. ఇరువది మూడవది మహజీయోతు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

30. ఇరవై మూడవ చీటి మహజీయోతుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుమంది ఎంపికైనారు.

31. ఇరువది నాలుగవది రోమమీ్తయెజెరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.

31. ఇరవై నాల్గవ చీటీ రోమమ్తీయెజెరుకు వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Chronicles I - 1 దినవృత్తాంతములు 25 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

గాయకులు మరియు సంగీతకారులు.

దేవాలయంలో గాయకులు మరియు సంగీతకారులుగా నియమించబడిన వారిని డేవిడ్ ఒక నిర్దిష్ట క్రమంలో ఏర్పాటు చేశాడు. ప్రవచనం, ఈ సందర్భంలో, పరిశుద్ధాత్మ ప్రభావంతో మార్గనిర్దేశం చేయబడిన లోతైన చిత్తశుద్ధి మరియు అంకిత భావాలతో దేవుణ్ణి స్తుతించడం. ఈ భావోద్వేగాలను పెంచడానికి, కవిత్వం మరియు సంగీతం ఉపయోగించబడ్డాయి. పవిత్రాత్మ మన ఆరాధనలో తేజము మరియు అభిరుచిని నింపకపోతే, మన ఆచారాలు, ఎంత చక్కగా వ్యవస్థీకృతమైనప్పటికీ, జీవితం మరియు ప్రాముఖ్యత లేకుండానే ఉంటాయి.



Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |