Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
Telugu Reference Bible
1. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపుకుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.
1. కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల జట్టులు ఏవనగా: మెషెలెమ్యా మరియు అతని కుమారులు, (మెషెలెమ్యా తండ్రి పేరు కోరే. అతడు ఆసాపు వంశంలోని వాడు.)
2. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు,
2. మెషెలెమ్యా సంతానవంతుడు. జెకర్యా పెద్దవాడు. యెదీయవేలు రెండవవాడు. జెబద్యా మూడవవాడు. యత్నీయేలు నాల్గవవాడు.
3. ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై యేడవవాడు.
3. ఏలాము ఐదవ కుమారుడు. యెహోహనాను ఆరవవాడు. ఎల్యోయేనై ఏడవ కుమారుడు.
4. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను; వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజా బాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాల్గవవాడు, నెతనేలు అయిదవవాడు,
4. ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు.
5. అమీ్మయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై యెనిమిదవవాడు.
5. అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ కుమారుడు. పెయుల్లెతై అతని ఎనిమిదవ కుమారుడు. దేవుడు నిజంగా ఓబేదెదోమును ఆశీర్వదించాడు.
6. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి; వారు పరా క్రమ శాలులైయుండి తమ తండ్రి యింటివారికి పెద్దలైరి.
6. ఓబేదెదోము కుమారుడు షెమయా. షెమయాకు కూడ కుమారులున్నారు. తన తండ్రి కుటుంబంలో షెమయా కుమారులంతా ధైర్యంగల సేనానులు కావటంతే వారు నాయకులయ్యారు.
7. షెమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు సెమక్యా.
7. షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, ఎలీహు, మరియు సెమక్యా అనేవారు. ఎల్జాబాదు బంధువులు నేర్పరులైన పనివారు.
8. ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమా రులును వీరి సహోదరులును అరువది యిద్దరు, వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు.
8. వారంతా ఓబేదెదోము సంతతివారు. వారు, వారి కుమారులు, బంధువులు అంతా పరాక్రమశాలురు. వారు మంచి రక్షక భటులు. ఓబేదెదోము సంతతివారు అరువది ఇద్దరు.
9. మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.
9. మెషెలెమ్యా కుమారులు, బంధువులు పరాక్రమవంతులు. అతని కొడుకులు, బంధువులు కలిసి పద్దెనిమిది మంది వున్నారు.
10. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,
10. మెరారీ వంశానికి చెందిన ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా షిమ్రీ పరిగణింపబడ్డాడు. నిజంగా షిమ్రీ పెద్ద కుమారుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా ఆదరించాడు.
11. రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.
11. హిల్కీయా అతని రెండవ కుమారుడు. టెబల్యాహు అతని మూడవ కుమారుడు. జెకర్యా నాల్గవవాడు. అంతా కలిసి హోసాకు పదముగ్గురు కుమారులు, బంధువులు వున్నారు.
12. ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి.
12. వీరు ద్వారపాలకుల జట్ల నాయకులు. వీరి ఇతర బంధువుల వలెనే ద్వారపాలకులకు ఆలయ సేవలో ఒక విశిష్టమైన పద్ధతి వుంది.
13. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
13. ప్రతి కుటుంబానికి ఒక ద్వారం కాపలా కొరకు కేటాయించబడింది. ప్రతి కుటుంబానికీ ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే భేధం పాటించకుండా అంతా సమంగా చూడబడ్డారు.
14. తూర్పుతట్టు కావలి షెలెమ్యాకు పడెను, వివేకముగల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటివేయగా, ఉత్తరపుతట్టు కావలి వానికి పడెను,
14. చీట్లు వేయగా తూర్పు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెలివైన సలహాదారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది.
15. ఓబేదెదోమునకు దక్షిణపువైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటికావలియు పడెను.
15. ఓబేదెదోముకు దక్షిణ ద్వారం వచ్చింది. ఓబేదెదోము కుమారులు విలువైన వస్తువులు దాచే ఇంటి కాపలాకై ఎంపిక చేయబడ్డారు.
16. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను.
16. షుప్పీము, హోసా పడమటి ద్వారం కాపలాకు, ఎగువ మార్గంలో వున్న షల్లెకెతు ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు. భటులు ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు.
17. తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,
17. తూర్పుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగులు లేవీయులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలువైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు కాపలా వుండేవారు.
18. బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.
18. పడమటి సభాస్థానం వద్ద నలుగురు భటులు కాపలా వుండేవారు. సభాస్థానికి వెళ్లే బాటమీద ఇద్దరు భటులు వుండేవారు.
19. కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.
19. ఇవి ద్వారపాలకుల జట్లు. ఆ ద్వారపాలకులు కోరహు (కోరే), మెరారి సంతతివారు.
20. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.
20. అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత.
21. లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.
21. గెర్షోను తెగవారిలో లద్దాను ఒక కుటుంబపు మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు లద్దాను వంశంలో ఒక నాయకుడు.
22. యెహీయేలీ కుమారులైన జేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలికాయువారు.
22. యెహీయేలీ కుమారులు జేతాము, అతని సోదరుడైన యోవేలు. దేవాలయంలో విలువైన వస్తువులన్నిటి పరిరక్షణ వారి బాధ్యత.
23. అమ్రామీయులు ఇస్హారీయులు హెబ్రోనీయులు ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది.
23. ఇతర నాయకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయబడ్డారు.
24. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.
24. ఆలయంలో విలువైన వస్తువులపై కాపలా షూబాయేలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు గెర్షోము. గెర్షోము తండ్రి పేరు మోషే.
25. ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.
25. షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు.
26. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును
26. షెలోమీతు, అతని బంధువులు ఆలయానికై దావీదు సేకరించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు. సైన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు ఇచ్చారు.
27. యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.
27. వారు యుద్ధాలలో శత్రువుల నుండి తీసుకొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు.
28. దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.
28. షెలోమీతు, అతని బంధువులు కలిసి దీర్ఘదర్శియగు (ప్రవక్త) సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా వహించారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త వహించారు.
29. ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.
29. కెనన్యా ఇస్హారు కుటుంబంలోని వాడు. కెనన్యా, అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు స్వీకరించారు. వారు రక్షకభటులుగాను, న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలులో వివిధ ప్రాంతాలలో పని చేశారు.
30. హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమ శాలులును వేయిన్ని యేడు వందల సంఖ్యగలవారు, వీరు యొర్దాను ఈవల పడమటి వైపుననుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పనివిషయములోను పైవిచారణకర్తలుగా నియమింపబడిరి.
30. హషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాలలోను; యోర్దాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు.
31. హెబ్రోనీయులను గూర్చి నది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమ శాలులుగా కనబడిరి.
31. వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు.
32. పరాక్రమశాలులగు వాని సహోదరులు రెండువేల ఏడువందలమంది యింటి పెద్దలుగా కనబడిరి, దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజకార్యముల విషయములోను రూబే నీయుల మీదను గాదీయులమీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.
32. యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు.